గ్రూప్ 1 పరీక్ష రద్దు ప్రభుత్వ నిర్లక్ష్యమే: బల్మూరి వెంకట్

గ్రూప్ - 1 పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ స్పందించారు.

శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవకతవకలను తప్పు పడుతూ బయోమెట్రిక్ విధానం అమలు చేయించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ తప్పిదమే అని ఆరోపించారు. ప్రతిఒక్క అభ్యర్థికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

నిరుద్యోగులతో ప్రభుత్వ నాయకులను జిల్లాల వారిగా అడ్డుకుంటామని హెచ్చరించారు.

టీఎస్‌పీఎస్సీ ట్రాన్సపేరెన్సీగా పని చేయాలని కోరారు. యువతకు న్యాయం జరిగేలా సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

మూడు అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత విద్యార్థుల సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని అంతే కాకుండా యువత సమస్యలను పరిష్కరిస్తామని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు..

Motkupalli Narasimhulu : చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్‌ స్పందించాలి: మోత్కుపల్లి

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా ఖండించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరారు.

చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు..

హైదరాబాద్‌లో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు.

'జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత. జగన్‌ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారు. దళితులపై ఇన్ని ఘోరాలు గతంలో ఎప్పుడూ జరగలేదు.

ఏపీ సీఎం జగన్‌ దళిత ద్రోహి. జగన్‌ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. చంద్రబాబు లాంటి నేతలను తీసుకెళ్లి జైలులో పెట్టి రాక్షసానందం పొందుతున్నారు.

వైఎస్‌ కూడా ఇలా ఎప్పుడూ పరిపాలన చేయలేదు. దళిత డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. పులివెందులలో దళిత మహిళను అత్యాచారం చేసి చంపారు.

ప్రజల కోసం ఐదేళ్లలో బడ్జెట్‌లో రూ.7-8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు. అలాంటి వ్యక్తి.. ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా? '' అని ఏపీ ప్రభుత్వాన్ని మోత్కుపల్లి నిలదీశారు..

చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని మోత్కుపల్లి అన్నారు. ''చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్‌ పని చేశారు. నేను ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో పని చేశాను. రాజకీయాలు పక్కనపెట్టి కేసీఆర్‌ స్పందిస్తే.. ప్రజాస్వామ్యానికి మంచిది. నేను భారాసలోనే ఉన్నాను.

కానీ, వ్యక్తిగతంగా చంద్రబాబు అరెస్టుపై స్పందించాను. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కచ్చితంగా గెలుస్తారు.'' అని మోత్కుపల్లి తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేపడతానని.. అదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేస్తానని అన్నారు..

ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు గోల్ మాల్ చేశారని

ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

సీఐడీ పోలీసులు చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి హిమబిందు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించినప్పటీ నుండి ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

తమ నేతను జైలుకు పంపారన్న ఆగ్రహంతో ఆమెను కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారు.

కాగా, జడ్జిని కించపరుస్తూ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఆ ఫిర్యాదులపై రాష్ట్రపతి భవన్ స్పందించింది.

విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు రాష్ట్రపతి కార్యదర్శి పీ.సీ మీనా ఆదేశించారు.

ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి వివరించాలని లేఖ రాశారు....

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు?

రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు..16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ తెలంగాణలో ఈ వానకాలం 15 శాతం అధిక వర్షపా తం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా శనివారం నుంచి రాష్ట్రం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సహా 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీచేసింది. ఈ నెల 25 నుం చి నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందుతాయని, రాజస్థాన్‌ నుంచి వెనుతిరుగుతాయని వెల్లడించింది.

ఈ ప్రభావంతో డిసెంబర్‌ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు...

SB NEWS

SB NEWS

SB NEWS

Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్‌

అమరావతి: జైలులో ఉండాల్సిన సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

జనంలో ఉండాల్సిన నిజాయతీపరుడు, తెదేపా అధినేత చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారని పేర్కొన్నారు..

ఈ మేరకు నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ''జైలు మోహన్‌కు బెయిల్‌డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. జైలు మోహన్.. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు.

రూ.42 వేల కోట్ల ప్రజాధనం దోచేశారు. జగన్‌పై సీబీఐ, ఈడీ సహా 38 కేసులు ఉన్నాయి. జైలులో ఉండాల్సిన ఆయన.. పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారు'' అని లోకేశ్‌ ధ్వజమెత్తారు..

SB NEWS

SB NEWS

SB NEWS

Chandrababu : క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్‌ చేసిన చంద్రబాబు

దిల్లీ: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

స్కిల్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు..

తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.

సోమవారం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి.. వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉంది.

దర్యాప్తు తుది దశలో ఉన్నందున కేసులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే..

SB NEWS

SB NEWS

స్కాంలో ఉన్నది ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి బొత్స

చంద్రబాబుపై మంత్రి బొత్స సెటైర్లు

అవినీతిపై పక్కా ఆధారాలున్నాయి

బాబు మద్దతిచ్చే వారు ఇప్పటికైనా ఆయన్ను ప్రశ్నించండి

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైరికల్‌ పంచ్‌ వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ..

దొరికితే దింగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా చంద్రబాబు ఇన్నాళ్లు ప్రవర్తించారు. ఇన్నాళ్లు తప్పులు చేసినా దొరకలేదు.. ఇప్పటికి దొంగ దొరికిపోయి జైలుకు వెళ్లారని చురకలంటించారు.

