ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్న నల్లగొండ ఐటి హబ్ను సందర్శించిన ఎమ్మెల్యే కంచర్ల

ఐటీ హబ్ ను సందర్శించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు

నల్లగొండలో తుది మెరుగులు దిద్దుకొని ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నా ఐటీ హబ్ ను సందర్శించిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు   నల్లగొండలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి అని అత్యాధునిక టెక్నాలజీ కార్పొరేట్ హాంగులతో విశాలమైన గదులతో నిర్మించిన ఈ టవర్ అతి త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే ఈ ఐటీ టవర్ లో కార్యకలాపాల నిర్వహణకు ఆయా కంపెనీలతో ఐటి శాఖ ఒప్పందని కుదుర్చుకుందని దానికి సంబంధించిన జాబ్ మేళా ను కూడా ఇప్పటికే స్థానిక లక్ష్మి గార్డెన్స్ లో సెప్టెంబర్ 01.వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ..

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారితో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) మరియు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు మరియు మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు స్థానిక కౌన్సిలర్లు మరియు ఐటి టవర్ నిర్మాణ సంస్థ మరియు ఇతరులు పాల్గొన్నారు.

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ ఏరియార్స్ వెంటనే చెల్లించాలి-AITUC

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ ఏరియార్స్ వెంటనే చెల్లించాలి-AITUC

  

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 2021 ఏప్రిల్ నుండి పెరిగిన డిఏ డిఏ బాపతో ఏరియర్స్ డబ్బులను వెంటనే చెల్లించాలని ఏఐటీయుసీ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ,రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య లు డిమాండ్ చేశారు.

బుధవారం నాడు సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ సివిల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో డివైయస్ఇ సి.బానుప్రసాద్ గారికి మరియు కార్పొరేటు సివిల్ డివైయస్ఇ ఏ.రవికుమార్ గారికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2021 ఏప్రిల్ నుండి సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా రివైజు అయిన డిఏ బాపతు పెండింగ్ ఏరియర్స్ చెల్లింపులో సింగరేణి అధికారులు జాప్యం చేయడం సరికాదని విమర్శించారు.తక్షణమే పెండింగ్ ఏరియర్స్ చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం చంద్రశేఖర్,నరసింహ, ప్రభాకర్,ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

_పారిశ్రామిక కార్మికులు గా ఉన్నా ఆర్టీసి కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండేలా చూడాలి

_పారిశ్రామిక కార్మికులు గా ఉన్నా ఆర్టీసి కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండేలా చూడాలి

పారిశ్రామిక కార్మికులుగా ఉన్న ఆర్టీసి కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ వుండేలా చూడటం, అమలులో వున్న అలవెన్సులను పూర్తిగా కొనసాగించాలని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు నల్గొండ డిపో గౌరవాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య . ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

  

 బుధవారం ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన ఆర్టీసీ విలీనం- ఆంధ్రప్రదేశ్ అనుభవాలు అనే బుక్ లెట్ ను నలగొండ డిపోలో ఆవిష్కరించి అనంతరం ఆర్ ఎం శ్రీదేవి కి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ ఆర్టీసి కార్మికులు పారిశ్రామిక కార్మికులని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని పరిస్థితులకు, ఆర్టీసి కార్మికుల పని పరిస్థితులకు పూర్తి తేడా వుంటుందని అన్నారు. ఆర్టిసి కార్మికులకు స్థిరమైన పద్ధతిలో పని దినం వుండదు. ఒక రోజు తెల్లవారుఝామున వెళితే, మరో రోజు మరో సమయంలో డ్యూటీకి వెళ్ళవలసి వస్తుంది. ఇంటి భోజనం తినడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. బయట హోటల్లోనే భోజనం చేయాలి. అలాగే పూర్తిగా ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా ధైర్యంగా పని చేయాలి. అనుకోని పద్ధతిలో తమ తప్పు లేకపోయినా, ఎదుటివారి తప్పిదాల వలన జరిగే ప్రమాదాలలో కూడా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తమ ప్రాణానికి ముప్పు ఏర్పడిందని తెలుస్తున్న సందర్భాలలో కూడా ప్రయాణీకులను సురక్షితంగా వుండేలా చూసి, స్టీరింగ్ పైనే తమ ప్రాణాలను విడిచిన ఘటనలు కార్మికుల వారి క్రమ శిక్షణకు, అంకిత భావానికి నిదర్శనాలు.అటువంటి క్లిష్టతర పరిస్థితిలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా వుండాలని 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (జులై 20, 21 - 2015) కూడా నిర్దేశించింది. కావున ఆర్టీసి కార్మికులకు 2017, 2021 సం॥లలో రావలసిన వేతన ఒప్పందాలను అమలు చేసి, ఆ పిమ్మట ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కువగా వుండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుఅలాగే,65 సం॥రాల ఆర్టీసి ప్రస్తానంలో (ఉమ్మడి ఆర్టీసి గాను, టీఎస్ ఆర్టీసిగాను) కార్మికోద్యమం చేసిన ఆందోళనలు,ఐక్య పోరాటాలతో సంస్థను బ్రతికించుకోవడంతో పాటు, అనేక అలవెన్స్ లను, సౌకర్యాలను సాధించుకొన్నారు అవన్నీ కూడా పారిశ్రామిక వివాదాల చట్టం - సెక్షన్ 12 (3) క్రింద ఒప్పందం చేసుకొన్నా విలీనం అనంతరం కూడా ఆ అలవెన్స్లు,సౌకర్యాలను కొనసాగిస్తూనే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వున్న మెరుగైన సౌకర్యాలు, అలవెన్స్లు ఆర్టీసీ కార్మికులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు

  

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ రీజియన్ అధ్యక్షులు కందుల నరసింహ చంద్రమౌళి డిపో కార్యదర్శి బోడ స్వామి రీజియన్ సహాయ కార్యదర్శి శ్యాంసుందర్ ,సాధిక్ పాష , శ్రీరాములు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్‌లో ముదిరిన వివాదం.. నన్ను డిక్టేట్‌ చేయొద్దన్న రేవంత్‌ రెడ్డి.. మీటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోయిన ఉత్తమ్‌

కాంగ్రెస్‌లో ముదిరిన వివాదం.. నన్ను డిక్టేట్‌ చేయొద్దన్న రేవంత్‌ రెడ్డి.. మీటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోయిన ఉత్తమ్‌

కాంగ్రెస్‌లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన పీఈసీ సమావేశం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వర్సెస్‌ రేవంత్‌ రెడ్డిగా మారింది.

పార్టీలో రెండు టికెట్ల విషయంలో జరిగిన చర్చ వాగ్వాదానికి దారితీసింది.

కాంగ్రెస్‌లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన పీఈసీ సమావేశం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వర్సెస్‌ రేవంత్‌ రెడ్డిగా మారింది. పార్టీలో రెండు టికెట్ల విషయంలో జరిగిన చర్చ వాగ్వాదానికి దారితీసింది. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చే అంశంపై అధిష్ఠానంతో చర్చించాలని ఉత్తమ్‌ అడగ్గా.. నన్ను డిక్టేట్‌ చేయొద్దంటూ రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉత్తమ్‌.. మీటింగ్‌ మధ్యలో నుంచే వెళ్లిపోయారు. ఈ వాగ్వాదం ఇప్పుడు కాంగ్రెస్‌ను హీటెక్కిస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న ఆశవాహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు పీఈసీ (పీసీసీ ఎలక్షన్‌ కమిటీ ) మంగళవారం గాంధీ భవన్‌లో సమావేశమైంది. దాదాపు మూడున్నర గంటల పాటు కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో సామాజిక వర్గాల వారిగా కేటాయించిన స్థానాలపై చర్చ జరిగింది. మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని రేణుకా చౌదరి డిమాండ్‌ చేశారు. బీసీల లెక్క తేల్చాలని వీహెచ్‌, ఏ ప్రాతిపదికన సర్వేలు చేశారని బలరాం నాయక్‌ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఒకే కుటుంబానికి రెండు టికెట్ల అంశంపై కూడా ప్రస్తావన వచ్చింది. ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశాన్ని హైకమాండ్‌ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే టీపీసీసీ చీఫ్‌గా దీనిపై నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయాన్ని హైకమాండ్‌కు సూచించాలని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో తనను డిక్టేట్‌ చేయొద్దంటూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. దీంతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయారు.

ధూప దీప వేతనం రూ.10,000

ధూప దీప వేతనం రూ.10,000

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు.

సీఎం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్‌ ప్రతిపాదనలను పంపారు. ఆ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

6,541 మంది అర్చకులకు లబ్ధి

మూడు నెలల్లోనే అమలవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో హామీ

అర్చక సమాఖ్య హర్షం.. క్షీరాభిషేకం

నేడు కేసీఆర్‌ పేరిట గుడుల్లో పూజలు

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు. సీఎం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్‌ ప్రతిపాదనలను పంపారు. ఆ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.4,000 ధూప దీప నైవేద్యానికి, రూ.6,000 అర్చకుల వేతనాలు కలిపి రూ.10 వేలకు పెంచుతూ మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి వీ అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,541 మంది అర్చకులకు ప్రయోజనం చేకూరనున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. తమ మేలు కోసం నిర్ణయం తీసుకొన్న ముఖ్యమంత్రికి అర్చక సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

ప్రభుత్వంపై ఏటా రూ.31.39 కోట్ల అదనపు భారం

ధూపదీప నైవేద్య పథకం కింద గతంలో 6,541 మంది అర్చకులకు నెలకు రూ.6,000 వేల చొప్పున ప్రభుత్వం ఏటా 47.09 కోట్లు చెల్లించేది. ఇక నుంచి రూ.78.49 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై అదనంగా రూ.31.39 కోట్ల భారం పడనున్నది. అర్చకుల శ్రేయస్సు, ఆలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు జరగాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ వేతనాలను పెంచాలని నిర్ణయించారు. ధూప దీప నైవేద్య (డీడీఎన్‌) పథకం గౌరవ భృతిని 10 వేలకు పెంచడాన్ని హర్షిస్తూ హైదరాబాద్‌లో అర్చక సమాఖ్య గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అన్ని కులమతాలను సమానంగా ఆదరిస్తున్న కేసీఆర్‌ పదికాలాలపాటు అధికారంలో కొనసాగాలని కాంక్షిస్తూ బుధవారం అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌శర్మ, నారాయణస్వామి, ఆంజనేయాచారి, మహేంద్రాచారి, మోహన్‌ శర్మ, నవీన్‌ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ గొప్ప మనసుకు నిదర్శనం: ఇంద్రకరణ్‌రెడ్డి

ఇచ్చిన మాట ప్రకారం ధూప దీప నైవేద్య పథకం వేతనాలను రూ.10 వేలకు పెంచడం సీఎం కేసీఆర్‌ గొప్ప మనసుకు నిదర్శనమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కొనియాడారు. ఉమ్మడి పాలనలో అర్చకులకు డీడీఎన్‌ కింద నెలకు కేవలం రూ.2,500 మాత్రమే ఇచ్చేవారని, సీఎం కేసీఆర్‌ ఈ మొత్తాన్ని మొదట రూ.6000కు పెంచారని, తాజాగా రూ. 10,000కు పెంచారని గుర్తుచేశారు. గతంలో 1,805 ఆలయాలకు మాత్రమే డీడీఎన్‌ పథకం అమలుచేసే వారని, ప్రస్తుతం 6,541 ఆలయాలకు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆలయాలకు విస్తరించాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు. రూ.10 వేల పెంపుతో డీడీఎన్‌ పథకానికి ఏటా రూ.78.49 కోట్లు ఖర్చవుతుందని మంత్రి తెలిపారు.

నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల

 నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారుతమ క్యాంప్ కార్యాలయంలో... గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ,గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థలు మరియు ట్రస్మా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో...నిర్వహించిన నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..భారత హాకీ క్రీడను ప్రపంచవ్యాప్తం చేసిన త్రిబుల్ ఒలంపియన్... మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు 29 ని నేషనల్ స్పోర్ట్స్ డేగా ...ప్రభుత్వం జరుపటం... అత్యంత సముచితమని.. భారత హాకీ క్రీడ విశ్వవ్యాప్తం కావడానికి వారి త్యాగం ఎంతో ఘనమైనదని... జర్మనీ నియంత హిట్లర్ తమ దేశం తరుఫున ఆడితే... మేజర్ పదవేకాదు, అనేక సంపదలను ఆశ చూపినా, ఆ ప్రలోబాలకు లొంగకుండా... తన మాతృ దేశం కోసమే ఆడతానని చెప్పిన గొప్ప దేశభక్తుడని... ఇది ఈనాటి యువతరం వారి నుండి స్ఫూర్తి పొంది దేశ భక్తిని అలవార్చుకోవాలని కోరారు..

ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జి వి రావు

, చెన్నయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు గంట్ల అనంతరెడ్డి, పుచ్చకాయల వెంకటరెడ్డి, పులిజాల లక్ష్మీనారాయణ, రాజ్ కుమార్ రెడ్డి, రామకృష్ణ, ఎండి అజీజ్ షరీఫ్, జంగయ్య, అరుల్ రాజ్, ముద్దం నరసింహ, భారతీయ శ్రీనివాస్ రెడ్డి, హాలియా పబ్లిక్ స్కూల్ శ్రీనివాస్ మల్లెపల్లి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంజన్ గౌడ్, జహంగీర్, మల్లయ్య, పాండు, వాణి, ఆక్స్ఫర్డ్ జంగయ్య, మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు

ఎమ్మెల్యే కు వినతి పత్రం అందించిన ఆశ వర్కర్లు..

ఆశ వర్కర్స్ కు కనీస వేతనం 18000 ఇవ్వాలి 

ఎమ్మెల్యేకు వినతి 

     ఆశ వర్కర్స్ కు కనీస వేతనం 18000 నిర్ణయించి అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎం లుగా ప్రమోషన్లు కల్పించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య డిమాండ్ చేశారు

        

మంగళవారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) యూనియన్ ఆధ్వర్యంలో నలగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇస్తున్న పారితోషకాలను 18000 లకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పారితోషం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకూడదని, ఆశలకు పని భారం తగ్గించాలని పెండింగ్ లో ఉన్న కరోనా రిస్క్ అలవెన్స్ బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్స్ కు ప్రమాద బీమా ,పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రసూతి సెలవులు పైన సర్కులర్ ను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. 

    

 ఈ కార్యక్రమంలో సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్ పోలె సత్యనారాయణ, ఆశ వర్కర్స్ యూనియన్ తిప్పర్తి మండల అధ్యక్షులు టి పార్వతమ్మ, గాదరి పూలమ్మ, నిర్మల, బిక్షవమ్మా, ఎల్లమ్మ , మల్లేశ్వరి, శైలజ,రేణుక, తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ.. పేస్కేలుపై 30 శాతం వేతనాలు పెంపు

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ.. పేస్కేలుపై 30 శాతం వేతనాలు పెంపు

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీఎస్‌ఎస్‌ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ మూడు నెలల క్రితమే క్లియరెన్స్‌ ఇచ్చింది. 

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌ఎస్‌ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ మూడు నెలల క్రితమే క్లియరెన్స్‌ ఇచ్చింది. దీనికి సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలపడంతో తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్‌ఎస్‌ ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. పెరగనున్న పీఆర్సీ 2021 జూన్‌ 1వ తేదీ నుంచి వర్తించనుంది.

తెలంగాణ సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పే స్కేలు మీద 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల పేస్కేలు24,514 ఉండగా.. నూతన పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు ఒక్కొక్కరికీ 7,300 మేర పెరగనున్నాయి.

నల్గొండలో నూతన బట్టల షోరూం ఓపెనింగ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన నల్లగొండ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి

నల్గొండలో నూతన బట్టల షోరూం ఓపెనింగ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన నల్లగొండ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి

నల్లగొండ పట్టణంలోని వివేకానంద నగర్ గౌతమి కాలేజ్ సమీపాన కొలను మహేష్ శ్రీవిద్య దంపతుల క్వీన్స్ ఫ్యాన్సీ క్లాతింగ్ స్టోర్ ను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలకు కాస్మెటిక్స్ ఫ్యాన్సీ మెటీరియల్ డ్రెస్సెస్ మరియు అన్ని రకముల వన్ గ్రామ్ గోల్డ్, ఎంపోరియం శారీస్ మ్యాచింగ్ డెకరేటివ్ ఐటమ్స్ లభిస్తాయని పట్టణ ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బొజ్జ నాగరాజు, రావుల రేణుక, విజయ , రూప, లీలావతి, సైదమ్మ శిరీష కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

వికలాంగుల విద్య, ఉపాధి కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలి

వికలాంగుల విద్య, ఉపాధి కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలి

ఆటిజం వినికిడి తెరపి కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి-సంక్షేమం, సాధికారత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

వికలాంగులకు విద్యా, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక విదానాన్ని ప్రకటించాలనీ, రాష్ట్రంలో 12.2 శాతం జనాభా కలిగిన వికలాంగుల సంక్షేమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టదా అని వక్తలు ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కమిటీ నేతృత్వంలో వెలువడుతున్న వికలాంగుల వాయిస్ చైతన్య మాస పత్రిక 9వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోజరిగింది. వార్షికోత్సవం ప్రత్యేక సంచికను వొకేషనల్ రేహాబిలిటేషన్ సెంటర్ మాజీ డైరెక్టర్ గంగాధర్ రావు, ఎన్పీఆర్డీ జాతీయ ఉపాధ్యక్షులు యం అడివయ్య, వికలాంగుల వాయిస్ మాస పత్రిక మేనేజర్ కే వెంకట్, అసిస్టెంట్ మేనేజర్ బి స్వామి, అసిస్టెంట్ ఎడిటర్ జే రాజు, ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులు అర్ వెంకటేష్, ఎ రంగారెడ్డి, బలేశ్వర్, సాయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడివయ్య, గంగాధర్ రావు మాట్లాడుతూ దేశంలో 2.68 కోట్ల మంది వికలాంగులు ఉంటే రాష్ట్రంలో 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారన్నారు. రాష్ట్ర జనాభాలో వీరు 12.2శాతం ఉన్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీరి సంక్షేమం ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. విద్యా, ఉపాధి దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనాభాకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు. దేశలో 50 లక్షల మంది ఆటిజం కలిగిన వారున్నారని తెలిపారు. రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారనీ, వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా థెరపీ అందించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో, రాష్ట్రంలో వినికిడి లోపం సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. వికలాంగుల వాయిస్ మాస పత్రిక మేనేజర్ కే వెంకట్ మాట్లాడుతూ వైకల్య ధృవీకరణ పత్రాలు అందించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.

కార్యక్రమంలో ఎన్పీఆర్డీ నాయకులు టి మధు బాబు, కాశప్ప, దశరథ్, యశోద, పి కవిత, అరిఫా, ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్, ఎస్ ప్రకాష్ ,జయలక్ష్మి,శంకర్, భుజంగ రెడ్డి, రాధమ్మ, చంద్రమోహన్, లలిత ,బాలయ్య ,చందు, లింగన్న, వెంకన్న, సావిత్రి, షాహిన్ బేగం, రాజశేఖర్ గౌడ్, జంగయ్య, నారాయణ లతో పాటు వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.