ఎనిమిది మంది కూలీలపై పడిన పిడుగు

ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో చోటుచేసుకుంది. ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు అదే గ్రామానికి చెందిన మద్ది వీరయ్యకు చెందిన మిర్చి, పత్తి చేనులో చెత్తను తొలగించేందుకు వెళ్లారు. ఉదయం నుంచి పనులను ప్రారంభించారు. అయితే.. ఉన్నట్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

దాంతో.. వర్షం నుంచి తలదాచుకునేందుకు 8 మంది వ్యవసాయ కూలీలంతా వెళ్లి అక్కడే ఉన్న ఒక వేప చెట్టు కింద నిలబడ్డారు. అదే వారు చేసిన తప్పుగా మిగిలిపోయింది. పెద్ద శబ్ధంతో పిడుగు వ్యవసాయకూలీలు నిలబడ్డ చెట్టుపైనే పడిపోయింది.

దాంతో.. చెట్టుకింద ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకి గురయ్యారు.

ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. మిగతావారికి స్వల్పగాయాలు అయ్యాయి.త తీవ్రంగా గాయపడ్డవారిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. తీవ్రగాయాలపాలైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. పిడుగులు పడుతున్న సందర్భంలో చెట్ల కింద కానీ.. బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Sbnews

పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు.

గడపగడపకూ మన ప్రభుత్వంపై వారితో సమీక్షిస్తున్న సీఎం.. రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.

Sbnews

Sbnews

టీఎస్పీఎస్సీ పై హైకోర్టు సీరియస్

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు రేపటి బుధవారం కి వాయిదా వేసింది.

టీఎస్పీఎస్సీ పై విచారణ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. బయోమెట్రిక్ విధానం ఎందుకు పెట్టలేదని న్యాయస్థానం మరోసారి ప్రశ్నించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని, అలాగే బయో మెట్రిక్‌పై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

బయో మెట్రిక్ విధానంలో సాంకేతికత, సమయం లేకపోవడం వల్ల పెట్టలేకపోయమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. బయో మెట్రిక్ విధానం వల్ల సమస్యలు ఉన్నాయని.. మొదటిసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లోనూ బయో మెట్రిక్ సమస్యలు వచ్చాయని ఏజీ తెలిపారు.

దీనిపై స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ మిగతా పరీక్షలకు బయో మెట్రిక్ విధానం అమలు అవుతునప్పుడు.. గ్రూప్ 1కు మాత్రమే సమస్య వస్తుందన్నారు. కానిస్టేబుల్ పరీక్షకు 6 లక్షల మందికి బయో మెట్రిక్ తీసుకున్నారని న్యాయవాది తెలిపారు.

దీంతో ఏ ఏ పరీక్షల్లో బయో మెట్రిక్ ఎంత మందికి వాడారనే వివరాలు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ మేరకు వాయిదా వేసింది.

అంతకుముందు విచారణలో టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదేపదే టీఎస్పీఎస్సీ విఫలమవుతుందని మండిపడింది.

మొదటిసారి పేపర్ లీకేజ్‌తో పరీక్ష రద్దు చేశారని, రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాతబస్తీ హనుమాన్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి భూరి విరాళం ప్రకటించిన కంచర్ల

 పాత బస్తి హనుమాన్ నగర్ లో..

 నిర్మితమవుతున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి., నల్లగొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి 30లక్షల రూపాయాలా బారి విరాళాన్ని ప్రకటించారు.

భారీ ఎత్తున నిర్మిస్తున్న దేవాలయ నిర్మాణానికి తన వంతుగా,విరాళం ప్రకటిస్తున్నానని, అనుకున్న రీతిలో దేవాలయం అద్భుతంగా నిర్మాణం

పూర్తిచేయాలనీ ఆలయ కమిటీని కోరారు.

 మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ వట్టిపల్లి శ్రీనివాస్., ఆలకుంట్ల మోహన్ బాబు, రమేష్ చంద్ర.. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Sbnews

Sbnews

కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన తిప్పర్తి మండలం కాంగ్రెస్ నాయకులు

నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో తిప్పర్తి మండలం అంతయ్య గూడెం గ్రామానికి చెందిన... 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.... కన్నబోయిన పెద్ద కొండయ్య ఆధ్వర్యంలో... బిఆర్ఎస్ పార్టీలో చేరారు..

 

ఈ సందర్భంగా కంచర్ల వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరపూర్వకంగా ఆహ్వానించారు.

 

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ కెసిఆర్ అభివృద్ధి పనులకు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై.. స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని.. పాత కొత్త అనంత కూడా కలిసి పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు..

 

పార్టీలో చేరిన వారిలో కన్నెబోయిన పెద్ద కొండయ్య తో పాటు చిన్న కొండయ్య,రాములు,మార్కొండయ్య జానయ్య, పరశురాములు, తిరుమల రాము.. ల తో పాటు 50 మందికి పైగా బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

 

స్థానిక సర్పంచ్ సిరిగిరి పద్మా వెంకట్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, సీనియర్ నాయకులు లొడంగి గోవర్ధన్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గోగుల శ్రీనివాస్ యాదవ్, ఆలకుంట్ల మోహన్ బాబు తదితరులు వెంట ఉన్నారు

Sbnews

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సీఎం జగన్: పురందేశ్వరి ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆమె విశాఖ లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని.. జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టి వేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఏపిలో నాణ్యతలేని మద్యాన్ని ప్రజలతో తాగిస్తున్నారని.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతుందనేది నిజమని.. గతంలో రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్‌లను పూర్తిగా మార్చేశారని.. కొత్త బ్రాండ్‌లను మార్కెట్లోకి తెచ్చి.. వాటి ద్వారా దోచుకుంటున్నారని ఆరోపించారు.

గతంలో ఉన్న యాజమాన్యాల నుంచి కంపెనీలు లాక్కుని.. పేర్లు మార్చి అధికార పార్టీలో ఉన్న ముఖ్య నేతలు వీటిని నడుపుతున్నారన్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీనే కంపెనీ ఇవ్వనంటే.. ఆయన తయారు చేసిన మద్యాన్ని కొనకుండా పక్కన పెట్టేశారన్నారు.

ఏపీలో ఆరోగ్యానికి పూర్తి హానికరమైన పదార్ధాలతో మద్యం తయారీ జరుగుతోందని, రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదని.. ఒక్క పరిశ్రమ రాలేదని.. ఇలా అయితే మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని పురంధేశ్వరి ప్రశ్నించారు...

Sbnews

వచ్చేవారం నారా లోకేశ్‌ 'యువగళం' తిరిగి ప్రారంభం

రాజోలు: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిలిపివేసిన యువగళం పాదయాత్రను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. వచ్చేవారం నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..

చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూ.గో. జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళాన్ని తిరిగి ప్రారంభించనున్నారు.

చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో నారా లోకేశ్‌ ఇవాళ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు ఆయన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు..

Sbnews

Sbnews

సెల్ ఫోన్ కోసం యువకుడు ఆత్మహత్య?

ఫోన్ పోయిందని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది.

ఆదివారం ఉదయం జగద్గిరిగుట్ట ఎల్లమ్మ బండలో కెటిఆర్ కాలనీలో నివాసముంటున్న నితీష్ రాజు(26) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పోన్ పోయిందని మనస్తాపంతో నితీష్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు...

Sbnews

Sbnews

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి దీక్ష

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం నిరసన దీక్షకు దిగనున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో దీక్ష చేపట్టనున్నారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నారు. నిన్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన మోత్కుపల్లి.. ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన విషయం తెలిసిందే.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల అరెస్టును బీఆర్ఎస్ అధినేత ఇప్పటివరకూ ఖండించకపోవడంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రాజకీయాలకు అతీతంగా ఆ అరెస్టును ఖండించాల్సి ఉన్నదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అరెస్టులను ఖండించడం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇప్పటివరకు ఈ అరెస్టు వ్యవహారంలో కేసీఆర్ మౌనంగా ఉండడాన్ని అదే పార్టీకి చెందిన మోత్కుపల్లి నర్సింహులు

ప్రశ్నించడం గమనార్హం...

Sbnews

నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం శ్రీ గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న - మాదగాని శ్రీనివాస్ గౌడ్

తిప్పర్తి మండలం గడ్డి కొండారం గ్రామంలో లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న

BJP రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాదగాని శ్రీనివాస్ గౌడ్

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుండా వినయ్ కుమార్, నరేష్, వంగూరిరవి, లింగ ప్రసాదు,సైదులు,మధు వర్మ, శ్యామ్ పవన్, కళ్యాణ్, చంద్రయ్య, గణేష్ నిర్వహణ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Sbnews

Sbnews

Sbnews

Sbnews