Congress: కొడంగల్‌ నుంచి రేవంత్‌ ఒక్కరే.. ఇల్లందులో అత్యధికంగా 38 దరఖాస్తులు

హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌ టికెట్ల కోసం అధిక సంఖ్యలో ఆశావహులు ముందుకొచ్చారు. సీనియర్‌ నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అర్జీలు సమర్పించారు..

మొత్తంగా 119 నియోజకవర్గాలకు 1025 దరఖాస్తులు వచ్చాయి. ఆశావహుల్లో పలువురు పారిశ్రామికవేత్తలూ ఉన్నారు. కొందరు నేతలు రెండు, మూడు నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి చూపారు. కొడంగల్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఒక్కరు మాత్రమే దరఖాస్తు సమర్పించారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి..

రిజర్వుడ్ సెగ్మెంట్‌ల నుంచి అత్యధికంగా..!

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (మధిర), ఎమ్మెల్యేలు శ్రీధర్‌ బాబు (మంథని), సీతక్క (ములుగు), జగ్గారెడ్డి (సంగారెడ్డి), పొదెం వీరయ్య (భద్రాచలం) ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల నుంచి అదనంగా అర్జీలు వచ్చాయి. రిజర్వుడ్ సెగ్మెంట్‌లకు సైతం అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా ఇల్లందు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గానికి 38 మంది దరఖాస్తులు వచ్చాయి. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీకి దరఖాస్తులు ఇచ్చారు..

హుజురాబాద్‌ నుంచి బల్మూరి వెంకట్‌

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్గొండ), ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (జగిత్యాల), పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ గౌడ్‌(ఎల్బీనగర్‌), పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌(నిజామాబాద్‌ అర్బన్‌), ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ (హుజురాబాద్‌), మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌, కొండా సురేఖ వరంగల్‌ ఈస్ట్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి పోటీకి ముందుకొచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాలపై ఆసక్తి చూపారు. కొద్దికాలంగా గాంధీభవన్‌కు దూరంగా ఉంటున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు..

ఎన్నికల యుద్దం: సేనలు సిద్ధం..సై..!

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. గెలుపు కోసం ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి తమ సైన్యం వెళ్లేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు..

వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి తోను ప్రభుత్వానికి సంబంధాలు ఏర్పడ్డాయి. పథకాల లబ్ధిదారులే తమ ఓటు బ్యాంకు గా వైసీపీ భావిస్తుంది. ఇప్పుడు వీరికి పోటీగా టీడీపీ కుటుంబ సారధుల పేరుతో తమ సైన్యాన్ని రంగంలోకి దించుతోంది. దీంతో గడప దగ్గర నుంచే అసలు సిసలు ఎలక్షన్ వార్ ఏపీలో మొదలుకానుంది..

ఏపీలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. జగన్‌ను ఓడించి అధికారం చేపట్టాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్. ఇందుకోసం చంద్రబాబు జనసేనాని పవన్‌తో పొత్తు దాదాపు ఖాయం చేసుకున్నారు. ఈ ఇద్దరితో బీజేపీ కలిసి వస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో సీఎం జగన్ నమ్ముకున్న సంక్షేమ ఓట్ బ్యాంకుకు కౌంటర్ గా చంద్రబాబు మహానాడు వేదికగా సంక్షేమ మేనిఫెస్టోను ప్రకటించారు. కానీ ఆ మేనిఫెస్టోకు ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. దీంతో ఇప్పుడు వైసీపీ పథకాలను ఇంటింటికి అందిస్తున్న వాలంటీర్లకు పోటీగా కుటుంబ సారధులను రంగంలోకి దించి తన మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేరువ చేయాలనేది చంద్రబాబు తాజా ఆలోచన..

ఇందుకోసం వాలంటీర్ల తరహాలోనే ప్రతి 50 ఇళ్లకు ఒక కుటుంబ సారధిని నియమించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే పార్టీ ఇన్చార్జిలు వీరి ఎంపికకు సంబంధించి కసరత్తు పూర్తి చేశారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి వీరందరికీ బాధ్యతలు కేటాయించనున్నారు. టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోను టీడీపీ సూపర్ సిక్స్ ఇది బాబు గ్యారెంటీ స్కీం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీరికి శిక్షణ ఇవ్వనున్నారు..

ముఖ్యమంత్రి జగన్ తన పథకాల అమలులో ప్రధానంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి పథకంలోనూ మహిళలను లబ్ధిదారులుగా గుర్తించారు. అమ్మఒడి మొదలు ఇంటి స్థలాల వరకు అన్ని మహిళల పేరు మీదే పంపిణీ చేస్తున్నారు. మహిళా ఓట్ బ్యాంకును సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి పోటీగా చంద్రబాబు సైతం మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మహాశక్తి పేరుతో కొత్త పథకాలను ప్రకటించారు. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి మహిళకు ఆర్థికంగా చేయూతనివ్వటంతో పాటుగా , మహిళలకు జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని ప్రకటించారు..

ప్రతి ఇంటికి రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నేతలు ఈ పథకాల పైన అన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు ప్రతి ఇంటికి తన మేనిఫెస్టోను వివరించేందుకు కుటుంబ సారధులను ఎంచుకున్న చంద్రబాబు వారి ద్వారా వాలంటీర్ వ్యవస్థకు పోటీగా కొత్త వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. ఎన్నికల్లోగా టీడీపీ సారధులు ప్రతి ఇంటి తోను సంబంధాలు పెంచుకొని వైసీపీ కంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని ప్రచారం చేస్తూ టీడీపీకి అనుకూలంగా వారిని మలుచుకునేందుకు ప్రయత్నాలు చేయటమే వీరి నియామకం వెనుక అసలు ఉద్దేశం గా తెలుస్తుంది..

ఇప్పటికే ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్లతో పాటుగా వైసీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలో పార్టీ నుంచి కన్వీనర్లు గృహసారధుల నియామకం పూర్తిచేసింది. జగనన్న సురక్ష పేరుతో ప్రతి ఇంటికి ఈ టీం వెళ్లి అర్హత ఉండి పథకాలు అందని వారిని గుర్తించడంతో పాటుగా కావలసిన ధృవపత్రాలను సమకూర్చింది. అర్హత ఉన్నట్లుగా గుర్తించిన లబ్ధిదారులకు పథకాల పంపిణీ ప్రారంభించింది. పూర్తిగా పాజిటివ్ ఓటింగ్‌ను నమ్ముకున్న ముఖ్యమంత్రి జగన్ పథకాల లబ్ధిదారుల సంఖ్య ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈసారి ఎన్నికలు పూర్తిగా సంక్షేమ ఓట్ బ్యాంక్ ఆధారంగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు టీడీపీ కూడా కుటుంబ సారుథుల పేరుతో తమ సైన్యాన్ని రంగంలోకి దించటంతో ఇక క్షేత్రస్థాయిలో వాలంటీర్లు వర్సెస్ టీడీపీ గృహసారథులు అన్నట్లుగా వార్డు స్థాయిలోనే పొలిటికల్ వార్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Purandeswari: తితిదే బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారు: పురందేశ్వరి

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి నియామకాలపై ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తితిదే బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారని విమర్శించారు..

బోర్డు సభ్యులుగా శరత్‌ చంద్రారెడ్డి, కేతన్‌ దేశాయ్‌ నియామకమే ఇందుకు నిదర్శనమన్నారు. దిల్లీ మద్యం స్కామ్‌లో శరత్‌చంద్రారెడ్డి పాత్రధారిగా ఉన్నారని ఆమె ఆరోపించారు.

ఎంసీఐ స్కామ్‌లో దోషిగా తేలి కేతన్‌ దేశాయ్‌ పదవి కోల్పోయారన్నారు. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే ఈ విధానాన్ని భాజపా ఖండిస్తోందని పురందేశ్వరి తెలిపారు..

దేశ రాజధాని ఢిల్లీకి చేరిన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన

రాష్ట్రంలో కలకలం రేపిన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి చేరింది.

ఎల్బీనగర్ పీఎస్‌లో మహిళపై జరిగిన థర్డ్ డిగ్రీ ఘటనను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి గిరిజన సంఘాల నేతలు తీసుకెళ్లారు.

శనివారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మీర్పేట్ కార్పొరేటర్ నీల రవి నాయక్ కలిశారు. మహిళపై పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ అంశాన్ని స్పీకర్‌కు గిరిజన సంఘాల నేతలు వివరించారు.

ఒక మహిళను ఇంతలా కొట్టడం ఏంటని స్పీకర్ అడిగినట్టు గిరిజన నేతలు చెప్పారు. పోలీసులు మహిళలపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం బాధాకరమని స్పీకర్ అన్నారని వారు తెలిపారు.

మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతి భద్రతలు లేవన్నారు. అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒకరకమైన న్యాయం దక్కుతోందన్నారు. బీఆర్‌ఎస్ నేతల ఇండ్లలో మహిళలపై ఇలాగే అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా అని ప్రశ్నించారు.

గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.గిరిజన మహిళ వరలక్ష్మికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

లంబాడాల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న సోయం బాపురావు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.సోయం బాపురావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిజర్వేషన్లపై సోయం మాట్లాడటం అది ఆయన వ్యక్తిగతం అంటూ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును పార్లమెంట్ సభ్యుడైనా సోయం బాపురావు ఎలా వ్యతిరేకిస్తారని నిలదీశారు. సోయం బాపురావు వర్గం ప్రాబల్యం రెండు జిల్లాల్లోనే అని తెలిపారు.

ఢిల్లీకి ఫిర్యాదు చేయడానికి వస్తే తెలంగాణ పోలీసులు బెదిరిస్తున్నారని మంత్రులను కాదని ఎలా వెళ్తారని బాధితురాలు బంధువులను పోలీసులు బెదిరిస్తున్నారని నీలం రవి అన్నారు...

తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మెంబర్ గా సీతారెడ్డి

చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతా రెడ్డి కి కీలక పదవి దక్కింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా నియమించారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. 24 మందితో కొత్త పాలక మండలి ఏర్పాటు చేశారు. తెలంగాణా నుండి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి సీతా రెడ్డికి అవకాశం దక్కింది.

టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం దక్కడం పట్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి …తెలంగాణ సీఎం కేసీఅర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

సీతారెడ్డి. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు. ఇటీవల తిరుమల వేంకటేశ్వర స్వామినీ దర్శించుకున్న మరుసటి రోజే టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం దక్కడం విశేషం

కువైట్ లో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు సమాచారం.

మృతుడు గౌస్‌బాషా (35) అతని భార్య (30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. గౌస్‌బాషా రాజంపేట పట్టణంలోని ఎగువగడ్డలో ఉన్న అమ్మమ్మ తాతల వద్ద ఉంటూ స్థానిక ఓ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నట్లు తెలుస్తోంది.

అనంతరం తన స్వగ్రామమైన మదనపల్లెకి వెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి వివాహం చేసుకుని స్థిరపడ్డారు.బెంగళూరు నుంచి కువైట్‌కి వెళ్లిన గౌస్‌బాషా, ఆయన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం కారులో వెళ్తూ అదుపు తప్పి కారు బోల్తా పడిన సంఘటనలో కుటుంబం మృతి చెందినట్లు సమాచారం.

రోడ్డు ప్రమాదం జరిగింది వాస్తవమేనని, మృతి చెందినట్లు చెబుతున్న వ్యక్తికి ఫోన్‌ చేస్తే అందుబాటులోకి రావడం లేదని.. దీని బట్టి చూస్తే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని.. వారి మృతదేహాలను చూసే వరకు నిర్ధారించలేమని గౌస్‌బాషా సమీప బంధువులు తెలిపారు.........

పర్యాటక రైలులో భారీ పేలుడు :10 మంది దుర్మరణం

ఆలయాల నగరంగా ప్రసిద్ధిగాంచిన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని రైల్వే స్టేషన్‌లో ఆగివున్న పర్యాటక రైలులో అగ్నిప్రమాదం జరిగింది.

ఈ రైలులోని ప్యాంట్రీకార్‌లో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది..ఇందులో మొత్తం 10 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. మరికొందరు గాయపడినట్లు తెలిసింది,

లక్నో నుంచి రామేశ్వరం ప్రాంతాలను కలుపుతూ రైల్వే శాఖ పర్యాటక రైలును నడుపుతుంది. ఈ రైలు మదురై స్టేషన్‌కు వచ్చి ఆగింది. శనివారం ఉదయం రైలులోని ప్యాంట్రీకార్‌లో వంట పనుషులు తేనీరు పెట్టేందుకు గ్యాస్ స్టౌ వెలిగించారు. ఆ సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది

ఈ ప్రమాదంలో తొలుత ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చినప్పటికి ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..

డీఎస్సీ ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

తెలంగాణలో డీఎస్సీకి లైన్‌ క్లియర్‌ అయ్యింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యలో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ శుక్రవారం సాయంత్రం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు జీవో – 96ను జారీచేసింది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ మార్గదర్శకాల రూపకల్పనపై సంబంధిత శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.అధికారిక సమాచారం ప్రకారం దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు.

పరీక్షలను ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించగా, డీఎస్సీని సైతం ఇదే తరహాలో నిర్వహించే అంశంపై విద్యాశాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

పరీక్షలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు ఎస్జీటీలకు ఒక రోజు, స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. తాజాగా 5,089 పోస్టుల భర్తీకి జీవో విడుదల కాగా, 1,523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ ఫర్‌ డిసేబుల్డ్‌ పోస్టులను కొత్తగా మంజూరుచేయాల్సి ఉన్నది.

ఇవి కొత్త పోస్టులు కావడంతో ఆయా పోస్టులను మంజూరుచేస్తూ.. భర్తీకి అనుమతినిస్తూ ఒకే జీవోను జారీచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ జీవో ఒకట్రెండు రోజుల్లో వస్తుందని అధికారులు చెప్తున్నారు.

టీచర్‌ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ ఎగ్జామ్‌ను 80 మార్కులకు నిర్వహిస్తారు. అ ప్రశ్నపత్రంలో మాత్రం 160 ప్రశ్నలుంటాయి. అంటే ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున కేటాయిస్తారు.

ఇక టెట్‌కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష నిర్వహణ రాష్ట్రస్థాయిలోనే ఉంటుంది. అయితే, ఫలితాలు ప్రకటించిన తర్వాత జిల్లాలవారీగా మెరిట్‌, సెలెక్షన్‌ జాబితాలు విడుదల చేస్తారు.

కలెక్టర్ల నేతృత్వంలోని డిస్ట్రిక్ట్‌ సెలెక్షన్‌ కమిటీ, డీఎస్సీ, ఈ పోస్టుల భర్తీని చేపడుతుంది. కాగా, పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఎస్సీ ఏర్పాట్లపై కసరత్తు ముమ్మరం చేశారు.

మార్గదర్శకాలు

గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా,

ఈ నిబంధనను తాజాగా ఎత్తివేస్తున్నారు. రోస్టర్‌ ప్రకారం అంతా పోటీపడొచ్చు.

గతంలో 6 శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్‌ తాజాగా 10 శాతానికి పెంచుతున్నారు.

గతంలో లోకల్‌, ఓపెన్‌ కోటా రిజర్వేషన్‌ 80 : 20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95 : 5 రేషియోలో అమలుచేస్తారు.

అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో

4-10 తరగతుల చదువును పరిగణలోకి తీసుకోగా,

తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకొంటారు.

PM Modi: బెంగళూరుకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

బెంగళూరు: విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరుకు వచ్చారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు మోదీ ఇక్కడి వచ్చిన సంగతి తెలిసిందే..

ఈ సందర్భంగా విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 'జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌' నినాదం ఇచ్చారు. ''చంద్రుడిపై మన ల్యాండర్‌ దిగినప్పుడు భారత్‌లో నేను లేను. ఆ అద్భుత క్షణాలను విదేశాల నుంచి చూశా.

అప్పుడే నేరుగా బెంగళూరుకు రావాలని అనుకున్నా. భారత్‌ రాగానే శాస్త్రవేత్తలను కలుసుకొని అభినందించాలనుకున్నా. ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని చాలా ఆత్రుతగా ఉన్నా'' అని మోదీ వెల్లడించారు.

అనంతరం విమానాశ్రయం నుంచి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి మోదీ వెళ్లారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వివరించారు..

మూడు ప్రార్థన ఆలయాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

సచివాలయం ప్రాంగణంలో నిర్మితమైన దేవాలయం, మసీద్‌, చర్చి మ‌రికొద్దిసేప‌టిలో సీఎం కేసీఆర్‌ మీదుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ పరిపాలనా సౌధం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం సర్వమత సమ్మేళనానికి అత్తం పట్టనున్నది. సచివాల యం ఆవరణలో కొత్తగా ఈ మూడు నిర్మాణాలు పూర్తయ్యాయి.

సచివాలయం ఆవరణలో నిర్మించిన ఆలయంలో శివుడు, గణపతి, పోచమ్మ, హనుమంతుడి ఆలయాలున్నాయి. ఆయా దేవుళ్ల విగ్రహాలను తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాల నుంచి ప్రత్యేకంగా ఆయరు చేయించి తెప్పించారు. కాగా, గుడి, మసీదు, చర్చిలను సచివాలయంతోపాటే ప్రారంభించాలని భావించినా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సాధ్యంకాలేదు.

జులై 25 నాడే ప్రారంభించాలని భావించినా అనివార్యంగా కొన్ని పనులు పెండింగ్‌లో పడటంతో నిల్చిపోయింది. హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి దేవాలన్ని నేడు పున:ప్రారం భించనున్నారు.ఆ తర్వాత ఇస్లాం, క్రిస్టియన్‌ మతాల సాంప్రదా యాల మేరకు ఆయా మత పెద్దల సమక్షంలో మసీదు, చర్చిలను ప్రారంభిస్తారు.

తెలంగాణ పాత సచివాలయ ప్రాంగణంలో ఉన్న ప్రార్ధనా మందిరాలను తెలంగాణ సర్కార్‌ నూతన సచివాలయ నిర్మాణం తర్వాత పున:నిర్మించింది. గతంలో తెలంగాణ పాత సచివాల యంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం, రెండు మసీదులు, చర్చి ఉండేవి. పాత భవనాల కూల్చివేతల సమయంలో ప్రార్ధనా మందిరాలకు నష్టం వాటిళ్లడంతో ప్రభుత్వ ఖర్చుతోనే పున:నిర్మి స్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఇందుకు అనుగుణంగా సచివా లయ ప్రధాన భవన ప్రాంగణం వెలుపల మూడు నిర్మాణాలను నిర్మించారు. సచివాలయానికి నైరుతి మూలలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం విశాలంగా నిర్మించారు.

ప్రధాన ఆలయంలో భాగంగా గర్బగుడి, మహామండపం నిర్మించారు. నల్లపోచమ్మ ఆలయంతోపాటు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, గణపతి, సుబ్రహ్మన్య స్వామి ఆలయనాలను కూడా నిర్మించారు...