ఆలేరు ఎమ్మెల్యేకు హైకోర్టు జరిమానా
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. గత ఎన్నికల్లో తప్పుడు పత్రాలు ఇచ్చారనే ఆరోపణలపై హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనందుకు ఆమెకు హైకోర్టు మంగళవారం రూ.10 వేల జరిమానా విధించింది.
అక్టోబర్ 3 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.
అయితే 2018 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించి సునీత తప్పుడు సమాచారం అందించారని, ఆస్తులను చూపలేదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తప్పుడు సమాచారం అందించినందుకు ఆమె ఎన్నిక చెల్లదని, అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..
కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సునీతను ఆదేశించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.....
SB NEWS
![]()
Streetbuzz News
![]()
Streetbuzz News

























Streetbuzz News


Streetbuzz News


Streetbuzz News
Sep 26 2023, 15:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.4k