సెప్టెంబర్ 4,5 తేదీలలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు
సెప్టెంబర్ 4,5 తేదీలలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు
--- కరపత్ర ఆవిష్కరణ
తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలు పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 4,5 తేదీలలో నిర్వహిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ తెలిపారు
సోమవారం ఎస్పిటి మార్కెట్ ట్రస్ట్ భవన్లో మహాసభల కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది*. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేటి తెలంగాణ రాష్ట్రంలో చేనేత వస్త్ర పరిశ్రమ మరియు చేనేత కార్మికుల సమస్యలపై గత 70 సంవత్సరాలుగా గల్లీ నుండి ఢిల్లీ దాకా అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించామని అన్నారు. ఆనాటి బిజెపి ప్రభుత్వం చేనేత పరిశ్రమను చావు దెబ్బ తీసేందుకు సత్యం కమిటీ సిఫారసులు తీసుకొని వస్తే ఆ సత్యం కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మిక సంఘాల మరియు చేనేత సహకార సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐక్య ఉద్యమాలను, ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. చేనేత సహకార సంఘాలకు మరియు చేనేత కార్మికులకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని 2008లో ఐక్య కార్యచరణ ఏర్పాటు చేసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి నాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ని కలిసి రుణమాఫీ చేయాలని పోరాడి కార్మికుల రుణమాఫీ చేయించిన చరిత్ర చేనేత కార్మిక సంఘానిదని ఆయన అన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమకు ఉపయోగకరంగా ఉన్న జాతీయ చేనేత బోర్డుని, మహాత్మా గాంధీ బునకర్ భీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీం, హౌస్ కం వర్క్ షెడ్లాంటి కేంద్ర పథకాలను రద్దు చేసినందుకు చేనేత పరిశ్రమ పైన జిఎస్టి విధించిన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చేనేత పరిశ్రమ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనమందరం ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఆసన్నమైందని అన్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిపించకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా సభ్యులకు పని కల్పించలేని పరిస్థితికి నెట్టబడిన విధానాలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. చేనేత మగ్గాలకు జియో టాక్ వేయకపోవడం వలన చేనేత సంఘాలు, ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను టెస్కో కొనుగోలు చేసి డబ్బులు చెల్లించక మరియు సంఘాలలో ఉన్న వస్త్రాలను ఖరీదు చేయకపోవడం వలన వస్త్ర నిలువలు పేరుకుపోయాయని, టెస్కో చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించకపోవడం వలన సంఘాలు అప్పుల కూరుక పోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో చేనేత సహకార సంఘాలు మరియు సహకారేతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు మరియు చేనేత వస్త్ర పరిశ్రమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం నలగొండ పట్టణంలో సెప్టెంబర్ 4,5 తేదీలలో జరుగుతున్న చేనేత కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో చేనేత రంగంలో ప్రముఖ నాయకులు మిరియాల సోమయ్య ,రాపోలు దత్త గణేష్, జిల్లా బిక్షం ,మిర్యాల యాదగిరి, కర్నాటి యాదగిరి, జిల్లా గణేష్, దుడుగు లక్ష్మీనారాయణ, చిలుకూరు లక్ష్మీనర్సు, మిరియాల రంగయ్య ,తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీరంగం, నామిని ప్రభాకర్ ,రాపోలు వెంకన్న,ఏలే శ్రీనివాస్, బొల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
Aug 14 2023, 20:48