సీనియర్ జర్నలిస్టు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూత

సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూశారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు సంస్థలు, బీబీసీ, సాక్షి దినపత్రికల్లో ఉన్నత హోదాలో పని చేశారు. శ్రీనాథ్‌రెడ్డి చెన్నై ట్రిప్లికేన్ లోని హిందూ హైస్కూలులో 10వ తరగతి వరకూ చదివారు. ఆ తర్వాత తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ చదివారు. అనంతరం పాత్రికేయ రంగంలో అడుగు పెట్టారు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాథ్‌ రెడ్డి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. మొదట్లో తెలుగు దినపత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. అనంతరం కొన్ని ఇంగ్లీషు పేపర్లలోనూ చాలాకాలం పాటు పని చేశారు. 

రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ‘సెవెన్ రోడ్స్ జంక్షన్’ పేరుతో దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి రాసిన కాలమ్స్ విశేష ప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పని చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పని చేసిన శ్రీనాథ్‌ రెడ్డి.. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు.

క్రిమినల్‌ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణ: ఏపీ హైకోర్టు

క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉన్న వారికి పాస్ పోర్టు పునరుద్ధరణ కావాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సమర్పించాల్సిన అవసరం లేకుండానే పాస్‌పోర్టును పునరుద్ధరించేలా(రెన్యువల్‌) పాస్‌పోర్టు అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. విచారణ కోర్టు ఇచ్చిన ఎన్‌వోసీ/అనుమతి ఉత్తర్వులను సమర్పించాకే పిటిషనర్ల పాస్‌పోర్టును పునరుద్ధరించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది.

మరోవైపు న్యాయస్థానం అనుమతి ఉత్తర్వులిచ్చాక కూడా కోర్టులో క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉందనే ఒక్క కారణంతో పాస్‌పోర్టును పునరుద్ధరించకుండా ఉండటానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పిటిషనర్లు, లేదా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఎన్‌వోసీ కోసం క్రిమినల్‌ కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. ఆయా కేసులోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులివ్వాలని విచారణ కోర్టులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు.. మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ గెజిట్‌ జారీ..

అమ‌రావ‌తి కేపిట‌ల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తూ తుది నోటిఫికేష‌న్ జారీ చేసింది ప్రభుత్వం. గ‌తంలో ఉన్న జోన్ల‌లో కొన్ని భాగాల‌తో కొత్తగా R-5 జోన్ ఏర్పాటు చేసింది స‌ర్కార్. కోర్టు ఆదేశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని జోన్ ఏర్పాటుచేసిన‌ట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానంగా పేద‌ల ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టడంతో పాటు అందుబాటులో ఉండే ధ‌ర‌ల‌తో నిర్మాణాలు చేప‌ట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా జోన్ ఏర్పాటు చేసింది.

మంగ‌ళ‌గిరి మండ‌లంలోని కృష్ణాయ‌పాలెం, నిడమర్రు, కుర‌గ‌ల్లుతో పాటు తుళ్లూరు మండ‌లంలోని మంద‌డం, ఐన‌వోలు గ్రామాల్లోని 900.97 ఎక‌రాలతో జోన్ ఏర్పాటు చేసింది. దీంతో ఆయా గ్రామాల్లో గ‌తంలో ఉన్న జోన్లలో ప‌లు స‌ర్వే నెంబ‌ర్లు కొత్త జోన్ ప‌రిధిలోకి వ‌చ్చాయి. ఈ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్టాలి, ఏవి చేప‌ట్టకూడ‌ద‌నే వివ‌రాల‌న్నీ గెజిట్‌లో స్పష్టం చేసింది ప్రభుత్వం.

కొన్ని నిర్మాణాలకు కండిష‌న‌ల్ అనుమ‌తులు ఇచ్చింది. స‌ర్వీస్ అపార్ట్‌మెంట్స్, ఇండ‌స్ట్రియ‌ల్ అవ‌స‌రాల కోసం, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్‌కు అనుమ‌తులు ఇవ్వకూడ‌ద‌ని జీవోలో పేర్కొంది. ఇక నిర్మాణాల విష‌యంలో కూడా ఎన్ని ఫ్లోర్‌లు నిర్మించాలి? ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి ? పార్కింగ్ స్థలం ఎంత ఉండాల‌నేది కూడా జీవోలో పేర్కొంది. ఈ జోన్‌లో ప్రభుత్వం పేర్కొన్న నిబంధ‌న‌ల ప్రకార‌మే ఎలాంటి నిర్మాణాలైనా చేప‌ట్టాలనేదే ప్రధాన విషయం.

మొత్తంగా గ‌తంలో R-5 జోన్ పై వ‌చ్చిన అభ్యంత‌రాలు, ఆ త‌ర్వాత కోర్టు క్లియ‌రెన్స్‌తో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ఇప్పటికే ఈ వ్యవహారంలో న్యాయ పోరాటం చేశారు రైతులు.. ప్రభుత్వ తాజా నిర్ణయంపై వారు ఎలా స్పందిస్తారు అనేది వేచిచూడాలి.

బీజేపీ, జనసేన మధ్య కటీఫ్‌? సంచలనంగా మారిన మాధవ్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అని బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అవును, బీజేపీ, జనసేన మధ్య చెడినట్టే కనిపిస్తోంది. పొత్తులున్నా తమతో కలిసి జనసేన పనిచేయకపోవడంపై బీజేపీ గుస్సా మీదున్నట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాయమడిగినా చేయలేదని జనసేనపై విమర్శలు సంధిస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ పదాధికారుల సమావేశం తర్వాత ఆ పార్టీ నేత మాధవ్‌ చేసిన హాట్‌ కామెంట్స్.. ఇప్పుడు కాకరేపుతున్నాయ్‌.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్‌ కోసం పవన్‌ని అడిగామనీ.. అయితే, జనసేన నుంచి ఎలాంటి స్పందనా రాలేదనీ చెప్పారు మాధవ్‌. పొత్తుల విషయంలో చాలా ఆలోచలున్నాయని చెప్పిన ఆయన.. బీజేపీ ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటోందనీ తెలిపారు. ఏపీ బీజేపీలో కీలకనేతగా ఉన్న మాధవ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతేకాదు.. మాధవ్ వ్యాఖ్యలతో ఈ రెండు పార్టీలు బ్రేకప్‌ చెప్పేసుకుంటున్నాయనే చర్చ మొదలైందిప్పుడు.

మగళవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష తర్వాత మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ-జనసేన పార్టీల పొత్తులపై కీలక కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేయలేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఉత్తరాంధ్రతో పోల్చితే రాయలసీమలోనే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారాయన. అంతేకాదు.. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక వైసీపీతో కలిసి బీజేపీ పనిచేస్తుందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోందన్న మాధవ్.. ఈ ప్రచారాన్ని ఖండించారు. అలాంటి పొత్తులేమీ లేవని తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఓటమిని పక్కనపెడితే మిగిలిన చోట్ల గతంలో కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లే వచ్చాయని అన్నారు.

రామ్ గోపాల్ వర్మపై మహిళా న్యాయవాదులు సీరియస్

నాగార్జున యూనినర్సీటీలో అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై మహిళా న్యాయవాదులు సీరియస్ అయ్యారు. ఆయనపై గుంటూరు ‌జిల్లా పెదకాకాని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు మహిళా న్యాయవాదులు. ఫిర్యాదు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. సబ్యత, సంస్కారం లేని వర్మను యూనివర్శిటీ కి ఆహ్వానించిన వీసీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మానసిక రోగి వర్మను యూనివర్సిటీ కు ఎలా పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైరస్ ప్రపంచంలో ఉన్న పురుషలను కాదు వర్మను నిర్మూలిస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు. వావి వరసలు లేని మృగం ఆర్జీవీ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీని విలాస వస్తువుగా చూసే వర్మపై ఏపీ మహీళా ‌కమీషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విద్యార్దుల‌ మెదళ్ళలో విషం నింపిన వ్యక్తి అర్డీవి అని మండిపడ్డారు. మేథావి అంటూ పొగిడిన వీసీ ఆ పదవికి అనర్హుడన్నారు. ఆర్జీవీ, వీసీ పై చర్యలు తీసుకోవాలని మహిళా న్యాయవాదులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గుంటూరు మహిళా న్యాయవాదుల సంఘం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

శ్రీశైలానికి కన్నడ భక్తుల క్యూ

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకలను చూసేందుకు వేల మంది కన్నడ భక్తులు కాలినడకన నల్లమల అడవి గుండా తరలివస్తున్నారు.

 కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా దేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. అందుకే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెంకటాపురం నుంచి దట్టమైన అటవీప్రాంతం నుంచి సుమారు 40 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వస్తారు. 

వీరికి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చూసుకుంటోంది. మార్గమధ్యలో మంచినీరు, వైద్య సౌకర్యాలు కల్పించడం, అటవీ మార్గంలో రాళ్లు రప్పలు లేకుండా చూడడం, ట్రాక్టర్లతో నీళ్లు చల్లించడం, అన్నదానం వంటి ఏర్పాట్లను చేశామని ఈవో ఎస్.లవన్న తెలిపారు. మరోవైపు దాతలు కూడా మజ్జిగ, పండ్లు పంచడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు.

మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ సర్కారు.. ఏంటది?

ఈ పాలిటెక్నిక్ కాలేజీలను నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, కడప జిల్లాలోని మైదుకూరుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమో కోర్సుల్లో విద్యాభ్యాసం చేసేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొంది.

 పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తికాగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. ఈ మూడుక కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోకవర్గం డోన్ పరిధిలోని బేతంచర్లలో నిర్మిస్తామని ఆయన తెలిపారు.

అవినీతిలో నోబెల్., నటనలో ఆస్కార్ చంద్రబాబుకే - మంత్రి అమర్నాథ్.

టీడీపీ నేతలు, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కుంభకోణాల్లో చంద్రబాబు ఎంత సిద్ధహస్తుడో చెప్పడానికి”నారా స్కిల్ స్కామ్” ఉదాహరణ…..ఈ స్కామ్ లో ఇప్పటికే కీలక నిందితులను ED విచారిస్తోంది….అరెస్ట్ అవ్వకుండా మిగిలింది చంద్రబాబు., ఆయన కొడుకే. సీమెన్స్ తో ట్రై పార్టీ ఒప్పందం….,గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంతా బూటకం. ఈ స్కామ్ వెనుక పుత్రరత్నం ప్రమేయం ఉంది. తండ్రి కొడుకులు పంది కొక్కుల్లా ప్రజాధనం తినేశారు. ఈ విషయం సీమెన్స్ నిర్ధారించింది.. ఏలేరు స్కామ్., స్టాంప్ పేపర్ల కుంభకోణం.,హైటెక్ సిటీ నుంచి అమరావతి వరకు చంద్రబాబు హయం అంతా అవినీతి మయం అన్నారు మంత్రి అమర్నాథ్.

అవినీతిలో నోబెల్., యాక్టింగ్ లో ఆస్కార్ చంద్రబాబుకు ఇవ్వాలనేది నా ఆకాంక్ష….ఫోరెన్సిక్ ఆడిట్, షాడో ఫైల్స్ ద్వారా స్కిల్ డవలప్ మెంట్ కోసులో పూర్తి ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయి.. స్కిల్ స్కామ్ మరో యూరో లాటరీ లాంటి స్కీమ్…..రాజధానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమికి సంబంధం లేదు. పులివెందులలో లోకేష్ పోటీ చెయ్య గలుగుతాడా…..?3శాతం ఓటర్లు కలిగిన ఒక సెక్షన్ ఓటర్ల ప్రభావం పెద్దగా ఉండదు. పట్టభధ్రుల్లో అసంతృప్తికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాం అన్నారు. లోపం ఎక్కడ ఉందో పసిగట్టి మార్పులు చేసుకుంటాం అన్నారు మంత్రి అమర్నాథ్. ఇండియాకు.,కెన్యాకు మ్యాచ్ జరిగితే అప్పుడప్పుడు కెన్యా గెలుస్తుంది. అంత మాత్రాన కెన్యా బలమైందని చెప్పలేము. గెలుపు ముఖం చూడనందునే టీడీపీ సంబరాలు చేసుకుంటోందని విమర్శించారు.

రాయలసీమ వాసులకు జగన్ సర్కార్ శుభవార్త

రాయలసీమ జిల్లాల వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ప్రభుత్వం కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

ఈ మూడు కాలేజీలను అనంతపురం జిల్లా గుంతకల్, కడప జిల్లా మైదుకూరు, నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సివిల్, కెమికల్, మెకానికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుంది అంటున్నారు.

తిరుమల భక్తులకు శుభవార్త.. ఇవాళ జూన్ నెల టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త. ఇవాళ జూన్ నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ.

ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలకమండలి. ఇక ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం.. ప్రారంభం కానుంది. ఈ తరుణంలో శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేసింది టీటీడీ. అలాగే రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. దీంతో…శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి.