ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిసిన ఎరుకల సంఘం నాయకులు
.
ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిసిన ఎరుకల సంఘం నాయకులు
సంగెం మండలం..
నేడు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి నివాసంలో ఎరుకల సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేసి,శాలువతో సన్మానం చేయడం జరిగింది.సంగెం రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరహరి ఆధ్వర్యంలో ఎరుకల వివిధ సమస్యలను ఎమ్మెల్యే గారికీ వివరించారు.అందులో ముఖ్యంగా ఎరుకల పిగ్ ఏంపర్మెంట్ స్కీమ్ కింద 60 కోట్లు ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.ప్రతి మండల సోసైటీ కి 40 లక్షలు మంజూరైనందున మా మాడలానికి ఒక ఎకరం ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఎరుకల సంఘం మండల నాయకులు పల్లకొండ బిక్షపతి మరియు రాయపురం సాంబ శివ గారు కోరారు.ఈ విషయం పై సానుకూలంగా స్పందించి ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఎరుకల సోసైటీకి ఇప్పించండని స్థానిక ఎంపీపీకి ఎమ్మెల్యే తెలిపారు.ఎరుకల కులస్థులకు గృహ లక్ష్మిలో ప్రాధాన్యత చూపాలని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్,హన్మకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిపాటి రమేష్,సంగెం మండల అధ్యక్షులు పల్లకొండ బిక్షపతి, పిగ్ సోసైటీ మండల చైర్మన్ రాయపురం సాంబశివ,ప్రధాన కార్యదర్శి రాయపురం రాజు,ప్రచార కార్యదర్శి పల్లకొండ కుమారస్వామి,డైరెక్టర్లు రాయపురం మల్లేష్,సమ్మయ్య,జనార్దన్,కుమారస్వామి,శ్రీనివాస్,మల్లయ్య,రాజేష్, ఎల్లస్వామి,ఎల్లయ్య,సదానందం,స్వామి,సాంబమూర్తి,సమ్మక్క,యాకమ్మ,సంతోష తదితరులు పాల్గొన్నారు.
Aug 27 2023, 19:46