madagoni surendar

Mar 29 2023, 10:49

అమరావతి : కేబినెట్ లో కీలక పరిణామాలు

బిగ్ బ్రేకింగ్

అమరావతి : కేబినెట్ లో కీలక పరిణామాలు

- మంత్రివర్గంలోకి రానున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు

- ఒకటి రెండు రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

- మరోసారి కేబినెట్ లోకి కొడాలి నాని, బాలినేని శ్రీనివాస రెడ్డి

- వీరిద్దరితో పాటు ప్రసన్నకుమార్ రెడ్డికి మంత్రిగా అవకాశం

- కేబినెట్ లో మరికొన్ని మార్పులపై కసరత్తు చేస్తున్న సీఎంవో

- ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో మార్పులకు శ్రీకారం చుట్టిన వైసీపీ

- గవర్నర్ తో భేటీ, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఊపందుకున్న ముందస్తు ఎన్నికల ప్రచారం

-ఢిల్లీ పెద్దల ఆశీస్సులు లభిస్తే తెలంగాణ ఎన్నికలతో ఆంధ్రాలో కూడా ఎన్నికలు.

madagoni surendar

Mar 29 2023, 10:44

ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు మండలం :ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ‌‌.

ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు మండలం :

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ‌‌..

ముప్పాళ్ళ గ్రామంలో "గడపగడపకు -మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .

వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక కుయుక్తులు పన్నుతున్న ప్రతిపక్షాలు ..

రాష్ట్రంలో 175 స్థానాల్లో పొత్తులు లేకుండా పోటీ చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా ?? ..*

చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో బుధవారం ఉదయం "గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం"లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతుందని , ప్రతి హామీ అమలు చేస్తూ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని తెలిపారు , ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడంతో పాటు ప్రజలకు పాలనా ఫలాలు అందుతున్న తీరు తెలుసుకున్నారు ,ఇంకా సమస్యలు ఉంటే పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని ప్రజలతో నాయకులు, అధికారులు మమేకం కావడమే ముఖ్య ఉద్దేశమన్నారు ,అవినీతికి తావులేని పాలతో ప్రజలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ,ప్రభుత్వంపై బురద చల్లి ప్రయోజనం పొందాలని కూయుక్తులు పన్నుతున్నాయని -ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు ,ఎన్ని అవంతరాలు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధికి -ప్రజా సంక్షేమానికి సీఎం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు, రాష్ట్రంలో 175 స్థానాల్లో పొత్తుల్లేకుండా దమ్ము ప్రతిపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు ..

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి నల్లాని రమాదేవి సాయి, పిఎసియస్ఎస్ అధ్యక్షులు నల్లాని అయ్యన్న, బండారుపల్లి కపిల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొణకంచి భద్రయ్య, మందడపు శ్రీను, వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది ,పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ..

madagoni surendar

Mar 29 2023, 10:17

డేటా లీకేజీ వ్యవహారం.. రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ

డేటా లీకేజీ వ్యవహారం.. రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డేటా లీకేజీపై కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) దృష్టి సారించింది. రక్షణశాఖతో పాటు అనేక విభాగాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన 16.8 కోట్ల మందికి సంబంధించిన డేటా బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇందులో ఏమైనా ఉగ్రకోణం ఉండొచ్చన్న అనుమానంతో ఐబీ రంగంలోకి దిగింది.

ఇప్పటికే సైబరాబాద్‌ అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న ఐబీ ప్రతినిధులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు త్వరలో ఇక్కడకు రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉగ్రకోణం ఉన్నట్లు తేలితే కేసు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.)కి బదిలీ అయ్యే అవకాశం ఉంది.

ఈ కేసులో ఏడుగురు సభ్యుల ముఠాను ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల్లో అనేక ప్రభుత్వ విభాగాలతో పాటు ఇతర రాష్ట్రాల వారూ ఉండటంతో కేంద్ర నిఘా సంస్థ దృష్టి సారించింది. ఇంత పెద్ద రాకెట్‌ను పట్టుకున్నందుకు వారిని ఈ సంస్థ అధికారులు అభినందిస్తున్నారు.

madagoni surendar

Mar 29 2023, 07:05

న్యూడిల్లీ :జర్నలిస్ట్ లకు మరింత స్వేచ్ఛ ఉండాలె : కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి

జర్నలిస్ట్ లకు మరింత స్వేచ్ఛ ఉండాలె : కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి

‘ఢిల్లీ టీయూడబ్ల్యూజే హెచ్ 143’ డైరీ రిలీజ్

న్యూఢిల్లీ, : జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జర్నలిస్ట్ ల స్వేచ్ఛ అంటే, యాజమాన్యాల స్వేచ్ఛ కాదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ గురజాడ హాల్​లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్–హెచ్ 143(టీయూడబ్ల్యూజే) డైరీ–2023 రిలీజ్ చేశారు. ఢిల్లీ మీడియా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వాయిస్ ​వినిపిస్తున్నదని కిషన్ రెడ్డి కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాపై ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్ట్ ల పాత్ర మరువలేనిదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేశ్, జనరల్ సెక్రటరీ వంగ తిరుపతి, కొండపల్లి శిరీశ్​ రెడ్డి, సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి, ఉంద్యాల అశోక్ రెడ్డి, కృష్ణారావు, విజయ్ కుమార్, రవీందర్ రెడ్డి, కొన్నోజు రాజు, మేక గోపి కృష్ణ, జబ్బర్ లాల్ నాయక్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 28 2023, 21:37

10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసిన "నకిరేకల్ ఏంపీపి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు దంపతులు.

10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసిన "నకిరేకల్ ఏంపీపి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు దంపతులు.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

బిజిఆర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో నకిరేకల్ మండలంలోనినోముల,ఓగోడ్,కడపర్తి గ్రామాల్లోని ప్రబుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరిక్షప్యాడ్ లు,పెన్నులు‌,స్కేల్లు అందజేసిన నకిరేకల్ ఏంపీపి దంపతులు.

అనంతరం వారు మాట్లాడుతూ. విద్యార్థులు ఎటువంటి సందిగ్ధాలకు గురికాకుండా,పరిక్షా సెంటర్ లకు గంట ముందుగానే చేరేవిధంగా ప్లాన్ చేసుకోవాలని, ప్రశాంతమైన ఆలోచనలతో పరిక్షలురాసి మంచి గ్రేడ్ లు సాధించాలని ఏంపీపి దంపతులు అన్నారు.(ఈకార్యక్రమంలో)

నోముల,ఓగోడ్ ఎంపీటీసీ సభ్యులు సామ మల్లమ్మ ,లోడే సాగర్,మంగలపల్లి ఉపసర్పంచ్ శ్రీను యాదవ్, పాలెం ఉపసర్పంచ్ మాల్లారగడ్డిగారు,అయాపాఠశాలల ఉపాద్యాయలు,మరియు అయాగ్రామల బిజీర్ సైన్యం యువత, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 28 2023, 21:33

ఏపీ ::అమరావతి ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ -

అమరావతి 

ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ - 

ఎన్టీఆర్ బొమ్మతో ప్రత్యేక నాణెం విడుదలపై ధన్యవాదాలు తెలుపుతూ లేఖ - 

 టీడీపీ పొలిట్‍బ్యూరో తరఫున ప్రధాని మోదీకి ధన్యవాదాలు - 

 

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల చేయడం హర్షించదగిన విషయం - 

 ఎన్టీఆర్ ప్రత్యేక నాణెంపై కేంద్రం నిర్ణయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో స్వాగతించింది - 

 

ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక - 

 ఎన్టీఆర్ ను గౌరవించడమంటే తెలుగువారిని గౌరవించడమే 

టీడీపీ అధినేత చంద్రబాబు

madagoni surendar

Mar 28 2023, 21:28

22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు.. బస్సులో ప్రపంచ యాత్ర* *ప్రపంచ రికార్డు కోసం సిద్ధమైన భారత టూర్ ఆపరేటింగ్ కంపెనీ

22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు.. బస్సులో ప్రపంచ యాత్ర

ప్రపంచ రికార్డు కోసం సిద్ధమైన భారత టూర్ ఆపరేటింగ్ కంపెనీ

టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ కు బస్సు యాత్ర

ఆగస్టు 7న ప్రారంభం.. ఒక్కో టికెట్ సుమారు రూ.20 లక్షలు

ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రయాణమిది.. ఒకటీ రెండు కాదు ఏకంగా 56 రోజులపాటు సాగే జర్నీ.. 12 వేల కిలోమీటర్లు.. మధ్యలో 22 దేశాలు చుట్టి వచ్చే యాత్ర. అయితే వెళ్లేది విమానంలోనో, నౌకలోనో అనుకుంటున్నారేమో.. కానే కాదు. కనీసం రైలులో కూడా కాదు. బస్సులో. అవును నిజంగా బస్సులోనే!

భారత్ కు చెందిన ప్రముఖ టూర్ ఆపరేటింగ్ కంపెనీ ‘అడ్వెంచర్స్ ఓవర్ లాండ్’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు రెడీ అయింది. ప్రపంచంలోనే సుదీర్ఘ బస్సు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. టర్కీ (తుర్కియా)లోని ఇస్తాంబుల్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వరకు దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరాన్ని 56 రోజుల్లో పూర్తి చేసేందుకు సకల వసతులతో కూడిన ప్రత్యేక లగ్జరీ బస్సును సిద్ధం చేసింది. ఆగస్టు 7న ఇస్తాంబుల్ నుంచి బయలుదేరనున్న బస్సు అక్టోబరు 1న లండన్ కు చేరుకుంటుందని టూర్ సంస్థ వెల్లడించింది. ఇందులో 30 సీట్లు ఉంటాయి. ఒక్కో టికెట్ రేటును 24,300 డాలర్లు ( సుమారుగా రూ.20 లక్షలు) గా నిర్ణయించారు. 22 దేశాల మీదుగా బస్సు జర్నీ సాగుతుంది. బాల్కన్స్, తూర్పు యూరప్, స్కాండినేవియా, పశ్చిమ యూరప్ ప్రాంతాల మీదుగా లండన్ కు చేరుకుంటుంది. ప్రధాన నగరాల్లో బస్సు ఆగినప్పుడల్లా హోటల్స్ లో డబుల్ షేరింగ్ రూమ్స్ కేటాయిస్తారు. బస్సులో రెండు నెలలు ఎలా పోవాలబ్బా అని ఆలోచించాల్సిన పని లేదు. ఫుల్ లగ్జరీ ఏర్పాట్లు చేశారట. సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా ఉండేలా బస్సును డిజైన్ చేశారట. వరల్డ్ టూర్ చేయాలని అనుకునే వాళ్లకు ఇదో మంచి అవకాశం.

madagoni surendar

Mar 28 2023, 21:01

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ : *ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వక కలిసిన ట్రాఫిక్ ఎస్.ఐ N. నరేష్ మరియు సిబ్బంది .

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :

ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వక కలిసిన ట్రాఫిక్ ఎస్.ఐ N. నరేష్ మరియు సిబ్బంది ..

పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..*

నందిగామ పట్టణంలోని ఎమ్మెల్సీ వారి కార్యాలయంలో పట్టణ ట్రాఫిక్ S.I. గా నియమితులైన ఎన్.నరేష్ మరియు ట్రాఫిక్ కానిస్టేబుల్ లతో పాటు శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, పట్టణ వాసులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మెలగాలన్నారు, ట్రాఫిక్ ఆంక్షాలపై - నో పార్కింగ్ జోన్లపై పట్టణ ప్రజలకు సిబ్బంది ద్వారా ప్రత్యేక సూచనలు ఇవ్వాలన్నారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ..

madagoni surendar

Mar 28 2023, 19:30

సిటీలో ఆ రోజు వైన్స్, బార్లు బంద్

సిటీలో ఆ రోజు వైన్స్, బార్లు బంద్

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో మార్చి 30 న మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, రిజిస్టర్ క్లబ్ లు ,పబ్ లు ఇన్ క్లూడింగ్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో బార్ రూమ్స్ మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31 వ తేదీ ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసి వేయనున్నారు.

శాంతి భద్రతల కారణంగా మద్యం షాపులను పండుగ సందర్భంగా మూసివేయాలని మద్యం షాపులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

madagoni surendar

Mar 28 2023, 19:01

కర్ణాటక::ఇంకా.. ఆటా నాదే.. వేట నాదే అంటున్న బళ్ళారి బంగారు బాబు.. గాలి జనార్దనరెడ్డి.

ఇంకా.. ఆటా నాదే.. వేట నాదే అంటున్న బళ్ళారి బంగారు బాబు.. గాలి జనార్దనరెడ్డి.

బళ్ళారి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దనరెడ్డి కర్నాటక లో తానే సొంత పార్టీ పెట్టడం ఇప్పటికే 50 నియేజకవర్గలలో గాలి జనార్దనరెడ్డి దంపతులు సుడిగాలి గా రోడ్డు షో చేస్తున్నారు.

ఇప్పుడు గాలి జనార్దనరెడ్డి పార్టీ కి ఎన్నికల కమిషన్ ""పుట్ బాల్" గుర్తు కేటయించటం తో ఆయన పుట్ బాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నన్ను అన్ని పార్టీలు పుట్ బాల్ అడుకొన్నరు ఇంకా ఆట నాదే.

వేట నాదే.. ఇప్పుడు ఆటా నేను మొదలు పెట్టాతా.. గోల్ వేయడం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని ఈ జట్టు కెప్టెన్ నేనే ఆటగాడు నేనే అని బళ్ళారి బంగారు బాబు తెలిపారు.

51 నియేజవర్గలలో తమ పార్టీ పోటీ చేస్తారు అని 30 స్థానాల లో గెలుపు ఖాయం అని గాలి జనార్దనరెడ్డి ధీమా వ్యక్తంచేశారు.