అలాగే, స్కిల్‌ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాగా, తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్‌ స్కాం కేసులో ప్రేమ చంద్రారెడ్డి మీద మాకు ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు.

స్కాంలో ఎవరి పాత్ర ఉంటే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అధికారులు అభ్యంతరం చెప్పిన తర్వాతే ఫైల్‌ సీఎం దగ్గరకు వెళ్తుంది.

దానికి ముఖ్యమంత్రిదే బాధ్యత ఉంటుంది. రిమాండ్‌ కొనసాగింపు సందర్బంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారు.

అందుకే ప్రజాజీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. అవినీతి చేయకుండా పరిపాలన సాగించాలి..

గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు

తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. ఈ మేరకు శనివారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు సార్లు గ్రూప్ - 1 పరీక్షలు రద్దు అయినట్లు తెలిసింది.

హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ - 1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

హాల్ టికెట్ నెంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం… పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.

జూన్ 11వ తేదీన జరిగిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది...

SB NEWS

SB NEWS

SB NEWS

చంద్రబాబును విచారిస్తున్న సిఐడి బృందం

సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. శనివారం ఉదయమే చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం మెడికల్ టెస్టులు చేసింది.

అల్పాహారాన్ని తీసుకున్న చంద్రబాబు మెడిసిన్స్ వేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సరిగ్గా ఉదయం 9.30 గంటలకు ఆయనను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని, విచారణను ప్రారంభించారు.

సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇస్తారు. 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది.

ప్రతి గంటకూ చంద్రబాబుకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తారు. సీఐడీ విచారణ నేపథ్యంలో జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

జైలు పరిసరాల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు విచార‌ణ‌లో షరతులు

చంద్రబాబు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా జర్నీ అవసరం లేకుండా జైల్లోనే విచారించాలని ఆదేశించిన కోర్ట్ .

ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించే అవకాశం

విచారణలో మొత్తం 12 మందిని జైల్లోకి అనుమతి.

9 మంది అధికారులతో పాటు ఒక వీడియో గ్రాఫర్ ఇద్దరు మీడియేటర్లను అనుమతి

ఏడుగురు న్యాయవాదులు విచారణ జరిగే ప్రాంగణంలో ఉండవచ్చనేది కోర్ట్ ఆదేశం.

కస్టడీకి తీసుకునే ముందు బాబుకు వైద్య పరీక్షలు.

విచారణ సందర్భంగా పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు.

న్యాయవాది సమక్షంలో చంద్రబాబును విచారించాలి..

విచారణలో న్యాయవాదులు జోక్యం చేసుకోకూడదు

విచారణ సందర్భంగా చంద్రబాబుకు అవసరమైన మెడికల్ సదుపాయం అందుబాటులో ఉంచాలి.

మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ విరామం

ప్రతి గంటలో ఐదు నిమిషాల పాటు బ్రేక్.

విచారణ సమయంలో చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లు ఉండడానికి అనుమతి

బ్రేక్ సమయంలో చంద్రబాబు తన కౌన్సిల్‌తో మాట్లాడే వెసులుబాటు.

న్యాయవాదికి కనిపించేలా చంద్రబాబును విచారించాలి.

విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలనేది కోర్ట్ ఆదేశం.

దర్యాప్తుపై పూర్తి గోప్యత పాటించాలనీ.. సీల్డ్ కవర్లో కాపీని సమర్పించాలని ఆదేశించిన కోర్ట్

సీఐడీ డీఎస్పీ ధనంజయుడు నేతృత్వంలో ఒక సీఐ, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్ల సమక్షంలో ఈ విచారణ.

రాజమండ్రి జైల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తిని విచారించడం ఇదే తొలిసారి కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు

రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో నేడు జమిలి కమిటీ సమావేశం

జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం శనివారం ఇక్క డ జరగనుంది.

ఈ విషయంలో రోడ్‌మ్యాప్‌పైన, ఇందుకు సంబంధించిన భాగస్వాములతో ఎలా చర్చించాలనే దానిపై ఈ సమావేశం లో చర్చిస్తారని తెలుస్తోంది.

ఈ నెల 23న కమిటీ సమావేశం జరుగుతుందని కోవిద్ ఇటీవల ఒడిశాలో చెప్పిన విషయం తెలిసిందే.

లోక్‌సభతో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై పరిశీలన జరిపి, వీలయినంత త్వర లో సిఫార్సులు చేసేందకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న కోవింద్ నే తృత్వంలో ఎనిమిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించిన విషయం తెలిసిందే,

ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మాజీ మంత్రి గులాబ్ నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ అధ్యక్షుడు ఎన్‌కె సింగ్ , లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సి కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మాజీ చీఫ్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉన్నారు.

లోక్‌సభలో కాం గ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని కూడా కమిటీలో సభ్యుడుగా ఉన్నప్పటికీ తాను కమిటీలో ఉండబోవడం లేదని ఆయన ఇటీవల హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

కాగా ఈ సమావేశం కే వలం పరిచయ సమావేశం మాత్రమేనని, ఈ సమావేశంలో తమకిచ్చి న అంశంపై ముందుకు వెళ్లడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌పై కమిటీ చరిస్తుందని కమిటీ సన్నిహిత వర్గాలు తెలియజేశారు.

కమిటీ విధి విధానాల గురించి న్యాయశాఖ అధికారులు ఇదివరకే కోవింద్‌కు వివరించారు. అంతేకాకుండా అమిత్ షా, కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్న న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్‌లు కోవింద్‌ను కలిశారు.