నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్పార్టీ అభ్యర్థిగా కంచర్లను ప్రకటించిన నాటి నుండి.. వెల్లువలా ప్రజల నుండి మద్దతు...

 నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్పార్టీ అభ్యర్థిగా కంచర్లను ప్రకటించిన వాటి నుండి.. వెల్లువలా ప్రజల నుండి మద్దతు...

 పలు ప్రజాసంఘాలవారు... మేధావులు యువకులు యువకుల నుండి విశేష స్పందన. 

నల్లగొండ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరి మద్దతు తనకు ఉంటుంది...

 నిన్న....ఈరోజు పలు వార్డులు గ్రామాల నుండి భారీ సంఖ్యలో చేరికలు....

 ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల కరస్పాండెంట్స్ కంచర్లను కలిసి తమ మద్దతు ప్రకటన..

 బిఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా.. ముఖ్యమంత్రి ప్రకటించిన నాటి నుండి... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి... పలు ప్రజా సంఘాలు, యాజమాన్యాలు, మేధావులు యువకులు, తమ మద్దతు తెలియజేస్తూన్నారు... గత మూడు రోజుల నుండి కూడా కంచర్ల నివాసం... కోలాహలంగా మారింది... ప్రైవేట్ పాఠశాలలు కళాశాల యాజమాన్యం తరఫున....పలువురు కరస్పాండెంట్లు విచ్చేసి తమ మద్దతు తెలియజేశారు...

నిన్న ఈరోజు పార్టీలో పలు గ్రామాల నుండి వార్డుల నుండి... వందల సంఖ్యలో వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతూన్నారు...

 

ఈరోజు.. నల్గొండ పట్టణం 9వ వార్డు నుండి... జిట్టా నగేష్, కూతటి రాములు ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ నుండి 50 కుటుంబాలు... జంగాల కాలనీహనుమంతు పర్వతం,ఆధ్వర్యంలో 25 కుటుంబాలు నడ్డివారిగూడెం వింజమూరు నరసింహ మొండి కత్తి అశోక్ ఆధ్వర్యంలో 15 కుటుంబాలు.... మొత్తం 100 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. అదేవిధంగా పట్టణం 32 వార్డుకు సంబంధించి.. శ్రీ సాయి కాలనీ నుండి అక్కినేపల్లి గణేష్ నిమ్మల చందు ఆధ్వర్యంలో.. 50 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి.. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో

 బిఆర్ఎస్ పార్టీ చేరారు....

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.... గత ఎన్నికల్లో నల్లగొండ మార్పుకు సంబంధించి ప్రధానంగా ప్రజలకు చెప్పామని.. ప్రజలు ఏ మార్పు ఆశించి తనను గెలిపించారో.., కెసిఆర్ ఆశీర్వాదంతో ఆ మార్పును చేసి చూపిస్తున్నామని... అన్నమాట ప్రకారం నల్లగొండను దత్తత తీసుకున్న కెసిఆర్ నల్లగొండ నల్లవైపులా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని 1200 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయని... ఇప్పటికి 25% పనులు మాత్రమే పూర్తయ్యాయని... నల్లగొండ పట్టణం భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఎన్నో మార్పులు చేర్పులు చేయవలసి ఉన్నదని ఎన్నో మౌలిక వసతులు కల్పించవలసినదని...కెసిఆర్ నాయకత్వంలో మాత్రమే అది సాధ్యమవుతుందని... అది అర్థం చేసుకున్న చైతన్యవంతులైన నల్గొండ ప్రజలు... తమకు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరినవారందరికి తాము స్వాగతం పలుకుతున్నామని తన కుటుంబ సభ్యులవలె వారిని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని... పాత కొత్త వాళ్ళంతా కలిసి పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు.. కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్... 9వ వార్డు ఇంచార్జ్.. వజ్జే శ్రీనివాస్,రాం రెడ్డి,మల్లయ్య, అలుగుబెల్లి కిరణ్ కుమార్ రెడ్డి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత

సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత

సూర్యాపేట

 

భావితరాలకు మన సనాతన ధర్మాన్ని తెలియపరచడం తో పాటు ఆర్ధికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే సదాచార్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్త అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల సదాచార్ ట్రస్ట్ సేవా మందిరంలో ఆర్ధికంగా వెనుకబడిన  కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన ముస్కు వెంకన్న,రేణుక కుమార్తె త్రిష వివాహము నిమిత్తం సూర్యాపేటకు చెందిన మిర్యాల శివకుమార్,కవిత దంపతుల సహకారంతో మంగళసూత్రం. ,మట్టెలు, నూతన వస్త్రములు అందజేసి మాట్లాడారు.

 

శ్రీ వామనాశ్రమ మహస్వామిజి ఆశీర్వచనంతో సదాచార్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ సాయి ఈశ్వర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ లో దాతల సహకారం తో ఆర్ధికంగా వెనుకబడిన పెండ్లి కుమార్తెలకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది వదువులకు ఇచ్చామని అందులో ఒక్క సూర్యాపేట జిల్లా లోనే 50 మంది వదువులకు మంగళసూత్రాలు, మట్టెలతో పాటు నూతన వస్త్రములు అందించినట్లు తెలిపారు. ఆర్ధికంగా వెనుకబడిన హిందూ మతం లోని కుటుంబాలకు చెందిన వారు వివాహం చేసుకునే వధువు పెండ్లి పత్రిక ,ఆధార్ కార్డ్ , తెల్ల రేషన్ కార్డ్ తో మా కార్యాలయంలో ముందుగా సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  సదా చార్ ట్రస్ట్ సభ్యులు ఈగా విజయలక్ష్మి ,,బచ్చు పురుషోత్తం, వై.ఎల్.ఎన్.గౌడ్, దార జ్యోతి తదితరులు పాల్గొన్నారు..

జయప్రదంగా ఏఐఎస్ఎఫ్ ములకలపల్లి మండల మహాసభలు

జయప్రదంగా ఏఐఎస్ఎఫ్ ములకలపల్లి మండల మహాసభలు

స్థానిక ములకలపల్లి మండలం నందు ఏఐఎస్ఎఫ్ మండల మహాసభ ఏఎస్ఎఫ్ మండలం నాయకులు రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం, తెలంగాణ సాయుధ పోరాటం లోనూ, విద్యారంగ సమస్యల పట్ల పోరాటంలోనూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ కు ఒక చరిత్ర ఉందని చదువుతూ పోరాడు చదువుకై పోరాడు నినాదంతో విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ శాస్త్రీయ విద్య విధానం కోసం మొట్టమొదటిగా కొట్లాడింది అఖిలభారత విద్యార్థి సమైక్యానని,వృత్తి విద్య కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు సూచించింది ఏఐఎస్ఎఫ్ అని, విద్యా విధానంలో విద్యార్థులకు అవసరమయ్యే సంస్కరణలు ఏఐఎస్ఎఫ్ సంఘంలో పనిచేయడం కోసం విద్యా రంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్క విద్యార్థి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు ఈరోజు ఈ యొక్క మహాసభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సమితిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క మండల సమితిలో మండల కార్యదర్శిగా లలిత్ అధ్యక్షుడిగా పవన్ సహాయ కార్యదర్శి* నిఖిలేష్ వందన ప్రసాద్ శివ సందీప్ లను ఏకగ్రీవంగా తీసుకోవడం జరిగిందని వారు తెలియజేశారు,

ఈ కార్యక్రమంలో  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున రావు గారు ఏఐటీయూసీ జిల్లా నాయకులు యూసుఫ్ గారు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వరక అజిత్ తదితరులు పాల్గొన్నరు...

ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాలి.. ఆగ‌మాగం కావొద్దు : సీఎం కేసీఆర్

ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాలి.. ఆగ‌మాగం కావొద్దు : సీఎం కేసీఆర్

ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చేశాయి.. ఎన్నిక‌లు రాగానే వ‌డ్ల క‌ల్ల‌ల వ‌ద్ద‌కు అడుక్కుతినే వారు వ‌చ్చిన‌ట్లు చాలా మంది బ‌య‌ల్దేరుతారు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎద్దెవా చేశారు. ఎన్నిక‌లు వ‌స్తే ఆగ‌మాగం కావొద్దు. ఎల‌క్ష‌న్లు వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాలి. నిజ‌మేంది.. వాస్త‌వ‌మేంది.. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారు. నిజ‌మైన ప్ర‌జా సేవ‌కుల‌ను గుర్తించిన‌ట్లు అయితే బ్ర‌హ్మాండ‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. అభివృద్ధి కూడా బాగా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. మెద‌క్ జిల్లాలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఒక్క‌ట మాట మ‌నవి చేస్తున్నా.. ఘ‌న‌పురం ఆయ‌క‌ట్టు గ‌తంలో ఎప్పుడూ నీళ్లు రాలేద‌ని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ ఇవ్వండిని అడుగుతున్నారు. ఒక్క ఛాన్స్ కాదు.. 50 ఏండ్లు కాంగ్రెస్ పాలించింది. కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నా ఘ‌న‌పురంకు నీళ్లు కావాలంటే మెద‌క్‌లో ఆర్డీవో ఆఫీసు వ‌ద్ద ధ‌ర్నా చేయాలి. ప్ర‌తి సంవ‌త్స‌రం ధ‌ర్నా చేస్తే త‌ప్ప నీళ్లు వ‌చ్చే ప‌రిస్థితి కాదు. ఘ‌న‌పురం కాల్వ‌ల‌లో తుమ్మ చెట్లు మెలిచాయి. కానీ నేను సీఎం అయ్యాక ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి స‌ర్వే చేసి.. ఘ‌న‌పురం ఎత్తు పెంచుకున్నాం. కాల్వ‌లు బాగు చేసుకున్నాం. 30 నుంచి 40 వేల ఎక‌రాల‌కు నీళ్లు అందిస్తున్నాం. గ‌త కాంగ్రెస్ నాయ‌కులు సింగూరు ప్రాజెక్టుకు హైద‌రాబాద్‌కు ద‌త్త‌త ఇచ్చి ఇక్క‌డ మ‌న పొలాలు ఎండ‌బెట్టారు. కానీ ఈ రోజు సింగూర్‌ను మెద‌క్‌కే డెడికేట్ చేసుకోవ‌డం కార‌ణంగా బ్ర‌హ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయి. ఘ‌న‌పురం ఆయ‌క‌ట్టు కింద ఒక గుంట ఎండిపోకుండా పంట‌లు పండించుకుంటున్నాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

రైతును బాగు చేయాల‌నే సంక‌ల్పంతో అనేక కార్య‌క్ర‌మాలు..

తెలంగాణ రాక‌ముందు చెట్టు ఒక‌రు, గుట్ట ఒక‌రు అయిపోయారని కేసీఆర్ గుర్తు చేశారు. భూమి ఉన్నా కూడా హైద‌రాబాద్ వ‌చ్చి ఆటో రిక్షా న‌డిపే స్థాయికి దిగ‌జారిపోయారు. దీంతో తెలంగాణ ఏర్ప‌డ‌గానే.. రైతును ఏ విధంగానైనా స‌రే బాగు చేయాల‌ని సంక‌ల్పంతో కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టాం. కాళేశ్వ‌రం నీళ్లు వ‌స్తున్నాయి. అదే ర‌కంగా ఇంకా అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రం చేసుకున్నాం. రైతుబంధు, రైతుబీమా అమ‌లు చేస్తున్నాం. నీళ్లు మాత్ర‌మే కాకుండా.. 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నాం. ఇవాళ రెండు పార్టీలో మ‌న‌తో బ‌రిలో ఉన్నాయి.. ఒక‌టి బీజేపీ.. మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌ని చెబుతున్నారు. క‌రెంట్ మోటార్ల‌కు మీట‌ర్లు పెట్ట‌క‌పోవ‌డంతో దాదాపు ఇవాళ మ‌న‌కు రూ. 25 వేల కోట్ల న‌ష్టం క‌లిగించింది కేంద్రం. కానీ ఆ బాధ‌ను అనుభ‌వించుకుంటూ ప్రాణం పోయినా మీట‌ర్లు పెట్ట‌మ‌ని చెప్పాను. మ‌రో పార్టీ.. నిన్న కాక మొన్న‌ క‌ర్ణాట‌క‌లో గెలిచింది. ఇష్ట‌మొచ్చిన వాగ్దానాలు చేశారు. గెలిచిన తెల్లారే అక్క‌డ 7 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నారు. మ‌ళ్లీ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. తెలంగాణ‌లో 24 గంట‌లు క‌రెంట్ ఇచ్చుకుంటున్నాం. వాగులో, ప్రాజెక్టులో నుంచి మోటార్లు పెట్టి నీళ్లు తీసుకుంటున్నావా అని అడిగే వారు లేరు. కాబ‌ట్టే రైతులు బ్ర‌హ్మాండంగా పంట‌లు పండించుకుంటున్నారు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

స‌జీవంగా న‌దులు..

మెద‌క్‌లో పారే హ‌ల్దీ వాగు, మంజీరా వాగుల‌పై దాదాపు 30, 40 చెక్‌డ్యాంలు క‌ట్టుకుని ఆ న‌దులు 365 రోజులు స‌జీవంగా ఉండేలా చేసుకుంటున్నాం. కాళేశ్వ‌రంలో భాగంగా మ‌ల్ల‌న్న సాగ‌ర్ ద్వారా అక్క‌డ్నుంచి అవ‌స‌ర‌మున్న‌ప్పుడ‌ల్లా వాగుల్లో నీళ్లు విడుద‌ల చేస్తున్నాం. చెక్ డ్యాంలు మ‌త్త‌ళ్లు దుంకుతున్నాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సాలువపై భూపాల్ రెడ్డి చిత్రపటాన్ని నేపించిన త్రిఫ్ట్ ఫండ్ ఏజెంట్లు

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సాలువపై భూపాల్ రెడ్డి చిత్రపటాన్ని నేపించిన త్రిఫ్ట్ ఫండ్ ఏజెంట్లు 

నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని నల్గొండ లోని పవర్లూమ్ సంబంధించిన ట్రిప్టు పండ్ ఏజెంట్లు భూపాల్ రెడ్డి చిత్రపటాన్ని సాలువ మీద వచ్చే విధంగా మొగ్గంపై తయారు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ అభివృద్ధి ప్రదాత భూపాల్ రెడ్డి మరొకసారి ఎమ్మెల్యే గా గెలవాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి ఉండాలని కోరారు. భూపాల్ రెడ్డి గారి జన్మదినం నాడు ఈ సాలువని భూపాల్ రెడ్డి గారికి బహుకరిస్తారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో త్రీఫ్ట్ పండ్ ఏజెంట్లు కటకం వెంకన్న, సామల సత్యనారాయణ, పసునూరి యోగానందం, వెంకన్న, దొంత రవి పాల్గొన్నారు.

పెరుగుతున్న అసమానతలను తగ్గించాలి జాతీయ నేత వి.కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి లేఖ

పెరుగుతున్న అసమానతలను తగ్గించాలి 

పౌర హక్కులను కాపాడాలి 

జాతీయ నేత వి.కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి లేఖ

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు న్యాయమైన, సమ్మిళిత, పారదర్శకమైన, సమానమైన భవిష్యత్తు అందించేందుకు అన్ని ప్రజాస్వామ్య శక్తులు, ప్రజా ఉద్యమాలు, పౌర సమాజ సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు, ప్రగతిశీల వ్యక్తుల మధ్య సంఘీభావం, ఐక్యత, బలమైన సహకారం అవసరమని వి20 ప్రజా సమ్మిట్‌ ఆదివారం ‘ప్రజలు.. ప్రకృతికి సమ్మిళిత, పారదర్శక, సమాన భవిష్యత్తు’ పేరుతో విడుదల చేసిన డిక్లరేషన్‌లో ప్రస్తావించిన ఏకగ్రీవంగా ఆమోదించబడిన 20 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి వ్రాసిన లేఖలో కోరారు.

జి20 సమావేశాలు సాధారణంగా ధనిక, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు సేవ చేయడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌), ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి అంతర్జాతీయ సంస్థలచే ప్రోత్సహించబడిన నయా ఉదారవాద అజెండాను ముందుకు తెస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల ఆర్థిక, సామాజిక, పర్యావరణ, అసమానత, వ్యవసాయం, ఆహారం, జీవనోపాధి, అప్పుల బాధ, వాతావరణ మార్పు, మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య తిరోగమనం వంటి సమస్యలను పరిష్కరించడంలో పదేపదే విఫలమయ్యాయని గుర్తు చేశారు. ప్రజల ప్రాధాన్యతలను తక్షణమే గుర్తించాలని డిక్లరేషన్‌ ప్రతిని జతపరుస్తూ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

పెరుగుతున్న అసమానతలు, కార్మికులు, రైతులు, మత్స్యకారులు, దళితులు, ఆదివాసీల హక్కులను క్రమపద్ధతిలో కాలరాయడం, ఆకాశాన్నంటుతున్న ఆహారం, ఇంధన ధరలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు, వాతావరణ సంక్షోభం, విస్తృతమైన పర్యావరణ విధ్వంసం, అంతర్‌-విశ్వాసం, అంతర్‌-మత ఘర్షణలు, మహిళలు, లింగ విభిన్న వ్యక్తులపై హింస పెరగడం, ప్రజాస్వామ్య ప్రాంతాలు తగ్గడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో భారత్ అధ్యక్షతన సెప్టెంబర్‌ 9,10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే 18వ జి20 నాయకుల శిఖరాగ్ర సమావేశానికి ముందు ఆగస్టు 18 నుండి 20 వరకు జరిగిన వి20 పీపుల్స్‌ సమ్మిట్‌లో ప్రజా మేనిఫెస్టో అంశాలను చర్చించేందుకు విచ్చేసిన పార్లమెంటేరియన్లు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, పౌర సమాజ ప్రతినిధులను హాజరు కాకుండా, ప్రజలు శాంతియుతంగా సమావేశమై తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకోకుండా అడ్డుకున్న ఢిల్లీ పోలీసుల ఏకపక్ష చర్యను తీవ్రంగా ఖండించారు. ఖాకీల దాష్టీకం ఎమర్జెన్సీని తలపిస్తోందని, ప్రైవేటు భవనాల్లో సమావేశాలు లేదా సెమినార్లు జరుపుకోవడానికి ఏ పోలీసు అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.

ఢిల్లీలోని అధ్యయన, విజ్ఞాన కేంద్రం హెచ్ కేఎస్ భవన్ ఆడిటోరియంలో 70కి పైగా పౌర సమాజ సంస్థలు వ్యవసాయం, వాతావరణ సంక్షోభం, ఇంధన పరివర్తన, అంతర్జాతీయ వాణిజ్యం, బ్యాంకింగ్‌, కార్మికులు, సామాజిక న్యాయం, కుంచించుకు పోతున్న ప్రజాస్వామ్య ప్రదేశాలు, పెరుగుతున్న అసమానతలు, సమాచార హక్కు, డేటా, డిజిటల్‌ నిఘా, పట్టణ జీవితం, ప్రభుత్వ సేవల ప్రయివేటీకరణ, సంస్కృతి వంటి కీలక అంశాలపై మూడు రోజుల జాతీయ సదస్సులో తొలి రోజు ప్రశాంతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిందని, వీధి నిరసనలు, ఆందోళనలు వంటివి లేనేలేవని, రెండవ రోజు నుండి ఇండోర్ హాల్లో ప్రజాస్వామ్యయుతంగా సమావేశాలు నిర్వహించుకుంటుంటే ప్రగతిశీల శక్తులకు భయపడి సదస్సును భగ్నం చేయమని కేంద్ర ప్రభుత్వం పోలీసులకు ఎందుకు ఆదేశాలు ఇచ్చిందని ప్రశ్నించారు. రాజధానిలో ప్రత్యామ్నాయ విధానాలపై చర్చించేందుకు, సెమినార్లు నిర్వహించుకునేందుకు పౌరులకు గల ప్రజాస్వామ్య హక్కులో ఢిల్లీ పోలీసుల ద్వారా జోక్యం చేసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే ఆపాలని, అసమ్మతి గళాలను నొక్కేసే ఇలాంటి యత్నాలు ఎంత మాత్రమూ సమర్ధనీయం కాదు, అవాంఛనీయం కూడా అని ఖండించారు. దేశంలో ప్రాథమిక మానవ హక్కులు, పర్యావరణం, జీవవైవిధ్యం, గోప్యత సహా అన్ని రక్షణ చట్టాలకు అర్థం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేస్తే కఠినమైన చట్టాల కింద కల్పిత కేసులు పెట్టి, క్రిమినల్‌ విచారణల్లో ఇరికిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

జీ20 సదస్సు నిర్వహణ కోసం న్యూఢిల్లీలో వేలాది మంది పట్టణ పేదలు, అట్టడుగు వర్గాల మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ పేదలను బలవంతంగా ఇండ్ల నుంచి వెళ్లగొట్టారనీ, బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తున్నారని, పరిహారం, సరైన పునరావాసం లేకుండా జీవనోపాధిపై దాడి జరిగిందని వాపోయారు. వారికి పునరావాసం, తగిన పరిహారం ఇవ్వాలని వి. కృష్ణ మోహన్ డిమాండ్ చేశారు.

దేశంలోని ఆర్థిక, ప్రకృతి సంక్షోభ సమయంలో జి20 భారతదేశ అధ్యక్ష పదవిని ప్రచారం చేయడానికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో ఖర్చు చేయడాన్ని తప్పుపట్టారు. మానవ హక్కుల రక్షణకై ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత తక్షణ అవసరమని పేర్కొన్నారు.

నల్గొండలో భారీగా బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు...

నల్గొండలో భారీగా బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు...

మరొకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్గొండలో భూపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి డప్పు కొట్టి మరి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తమ నాయకునికి మరొకసారి టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మరొకసారి నల్గొండలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజవర్గ సంబంధించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్, నల్గొండ కౌన్సిలర్లు, నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు,జడ్పిటిసిలు, డైరెక్టర్లు ,చైర్మన్లు, భారీగా బి ఆర్ ఎస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని తమ నాయకుడు భూపాల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

వర్దన్న పేట ఎమ్మెల్యేకి వివిధ ఎరుకల సమస్యలపై వినతి పత్రం అందజేత:T.Y.S. స్టేట్స్ జనరల్ సెక్రెటరీ లోకీని రాజు

వర్దన్న పేట ఎమ్మెల్యేకి వివిధ ఎరుకల సమస్యలపై వినతి పత్రం అందజేత

టి.వై.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు 

 వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నీ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందచేశారు. అనంతరం లోకిని రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆదివాసి ఎరుకల సమస్యలను పరిష్కరించాలని చర్చించారు.వచ్చే ఎన్నికలలో ఎరుకల కులస్థులకు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ,జడ్పీటీసీ లకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్,జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్,హసన్ పర్తి మండల నాయకులు మేడ్రగుత్తి రఘు,మానుపాటి గణేష్,చంద్రశేఖర్,మానుపాటి శ్రీనివాస్,మానుపాటి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నుండి బీ.ఆర్.ఎస్ గూటికి చేరిన రాణా

బీజేపీ నుండి బీ.ఆర్.ఎస్ గూటికి చేరిన రాణా

 నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 3000 మంది యువకులతో బీజేపీ జిల్లా యువజన నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. బీజేపీలో సరైన గుర్తింపు లేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలే బీ.ఆర్.ఎస్ పార్టీనీ ప్రజలు గెలిపిస్తారనీ రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు. నర్సంపేట గడ్డపై ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డినీ మళ్ళీ గెలిపించుకొని బీ.ఆర్.ఎస్ జెండా ఎగురెస్తామని కొనియాడారు.ప్రజలకు అందే సంక్షేమ పథకాలే సీఎం గా కెసిఆర్ నీ గెలిపిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కౌన్సిలర్లు,వివిధ మండల అధ్యక్షులు,జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు,క్లస్టర్లు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులు వికలాంగులమనే భావన మనసులో నుంచి తొలగించాలి: మంత్రి మల్లారెడ్డి

దివ్యాంగులు వికలాంగులమనే భావన మనసులో నుంచి తొలగించాలి: మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దివ్యాంగుల ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు తమ మనసులో నుంచి ఆ భావనాన్ని తీసివేసి పట్టుదలతో ముందుకు వెళితే విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

అర్హులైన 17 మంది దివ్యాంగులకు ఆయన చేతుల మీదుగా మోటరైజ్డ్ వేకిల్స్, బ్యాటరీ ఛైర్, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ లను జిల్లా కలెక్టర్ అమొయ్ కుమార్ తో కలిసి అందించారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాహనాలు, ఇతర పరికరాలు అందచేయడం జరిగిందన్నీ, దివ్యాంగులు అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమములో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణరెడ్డి, ప్రజాప్రతినిధులు ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు