ఏపీ ::అమరావతి- సచివాలయం. *మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీ బెంబేలుః మంత్రి మేరుగు నాగార్జున*

అమరావతి- సచివాలయం.

మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీ బెంబేలుః మంత్రి మేరుగు నాగార్జున

– అందుకే దళితులపై దమనకాండ అంటూ ఈనాడు అడ్డగోలు రాతలు..

– మార్గదర్శి కేసులో ప్రధాన ముద్దాయి రామోజీరావు

– ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వంపై బురదజల్లే రాతలు

– ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే రామోజీకి పరాభవం తప్పదు

– బాబు, రామోజీ ముసుగు దొంగలు

-ః మంత్రి మేరుగు నాగార్జున ఫైర్

రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ మేరుగు నాగార్జున ప్రెస్‌మీట్ః

– దళితులపై దమనకాండ జరిగింది బాబు హయాంలోనే..

– దళితులను అడ్డుపెట్టుకుని మా ప్రభుత్వంపై బురదచల్లుతావా?

– టీడీపీ హయాంలో కారంచేడు, దళితుల ఊచకోత ఘటనలపై రామోజీ ఎందుకు కథనాలు రాయలేదు..?

– గరగపర్రులో దళితుల వెలివేత, పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనలు రామోజీ కళ్ళకు కనిపించలేదా ..?

– అచ్చెన్న మహిళను కాలితో తంతే.. మీకు ముచ్చటగా అనిపించిందా..?

-ఃసూటిగా ప్రశ్నించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ మేరుగు నాగార్జున

– జగన్‌గారి పాలనలో దళితులకు జరుగుతున్న మేలు రామోజీకి అట్రాసిటీగా కనిపిస్తుందా..?

– ఫిల్మ్ సిటీలో దళితుల భూములను కొట్టేసింది రామోజీనే 

-ః మంత్రి శ్రీ మేరుగు నాగార్జున 

మంత్రి శ్రీ మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ .. ఇంకా ఏమన్నారంటే..ః

రామోజీ.. ఇవేనా జర్నలిజం విలువలు..?

రామోజీరావు, ఈనాడు పేపర్‌ పెట్టుకున్న తర్వాత ఇన్నేళ్లకు దళితులు గుర్తుకొచ్చారా..? ఈరోజు రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నట్లు కథనాలు రాయడానికి ఆయనకు సిగ్గుందా..? అని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో దళితులపై ఏ విధంగా దాడులు, అఘాయిత్యాలు, వెలివేతలు, జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసిన సంఘటనలపై కథనాలను ఎందుకు రాయలేదు రామోజీ..? ఇదేనా మీ జర్నలిజం విలువలు..? 

- కారంచేడులో దళితులపై దాడులు జరిగినప్పుడు.. అప్పుడు జరిగిన అగ్రవర్ణాల అహంకారం గురించి ఈనాడు ఎందుకు రాయలేదు..? ఆరోజు దళితులపై జరిగిన దమనకాండకు కారకులైన వారి గురించి ఇప్పుడు రాయొచ్చు కదా.. రామోజీరావు సొంత సామాజికవర్గానికి చెందిన వారు దళితులపై మారణకాండ జరుపుతున్నప్పుడు .. ఇది తప్పు అని ఎందుకు రాయలేదు..? అని ప్రశ్నిస్తున్నాను. 

బాబు, రామోజీ ముసుగుదొంగలుః

  ఎందుకంటే.. తన రాతలతో చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి జరగాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఈనాడు ముసుగులో నువ్వు వ్యాపారాలు చేయాలి. మార్గదర్శి ఎవరిది..? అందులో వ్యాపార భాగస్వాములు ఎవరు..? ఎవరి డబ్బులతో రామోజీరావు వ్యాపారం చేస్తున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో.. ప్రస్తుతం సీఐడీ ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. రేపు మార్గదర్శి కేసులో ఈనాడు రామోజీరావు ప్రధాన ముద్దాయి అవుతున్నాడని .. ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. అందుకే, ఇప్పుడు దళితులపై దాడులంటూ.. తప్పుడు కథనాలు రాస్తున్నాడనేది పచ్చి నిజం. 

- మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల డొంక కదిలేకొద్దీ.. రామోజీకి బుర్ర పనిచేయడం లేదు. 

- మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో.. జనం సొమ్మును తన వేరే వ్యాపారాలకు విస్తరించి, చిట్స్ వేసిన ఖాతాదారుల జీవితాలతో చెలగాటమాడుతున్నది రామోజీనే.

- రామోజీ చిట్స్- చీటింగ్ బాగోతాన్ని సీబీసీఐడీ అధికారులు తవ్వి తీస్తుంటే.. ఆయనకు, ఆయనకు వకాల్తా పలుకుతున్న చంద్రబాబు, దుష్ట చతుష్టయానికి కడుపు రగిలిపోతుంది.

ఫిల్మ్ సిటీలో దళితుల భూములు కొట్టేసిన రామోజీరావు

రామోజీఫిల్మ్‌సిటీ నిర్మాణానికి సంబంధించి దళితుల భూముల్ని కబ్జా చేసినట్లు రామోజీరావుపై పలు కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పటికీ కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి ఈరోజు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు, ఈ రాష్ట్రంలో ఎవరో దళిత డాక్టర్లపై దాడులు జరుగుతున్నట్లు తప్పుడు రాతలతో నీచమైన మనస్తత్వాన్ని రామోజీరావు ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇటువంటి దౌర్భాగ్యపు రాతలతో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ లకు రాజకీయంగా పట్టం కట్టాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలించేదే లేదు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక దొంగ అయితే.. ఆయన్ను భుజానెత్తుకుని విషపురాతలు రాసే రామోజీరావేమో గజదొంగ అని చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టే రాతలు మానుకోకపోతే ఈనాడు రామోజీరావుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాను. 

చంద్రబాబు హయాంలో దళితులపై అరాచకాలు

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితులు అలో లక్ష్మణా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులు, అఘాయిత్యాలు జరిగినప్పుడు పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిరిగి కేసులు పెట్టమని రోధిస్తే ఏ ఒక్కడూ పట్టించుకున్న దాఖలాల్లేవు. అచ్చెన్నాయుడు మహిళను కాలుతో తంతే ఎందుకు కేసు పెట్టలేదు..? గరగపర్రులో దళితులు వెలివేత కేసు ఏంచేశారు..? పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన కేసుకు సంబంధించి పెందుర్తి పోలీసుస్టేషన్‌ ముందు ధర్నాకు దిగితే.. ఆ కేసుల్ని ఏం చేశారు..? వాటిని ఎందుకు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు..? ఈ ఘటనలపై ఈనాడులో వరుస కథనాలు ఎందుకు రాయలేదో.. రామోజీరావు సమాధానం చెప్పాలి..? ఇవన్నీ ఈనాడుకు ముచ్చటగా అనిపించాయా..? 

దళితుల మేలుపై చర్చకొస్తారా..?  

రాష్ట్రంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతోంది. రాజ్యాంగబద్ధంగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారి ఆలోచనా విధానంతో సుభిక్షమైన పరిపాలన అందజేస్తుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా సంక్షేమపథకాలతో సంతోషంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత దళితుల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం గురించి మంచిగా ఆలోచించే ముఖ్యమంత్రి వచ్చారని మా జగన్‌మోహన్‌రెడ్డి గారిని ప్రతీ పేదోడి ఇంట్లో దేవుడుగా కొలుస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబుకు, రామోజీరావుకు కన్నుకుట్టే విషయమైంది. దళితుల రక్షణకు, వారి మేలుకు మేం బాధ్యతగా పనిచేస్తున్నామని దమ్ముగా చెబుతున్నాను. అడ్డగోలు రాతలకు, నీచమైన రాతలకు ఈనాడు వేదికగా ఉంది. దళితులకు ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో... మీరు చర్చకు రాగలరా..?

అట్రాసిటీ అంటే అర్ధమేంటి..?

  ఈనాడు మాత్రం ‘దళితులపై దమనకాండ’ అంటూ విషప్రచారానికి పూనుకుంటుంది. అసలు అట్రాసిటీ అంటే రామోజీరావు దృష్టిలో ఏంటి..? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీషుమీడియం తీసుకొచ్చి పేదపిల్లలకు చదువు చెప్పడాన్ని అట్రాసిటీ అంటారా..? రాజధాని ప్రాంతంలో భూముల్ని పేదలకు ఇస్తామంటే.. ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని టీడీపీ అడ్డుకోవడాన్ని అట్రాసిటీ అంటారా..? కొన్ని లక్షల కోట్లు డీబీటీ రూపంలో దళితులకు సంక్షేమపథకాల కింద నేరుగా మా ప్రభుత్వం అందజేస్తుంటే అది అట్రాసిటీనా..?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 68శాతం రాజకీయ పదవులిచ్చి అత్యున్నత స్థానాల్లో నిలబెట్టడాన్నిరామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తున్నాయా.?. పేదోడికి గూడును కల్పిద్దామని.. వారికి ఉచితంగా ఇంటి స్థలమిచ్చి రుణసాయంతో ఇల్లు నిర్మించడమే కాకుండా వారికి ఉపాధిచూపాలని తపనపడే ప్రభుత్వం మీకు అట్రాసిటీకి పాల్పడుతున్నట్లు కనిపిస్తుందా..? పేదవాళ్లకు సాయం చేయడం అనేది నీకు, నువ్వు అండగా ఉండే నీ నాయకుడు చంద్రబాబుకు చేతగాదు. పేదవాళ్లను అక్కునజేర్చుకుని భావితరాల భవిష్యత్తుకోసం మా ప్రభుత్వం గొప్ప పరిపాలన అందిస్తుంటే.. అది రామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తుందా..?

దళితులు ఎప్పటికీ కూలోళ్ళుగానే బతకాలా రామోజీ..?  

ఎస్సీ, ఎస్టీలు పనివాళ్లుగా ఉంటే చంద్రబాబు, రామోజీరావు సామాజికవర్గమే పరిపాలన చేస్తూ దళితుల మీద పెత్తనం చే స్తారా..? దళితుల మేలు జరగడం అంటే.. ఈనాడు రామోజీరావు దృష్టిలో మేమంతా కూలోళ్లుగానే బతకడమా..? ఇలాంటి తప్పుడు రాతలు రాసేటప్పుడు .. బాధ్యత లేకుండా రాతలు రాసేటప్పుడు సిగ్గూశరం గుర్తుకురావా..? ఈనాడు పత్రికకు విలువలు, విశ్వసనీయత ఉండవా.? అని నిలదీస్తున్నాను. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విలువల్ని పుణికిపుచ్చుకున్న మా నేత, గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆనందంగా.. గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా బతుకుతున్నారు. ఇదే విషయాన్ని మేం గర్వంగా దమ్ముగా చెప్పుకుంటున్నాం. 

దళితులకు ‘బాబు’చేసిన మోసం గురించి ఎందుకు రాయవు..?

చంద్రబాబు హయాంలో 5 ఏళ్ళలో, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.33,625.49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపితే.. ఆ డబ్బు దళితులకు దేనికోసం ఖర్చుచేశారో.. అందులో అవినీతి ఎంత జరిగిందో.. ఎంతమంది చేతులు మార్చుకున్నారో.. ఈ కుంభకోణాలపై కథనాలు రాసే దమ్ము రామోజీరావుకు ఉందా..? అని అడుగుతున్నాను. అదే మా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలనలో ఫిబ్రవరి మాసాంతానికి దళితుల సంక్షేమానికి రూ.51,293 కోట్లు ఖర్చుచేశాం. డీబీటీ ద్వారా ఒక్క పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయితే.. వీటిమీద రాతలు రాయడానికి చేతులు కదలడం లేదా రామోజీరావు..? అని అడుగుతున్నాను. 

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..

తప్పుచేసింది కాబట్టే ఎమ్మెల్యే శ్రీదేవికి భయం

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు తప్పు చేశారు కనుకనే ఈరోజు భయపడుతున్నారేమో.. ఆమె చంద్రబాబు వలలో చిక్కుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జెండాపై గెలిచి వెన్నుపోటు పొడిచి పక్క పార్టీల్లోకి వెళ్లిన వారి భవిష్యత్తు ఇప్పుడెలా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు శ్రీదేవి మాట్లాడుతున్న మాటలన్నీ చంద్రబాబు స్క్రిప్టుగానే చూడాలి. అనామకులను కూడా రాజకీయాల్లో ఉన్నత పదవులు కల్పించి నాయకుల్ని చేసిన ఘనమైన చరిత్ర డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి ఉంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మనసున్న మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు మమ్మల్ని ఎంతగానో ఆదరించి అక్కునజేర్చుకుంటే చంద్రబాబుకు కన్నుకుడుతుంది. అందుకే ఎమ్మెల్యే శ్రీదేవి లాంటి వారిని రాజకీయంగా ప్రలోభపెట్టి, తన పంచన చేర్చుకుంటున్నాడు. ఆమె మా పార్టీకి ద్రోహం చేసినందుకు మేమంతా బాధపడుతున్నాం. 

ఏపీ :మెగా వైద్య శిబిరాన్ని,మినీ వాటర్ ట్యాంకులను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

మెగా వైద్య శిబిరాన్ని,మినీ వాటర్ ట్యాంకులను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.

ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో రాగోలు జెమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో లావేరు మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజినాయుడు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బెజ్జిపురం గ్రామపంచాయతీ నిధులతో నాలుగు మినీ వాటర్ ట్యాంక్ లను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో లావేరు మండలం ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ,జే.సి.యస్ మండల ఇంచార్జి మీసాల శ్రీనువాసరావు,వైస్ ఎంపీపీ లుకలాపు శ్రీనువాసరావు,జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు గొర్లె అప్పలనాయుడు,సర్పంచ్లు సంఘం అధ్యక్షులు చాంద్ బాషా,మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి తిరుపతిరావు,నాయకులు బొంతు సూర్యనారాయణ,బెజ్జిపురం పంచాయతీ నాయకులు దన్నాన అప్పలనాయుడు,ఇజ్జాడవెంకటరమణ,పిన్నింటి పూర్ణచంద్రరావు,ఇజ్జాడసూర్యనారాయణ,చివికి ఆశిరప్పడు,కడుపూరి అప్పారావు,దన్నాన రామ్మూర్తి,ఇజ్జాడ సన్యాసప్పుడు,కలిశెట్టి పైడితల్లి,బెజ్జిపురం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,లావేరు మండలం సర్పంచులు,ఎంపీటీసీలు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,జెమ్స్ హాస్పిటల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

తాడి చెట్టు మీద నుండి పడిన గీత కార్మికుడినీ పరామర్శించిన హన్మకొండ గోపా జిల్లా అధ్యక్షుడు చిర్ర రాజు గౌడ్.

తాడి చెట్టు మీద నుండి పడిన గీత కార్మికుడినీ పరామర్శించిన హన్మకొండ గోపా జిల్లా అధ్యక్షుడు చిర్ర రాజు గౌడ్

Streetbuzz news:

ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన గొడిశాల కుమార్ గౌడ్ శుక్రవారం రోజున తాడిచెట్టు ఎక్కుతున్న క్రమంలో కాలు జారి కిందపడి తీవ్ర గాయాలు పాలయ్యాడు. అట్టి విషయం తెలుసుకున్న గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గొపా) హన్మకొండ జిల్లా అధ్యక్షుడు చిర్ర రాజు గౌడ్ గాయాల పాలైన గీత కార్మికుని ఇంటికి వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా చిర్ర రాజు గౌడ్ మాట్లాడుతూ తాడిచెట్టు నుంచి పడుతున్న గీత కార్మికులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం బాధాకరమని, ప్రభుత్వం గీత కార్మికులకు తాడిచెట్టు ఎక్కడానికి యంత్రాల త్వరగా అందించాలని,ప్రతి గాయపడ్డ గీతా కార్మికునికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోపా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, గోపా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీపతి.గోపి గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏరుకొండ రమేష్ గౌడ్ గోపా మండల నాయకులు గోడిశాల వినయ్ కుమార్ గౌడ్, ఎల్కతుర్తి సంఘం గౌడ సంఘం డైరెక్టర్ గోడిశాల నరేష్ గౌడ్, గౌడ నాయకులు గొడిశాల విక్రం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*

ఏపీ పి ఎస్సీ : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

ఏపీ పి ఎస్సీ : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 మెయిన్స్‌ (APPSC Group-1 mains) పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం..

ఏప్రిల్‌ 23 నుంచి 29వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా జూన్‌ తొలి వారానికి వాయిదా వేశారు. ఏప్రిల్‌ 24 నుంచి మే 18వరకు సివిల్స్‌ ఇంటర్వ్యూలు ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 3 నుంచి 9వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. నిన్న యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ తాజా నిర్ణయం తీసుకుంది. సివిల్స్‌ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి గ్రూప్‌ 1 పరీక్ష రాసే 25మంది అభ్యర్థులు హాజరు కావాల్సిఉంది. వారిని దృష్టిలో ఉంచుకొని అధికారులు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల తేదీల్లో ఈ మార్పులు చేశారు..

అద్భుతమైన ఘటం...నేడు ఆకాశంలో ఐదు గ్రహాలను చూడచ్చు.. వరుస క్రమం ఇలా.. సూర్యాస్తమయం ముగిసిన వెంటనే చూడాలి

అద్భుతమైన ఘటం...నేడు ఆకాశంలో ఐదు గ్రహాలను చూడచ్చు.. వరుస క్రమం ఇలా..!

సూర్యాస్తమయం ముగిసిన వెంటనే చూడాలి

పశ్చిమదిశలో ఒకే సమాంతర రేఖపైకి ఐదు నక్షత్రాలు

గురుడు, శుక్రుడు, అంగారకుడిని కళ్లతో చూడొచ్చు

మిగిలిన రెండింటిని చూడాలంటే బైనాక్యులర్ అవసరం

నేడు సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ఐదు గ్రహాలు కనువిందు చేయనున్నాయి. కాకపోతే ఇందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాల్సిందే. ఐదింటలోనూ మూడింటిని నేరుగా కళ్లతో చూడొచ్చు. రెండింటిని బైనాక్యులర్ తోనే చూడగలరు. 

సరైన సమయం

సూర్యస్తమయం అయిన వెంటనే పశ్చిమం వైపు చూడాలి. ఐదు గ్రహాలూ సమాంతర రేఖలో కనిపిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే సూర్యాస్తమయం ముగిసిన అరగంట తర్వాత బుధగ్రహం, గురుడు సమాంతర రేఖ నుంచి కొంచెం కిందకు వస్తారు. ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే భూమిపై ఎక్కడి నుంచైనా వీటిని చూడొచ్చు. 

గురుడు, శుక్రుడు, అంగారకుడిని కళ్లతో చూడొచ్చు. ఇవి కొంచెం ప్రకాశవంతంగా కనిపిస్తాయి. సమాంతర రేఖలో అన్నింటికంటే దిగువన ఉన్నది బుధగ్రహం. తర్వాత ఉన్నది శుక్రుడు. దానిపైన, చంద్రుడికి దిగువన ఉన్నది యురేనస్. తర్వాత చంద్రుడు. చంద్రుడికి ఎగువ భాగంలో తొలుత మార్స్ ఉంటుంది. అన్నింటికంటే పైన గురుగ్రహం కనిపిస్తుంది. సాధారణంగా మిగిలిన గ్రహాలు అప్పుడప్పుడు దర్శనమిచ్చినా, యురేనస్ కనిపించడం అరుదు. ఈ ఏడాది జూన్ లోనూ ఇదే మాదిరి దృశ్యం కనిపించనుంది. కాకపోతే ప్రతిసారీ ఇవే ఐదు గ్రహాలు ఉండవు.

ఏపీ ::మహిళల పక్షపాతి వైఎస్ జగన్. నరసరావుపేట శాసనసభ్యులు డా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

మహిళల పక్షపాతి వైఎస్ జగన్ -నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి .

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశించిన పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన..

