Shamshabad: శంషాబాద్‌లో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికులు 300 మంది..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది.

దీంతో రాష్ట్రంలో కార్యకలాపాలన్నీ స్తంభించాయి. శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

ఈరోజు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు.

శంషాబాద్ ఎయిర్ ఎయిర్ పోర్ట్ లో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఖతార్‌ వెళ్లాల్సిన విమానం శంషాబాద్ లో ల్యాండింగ్‌ ఎందుకు చేస్తున్నారో అర్థంకాని గందరగోళ పరిస్థితి ప్రయాణికుల్లో నెలకొంది.

దోహా నుండి నాగపూర్ వెళ్లాల్సిన కత్తర్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించడంతో 300 మంది ప్రయాణికుల మైండ్‌ బ్లాంక్ అయ్యింది..

SB NEWS

నేటి నుంచి ఆసియా గేమ్స్ సమరం

ఆసియా గేమ్స్‌-2023 ప్రధాన ఈవెంట్లకు నేటి నుంచి తెరలేవనుంది. ఈ మెగా సంగ్రామంలో భారత క్రీడాకారులు పతకాల వేటను ప్రారంభించడానికి రెడీ అయ్యారు.

భారత్‌ నుంచి వివిధ క్రీడాంశాల్లో మొత్తం 655 మంది క్రీడాకారులు ఈ మెగా సమరంలో పోటీ పడుతున్నారు. గత ఎడిషన్‌ 2018లో జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌ పోటీల్లో భారత్‌ మొత్తం 70 పతకాలు గెలుచుకుంది.

ఇదే భారత్‌ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఇక ఈసారి చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మన దేశ ఆటగాళ్లు వంద(100) పతకలతో సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇప్పటికే ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, మహిళల క్రికెట్‌, టేబుల్‌ టెన్నిస్‌, రోయింగ్స్‌ వంటి క్రీడలు మొదలయ్యాయి. కానీ అధికారికంగా శనివారం నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు ఈ మెగా టోర్నీ ప్రధాన ఈవెంట్లు జరుగుతాయి.

బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, బాక్సింగ్‌, పురుషుల క్రికెట్‌, టెన్నిస్‌, హాకీ, కబడ్డీ, రెజ్లింగ్‌, ఆర్చరీ, అథ్లెటిక్స్‌, సెపక్‌ తక్రా తదితర క్రీడా అంశాల్లో భారత ఆటగాళ్లు పతకాల కోసం విదేశీ ప్రత్యర్థులతో పోటీ పడనున్నారు.

ప్రస్తుతం అన్ని క్రీడా విభాగాల్లో భారత్‌ దూసుకుపోతుంది. చిన్న చిన్న పోటీల్లో కాకుండా పెద్ద ఈవెంట్‌లలోనూ భారత క్రీడాకారులు సత్తా చాటుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఒలింపిక్స్‌ లాంటి మెగా ఈవెంట్‌లలోనూ పతకాలు సాధిస్తూ భారత ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికల్లో దేశ కీర్తి, ప్రతిష్టలను మరింతగా మెరుగుపరుస్తున్నారు.

ఈసారి అత్యధిక స్వర్ణాలు ఖాయం..!

కొన్ని క్రీడాంశాల్లో భారత్‌ స్వర్ణ పతకాలు గెలవడం ఖాయం. ముఖ్యంగా భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఈసారి బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.

ఈ ఏడాది జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడిషన్‌ ఆసియా గేమ్స్‌లోనూ బంగారు పతకం సాధించన విషయం తెలిసిందే.

ఈసారి కూడా అతను పసిడితో మెరుస్తాడని అందరూ భావిస్తున్నారు. ఇక తొలిసారి ఆసియా క్రీడాల్లో ప్రవేశ పెట్టిన క్రికెట్‌లో కూడా భారత్‌ పురుషుల, మహిళల రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు హాకీలోనూ టీమిండియా పటిష్టంగా ఉంది.

హాకీలో పురుషుల జట్టు, మహిళల జట్టు పసిడి గెలుచుకుంటుందనడంలో సందేహంలేదు. బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు ఎదురులేదనే చెప్పాలి. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి పురుషుల డబుల్స్‌ జోడీ ఈసారి కూడా బంగారు పతకం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అలాగే మహిళల సింగిల్స్‌లో సింధుపై భారీ ఆశలు ఉన్నాయి.

ఈ ఏడాది ఫామ్‌లేమితో సతమతమవుతున్న సింధు ఆసియాగేమ్స్‌ పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిదాంబీ శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌లు కూడా పతకాలు గెలుచుకోనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

నార్కోటిక్ పోలీసుల ముందుకు హీరో నవదీప్

హైదరాబాద్ : నేడు నార్కోటిక్ పోలీసుల ముందుకు హీరో నవదీప్ రానున్నాడు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29 గా హీరో నవదీప్ ఉన్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సప్లయర్ రామచందర్‌తో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు వివరాలు ఆరా తీయనున్నారు..

హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు అనుమానిస్తున్నారు. సప్లయర్ రామచందర్ పట్టుబడినప్పటి నుంచి హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెల్ పిటిషన్ కొట్టేసి 41 ఏసీఆర్‌పీసీ కింద విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు హైకోర్టు సూచించింది.

ఆదేశాల నేపథ్యంలో నవదీప్‌కు 41 ఏసీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు..

SB NEWS

SB NEWS

కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తండ్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి (76) శుక్రవారం రాత్రి 10.10 గంటలకు గుండెపోటుతో మరణించారు.

కాగా హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రముఖ నేత హరీశ్వర్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హరీశ్వర్ రెడ్డి తనయుడు, ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి అకాల మరణం పట్ల తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

కొప్పుల హరీశ్వర్ రెడ్డితో పనిచేసినప్పుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు...

SB NEWS

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

వీకెండ్ రానే వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది.

నేడు శనివారం 31 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న శుక్రవారం 72,650 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 27,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి.

4 గంటలకు స్వర్ణ రథంపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.

మైనంపల్లి నేడు ఢిల్లీ పయనం

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తినకు పయనం కానున్నారు. నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి భేటీ కానున్నారని సమాచారం.

శుక్రవారం రాత్రి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరికపై ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరపనున్నారు.

ఈ నెలాఖరులోగా మైనంపల్లి హస్తం గూటికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు రెండు రోజులపాటు జరిగాయి. ఈ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలందరూ ఢిల్లీలోనే ఉన్నారు.

దీంతో మైనంపల్లి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అనంతరం కాంగ్రెస్‌లో చేరికపై మైనంపల్లి అధికారికంగా ప్రకటన చేయనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

కూత్బాల్లాపూర్ నుంచి మైనంపల్లికి, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

తండ్రీకొడుకులకు టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో మైనంపల్లి హస్తం గూటికి చేరుతున్నట్లు తెలుస్తోంది......

నేడు షర్మిల ఢిల్లీ టూర్

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల శనివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది.

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రె్‌సలో వైఎస్సార్టీపీని విలీనం చేయాలని షర్మిల ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా..

ఆమె సేవలను ఎక్కడ వినియోగించుకోవాలన్న దానిపై స్పష్టత రావట్లేదు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం.. షర్మిల చేరికను వ్యతిరేకిస్తూ వస్తోంది.

అయితే దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ షర్మిలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే షర్మిల ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ వారంలోనే కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై స్పష్టత రానున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి....

SB NEWS

రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు

రాష్ట్రంలో పనిచేస్తున్న తొమ్మిది మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సందర్భంలో డీఎస్పీల బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది.

రానున్న రెండు మూడు రోజుల్లో మరికొన్ని బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఈనెల చివరిలోగా పోలీస్ మరియు రెవెన్యూ శాఖల్లో కొన్ని బదిలీలు జరగనున్నట్లు తెలిసింది......

SB NEWS

SB NEWS

SB NEWS

Sidharth Luthra: సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్‌

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తాజాగా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా మరో పోస్ట్‌ పెట్టారు..

'ప్రతి రాత్రి తర్వాత ఉషోదయం ఉంటుంది. అది మన జీవితాల్లోకి కొత్త వెలుగులను మోసుకొస్తుంది' అంటూ ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.

చంద్రబాబు తరఫున హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో లూథ్రా ఈ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

చంద్రబాబు కేసును వాదిస్తునప్పటి నుంచి లూథ్రా వరుస ట్వీట్లు చేస్తున్నారు.

తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోవద్దన్న స్వామి వివేకానంద వ్యాఖ్యలను ఓ పోస్ట్‌లో ప్రస్తావించారు.

అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపుమేర కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైందని, పోరాటమే శరణ్యం అంటూ లూథ్రా చేసిన ట్వీట్‌ కూడా ఆసక్తిని రేకెత్తించింది..

SB NEWS

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ నిరాహార దీక్ష భగ్నం..

నంద్యాల: తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రెండు రోజులుగా ఆమె నిరాహార దీక్ష చేపట్టారు..

నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఆమె దీక్షకు దిగారు. ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి సైతం నిరవధిక దీక్షలో కూర్చున్నారు.

దీంతో పోలీసులు శనివారం వేకువ జామున ఆమె దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఆమెను నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆళ్లగడ్డకు తరలించారు.

ఆళ్లగడ్డలోని నివాసంలోనికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల వాహనంలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు.

ఈ దశలో ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను, ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి ఆమె నివాసానికి తరలించారు..

SB NEWS