తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవురోజు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.

దీంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్వనానికి కూడా 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.

కాగా, శనివారం 74,884 శ్రీవారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో నిన్న 32,213 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.7కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Streetbuzz News

తెలంగాణ బోర్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఉధృతిత

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ.. ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి ఏపీ కి వస్తున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు.

భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వస్తున్నట్టు ఏపీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం తెలంగాణ బోర్డర్ వద్ద భారీగా పోలీసుల మొహరించారు.

హైదరాబాద్ వైపు నుంచి వస్తోన్న వాహానాలను తనిఖీ చేస్తున్నారు.

పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఖమ్మం మీదుగా రాజమండ్రికి వెళ్తున్నారు. బ్యాచులుగా విడిపోయి రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బోర్డర్ వద్ద ఐడి కార్డులు.. వివరాలను తెలుసుకున్న తర్వాతే వాహనాలను వదిలిపెడుతున్నారు. ఇప్పటికే ఐటీ ప్రొఫెషనల్స్ వివిధ మార్గాల ద్వారా రాజమండ్రికి చేరుకున్నట్టు సమాచారం.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘చలో రాజమండ్రి’ కార్యక్రమాన్ని కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు వద్ద హైఅలర్ట్‌ ప్రకటించారు.

ఐటీ ఉద్యోగుల ఆందోళనకు అనుమతి లేదంటూ వారిని సరిహద్దు వద్ద అడ్డుకునేందుకు భారీగా బలగాలను రంగంలోకి దించారు.

సరిహద్దు వద్ద మూడంచెల్లో దాదాపు 250 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ డీసీసీ అనిత, నందిగామ ఏసీపీలు ప్రత్యేక దృష్టి సారించారు..

Simultaneous Polls: 'జమిలి ఎన్నికల కమిటీ' తొలి భేటీ.. పార్టీల అభిప్రాయాల సేకరణకు నిర్ణయం

దిల్లీ: 'ఒకే దేశం - ఒకే ఎన్నికల (One Nation, One Election)' నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే..

ఈ కమిటీ శనివారం దిల్లీలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా సభ్యులకు స్వాగతం పలికిన కమిటీ ఛైర్మన్‌ కోవింద్‌.. సమావేశ అజెండాను వివరించారు.

ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.

'జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాల సేకరణకు.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, పార్లమెంటులో

తమ ప్రతినిధులు ఉన్న పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.

దీంతోపాటు భారత న్యాయ కమిషన్‌ను కూడా కమిటీ ఈ మేరకు ఆహ్వానించింది' అని ఒక ప్రకటన వెలువడింది.

అవసరమైన దస్త్రాల సన్నద్ధత, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి? జమిలి ఎన్నికలపై పరిశోధన.. తదితర అంశాలు సమావేశ అజెండాలో భాగమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి..

SB NEWS

STREETBUZZ NEWS

ఆర్టీసీ సిబ్బందికి ఎండీ సజ్జనర్ కీలక సూచనలు

రాబోయే ఐదు నెలలు ఆర్టీసీ సంస్థకు ఎంతో కీలకమని, పండుగల సీజన్ లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ ఆదేశించారు.

దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, మేడారం జాతరతో పాటు శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ధేశించారు.

పండుగ సీజన్ సన్నద్ధత, క్షేత్రస్థాయిలో సిబ్బంది విధుల నిర్వహణ, తలెత్తుతున్న సమస్యలు, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఉద్యోగులందరితో శనివారం ఆయన వర్చ్‌వల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వంలో విలీనం చేయడంతో సిబ్బంది బాధ్యత మరింత పెరిగిందని, గతం కంటే రెట్టింపు స్థాయిలో పని చేయాలన్నారు.

గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చామని, వినూత్న కార్యక్రమాలతో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువ చేశామని తెలిపారు.

సంస్థ మనుగడ కోసం యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను అటు సిబ్బంది, ఇటు ప్రయాణికులు స్వాగతించారని పేర్కొన్నారు.

వంద రోజుల ఛాలెంజ్‌, శ్రావణ మాసం ఛాలెంజ్‌, రాఖీ పండుగ ఛాలెంజ్‌, దసరా ఛాలెంజ్‌, సంక్రాతి ఛాలెంజ్‌, ఏడీపీసీ ఛాలెంజ్‌... ఇలా ఎన్నింటినో సిబ్బంది స‌వాలుగా స్వీక‌రించి

లక్ష్యానికి మించి ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పని చేయడం వల్లే సంస్థకు సత్పలితాలు వచ్చాయని తెలిపారు..

SB NEWS

హైదరాబాదులో భారీ భవనాలు కూల్చివేత

మదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు.

అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో రహేజా మైండ్‌స్పేస్‌లోని నెంబర్‌ 7, 8 భవనాలను క్షణాల్లోనే అధికారులు నేలమట్టం చేశారు.