ఘనంగా ఈ రోజు నరసరావుపేట నియోజకవర్గంలో 3వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు 11,351 మంది సభ్యులకు 8,97,96,156/- చెక్కు నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణి చేసారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలలో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం ద్వారా ది.11-04-2019 నాటికి స్వయం సహాయక సంఘాలకు రుణ మొత్తాన్ని 4 విడతల్లో రుణమాఫీ చేయుటకు నిర్ణయించింది, దీనిలో భాగంగా ఇప్పటి వరకు 3 విడతలలో స్వయం సహాయక సంఘాలకు రుణమాఫీ నిధులు నేరుగా లబ్ధిదారులు ఖాతాలో జమ చేయడం జరిగినది..

పట్టణ పేదరికం నిర్మూలన సంస్థ (మెప్మా) నరసరావుపేట పురపాలక సంగం నందు 1190 స్వయం సహాయక సంఘాలు వైయస్సా ఆసరా పథకాన్ని పొందటకు అర్హత కలిగి ఉన్నాయి. 1190 స్వయం సహాయక సంఘాల్లో ని 11,351 మంది సభ్యులకు 8,97,96,156/- కోట్లు చెక్కు నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది, ఇప్పటి వరకు 3 విడతల్లో మొత్తం 1190 స్వయం సహాయక సంఘాలకు 26.86 కోట్లు స్వయం సహాయక సంఘాలకు జమ చెయ్యటమైనది..

నరసరావుపేట పట్టణంలోని టౌన్ హాల్ కు భారీగా తరలి వచ్చిన మహిళలు - కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,

ఈ సంధర్బంగా. నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ:

రాష్ట్రంలో మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చేపట్టడం హర్షణియ్యమని అన్నారు..

ఈ మూడు సంవత్సరాల కాలంలో సుమారు 20 వేల కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ ఆసరా కొసం కేటాయించడం చరిత్రలో లిఖించదగిన అంశంగా పేర్కొన్నారు..

గతలో తెలుగుదేశం ప్రభుత్వాలు మహిళలను మోసం చేస్తే, ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులలో సైతం మాట నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కొనియాడారు..

ఇది సామాన్యమైన విషయం కాదని, నాయకుడి యెక్క విలువలకు, విశ్వసనియతకు ఇది నిదర్శమన్నారు...

కుటుంబం నడపగల ఆలోచన శక్తి కేవలం మహిళలకు మాత్రమే ఉంటుందని గ్రహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి , కుల, మత, వర్గ పార్టీ, ప్రాంతాలకు అతీతంగా ప్రతి మహిళకు చేయూతనందించారని అన్నారు..

ఎవరికి ఒక్క పైసా లంచం లేకుండా ఇటువంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే సాధ్యం అని అన్నారు..

ప్రతి మహిళకు సొంత అన్నలా ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళల శ్రేయస్సు కోసం శ్రమించారో..

ఆయన తనయుడిగా నేడు వైయస్ జగన్ ఆ ఆశయాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఆశించిన పేదరిక నిర్మూలన కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి,అహర్నిశలు పాటు పడుతున్నారని అన్నారు..

ఈ కార్యక్రమంలో  శాసనసభ్యులు డా౹౹ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, పిడి మెప్మా , మున్సిపల్ కమిషనర్, PUDA చైర్మన్ మిట్టపల్లి రమేష్ , జిల్లా మరియు మండల ఉన్నతాధిరులు, డ్వాక్రా మహిళలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, అన్ని శాఖల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు మండలంలోని రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.._

భద్రాద్రి కొత్తగూడెం పోలిస్ శ్రీరామనవమి ఉత్సవం-2023 సందర్బంగా భద్రాచలానికి విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం.

భద్రాద్రి కొత్తగూడెం పోలిస్ శ్రీరామనవమి ఉత్సవం-2023 సందర్బంగా భద్రాచలానికి విచ్చేస్తున్న మీకు స్వాగతం.

ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, తలంబ్రాలు & లడ్డూ ప్రసాదం స్టాల్స్ మరియు కల్యాణమండపం యొక్క సెక్టార్ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం:

ఇవ్వబడిన QR కోడ్ ని స్కాన్ చేయండి

లేదా

దిగువ లింక్‌పై క్లిక్ చేయండి

https://bhadrachalam.netlify.app

వినీత్.జి ఐపిఎస్

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*

ఐపీల్ 2023: ఐపీఎల్ నయా రూల్స్.. జట్లన్నీ కొత్తగా.

ఐపీల్ 2023: ఐపీఎల్ నయా రూల్స్.. జట్లన్నీ కొత్తగా.

Streetbuzz news ::

పోయిన ఏడాది వరకు ఒక లెక్క.. ఈ ఏడాది ఇంకో లెక్క అన్నీ రీతిలో ఐపీఎల్ 2023 సీజన్ ఉండనుంది. ఈసారి జట్లన్నీ కొత్తగా కనిపించనున్నాయి. చాలా జట్లు తమ కీలక ప్లేయర్లను ఈ సీజన్లో వదిలేశాయి. టీ20 ప్రపంచకప్ లో రాణించిన కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ లో భారీ ధరకు అమ్ముడుపోయారు. పంజాబ్.. శామ్ కరన్ రూ.18.5 కోట్లకు దక్కించుకోగా, బెన్ స్ట్కోక్స్ ను చెన్నై రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. పోయిన ఏడాది సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్న విలియమ్సన్.. ఇప్పుడు గుజరాత్ తరుపున ఆడనున్నాడు. ఢిల్లీకి వార్నర్, సన్ రైజర్స్ కు మార్ క్రమ్, పంజాబ్ కు ధవన్, కోల్ కతాకు నితిష్ రాణా కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

మళ్లీ ఇంటా, బయటా…

లీగ్ స్టేజ్ లో మ్యాచ్ లన్నీ ఇంటా, బయట విధానంలో జరగడం కొత్తేమీ కాదు. అయితే. 2019 కరోనా తర్వాత ఆ రూల్ ని తీసేశారు. ప్రస్తుతం మళ్లీ ఐపీఎల్ 2023లో ఈ రూల్ ని తీసుకొచ్చారు. ప్రతి జట్టు సొంతగడ్డపై 7 మ్యాచులు, ప్రత్యర్థి మైదానంలో 7 మ్యాచులు ఆడుతుంది. ఈసారి మొత్తం 12 వేదికల్లో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయి. రాజస్థాన్‌, ధర్మశాల, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్‌, జైపుర్‌, మొహాలీలో మ్యాచ్‌లు జరుగుతాయి.

ఏపీ :అనంతపురం జిల్లా::రమాదేవి హత్యలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి స్పష్టమని పిర్యాదు

కణేకల్ మండలం లో పిడిఎసుయు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ

ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం,

Stretubuzz news.

అనంతపురం జిల్లా లో సోమవారం నార్పల మండల పరిధిలోని బొందలవాడ గ్రామంలో దారుణ హత్యకు గురైన కడపల రమాదేవి మరియు మరీ ఎందరో గత వైసీపీ పాలన లో S.C S.T లు పై దౌర్జన్యం. దాడులు,హత్యలు మాన భంగాలు జరిగావి మాకు రక్షణ కల్పించలేరాని..?రమాదేవి ఫ్యామిలీ నిలదీశారు.రమాదేవి హత్యలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి స్పష్టమని పిర్యాదు చేయడానికి పోయిన తల్లి, దండ్రులను పోలీసులు బెదిరించడం సరికాదన్నారు.హంతుకుడు జాఫర్ వలికే వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. ఎస్సీ,ఎస్టీల ప్రాణాలంటే ఎందుకు అంత చులకన్నారు. ఎస్సీ,ఎస్టీల పై దాడులను అరికట్టాలి,స్నేహ లత,నల్లపు రమ్య,టేకు లక్ష్మి,ప్రీతి నాయక్ ఇలా సబ్బండ కులాల అడ బిడ్డలను ఎంత మందిని పోగొట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు.మా గోడు,ఉసురు తగలక పోదాని శపించారు. రమాదేవి కిరాతకంగా హత్య చేసిన జాఫర్ వలిని పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వార విచారణ జరిపి ఉరి తీయాలని,కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని,ఈ వైసీపీ ప్రభుత్వం మృతురాలు కుటుంబానికి 50లక్షల ఎక్షగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో పోరాడి సాధించు కుంటామన్నారు. రమాదేవి నీ కిరాతకంగా హత్య చేసిన జాపర్ వలిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శిక్ష వేయాలని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము,

             ఇట్లు

       మల్లెల ప్రసాద్

ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

పిడిఎసుయు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు

ఏపీ:ఎస్సీ సబ్ ప్లాన్ పనుల కోసం రూ.13112 కోట్ల వ్యయం.ఫిబ్రవరి మాసాంతానికి 70.81% నిధుల ఖర్చు • 100% నిధులు ఎస్సీలకు చేరేలా అధికారులు పని చేయాలి.

ఎస్సీ సబ్ ప్లాన్ పనుల కోసం రూ.13112 కోట్ల వ్యయం

• ఫిబ్రవరి మాసాంతానికి 70.81% నిధుల ఖర్చు

• 100% నిధులు ఎస్సీలకు చేరేలా అధికారులు పని చేయాలి

• నోడల్ ఏజెన్సీ సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున.

Stretbuzz news:

అమరావతి, మార్చి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.18518.29 కోట్ల లో గత ఫిబ్రవరి మాసాంతానికి నాటికి 70.81శాతం నిధులు ఖర్చు కావడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం మరింతగా పెరగాలని , ఎస్సీల కోసం కేటాయించిన నిధులన్నీ వారి సంక్షేమానికే ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ సబ్ ప్లాన్(ఎస్సీ కాంపొనెట్)కు చెందిన 30వ నోడల్ ఏజెన్సీ సమావేశంలో నాగార్జున సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ శాఖల్లో 43 శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ శాఖల ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వ్యయం గురించి వివరించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమైన శాఖలకు ప్రభుత్వం రూ.18518.29 కోట్లను ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిందని చెప్పారు. అయితే రాష్ట్రంలోని కొన్ని శాఖలు సబ్ ప్లాన్ ద్వారా తాము ప్రతిపాదించిన పనుల కోసం అదనపు బడ్జెట్ కావాలని కోరడం, ప్రభుత్వం ఆ విధంగానే అదనపు బడ్జెట్ ను కేటాయించడంతో ఈ మొత్తం రూ.20605.44 కోట్లకు చేరిందని తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం విషయంలో కొన్ని శాఖలు అంచనాలకు మించి ప్రగతిని సాధిస్తుండగా కొన్ని శాఖలు మాత్రం వెనుకబడి ఉన్నాయని గుర్తించామన్నారు. ఆయా శాఖల పనితీరు ఆధారంగా గ్రేడ్లను నిర్ణయించామన్నారు. 76% నుంచి 100% నిధులను వినియోగించిన శాఖలు ఏ-గ్రేడ్ గాను, 51% నుంచి 75% దాకా నిధులను వినియోగించిన శాఖలను బీ-గ్రేడ్ గానూ,26% నుంచి 50% దాకా నిధులను వాడుకున్న శాఖలను సీ-గ్రేడ్ గాను, 25% వరకూ మాత్రమే నిధుల వినియోగం ఉన్న శాఖలను డీ-గ్రేడ్ గాను గుర్తించామని, ఈ గ్రేడ్ల ఆధారంగానే సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని నాగార్జున వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సబ్ ప్లాన్ నిధుల్లో రూ.13112.36 కోట్లు ఫిబ్రవరి మాసాంతానికి ఖర్చు అయ్యాయని వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల్లో అత్యధికశాతం ఖర్చు చేసిన విద్యుత్, సివిల్ సప్లయిస్, ప్రజారోగ్యం, పరిశ్రమలు, వైద్య విద్య, ఎస్సీ గురుకులాలు, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, భూ పరిపాలన, వ్యవసాయం, బలహీనవర్గాల గృహనిర్మాణం, పంచాయితీరాజ్ తదితర శాఖల పనితీరును ప్రశంసించారు. నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో వినియోగించుకోని నిధులను మరొక ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం లేదని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ కారణంగానే సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో ప్రతి రుపాయి కూడా ఎస్సీల ప్రగతికి ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.జయలక్ష్మి, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, అడిషనల్ డైరెక్టర్ రఘురామ్, డిప్యుటీ డైరెక్టర్ లక్ష్మీ సుధ తో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

• ఫోటోవార్త: ఎస్సీ సబ్ ప్లాన్ నోడల్ ఏజెన్సీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మేరుగు నాగార్జున.