చరిత్ర మరువని యోధుడు కామ్రేడ్ బూరుగు అంజన్న: CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు డేవిడ్ కుమార్
ఈదులూరు
చరిత్ర మరువని యోధుడు కామ్రేడ్ బూరుగు అంజన్న
CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు డేవిడ్ కుమార్
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ బూరుగు అంజన్న 20వ వర్ధంతి సందర్భంగా సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈదులూరు గ్రామంలో జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈసందర్భంగా సీపీఐ (ఎం-ఎల్ ) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్ ఎర్రజెండా ఎగురవేసి అంజన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామ సర్పంచ్ ఐతగొని నారాయణ పూల మాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు డేవిడ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ అంజన్న భూమి,భుక్తి,విముక్తి పోరాటంలో నిజాం నవాబు, రజాకార్ల కు వ్యతిరేకంగా మట్టిమానుషులను తట్టిలేపి ఉక్కుమనుషులుగా మార్చి,బాంచెన్ దొరా నికాల్మొక్త అన్నా చేతులతోనే బందూకులు పట్టించి పొరాటలవైపు నడిపించాడని అంజన్న చరిత్ర మరువలేనిదని అన్నారు.ఎర్రజెండా వెలుగులో దున్నేవానికే భూమి నినాదంతో జరిగిన నక్సల్భరీ ఉద్యమవైపు నిలబడి రైతు కూలీలను ఐక్యం చేశాడని అన్నారు.కామ్రేడ్ అంజన్న 40 సంవత్సరాలు గ్రామ సర్పంచిగా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని తెలిపారు.కామ్రేడ్ బూరుగు అంజన్న ఎంతోమంది విప్లవకారులకు ఆదర్శంగా నిలిచాడని,జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని కొనియాడారు. అంజన్న స్పూర్తితో నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని అన్నారు.ప్రజలపై పన్నుల భారాన్ని మోపి,కార్పొరేట్ శక్తులకు ప్రజాసొమ్మును ధారాదత్తం చేస్తున్న మోడీ,కేసీఆర్ పాలకులకు బుద్దిచెప్పడమే కామ్రేడ్ అంజన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐతగొని నారాయణ, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్,రైతు-కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి,పుట్ట సత్యం, పివైఎల్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, బి.వి చారి,గ్రామ పార్టీ కార్యదర్శి బూరుగు సత్తయ్య,ఎమ్.ఆర్.పి.ఎస్ నాయకులు భరత్,బింగి నర్సయ్య,వీరంజనేయులు,బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతల అంజయ్య, POW జిల్లా అధ్యక్షుడు బూరుగు లక్ష్మక్క,దణ్డంపెళ్లి చంద్రయ్య, గుడుకుంట్ల వేoకటయ్య,తదితరులు పాల్గొన్నారు.
Aug 14 2023, 20:58