ఏడు అంతస్తుల్లో ఉన్న భవనాలు క్షణాల్లోనే కూల్చివేశారు. ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ భవనాల కూల్చివేతను చేపట్టింది.

అయితే, రెండు భవనాల స్థానంలో కొత్తగా భవనాలు నిర్మించనున్నారు. కొద్దికాలం కిందట భవనాలను నిర్మించారు.

పలు సాంకేతిక కారణాలతో భవనాలకు సమస్యలు రావడంతో వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను వినియోగించి..

పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ భవనాలను కూల్చివేశారు.....

అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: స్టాలిన్ సర్కార్

తమిళనాడు లోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాత లకు ప్రభుత్వం లాంఛనాలతోనే

అంత్య క్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు.

అవయవ దానం విష యంలో తమిళనాడు దేశం లోనే అగ్రగామిగా ఉంది. విషా దకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల

అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది.

మరణానంతర అవయవ దానం చేయటం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధు మిత్రులకు తెలియజేయాలి.

మిగిలిన వాళ్లు కూడా అవ యవ దానం చేసేలా ప్రోత్సహించాలి.

అవయవ దాతలు , వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్రం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని స్టాలిన్ పేర్కొన్నారు..

సీ వీ ఆనంద్ ను కలిసిన ప్రీ వెడ్డింగ్ షూట్..పోలీస్ దంపతులు

హైదరాబాద్‌కు చెందిన పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం, పోలీస్ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

పోలీస్ వెహికల్‌ నుంచి కిందకు దిగుతున్నట్లు ఫొటోలు తీయించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

పోలీస్ వెహికల్, డ్రెస్, పోలీస్ స్టేషన్‌ను ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ఉపయోగించుకోవడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు.

ఈ పోలీస్ దంపతులు బాధ్యతలు మరిచి ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.

ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, విమర్శలు దారి తీసిన నేపథ్యంలో తాజాగా పోలీస్ దంపతులు ఎస్‌ఐ భావన, రావు కిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌కు పోలీస్ డ్రెస్, వెహికల్, పోలీసుల ప్రాపర్టీ ఉపయోగించుకోవడంపై ఆయనకు క్షమాపణలు చెప్పారు.

దీంతో జీవితంలో సంతోషంగా ఉండాలని కొత్త జంటకు సీవీ ఆనంద్ శుభాకాంక్షలు చెప్పారు...

ముగిసిన చంద్రబాబు మొదటి విచారణ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి రోజు సిఐడి విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును సిఐడి అధికారులు విచారించారు.

సుమారు ఆరు గంటలపాటు చంద్రబాబును సిఐడి అధికారులు ప్రశ్నించారు.

సిఐడి డిఎస్‌పి ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది బృందం విచారించింది. బాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ జరిగింది.

ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో సిఐడి అధికారులు ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే...

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

ఎమ్మెల్సీ కవితతో బీసీ నేత ( ఎంపీ )ఆర్ కిష్టయ్య భేటీ

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ అయ్యారు.కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ నేతలు కూడా కవితతో సమావేశమయ్యారు.

మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోట అమలు చేసేలా జాతీయ స్థాయిలో కృషి చేయాలని కోరారు. 40 ఏళ్ల నుంచి బీసీల కోసం పోరాటం చేస్తున్నామని.. ఢిల్లీలో 80సార్లు ధర్నా చేశామన్నారు.

అలాగే బీసీల కోసం.. బీసీ బిల్లు కోసం 65 సార్లు ప్రధాన మంత్రులను కలిసామని, కానీ ఈనాటికి బీసీలకు న్యాయం జరగటంలేదన్నారు. అన్ని పార్టీలను కలిసి బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేలా చేయాలని కోరామని తెలిపారు.

దశాబ్దాలుగా బీసీ బిల్లుకు మోక్షం కలగటంలేదని.. ఇప్పటికైనా పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక బీసీల బిల్లు ప్రవేశపెట్టే సమయం వచ్చిందని బీసీల నినాదం ఢిల్లీని తాకిందన్నారు.

ఇక బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు...

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

గ్రూప్ 1 పరీక్ష రద్దు ప్రభుత్వ నిర్లక్ష్యమే: బల్మూరి వెంకట్

గ్రూప్ - 1 పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ స్పందించారు.

శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవకతవకలను తప్పు పడుతూ బయోమెట్రిక్ విధానం అమలు చేయించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ తప్పిదమే అని ఆరోపించారు. ప్రతిఒక్క అభ్యర్థికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

నిరుద్యోగులతో ప్రభుత్వ నాయకులను జిల్లాల వారిగా అడ్డుకుంటామని హెచ్చరించారు.

టీఎస్‌పీఎస్సీ ట్రాన్సపేరెన్సీగా పని చేయాలని కోరారు. యువతకు న్యాయం జరిగేలా సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

మూడు అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత విద్యార్థుల సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని అంతే కాకుండా యువత సమస్యలను పరిష్కరిస్తామని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు..