నల్గొండలో భారీగా బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు...

నల్గొండలో భారీగా బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు...

మరొకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్గొండలో భూపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి డప్పు కొట్టి మరి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తమ నాయకునికి మరొకసారి టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మరొకసారి నల్గొండలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజవర్గ సంబంధించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్, నల్గొండ కౌన్సిలర్లు, నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు,జడ్పిటిసిలు, డైరెక్టర్లు ,చైర్మన్లు, భారీగా బి ఆర్ ఎస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని తమ నాయకుడు భూపాల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

వర్దన్న పేట ఎమ్మెల్యేకి వివిధ ఎరుకల సమస్యలపై వినతి పత్రం అందజేత:T.Y.S. స్టేట్స్ జనరల్ సెక్రెటరీ లోకీని రాజు

వర్దన్న పేట ఎమ్మెల్యేకి వివిధ ఎరుకల సమస్యలపై వినతి పత్రం అందజేత

టి.వై.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు 

 వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నీ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందచేశారు. అనంతరం లోకిని రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆదివాసి ఎరుకల సమస్యలను పరిష్కరించాలని చర్చించారు.వచ్చే ఎన్నికలలో ఎరుకల కులస్థులకు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ,జడ్పీటీసీ లకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్,జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్,హసన్ పర్తి మండల నాయకులు మేడ్రగుత్తి రఘు,మానుపాటి గణేష్,చంద్రశేఖర్,మానుపాటి శ్రీనివాస్,మానుపాటి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నుండి బీ.ఆర్.ఎస్ గూటికి చేరిన రాణా

బీజేపీ నుండి బీ.ఆర్.ఎస్ గూటికి చేరిన రాణా

 నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 3000 మంది యువకులతో బీజేపీ జిల్లా యువజన నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. బీజేపీలో సరైన గుర్తింపు లేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలే బీ.ఆర్.ఎస్ పార్టీనీ ప్రజలు గెలిపిస్తారనీ రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు. నర్సంపేట గడ్డపై ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డినీ మళ్ళీ గెలిపించుకొని బీ.ఆర్.ఎస్ జెండా ఎగురెస్తామని కొనియాడారు.ప్రజలకు అందే సంక్షేమ పథకాలే సీఎం గా కెసిఆర్ నీ గెలిపిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కౌన్సిలర్లు,వివిధ మండల అధ్యక్షులు,జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు,క్లస్టర్లు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులు వికలాంగులమనే భావన మనసులో నుంచి తొలగించాలి: మంత్రి మల్లారెడ్డి

దివ్యాంగులు వికలాంగులమనే భావన మనసులో నుంచి తొలగించాలి: మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దివ్యాంగుల ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు తమ మనసులో నుంచి ఆ భావనాన్ని తీసివేసి పట్టుదలతో ముందుకు వెళితే విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

అర్హులైన 17 మంది దివ్యాంగులకు ఆయన చేతుల మీదుగా మోటరైజ్డ్ వేకిల్స్, బ్యాటరీ ఛైర్, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ లను జిల్లా కలెక్టర్ అమొయ్ కుమార్ తో కలిసి అందించారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాహనాలు, ఇతర పరికరాలు అందచేయడం జరిగిందన్నీ, దివ్యాంగులు అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమములో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణరెడ్డి, ప్రజాప్రతినిధులు ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నల్లగొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల ,మున్సిపల్ చైర్మన్ సైది రెడ్డి

184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ TPJA నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో TPJA అధ్యక్షులు సింగం వెంకటరమణ అధ్యక్షతన నల్లగొండ MLA  క్యాంపు కార్యాలయం నందు వేడుకలు ఘనంగా జరిగాయి. 

ఈ కార్యక్రమంలో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని... కేక్ కట్ చేసి ఫోటో జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు, రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న ఫోటో జర్నలిస్టులు ముచ్చర్ల విజయ్ కుమార్, ముచ్చర్ల శ్రీనివాస్, ఆకాష్ లను అభినందించారు.

ఈ కార్యక్రమంలోTPJA ప్రధాన కార్యదర్శి కంది వేణుగోపాల్ సహాయ కార్యదర్శి నగర భాస్కర్, ప్రచార కార్యదర్శి కారింగ్ వెంకటేష్, కార్యవర్గ సభ్యులునాగేశ్వరరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: జనసేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనార్దన్ యాదవ్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

జన సేవా సమితి ప్రస్థాపక అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ళ జనార్ధన్ యాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరసన తెలుపుతూ విలేకరులతో మాట్లాడారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి విద్యత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మెడికల్ కళాశాల తీసుకొచ్చారని, పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే డిగ్రీ కళాశాల తీసుకరాకపోవడం శోచనీయమన్నారు. మహిళలకు ప్రత్యేకంగా మహిళా డిగ్రీ కళాశాలను కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేయిస్తున్నారని, పేద విద్యార్థుల గురించి ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని డిమాండ్ చేశారు. రేపు సభలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిక్లరేషన్ చేయని యెడల సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్, సాగర్ల అశోక్, లింగంపల్లి మధుకర్, దుబాని మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

ఎరుకల జాతిని గుర్తించిన ఘనత కెసిఆర్ దే: టి. వై. ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు

ఎరుకల జాతిని గుర్తించిన ఘనత కెసిఆర్ దే

  టి.వై.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు

 తేదీ 19 ఆగస్టు 2023 రోజున మొలుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎరుకల సంఘం ములుగు జిల్లా నాయకులు పాలకుర్తి సమ్మయ్య,పల్లకొండ భాస్కర్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.  

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గత కాంగ్రెస్,టిడిపి ప్రభుత్వాలు ఎరకల జాతిని గుర్తించలేదని పేర్కొన్నారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజిక తెలంగాణ దృక్పథంతో ఆలోచించి కేసీఆర్ ఎరుకల జాతిని గుర్తించి గవర్నర్ కోట కింద సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ కుర్ర సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించిన  గౌరవ శ్రీ కేసీఆర్ గారికి ఎరుకల జాతి తరపున రుణపడి ఉంటామని గుర్తు చేశారు.

    అన్ని కులాలను గౌరవించినట్టుగా ఆదివాసి ఎరుకల కులాన్ని గౌరవించి హైదరాబాద్ కేంద్రంగా ఎకరం భూమి ఎరుకల ఆత్మగౌరవ భవన నిర్మాణం కొరకు 3.5 కోట్లు నిధులు మంజూరు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది అని అన్నారు.అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల ఆదివాసి ఎరుకల కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ఎరుకల ఎంపవర్మెంట్ స్కీం పథకాన్ని ప్రవేశపెట్టి 60 కోట్లు నిధులు ఇచ్చిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వo కేసీఆర్ గారిది అని అన్నారు.

రాష్ట్ర అధ్యక్షులు కూతాడి రాములు గారికి కూకట్ పల్లి మార్కెట్ చైర్మన్ గా అవకాశం కల్పించి ఎరుకల ఆత్మగౌరాన్ని గౌరవించిన కేసీఆర్ గారికి

 గౌరవ శ్రీ హరీష్ రావు గారికి

 గౌరవ శ్రీ కేటీఆర్ గారికి గౌరవ శ్రీమతి సత్యవతి రాథోడ్ గార్లకు 

ఎరుకల జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ సందర్భంలో

గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చదువుకున్న ఆదివాసి ఎరుకల విద్యార్థి విద్యార్థులను గుర్తించి ఉద్యోగ ఉపాధి అవకకల్పించాలని కోరారు.

తెలంగాణ వ్యాప్తంగా కులవృత్తుల నమ్ముకున్న 18 బీసీ కులాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసినట్టుగా

 తెలంగాణ వ్యాప్తంగా తట్టలు బుట్టలు గంపలు గుమ్ములు అల్లుకుని జీవిస్తున్న నిరుపేద ఎరుకల కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలని గౌరవ శ్రీ కెసిఆర్ గారిని కోరినారు. 

  ఈ కార్యక్రమంలో 

రాష్ట్ర ఉపాధ్యక్షులు

 కేతిరి రాజశేఖర్,రాష్ట్ర నాయకులు పల్లకొండ ప్రభాకర్,పల్లకొండ కుమారస్వామి, వరంగల్, హన్మకొండ జిల్లా నాయకులు ఓని సదానందం,జిల్లా ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్,భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు కేతరి రాజు,కరీంనగర్ జిల్లా కన్వీనర్ కూతాడు శ్రీనివాస్,జిల్లా మహిళా నాయకులు పాలకుర్తి ప్రమీల,కూరాకుల సరోజన,బంగారయ్య,పాలకుర్తి ప్రశాంత్,పాలకుర్తి సురేష్,పాలకుర్తి తిరుపతి, ఎరుకల కులస్తులు,తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ను ఓడించడం కష్టం: బీజేపీ నేత మురళీధర్‌రావు

సీఎం కేసీఆర్‌ను ఓడించడం కష్టం: బీజేపీ నేత మురళీధర్‌రావు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించం కష్టమని బీజేపీ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. కొత్తగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్‌ను అడ్డుకోలేమని, పథకాల అమలులో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించం కష్టమని బీజేపీ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. కొత్తగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్‌ను అడ్డుకోలేమని, పథకాల అమలులో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్యను మాస్‌లీడర్‌గా అభివర్ణించారు. తాను ఇన్‌చార్జిగా ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తున్నదని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ తొలిగింపును సమర్థించారు. బండి సంజయ్‌కి కలుపుగోలుతనం లేదని, ఇతర నేతలను దగ్గరికి రానివ్వలేదని, అందుకే పదవి నుంచి తొలిగించారంటూ వస్తున్న కథనాలకు మురళీధర్‌రావు బలం చేకూర్చినట్టయ్యింది. బీజేపీ ఎంపీ అర్వింద్‌ సైతం బండి సంజయ్‌ ఉన్నన్నాళ్లూ పార్టీలో గొడవలు ఉన్నాయని, ఇప్పుడు గ్రూపులు, గొడవలు లేవని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో బండి సంజయ్‌ అభిమానులు మురళీధర్‌రావు, అర్వింద్‌పై గుర్రుమంటున్నారు.

నల్లగొండ నియోజకవర్గంలోని 20 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నాలుకోట్ల రూపాయల విడుదల

నల్లగొండ నియోజకవర్గంలోని 20 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నాలుకోట్ల రూపాయల విడుదల

 నల్లగొండ నియోజకవర్గం లోని 20 నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల... నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తమ హర్షం వ్యక్తం చేశారు... ఇందుకు ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి, పంచాయతీరాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి జిల్లా మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి తమ ధన్యవాదాలు తెలియజేశారు...

 దీనితో నూతనంగా గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ అన్ని గ్రామాలకు మరియు పాత భవనాలు కలిగి శిథిలావస్త లో ఉన్న గ్రామాలకు కూడా... 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు అయ్యాయని..

 దీంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు స్వంత భవనాలు ఏర్పడ్డట్టు అయిందన్నారు ...

 తిప్పర్తి మండలం లోని.. గోదావరి గూడెం, మామిడాల, గడ్డి కొండారం, కంకణాలపల్లి, జంగారెడ్డిగూడెం, యాపలగూడెం, వెంకటాద్రిపాలెం, సోమోరిగూడెం..

 నల్లగొండ మండలం లోని... నర్సింగ్ బట్ల,తొరగల్, జీకే అన్నారం, ఖాజీరామారం...

 కనగల్ మండలంలోని... తేలకంటి గూడెం, తుర్కపల్లి, బచ్చన్న గూడెం, శాబ్దుల్లాపురం, చర్లగౌరారం, తిమ్మన్నగూడెం, బాబాసాహెగూడం, ఏమి రెడ్డిగూడెం...

 మొత్తం 20 గ్రామాలకు ఒక్కో గ్రామపంచాయతీకి 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు అయినట్టు తెలియ చేశారు...

 

వెంటనే ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు.. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు... వెంటనే పనులు ప్రారంభించి.. పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.

ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం చేయాలి:SWF(CITU )

ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం చేయాలి:SWF(CITU )

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆగస్టు 6 శాసనసభలో ఆమోదం పొందిన ఆర్టీసీ విలీన బిల్లు ప్రక్రియను వేగవంతం చేస్తూ విలీనం వల్ల కార్మికులకు జరిగే నష్టాలను నివారించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలనీ ఆర్టీసీ స్టాఫ్ &వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం ) నల్లగొండ డిపో గౌరవాధ్యక్షులు దండెం పల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.

        

శుక్రవారం నల్లగొండ డిపోలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన విలీన కమిటీ చైర్మన్, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావుకి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, ఆర్టీసీ ఛైర్మెన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఇచ్చిన మెమోరాండం కాపీలను నల్లగొండ డిపోలో కార్మికులకు పంచడం జరిగింది.

ఈ సందర్బంగా సత్తయ్య మాట్లాడుతూ ఆర్టీసీ విలీనం పట్ల జరిగే లాభనష్టాలను కలుపుకొని దాదాపు  88 అంశాలను ఈ మెమోరాండంలో పందుపరచడం జరిగిందని  ప్రభుత్వం నియమించిన కమిటీ లో కార్మికసంఘాలకు చోటు కల్పించాలని అన్నారు. కార్మికులకు పాత పద్దతిలోనే మెడికల్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పెన్షన్ సౌకర్యం ఉండాలన్నారు. విలీనానికంటే ముందుగా 2017, 2021 వేతన సవరణ చేయాలనీ లేని పక్షంలో కార్మికులకు భారీగా నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. డిపో స్పేర్ విధానం ఎత్తివేసి భారత రాజ్యాంగానికి, చట్టాలకు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగావున్న ఆర్టీసీ రెగ్యులేషన్స్ సమూలంగా మార్చాలని డిమాండ్ చేశారు. 2013 వేతన సవరణ బకాయిలు సీసీఎస్, పిఎఫ్ సంస్థల కు చెల్లించాల్సిన డబ్బులను వేంటనే విడుదల చేయాలన్నారు. ఓవర్ టైం డ్యూటీ లు రద్దుచేసి 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. ఎలక్షన్స్ కోడ్ సమీపిసున్నా తరుణంలో వెంటనే విలీన ప్రక్రియ త్వరిగతిన చేపట్టి కార్మికులకు విలీనం వల్ల నష్టం జరగకుండా ప్రభుత్వం సానుకూల దృక్పతంతో వ్యవ హరించాలన్నారు. 

        

ఈ కార్యక్రమంలో రీజియన్ అధ్యక్షులు కందుల నర్సింహ, డిపో కార్యదర్శి బొడ స్వామి, రీజియన్ సహాయ కార్యదర్శి కె శ్యామ్ సుందర్,డిపో ఉపాధ్యక్షురాలు ch రేవతి,కె విజయ, జ్యోతిబసు,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.