నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 22:18

తెలంగాణలో గెరిల్లా గ్లాస్ సంస్థ పెట్టుబడి: మంత్రి కేటీఆర్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో దిగ్గజ కంపెనీ ముందుకొచ్చింది. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న గొరిల్లా గ్లాస్‌ తయారీ కంపెనీ తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను సెటప్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆ సంస్థ రూ. 934 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. 800 మందికి ఉపాధిని కల్పించనున్నట్లు తెలిపారు. కాగా, అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ ఉన్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో పెట్టుబడుల కోసం అంతర్జాతీయ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారు చేయడానికి తెలంగాణ‌లో తయారీ ప్లాంట్‌ను నెల‌కొల్పాల‌ని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 22:17

రేపటి నుంచి ఎంసెట్ బైపీసీ అభ్య‌ర్థుల‌కు కౌన్సెలింగ్ ప్రారంభం

ఎంసెట్ బైపీసీ అభ్య‌ర్థుల‌కు శ‌నివారం నుంచి కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. బీ ఫార్మ‌సీ, ఫార్మా డీ త‌దిత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు.

వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌బుకింగ్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది.

ఈ నెల 4, 5 తేదీల్లో అభ్య‌ర్థుల ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. 4 నుంచి 9 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవాలి. పూర్తి వివరాల కోసం https://tseamcetb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

బీ ఫార్మ‌సీకి సంబంధించి 114 కాలేజీల్లో 6910 క‌న్వీన‌ర్ కోటా సీట్లు, ఫార్మ్ -డీలో 61 కాలేజీల్లో 1191 క‌న్వీన‌ర్ కోటా సీట్లు, బ‌యోటెక్నాల‌జీలో 94, బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్‌లో 36, ఫార్మాస్యూటిక‌ల్ ఇంజినీరింగ్‌లో 81 సీట్లు ఉన్నాయి...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 19:59

Nadendla: 'ఒకే దేశం- ఒకే ఎన్నిక'కు జనసేన మద్దతు: నాదెండ్ల మనోహర్‌

మంగళగిరి: ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ మద్దతిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతూ..

ఈ అంశంపై భాజపా పెద్దలు పవన్‌ కల్యాణ్‌తో ఇప్పటికే చర్చించారన్నారు. దీనిపై మరింత లోతైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పిన మనోహర్‌.. ఎన్నికల సమయంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఈనెల 2న పవన్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, భవన నిర్మాణ కార్మికులతో కలసి సహపంక్తి భోజనం, రెల్లి కాలనీ వాసుల మధ్య పుట్టిన రోజు వేడుకలు, ఎస్సీ బాలుర వసతి గృహాలలో పెన్నులు, నోట్ బుక్స్ పంపిణీ, ప్రభుత్వ సహాయం అందని విభిన్న ప్రతిభా వంతులను దత్తత తీసుకొని వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతున్నామన్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 19:58

అమరావతి రైతులకు సుప్రీంకోర్టు శుభవార్త

ఆర్-5 జోన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దంటూ ఏపీ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది..

ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఆర్-5 జోన్ వ్యవహారానికి, రాజధాని అంశానికి సంబంధం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టిందని, పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవగా, దీనిపై హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.

ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ జస్టిస్ జోసెఫ్ ఉత్తర్వుల తర్వాత హైకోర్టు విచారణ జరిపించింది. విచారించాల్సిన అంశాలు చాలా ఉండటంతో తదుపరి విచారణ చేపడతామని సంజీవ్ ఖన్నా వెల్లడించారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. మూడువారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీచేసింది. ప్రతివాదులు కౌంటరు దాఖలు చేసిన తర్వాత మరో మూడు వారాల్లో రిజాయిండర్ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. తర్వాత విచారణను నవంబర్ లో చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 19:57

రేపే ఆసియన్ హాకీ సెమీఫైనల్ మ్యాచ్: దూసుకెళ్తున్న భారత్

మెన్స్ ఆసియన్‌ హాకీ 5ఎస్‌ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో భారత పురుషుల జట్టు.. ఎలైట్ గ్రూప్ లో జపాన్‌లతో జ‌రిగిన రెండో మ్యాచ్ లో 35-1 స్కోర్ తో చిత్తు చేసి సెమీస్ లోకి దూసుకెళ్లింది. అంత‌కుముందు మ‌లేషియాతో జ‌రిగిన మ్యాచ్ లో 7-5 స్కోర్ తో భార‌త్ విజ‌యం సొంతం చేసుకుంది.

వ‌రుస‌గా రెండు విజయాలతో, భారత్ 12 పాయింట్లతో ఎలైట్ పూల్ టేబుల్ లో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది.

కాగా, 13 పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇక ఈ టోర్నీలోని సెమీఫైనల్ మ్యాచ్ లు రేపు శనివారం ప్రారంభం అవుతాయి. అయితే, ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆడ‌నుండ‌గా.. భార‌త్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆడ‌నుంది.

కాగా, ఇవ్వాల జ‌రుగుతున్న క్వార్ట‌ర్ ఫైన‌ల్ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్- ఓమ‌న్, రెండో క్వార్ట‌ర్ మ్యాచ్ లో మ‌లేషియా- ఇరాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.

ఇక రేపు జ‌ర‌గున్న సెమీస్ లో తొలి క్వ‌ర్ట‌ర్ లో గెలిచిన జట్టు తో పాక్, రెండో క్వార్ట‌ర్ లో గెలిచిన జట్టు తో భార‌త్ లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 18:17

Opposition Meeting: లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ.. 'ఇండియా' కూటమి తీర్మానం

ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీయేను ఢీకొట్టేందుకు ఏర్పాటైన 'ఇండియా'(I.N.D.I.A) కూటమి మూడో సమావేశం ముంబయిలో రెండో రోజు కొనసాగుతోంది..

28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన ఈ కీలక భేటీలో వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరుపుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని కూటమిలోని పార్టీలు తీర్మానం చేశాయి. ఇందులో భాగంగా 14 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కూటమికి సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే కమిటీగా ఇది వ్యవహరించనుంది..

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేయాలని 'ఇండియా' కూటమిలోని పార్టీలు తీర్మానించాయి. వివిధ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ తక్షణమే ప్రారంభించనున్నట్టు ఈ మేరకు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. సహకార స్ఫూర్తితో త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని ప్రజా సమస్యలపై వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే, వివిధ భాషల్లో "జుడేగా భారత్, జీతేగా ఇండియా" అనే థీమ్‌తో ప్రచార వ్యూహాలను సమన్వయం చేసుకొని పనిచేయనున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్‌ 30 నాటికి సీట్ల సర్దుబాటు చేసే అంశాన్ని పూర్తి చేసేలా పనిచేయనున్నట్టు సమాచారం..

సమన్వయ కమిటీ సభ్యులు వీళ్లే..

'ఇండియా' కూటమి సమన్వయ కమిటీలో కాంగ్రెస్‌ నుంచి కేసీ వేణుగోపాల్‌, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి అభిషేక్‌ బెనర్జీ, శివసేన నుంచి సంజయ్‌ రౌత్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా, సమాజ్‌ వాదీ పార్టీ నుంచి జావేద్‌ అలీ ఖాన్‌, జేడీయూ నుంచి లలన్‌ సింగ్‌, సీపీఐ నేత డి.రాజా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఒమర్‌అబ్దుల్లా, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ ఉన్నట్టు సమాచారం. ఈ అత్యున్నత నిర్ణాయక కమిటీ తక్షణమే సీట్ల పంపకాలపై కసరత్తు ప్రారంభించనుంది..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 17:28

స్వతంత్ర భారత ఘన వజ్రోత్సవాల ముగింపు వేడుకలు.. హాజరైన సీఎం కేసీఆర్

నగరంలోని హెచ్‌ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కళారూపాల ప్రదర్శన నిర్వహించారు. వీణా వాయిద్య ప్రదర్శనతో పాటు లేజర్ షో కూడా ఏర్పాటు చేశారు.

స్వతంత్ర సమర యోధులను తలచుకునే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ప్యూజన్ డ్యాన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వేడుకలు కొనసాగుతున్నాయి. కార్యక్రమం చివరలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 17:26

యువకుడిపై మంత్రి కొడుకు తుపాకితో కాల్పులు?

కేంద్ర మంత్రి ఇంటిలో జ‌రిగిన కాల్పుల‌లో ఒక యువ‌కుడు మ‌ర‌ణించాడు.. మంత్రి కుమారుడు వికాస్ లైసెన్స్ డ్ గ‌న్ తో అత‌డిని కాల్పి చంపారు..

శుక్రవారం తెల్లవారు జామున 4.15 గంటలకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోని బెగారియా గ్రామంలో మంత్రి ఇంట్లో ఈ ఘటన జరిగింది. మంత్రి కుమారుడి స్నేహితుడు ఒకరు పార్టీ కోసం వినయ్ శ్రీవాస్త‌వ్ ను పిలిచారు. అయితే పార్టీ జరుగుతుండగా మధ్యలో శ్రీవాస్తవ తలలో గన్ పెట్టి కాల్చి చంపారు.

మృతుడిని 30 ఏళ్ల వినయ్ శ్రీవాస్తవ్ గా గుర్తించారు. చనిపోయిన యువకుడిని కౌషల్ కిషోర్ తనయుడు అషూ అలియాస్ వికాస్ స్నేహితుడిగా గుర్తించారు. అంతేకాదు వినయ్ బీజేపీ కార్యకర్త కూడా.

అయితే చంపడానికి ఉపయోగించిన గన్ మంత్రి కుమారుడు అషు లైసెన్స్డ్ రివాల్వర్ గా తేల్చారు పోలీసులు. అయితే హత్య జరిగిన సమయంలో మంత్రి తన ఇంట్లోనే ఉన్నారు. వెంటనే ఆయన పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గన్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

యువకుడి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు లక్నో డీసీపీ వెస్ట్ రాహుల్ రాజ్ తెలిపారు. మరణించిన యువకుడి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల పై ఐపీసీ సెక్షన్ 302హత్య కింద కేసు నమోదు చేశారు...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 17:25

తెలంగాణ ఆర్టీసీ ఆల్ టైం రికార్డ్!!

రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీసరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ 12.08.2022 నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది.

ఈ రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాది కన్నా లక్ష మంది అదనంగా రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే, గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈ సారి ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 2022లో రాఖీ పండగ నాడు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా.. ఈ సారి 36.77 లక్షల కిలో మీటర్లు నడిచాయి.

ఆక్యూపెన్సీ రేషియా ఓఆర్ విషయానికి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును పునరావృతం చేసింది. 2022లో రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈ సారి 104.68 శాతం రికార్డు ఓఆర్ నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి.

నల్లగొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రాఖీ పౌర్ణమికి 97.05 శాతం ఓఆర్ నమోదైంది. ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. అలాగే, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 17:23

తిరుపతిలో అయిదో చిరుత ఎట్రీ?

అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం. శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే నాలుగు చిరుత‌ల‌ను ప‌ట్టుకున్న అట‌వీ శాఖ...

తాజాగా ఆయిదో చిరుత‌ను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. వివిధ ప్రాంతాల‌లో బోనులు ఏర్పాట్లు చేశారు. కాలిన‌డ‌క భ‌క్త‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు..