నారా బ్రాహ్మణి ని కలిసిన ఐటి ఉద్యోగులు

హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటి ఉద్యోగులు నారా బ్రాహ్మణిని సోమవారం కలిశారు.

టిడిపి అధినేత చం ద్రబాబు నాయుడు అక్రమమని, ఒక విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం చా లా బాధకలిగిస్తోందని వారు బ్రాహ్మణితో ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ఐటి రంగ ఉన్నతికి ఎంతో కృషి చేసి లక్షల మందికి ఉద్యో గాలు కల్పించిన చంద్రబాబు అరెస్టు కక్షపూరిత చర్య అని అన్నారు.

చంద్రబాబు అరెస్టును ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారని ఐటి ఉద్యోగులు పేర్కొన్నారు...

SB NEWS

SB NEWS

Streetbuzz News

మైనంపల్లి ఇంటికి కాంగ్రెస్ నేతల క్యూ

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి సోమవారం ఉదయం కాంగ్రెస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ మల్లురవి తదితరులు వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా మైనంపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు. దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి ఈ ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు.

కాగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు పూర్తయ్యాయి.

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఇందుకు ఈనెల 27న ముహూర్తం కుదిరిందని మైనంపల్లి సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి మెదక్‌ సీటును తన కుమారుడు రోహిత్‌కు కేటాయించాలంటూ గతంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముందు మైనంపల్లి ప్రతిపాదన పెట్టారు.

అయితే మైనంపల్లిని మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. మెదక్‌ సీటును సిటింగ్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డికే ఇచ్చారు. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి లోనైన మైనంపల్లి.. మంత్రి హరీశ్‌రావుపైన, పార్టీ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజాగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి.. మల్కాజిగిరి టికెట్‌నూ నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు.ఇదే క్రమంలో మైనంపల్లి తో కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సంప్రదింపులు జరుపుతున్నారు.

తనకు మల్కాజిగిరితో పాటుగా తన కుమారునికి మెదక్‌ సీటునూ కేటాయించాలంటూ మైనంపల్లి ప్రతిపాదించారు....

తెలంగాణలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా వచ్చే నెల 24వ తేదీ నుండి సీఎం కేసీఆర్ బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించనున్నది.

దీంతో ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు.

సోమవారం – గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ

మంగళవారం – బియ్యం రవ్వ కిచిడి, చట్నీ

బుధవారం – బొంబాయి రవ్వ ఉప్మా, సాంబార్

గురువారం – రవ్వ పొంగల్, సాంబార్

శుక్రవారం – మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్

శనివారం – గోధుమ రవ్వ కిచిడి, సాంబార్

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ లోని మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.

ఈ పథకం ప్రారంభంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు...

SB NEWS

STREETBUZZ NEWS

ప్రగతిభవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయులు

తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ప్రగతి భవన్ ముట్టడికి 317 జీవో ద్వారా ఇబ్బందులు పడుతున్న నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులు ప్రయత్నించారు.

దీంతో ప్రగతి భవన్ పరిసరాలు అట్టుడికి పోయాయి. నాన్ స్పౌస్ ఉపాధ్యాయ బాధితులు తమను స్థానిక జిల్లాలకు పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి ఇచ్చేందుకు ప్రగతి భవన్ వద్దకు వెళ్లినట్టు పలువురు టీచర్లు చెబుతున్నారు.

వినతిపత్రం ఇవ్వడానికి పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రగతి భవన్‌కు బయలుదేరారు. పోలీసుల బారికేడ్లను కూడా ఛేదించుకుని ప్రగతి భవన్ సమీపం వరకు చేరుకున్నారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది.

పోలీసులు అడ్డుకోవడంతో టీచర్లు రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు. పలువురు కేసీఆర్ మాస్కులను ధరించి మూకుమ్మడిగా ప్రగతి భవన్ రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు.

స్థానికత పునాదుల మీద ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో స్థానికత అనే అంశమే పరిహాసంగా మారిందని టీచర్లు ఆవేదన వ్యక్తంచేశారు...

భారత్ కు తొలి స్వర్ణ పతకం

చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత్‌ తొలి గోల్డ్‌మెడల్‌ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది .

రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.క్వాలిఫికేషన్ ఫైనల్‌ రౌండ్‌లో 1893.7 స్కోర్‌తో భారత్‌ అగ్రస్ధానంలో నిలిచింది.

ఆ తర్వాతి స్ధానంలో నిలిచిన ఇండోనేషియా 1890.1 స్కోర్‌, సిల్వర్‌ మెడల్‌ సొం‍తం చేసుకుంది. మూడో స్ధానంలో నిలిచిన చైనా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది..

మూసీ నదిపై ప్యారిస్ తరహా బ్రిడ్జిలను నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో అనేక సంస్కరణలు చేపడుతున్నారు.

మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి మంచి పర్యాటక కేంద్రంగా మారింది.

అక్కడ ఏర్పాటు చేసిన పార్కు సైతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది.

దీంతో ఆ చెరువు పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించింది. చెరువులో మురుగునీరు చేరి కలుషితం కాకుండా.. జలమండలి ఆధ్వర్యంలో అక్కడ మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని 7 ఎంఎల్‌డీ సామర్థ్యంతో పూర్తి చేసింది.

ఈ ఎస్టీపీతో పాటు చెరువులో రెండు చోట్ల మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను సోమవారం నేడు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారు.

వీటితో పాటు చారిత్రక మూసీ, ఈసీలపై ప్యారిస్‌ తరహాలో గ్రేటర్‌ నగరంలో హైలెవల్‌ బ్రిడ్జిల పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. రూ.545 కోట్లతో మూసీ-ఈసీలపై మొత్తం 55 కిలోమీటర్ల మేర 15 బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

ఇందులో భాగంగానే దాదాపు రూ.200 కోట్లతో ఏడు చోట్ల బ్రిడ్జిల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగా.. ఈ పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు..

సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ నేడు తీర్పు

టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.

మరోవైపు ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటీషన్ విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది.

రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో మళ్లీ కస్టడీకి కావాలని సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.

కస్టడీ పొడిగింపు పిటీషన్‌పై తమ వాదనలు కూడా వినాలని చంద్రబాబు తరపు న్యాయవాది పోసాని నిన్ననే కోరారు.

ఈ రోజు మెమోపై కోర్టు విచారించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో పిటీ వారెంట్‌లపై కూడా విచారించాలని సీఐడీ కోరింది.

కాగా సుప్రీం కోర్టు లో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటీషన్‌పై ఏమి జరుగుతుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....

అక్టోబర్ మొదటి వారంలో టీఎస్ కాంగ్రెస్ మొదటి జాబితా?

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. సర్వేల ఫలితాలు, నియోజకవర్గాల్లో నేతల పనితీరు, సామాజి క అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తోంది.

ఇటీవల ఢిల్లీలో రెండు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ భేటీ కావడంతో పాటు దా దాపు 80 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖ రారు చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సీల్డ్ కవర్ లో ఆ జాబితాను పంపినట్టుగా తెలిసింది.

ఈ జాబితాను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రా హుల్ గాంధీ పరిశీలించిన తర్వాత ఆమోదం తెలుపనున్నారు.

అనంతరం అక్టోబర్‌లో కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. తొలి జాబితాలో సీనియర్ నేతల పేర్లు కూడా ఉండనున్నాయి.

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భ ట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లతో పాటు పలువురు సీనియర్ నేతల పే ర్లు ఉన్నట్టుగా తెలిసింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువమంది సీటు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఎవరికి సీటు ఇవ్వాలో కాంగ్రెస్ తేల్చుకోలేకపోతుంది. అలాంటి స్థానాలపై ఆచితూచి వ్య వహారించాలని అధిష్టానం నిర్ణయించింది.

మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించి ఇలాంటి స్థా నాలపై చర్చించి రెండో జాబితాను తయారుచేయాలని నిర్ణయించింది.

ఈ నెల 29వ తేదీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు స్క్రీనింగ్ కమిటీ పంపిన తొలి జాబితాను పరిశీలించనున్నా రు. అనంతరం తొలి జాబితాను విడుదల చేయనున్నారు. అక్టోబర్ తొలివారంలో తొలి జాబితా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలతో సైతం చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని వారికి టిపిసిసి ముఖ్యనేతలు సర్దిచెబుతున్నట్టుగా సమాచారం

నేడు పట్టాలెక్కిన 9వందే భారత్ రైళ్లు

దేశవ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లు ఆదివారం పట్టాలెక్కాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.

ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ప్రయాణ సౌలభ్యంపై కేంద్రం దృష్టి సారించిందని

గత ప్రభుత్వాలు రైల్వేకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 25 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మరో 9 వందే భారత్‌ రైళ్లు ప్రారంభం అయ్యాయి.

త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే దిశగా కార్యచరన రూపొందిస్తున్నాం. భారతీయ రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్రం పెంచింది. మల్టీ-మోడల్ కనెక్టివిటీపై కూడా ప్రభుత్వం పనిచేస్తోంది.

వేగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వందే భారత్‌ రైళ్లు పనిచేస్తున్నాయి. కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగానికి ఇది ఒక ఉదాహరణ’ అంటూ ప్రధాని మోదీ కార్యక్రమంలో ప్రసంగించారు.

తాజాగా ప్రారంభించిన 9 వందే భారత్ రైళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, విజయవాడ-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

ఆసియా గేమ్ లో సత్తా చాటిన భారత హాకీ జట్టు

ఆసియా కప్ లో భారత హాకీ జట్టు విశ్వరూపం చూపించింది. పూల్‌ ఏ ప్రిలిమనీ రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

చైనాలోని హాంగ్‌జో వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా 16-0 తేడాతో ఉజ్బెకిస్తాన్‌పై అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది.

ముగ్గురు భారత ఆటగాళ్లు హ్యాట్రిక్స్‌ సాధించారు. అలాగే లలిత్‌ ఉపాధ్యాయ్‌, వరుణ్‌ కుమార్‌ చెరో నాలుగు గోల్స్‌ చేయడం విశేషం.

మన్‌దీప్ సింగ్‌ మూడు గోల్స్‌ చేసి సత్తా చాటాడు. అభిషేక్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌ అమిత్‌ రోహిదాస్‌, సంజయ్‌ ఒక్కో గోల్‌ చేశారు.

ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ మంగళవారం సింగపూర్‌తో జరిగే మ్యాచ్‌లో తలపడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్ లేకపోయినా భారత హాకీ జట్టు చెలరేగి ఆడింది.

తొలి క్వార్టర్‌లో లలిత్‌, వరుణ్‌లు 2-0 అధిక్యంతో నిలిచారు. అనంతరం అభిషేక్‌, మన్‌దీప్‌లు 4-0తో స్కోరు సాధించారు.

ఇక రెండో క్వార్టర్‌లోనూ భారత్‌ ఆధిక్యంలో నిలిచింది. ఆపై సుఖ్‌జీత్, మన్‌దీప్‌ జోడి కట్టడంతో భారత్‌ విజేతగా నిలిచింది...