భార్య ప్రసూతికి గవర్నమెంట్ జాబ్ లో ఉన్న భర్తకు సెలవు ఇవ్వాల్సిందే: మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనం

ప్రసూతి సమయంలో భార్య పక్కన ఉండేందుకు 90 రోజుల సెలవులు పెట్టిన సీఐ

తొలుత మంజూరు చేసి ఆ తర్వాత మెమో ఇచ్చిన ఉన్నతాధికారులు

మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించిన సీఐ మెమోను రద్దు చేస్తూ ఉత్తర్వులు...

భార్య ప్రసూతి సమయంలో భర్తకు సెలవు మంజూరు చేయాల్సిందేనని మద్రాస్ హైకోర్టులోని మదురై ధర్మాసనం పేర్కొంది. గర్భంతో ఉన్న తన భార్య ప్రసూతి సమయంలో ఆమె పక్కన ఉండేందుకు తనకు మే 1 నుంచి 90 రోజులు సెలవులు కావాలంటూ తెన్‌కాశీ జిల్లా కడైయం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శరవణ్ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

తొలుత సెలవులు మంజూరు చేసిన ఉన్నతాధికారులు ఆ తర్వాత మెమో ఇవ్వడంతో ఆయన మద్రాస్ హైకోర్టులోని మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. విచారించిన ధర్మాసనం ప్రసూతి సమయంలో భార్య బాగోగులను చూసుకోవాల్సిన అవసరం భర్తకు ఉందని, కాబట్టి ఆయన సెలవు దరఖాస్తును పరిశీలించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌దారుడు బాధ్యతాయుతమైన భర్తగా వ్యవహరించారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన మెమోను రద్దు చేస్తున్నట్టు పేర్కొంటూ మెమోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మలక్‌పేట యశోద ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్ కు అరుదైన చికిత్స

•క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసిన వైద్య బృందం

నల్లగొండ :హైదరాబాదులోని మలక్‌పేట యశోద ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్ కు అరుదైన చికిత్స చేసి యువకుడి ప్రాణాలు కాపాడినట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ గోరుకంటి పవన్, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎల్ రోహిత్ రెడ్డిలు తెలిపారు.

గురువారం జిల్లా కేంద్రంలో మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నిరంతరం జ్వరం, రక్త స్రావంతో బాధపడుతూ ఆసుపత్రికి రాగా అతడికి పరీక్షలు జరిపి ఆక్యూట్ మై లో ఈడు లుకేమియా బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు.

వెంటనే అతడికి ఆప్యాధునిక వైద్య పరికరాలతో ఐదు రౌండ్ల కీమోథెరపీ చేసి , బ్లడ్ నుండి క్యాన్సర్ ను వేరు చేసి, ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ప్రాణాంతకమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటని, దానికి మెరుగైన వైద్యం, నిరంతర వైద్య పర్యవేక్షణ చాలా ముఖ్యమన్నారు . క్యాన్సర్ వచ్చినా కూడా ప్రాణాలు కాపాడుకోవచ్చని వారు తెలిపారు. క్యాన్సర్ అనగానే భయపడవద్దు అన్నారు. ఈ సమావేశంలో మలక్పేట యూనిట్ హెడ్ కే శ్రీనివాస్ రెడ్డి, జనరల్ మేనేజర్ చిరుద. శ్రీనివాస్ , సిబ్బంది వాసు కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్…పుష్పకు రెండు జాతీయ ఫిల్మ్ అవార్డ్

69వ జాతీయ ఫిల్మ్ అవార్డుల‌ను నేడు జ్యూరీ ప్ర‌క‌టించింది.. 31 అవార్దుల కోసం మొత్తం 28 భాష‌ల‌లో 280 చిత్రాలు పోటీ ప‌డ్డాయి..

ఈసారి అవార్డుల‌లో తెలుగు సినిమాలు కొత్త చ‌రిత్ర‌ను లిఖించాయి.. ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ వినోదాత్మ‌క‌ చిత్రం, ఉత్త‌మ సంగీతం, ఉత్తమ బ్యాంక్ గ్రౌండ్ సంగీతం, ఉత్త‌మ కొరియో గ్రఫీ, ఉత్త‌మ స్టంట్ కొరియో గ్రఫీ, ఉత్త‌మ గీత ర‌చయిత‌, ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్ అవార్డులు తెలుగు మూవీలు ఎగ‌రేసుకుపోయాయి..

69 సంవ‌త్స‌రాల జాతీయ అవార్దుల‌లో తొలిసారిగా తెలుగు హీరో అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడిగాఅవార్దు కైవ‌సం చేసుకుని టాలీవుడ్ కీర్తీని మరింత పెంచారు.. ఉప్పెన మూవీకి ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది..ఇక ఉత్తమ క్రిటిక్ అవార్డు ను తెలుగు మూవీ పురుషోత్తమ్ కు లభించగా, ఉత్తమ లిరిసిస్ట్ గా చంద్రబోస్ కొండపాలెం మూవీ ద్వారా ఎంపికయ్యారు

ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగం …

స్టంట్ కొరియో గ్ర‌ఫి సాల్మ‌న్ RRR మూవీ 

ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ RRR మూవీ 

విజువ‌ల్ ఎఫెక్ట్ వి శ్రీనివాస్ RRR మూవీ 

ఉత్త‌మ లిరిసిస్ట్ – చంద్ర‌బోస్- కొండ‌పాలెం మూవీ

బెస్ట్ సంగీత ద‌ర్శ‌కులు … ఫుష్ష . .. దేవీశ్రీ ప్ర‌సాద్ ,

బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఎం ఎం కీర‌వాణి. RRR

ఉత్త‌మ గాయ‌ని – శ్రీయా ఘోష‌ల్

ఉత్త‌మ గాయ‌కుడు – కాల‌భైర‌వ 

RRR మూవీ ఉత్త‌మ న‌టి .. అలియా భ‌ట్

గంగుభాయి వాడియా కీర్తి,స‌న‌న్,మిమి మూవీ

ఉత్త‌మ న‌టుడు – అల్లు అర్జున్ పుష్ప‌

ఉత్త‌మ చిత్రం – రాకెట్రీ ..ద నంబి తమిళం

ఉత్త‌మ వినోదాత్మ‌క చిత్రం RRR మూవీ 

  

ఉత్త‌మ ప్రాంతీయ చిత్రాలు

ఉత్త‌మ హిందీ చిత్రం స‌ర్దార్ ఉద్దమ్

క‌న్న‌డ చిత్రం 777 చార్లీ

మ‌ల‌యాళం చిత్రం – హోమ్

త‌మిళ చిత్రం క‌దాసి వ్య‌వ‌సాయి

తెలుగు ఫిల్మ్ .. ఉప్పెన.........

నోటిఫికేషన్ కాపీలను దహనం చేసిన ఏఎన్ఎంలు

జగిత్యాల జిల్లా:ఆగస్టు 24

తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని తొమ్మిది రోజులుగా దీక్షలు చేస్తున్న రెండో ఏఎన్ఎంలు ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏఎన్ఎంల రిక్రూట్ మెంట్ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కాపీలను గురువారం దీక్ష శిబిరం ఎదుట దహనం చేశారు. అనంతరం ఏఐటీయూసీ అనుబంధ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న తమని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

ఆర్టీసీ కార్మికులను,వీఆర్ఏ, పంచాయితీ కార్యదర్శులను కాంట్రాక్ట్ లెక్చలర్లను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు విస్మరించిదో అర్థం కావడం లేదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సర్వీస్ చేసామని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఇతర శాఖల్లో చేసిన మాదిరిగానే ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేసి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంల పక్షాన మధురిమ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సుప్రియ, నీరజ, పద్మ,రాజమని, మేరీ, ఎలిజబెత్, శిరీష, ప్రశాంతి, శైలజ, శిరీష, శారద, జమున, జయప్రద, చిలుకమ్మ, విజయలక్ష్మి, మహేశ్వరి, సుజాత, సరోజ, సుగుణ, ఊర్మిల, సమత, రాధ, ప్రశాంతి, సునీత, రమాదేవి, లక్ష్మికాంత, రజిత, సౌజన్య, పుష్ప, స్వరూప, సుమలత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు....

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నెంబర్ వన్

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌ అని రాష్ట్ర హోంమంత్రి మహముద్‌ అలీ అన్నారు.

నూతనంగా నిర్మించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ను చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, డీజీపీ అంజనికుమార్‌, సీపీ స్టీఫెన్‌ రవీంద్రతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జనాభా పెరుగుదలకు అనుకూలంగా నూతన పోలీస్‌ స్టేషన్లను నిర్మిస్తున్నదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి కమండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను హైదరాబాద్‌ నడిబొడ్డులో ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు , కర్ఫ్యూలు జరగలేదంటే పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు..

పట్నం మహేందర్ రెడ్డి కే పట్టం

తెలంగాణ కేబినెట్‌ విస్తరణ గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

రాజ్‌భవన్‌ లో గవర్నర్ తమిళిసై మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ పలువురు మంత్రులు హజరయ్యారు. మొత్తానికి పట్నం మహేందర్‌రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

ఈటల రాజేందర్ బర్త్‌రఫ్ తర్వాత దాదాపు రెండేళ్లపాటు సీఎం కేసీఆర్ ఆ మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అయితే మరో మూడు నెలల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత పట్నం మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగా చేశారు.

తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. తర్వాత మంత్రి పదవి వస్తుందని అంతా భావించినా.. సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. దీనిపై మహేందర్ రెడ్డి గతంలో రకరకాల కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు లీకులు కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేయడం, మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది...

WhatsApp: పేరు లేకుండానే గ్రూప్‌ క్రియేట్‌ చేసేలా.. వాట్సాప్‌ కొత్త ఫీచర్‌..

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మన ముందుకు వస్తూనే ఉంది. చాట్‌ ఎడిట్‌, చాట్ లాక్, వీడియో కాల్‌ సమయంలో స్క్రీన్‌ షేరింగ్‌, హెచ్‌డీ ఫొటో షేరింగ్‌ వంటి ఎన్నో సరికొత్త ఫీచర్లను ఇప్పటికే యూజర్లకు అందించింది..

తాజాగా గ్రూప్‌ క్రియేట్‌ చేయటంలో వాట్సాప్‌ కొత్త మార్పును తీసుకొచ్చింది.

సాధారణంగా వాట్సాప్‌లో గ్రూప్‌ క్రియేట్‌ చేయాలంటే ముందుగా కాంటాక్ట్స్‌లోని వారిని సెలెక్ట్ చేసుకొని దానికో పేరు పెట్టాలి. అప్పుడే గ్రూప్ క్రియేట్ అవుతుంది. అయితే, ఏదైనా హడావిడిలో పేరు ఎంపిక సాధ్యం కాకపోతే.. గ్రూప్‌ క్రియేట్‌ చేయడం కుదరదు. ఇకపై ఆ సమస్య ఉండబోదని వాట్సాప్ తెలిపింది. పేరుపెట్టాలనే నియమం లేకుండా వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ విషయాన్ని మెటా (Meta) సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) తన ఫేస్‌బుక్‌ (Facebook) ఖాతా ద్వారా వెల్లడించారు. అలాగే దానికి సంబంధించిన ఓ ఫోటోలను కూడా షేర్ చేశారు..

అత్యధికంగా ఆరుగురుతో క్రియేట్‌ చేసే వాట్సాప్ గ్రూప్‌లకు ఇకపై పేరు లేకపోయినా ఫర్వాలేదు. సభ్యుల పేర్ల ఆధారంగా గ్రూపు పేరు డైనమిక్‌గా మారుతుంటుంది. ప్రతి సభ్యుడికి వారి కాంటాక్టుల ఆధారంగా ఈ పేరు వేర్వేరుగా కనిపిస్తుంది. కావాలనుకుంటే తర్వాత గ్రూప్‌కి పేరు పెట్టొచ్చు. కేవలం అడ్మిన్‌ మాత్రమే కాకుండా గ్రూప్‌లోని సభ్యులు కూడా పేరును మార్చవచ్చు. అయితే, కాంటాక్ట్‌ని సేవ్‌ చేసుకోని వారికి మాత్రం ఫోన్‌ నంబర్ డిస్‌ప్లే అవుతుందని వాట్సాప్‌ వెల్లడించింది. రానున్న కొన్ని వారాల్లో ఈ సరికొత్త ఫీచర్ ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి రానుందని వాట్సాప్‌ తెలిపింది..

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..

ఢీల్లీ: మొదటి విడత 'భారత్ జోడో యాత్ర'కు అశేష ఆధరణ లభించడంతో కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు పిలుపునిచ్చారు..

అక్టోబర్ 2 నుంచి ఈ మేరకు యాత్ర ప్రారంభం కానుంది.

లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మరోసారి దేశం మొత్తం యాత్ర చేయడానికి పూనుకున్నారు. కాంగ్రెస్‌ను ప్రజల వద్దకు తీసుకుపోవడానికి, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మరోసారి నడుం బిగించారు.

మొదటిసారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొనసాగించారు రాహుల్. రెండోసారి భారత్ జోడో యాత్రలో గుజరాత్ నుంచి మేఘాలయా వరకు పర్యటించనున్నారని సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది..

డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు

తెలంగాణలో మరో ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి షాక్‌ తలిగింది. ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు.

తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ఆయనపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.

కృష్ణమోహన్‌రెడ్డికి 3 లక్షల జరిమానా విధిస్తూ అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది...

త్వరలోనే 6611 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌: మంత్రి సబిత

టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ లో నేడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ, మొత్తంగా 6,611పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రెండ్రోజుల్లో విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

కాగా వర్శిటీలలో అధ్యాపకులు పోస్ట్ ల భర్తీ బిల్లు గవర్న్ వద్ద పెండింగ్ లో ఉంద‌ని తెలిపారు.. ఇప్ప‌టికే ఆ బిల్లుపై గ‌వ‌ర్న‌ర్ అడిగిన అనుమానాల‌కు స‌మాధానాలు ఇచ్చామ‌ని చెప్పారు.

రాష్ట్రంలో విద్యారంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్ల బడ్జెట్ కేటాయించారని మంత్రి గుర్తుచేశారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ టీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకుల విద్యాసంస్థల్లో రాష్ట్రం గర్వించే స్థాయిలో ఫలితాలు వస్తున్నాయని కొనియాడారు. గురుకులాల్లో మరిన్ని సదుపాయాలు కల్పించడం, వాటిని అప్ గ్రేడ్ చేయడంలో విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పారు.

కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్ గ్రేడ్ చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని వివరించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 5,310 టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని, కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు.

దీంతో పాటు వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని వివరించారు. ఇంటర్‌, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తోందని, ప్రపంచం అబ్బురపడేలా సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నామని చెప్పారు.

నీళ్లు, నిధులకు సంబంధించి ఉద్యమకాలం నాటి ఆకాంక్షలు ఇప్పటికే నెరవేరాయని, నియామకాలకు సంబంధించిన ఆకాంక్షలు కొనసాగుతున్నాయని వివరించారు. కేసీఆర్ పాలనలో ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.....