బీజేపీ, జనసేన మధ్య కటీఫ్‌? సంచలనంగా మారిన మాధవ్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అని బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అవును, బీజేపీ, జనసేన మధ్య చెడినట్టే కనిపిస్తోంది. పొత్తులున్నా తమతో కలిసి జనసేన పనిచేయకపోవడంపై బీజేపీ గుస్సా మీదున్నట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాయమడిగినా చేయలేదని జనసేనపై విమర్శలు సంధిస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ పదాధికారుల సమావేశం తర్వాత ఆ పార్టీ నేత మాధవ్‌ చేసిన హాట్‌ కామెంట్స్.. ఇప్పుడు కాకరేపుతున్నాయ్‌.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్‌ కోసం పవన్‌ని అడిగామనీ.. అయితే, జనసేన నుంచి ఎలాంటి స్పందనా రాలేదనీ చెప్పారు మాధవ్‌. పొత్తుల విషయంలో చాలా ఆలోచలున్నాయని చెప్పిన ఆయన.. బీజేపీ ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటోందనీ తెలిపారు. ఏపీ బీజేపీలో కీలకనేతగా ఉన్న మాధవ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతేకాదు.. మాధవ్ వ్యాఖ్యలతో ఈ రెండు పార్టీలు బ్రేకప్‌ చెప్పేసుకుంటున్నాయనే చర్చ మొదలైందిప్పుడు.

మగళవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష తర్వాత మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ-జనసేన పార్టీల పొత్తులపై కీలక కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేయలేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఉత్తరాంధ్రతో పోల్చితే రాయలసీమలోనే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారాయన. అంతేకాదు.. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక వైసీపీతో కలిసి బీజేపీ పనిచేస్తుందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోందన్న మాధవ్.. ఈ ప్రచారాన్ని ఖండించారు. అలాంటి పొత్తులేమీ లేవని తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఓటమిని పక్కనపెడితే మిగిలిన చోట్ల గతంలో కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లే వచ్చాయని అన్నారు.

రామ్ గోపాల్ వర్మపై మహిళా న్యాయవాదులు సీరియస్

నాగార్జున యూనినర్సీటీలో అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై మహిళా న్యాయవాదులు సీరియస్ అయ్యారు. ఆయనపై గుంటూరు ‌జిల్లా పెదకాకాని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు మహిళా న్యాయవాదులు. ఫిర్యాదు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. సబ్యత, సంస్కారం లేని వర్మను యూనివర్శిటీ కి ఆహ్వానించిన వీసీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మానసిక రోగి వర్మను యూనివర్సిటీ కు ఎలా పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైరస్ ప్రపంచంలో ఉన్న పురుషలను కాదు వర్మను నిర్మూలిస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు. వావి వరసలు లేని మృగం ఆర్జీవీ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీని విలాస వస్తువుగా చూసే వర్మపై ఏపీ మహీళా ‌కమీషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విద్యార్దుల‌ మెదళ్ళలో విషం నింపిన వ్యక్తి అర్డీవి అని మండిపడ్డారు. మేథావి అంటూ పొగిడిన వీసీ ఆ పదవికి అనర్హుడన్నారు. ఆర్జీవీ, వీసీ పై చర్యలు తీసుకోవాలని మహిళా న్యాయవాదులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గుంటూరు మహిళా న్యాయవాదుల సంఘం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

శ్రీశైలానికి కన్నడ భక్తుల క్యూ

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకలను చూసేందుకు వేల మంది కన్నడ భక్తులు కాలినడకన నల్లమల అడవి గుండా తరలివస్తున్నారు.

 కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా దేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. అందుకే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెంకటాపురం నుంచి దట్టమైన అటవీప్రాంతం నుంచి సుమారు 40 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వస్తారు. 

వీరికి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చూసుకుంటోంది. మార్గమధ్యలో మంచినీరు, వైద్య సౌకర్యాలు కల్పించడం, అటవీ మార్గంలో రాళ్లు రప్పలు లేకుండా చూడడం, ట్రాక్టర్లతో నీళ్లు చల్లించడం, అన్నదానం వంటి ఏర్పాట్లను చేశామని ఈవో ఎస్.లవన్న తెలిపారు. మరోవైపు దాతలు కూడా మజ్జిగ, పండ్లు పంచడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు.

మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ సర్కారు.. ఏంటది?

ఈ పాలిటెక్నిక్ కాలేజీలను నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, కడప జిల్లాలోని మైదుకూరుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమో కోర్సుల్లో విద్యాభ్యాసం చేసేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొంది.

 పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తికాగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. ఈ మూడుక కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోకవర్గం డోన్ పరిధిలోని బేతంచర్లలో నిర్మిస్తామని ఆయన తెలిపారు.

అవినీతిలో నోబెల్., నటనలో ఆస్కార్ చంద్రబాబుకే - మంత్రి అమర్నాథ్.

టీడీపీ నేతలు, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కుంభకోణాల్లో చంద్రబాబు ఎంత సిద్ధహస్తుడో చెప్పడానికి”నారా స్కిల్ స్కామ్” ఉదాహరణ…..ఈ స్కామ్ లో ఇప్పటికే కీలక నిందితులను ED విచారిస్తోంది….అరెస్ట్ అవ్వకుండా మిగిలింది చంద్రబాబు., ఆయన కొడుకే. సీమెన్స్ తో ట్రై పార్టీ ఒప్పందం….,గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంతా బూటకం. ఈ స్కామ్ వెనుక పుత్రరత్నం ప్రమేయం ఉంది. తండ్రి కొడుకులు పంది కొక్కుల్లా ప్రజాధనం తినేశారు. ఈ విషయం సీమెన్స్ నిర్ధారించింది.. ఏలేరు స్కామ్., స్టాంప్ పేపర్ల కుంభకోణం.,హైటెక్ సిటీ నుంచి అమరావతి వరకు చంద్రబాబు హయం అంతా అవినీతి మయం అన్నారు మంత్రి అమర్నాథ్.

అవినీతిలో నోబెల్., యాక్టింగ్ లో ఆస్కార్ చంద్రబాబుకు ఇవ్వాలనేది నా ఆకాంక్ష….ఫోరెన్సిక్ ఆడిట్, షాడో ఫైల్స్ ద్వారా స్కిల్ డవలప్ మెంట్ కోసులో పూర్తి ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయి.. స్కిల్ స్కామ్ మరో యూరో లాటరీ లాంటి స్కీమ్…..రాజధానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమికి సంబంధం లేదు. పులివెందులలో లోకేష్ పోటీ చెయ్య గలుగుతాడా…..?3శాతం ఓటర్లు కలిగిన ఒక సెక్షన్ ఓటర్ల ప్రభావం పెద్దగా ఉండదు. పట్టభధ్రుల్లో అసంతృప్తికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాం అన్నారు. లోపం ఎక్కడ ఉందో పసిగట్టి మార్పులు చేసుకుంటాం అన్నారు మంత్రి అమర్నాథ్. ఇండియాకు.,కెన్యాకు మ్యాచ్ జరిగితే అప్పుడప్పుడు కెన్యా గెలుస్తుంది. అంత మాత్రాన కెన్యా బలమైందని చెప్పలేము. గెలుపు ముఖం చూడనందునే టీడీపీ సంబరాలు చేసుకుంటోందని విమర్శించారు.

రాయలసీమ వాసులకు జగన్ సర్కార్ శుభవార్త

రాయలసీమ జిల్లాల వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ప్రభుత్వం కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

ఈ మూడు కాలేజీలను అనంతపురం జిల్లా గుంతకల్, కడప జిల్లా మైదుకూరు, నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సివిల్, కెమికల్, మెకానికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుంది అంటున్నారు.

తిరుమల భక్తులకు శుభవార్త.. ఇవాళ జూన్ నెల టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త. ఇవాళ జూన్ నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ.

ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలకమండలి. ఇక ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం.. ప్రారంభం కానుంది. ఈ తరుణంలో శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేసింది టీటీడీ. అలాగే రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. దీంతో…శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి.

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్ విద్యార్థులకు రేపట్నుంచి రాగిజావ

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. స్కూలు విద్యార్థులకు రేపటి నుంచి రాగిజావా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో ఈనెల 10న ప్రారంభించాల్సిన కార్యక్రమం వాయిదా పడగా కోడ్ ముగియడంతో రేపు ప్రారంభించనుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది విద్యార్థులకు వారానికి మూడు రోజులు రాగిజావా, మరో మూడు రోజులు చిక్కి అందిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం స్కూళ్లలోనే గ్లాసులు అందుబాటులో ఉంచనుంది.

ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 ఎన్నికలే టీడీపీకి చివరివి..! - మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్‌ వచ్చింది.. ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇక 2024 ఎన్నికల్లోనూ ఈ ఫలితాలు రిపీట్‌ అవుతాయని చెబుతున్నారు.. అయితే, ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే పార్టీ గెలిచినట్లు చంద్రబాబు ఫీలవుతున్నారన్న ఆయన.. తనకు తానే తిరుగులేదని చెప్పుకోవటం హాస్యాస్పదమని సెటైర్లు చేశారు.. ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 సాధారణ ఎన్నికలు టీడీపీకి చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు.

ఇక, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు ఉంది సభలో టీడీపీ సభ్యుల తీరు అని ఫైర్‌ అయ్యారు మంత్రి కాకాణి.. చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు.. మోసాలు చేయటంలో‌ చంద్రబాబుకు గజకర్ణ, గోకర్ణ విద్యలు తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. వర్షాలు ఆగిన వెంటనే పంట నష్టం అంచనా వేస్తామని ప్రకటించారు. దిగుబడి ఆధారిత, పంట నష్టం ఆధారంగా వేసే పంటలకు అంచనా వేస్తున్నాం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం అని ఇప్పటికే నిరూపించాం అన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన వాటిని జగన్ ప్రభుత్వమే చెల్లించిందని.. దీంతో.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఫ్రస్టేషన్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

మరోవైపు.. ప్రజల ప్రాణాలు కాపాడటానికే జీవో నంబర్‌ వన్‌ తీసుకొచ్చామని తెలిపారు కాకాణి.. చంద్రబాబు గొంతు పెద్దది చేసుకుని అరుస్తూనే ఉన్నాడుగా.. గొంతు నొక్కితే అలా మాట్లాడలేడుగా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు అంటే లెక్క ఉండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వామపక్షాలవి అస్థిత్వం కోసం ఆందోళన, చంద్రబాబుది ఓటమి ఆవేదన అని సెటైర్లు వేశారు. ఇక, అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని.. అంగన్వాడీల సమస్యల పై ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఇదేనా?

వచ్చే యేడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతుంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల నుంచి బరిలోకి దిగనున్నారు. ముఖ్యంగా, ఆయన కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇక్కడ నుంచి రెండోసారి పోటీ చేసిన ఏ ఒక్క నాయకుడు మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు. అంటే తమకు అవసరమైన నేతలను ఎన్నుకోవడంలో పిఠాపురం ఓటర్లు ఎంతో చైతన్యవంతులనే నమ్మకం ఉంది. అందుకే ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ స్థానం ఓటర్లు రాజకీయ వైవిధ్యం చూపుతారని చెబుతుంటారు. 

ఈ నియోజకవర్గంలో మొత్తం మూడు మండలాలు ఉండగా, 2.36 లక్షల వరకు ఓట్లు ఉన్నాయి. వీరిలో కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లే కీలకం. ఇవి 80 వేల వరకు ఉన్నాయి. బీసీల ఓట్లు 79 వేలు ఉండగా, మిగిలిన ఓట్లు ఇతర కులాలకు చెందినవి కావడం గమనార్హం. పైగా, ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కాపు నేతలే ఉన్నారు.

ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాపు సామాజికవర్గానికి చెందిన వైకాపాకు చెందిన పెండెం దొరబాబు ఉన్నారు. ఉప్పాడ దగ్గర 450 కోట్లతో అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్, 2 వేల ఎకరాల భూమి రైతులకు తిరిగివ్వడం, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో.. అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు ఇతర అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే ఈ స్థానం టిక్కెట్ కేటాయించవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. 

అయితే, కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత కూడా ఈ దఫా పిఠాపురం నుంచి పోటీ చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్నారు. అయితే, ఆమెకు సీఎం జగన్ టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది తర్వాత విషయం. కానీ, ఆమె మాత్రం ఈ స్థానం నుంచి పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అదేసమయంలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది.