మహిళా కమిషన్ ముందుకు బండి సంజయ్..

భారత్ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆమె వద్ద ఈడీ అధికారులు విచారణ కూడా జరిపారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

దీంతో ఆయనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అదేసమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్ బండి సంజయ్‌కు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఈ నెల 13వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని పేర్కొనగా, 18వ తేదీన హాజరువుతానని బండి సంజయ్ మహిళా కమిషన్‌కు రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేడు కమిషన్ ముందు బండి సంజయ్ హాజరుకానున్నారు. 

మరోవైపు, బండి సంజయ్‌పై మహిళా సంఘాలతో పాటు తెరాస నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే తెరాస పార్టీ శ్రేణులు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పలురకాలైన ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయంతెల్సిందే.

నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు హైకోర్టులో చుక్కెదురు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. బీజేపీ ఎంపీ అరవింద్ కు తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో చుక్కెదురైంది.

ఎస్సీ ఎస్టీ లను కించపరిచేలా వాఖ్యలు చేశారని మాదన్నపేటలో 2022లో నమోదైన ఎస్సీ ఎస్టీ కేస్ ట్రైయిల్ ఫేస్ చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తీర్పు ఇచ్చింది. 

ఈ కేసు పై విధించిన స్టే వేకెట్ చేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. FIR నమోదుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అరవింద్.. పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పేపర్ లీక్ కేసులో టీఎస్ పీఎస్సీకి సిట్ నివేదిక

టీఎస్ పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ లో కీలక సూత్రధారి రాజశేఖరేనని సిట్ తేల్చింది. టీఎస్ పీస్సీకి అందజేసిన నివేదికలో సిట్ కీలక విషయాలు వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు.  టెక్నికల్ సర్వీస్‌ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన రాజశేఖర్.. కారుణ్యానియమకంలో ఉద్యోగంలో చేరాడని గుర్తించారు. ప్రవీణ్ తో రాజశేఖర్ సంబంధాలు కొనసాగించాడని తెలిపారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసి పాస్ వర్డ్ ని దొంగిలించాడని పేర్కొన్నారు.

పాస్ వర్డ్ ని శంకర్ లక్ష్మి ఎక్కడా రాయలేదని.. ఆమె చెప్పినదాంతోనే రాజశేఖర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పెన్ డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేసిన రాజశేఖర్.. పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడని వెల్లడించారు. ఫిబ్రవరి 27నే రాజశేఖర్ ఏఈ పేపర్ ను కాపీ చేశాడని.. ఆ పేపర్ ను ప్రవీణ్ రేణుకకు అమ్మినట్లు గుర్తించారు. గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు సిట్ అధికారులు తేల్చారు. అయితే ప్రవీణ్ కు గ్రూప్ 1లో 103 మార్కులు రావడంపై విచారిస్తున్నారు. సెక్రటరీ దగ్గర పీఏగా పనిచేస్తూ గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ ను కొట్టేసినట్లు సిట్ నిర్దారించింది.

టీఎస్పీఎస్సీ పేపర్​ లీక్​ ఘటనలో మొత్తం తొమ్మిది మంది నిందితులకు మరో ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. నిందితులను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు స్పందించిన కోర్టు 6 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. నిందితులను మార్చి 18 నుంచి మార్చి 23 వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్‌తో హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ పోలీసులు ఈ దీక్షను భగ్నం చేశారు. 

టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరుతున్న సంజయ్‌ని అరెస్ట్ చేశారు. సంజయ్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంజయ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకోగా, ఉద్రిక్తత నెలకొంది.

వెల్లుల్లి - ఆరోగ్య ప్రయోజనాలు

మనలో చాలామందికి కొన్ని రకాల ఆహారపదార్ధాలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు తినడం అంతగా అలవాటు ఉండదు. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కేవలం మాంసాహారం, చేపలు వంటివి తిన్నప్పుడు మాత్రమే వాడతారు. కానీ అల్లం, వెల్లుల్లిని విడిగా రోజువాడితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలీదు. వెల్లుల్లిలో విటమిన్లు B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి వంటి పోషకాలెన్నో ఉంటాయి.

వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. వెల్లుల్లిని ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థములు తినేవారు వెల్లుల్లి తప్పని సరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం మరియు ఇతర క్రొవ్వు పదార్ధములలో ఉన్న క్రొవ్వునకు విరుగుడుగా పని చేస్తుంది. గుండె జబ్బులను రానివ్వదు. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన అస్తమా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. వెల్లుల్లిని రోజూ వాడేవారు తక్కువగా అనారోగ్యం బారిన పడతారని డాక్టర్లు చెబుతున్నారు.

ఆయుర్వేదములో వెల్లుల్లి రసాయనంగా వాడాలని చెబుతారు. పక్షవాతము మొదలుకొని కుష్ఠు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, జ్వరము, జీర్ణాశయ వ్యాధులు మొదలైన అనేక వ్యాధులలో వెల్లుల్లికి మించిన ఔషధం లేదు. వెల్లుల్లి అత్యుత్తమమైన జీర్ణకారిగా పనిచేస్తుంది. గుండె జబ్బులు కలవారు బాగా లావుగా ఉన్నవారు ప్రతిరోజూ రెండు లేక మూడు చిన్నపాయలను తీసుకుంటే లావు తగ్గుతారు. స్త్రీలలో కలిగే వ్యాధులలో వెల్లుల్లి అత్యుత్తమంగా పని చేస్తుంది. ఋతు దోషములను పోగొట్టి సంతానాన్ని కలిగిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన ఆస్త్మా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది.

చర్మానికి కాంతి కావాలంటే వెల్లుల్ని వాడాలి. వెల్లుల్లిపాయలను దంచి ఆ రసాన్ని 10 చుక్కల చొప్పున రోజుకి రెండు సార్లు త్రాగిస్తే పిల్లలకు కలిగే కోరింత దగ్గు తగ్గుతుంది. శుక్రకణాలు తక్కువగా ఉండి, సంతాన సాఫల్యత కోసం ఎదురుచూసే వారు వెల్లుల్లిని ఎక్కువగా వాడమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. చాలామంది చెవిపోటుతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు వెల్లుల్లిని వాడితే చెవిపోటు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఏ పదార్ధాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. వెల్లుల్లి అతిగా తింటే రక్తస్రావం, రక్తంతో కూడిన వాంతులు, రక్త విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగు మోతాదులో జాగ్రత్తగా సేవిస్తే అమృతంలా పనిచేస్తుంది. మన శరీరం తత్వాన్ని బట్టి వెల్లుల్లిని సేవించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ : 24వ తేదీనే పిటీషన్ విచారిస్తాం

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణ.. 20వ తేదీన హాజరుకావాలన్న నోటీసులను సవాల్ చేస్తూ అత్యవసరం పిటీషన్ దాఖలు చేశారామె. దీనిపై మార్చి 17వ తేదీ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం విచారణ చేసింది. మీ పిటీషన్ పరిశీలించాం.. ముందుగా నిర్ణయించినట్లు.. మార్చి 24వ తేదీనే విచారిస్తాం అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

20వ తేదీన ఈడీ విచారణకు హాజరవుతున్న క్రమంలో.. 24వ తేదీన చేపట్టాల్సిన విచారణను.. ముందుగానే చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు కవిత. మహిళల హక్కులకు విరుద్ధంగా.. నిబంధనలకు భిన్నంగా ఈడీ వ్యవహరిస్తుందని.. బలవంతంగా వాంగ్మూలం తీసుకుంటారని తన పిటీషన్ లో స్పష్టం చేశారు కవిత.

సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందన్న కారణంతో.. ఈడీ విచారణకు హాజరుకాలేదు కవిత. ఇప్పుడు కోర్టు అందుకు భిన్నంగా తీర్పు ఇవ్వటంతో.. 20వ తేదీన ఈడీ ఆఫీసుకు వెళ్లి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో.. మరో మార్గం లేకుండా పోయింది కవితకు.

స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఏమన్నారంటే...

సికింద్రాబాద్​ స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో గురువారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎటు చూసినా హాహాకారాలతో స్వప్నలోక్​ కాంప్లెక్స్​ పరిసరాల్లో విషాద వాతావరణం అలుముకుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాంప్లెక్స్​లోని సిబ్బంది, స్థానికులు పరుగులు తీశారు. 

సెల్లార్​లో వైర్లు కాలి 4, 5, 6 , 7 ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. సుమారు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్భంది.. ఘటనా స్థలానికి చేరుకొని 12 మందిని కాపాడారు. అందులో ఆరుగురు మరణించారు. అయితే, ఈ ఘటనపై స్పందించిన అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి.. ప్రమాదానికి గల కారణాన్ని వివరించారు. యజమానులకు ఫైర్ సేఫ్టీని పెట్టుకోమని చెప్పినా నిర్లక్ష్యం చేశారని, ఇందులో షాప్ కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.

స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ షాక్ అనే భావిస్తున్నారు. బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ పెట్టినా అవి ఏమాత్రం పని చేయలేదు. బిల్డింగ్ లో సెట్ బ్యాక్స్ అనుకూలంగా ఉన్న కారణంగా ఫైర్ ఫైటింగ్ ఈజీగా చేయగలిగారు. అయితే, ప్రస్తుతానికి బిల్డింగ్ పరిస్థితి బాగానే ఉందని నిర్థారించారు. 

ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ప్రతి కమర్షియల్ లో తప్పనిసరిగా ఉండాలని, ఫైర్ సేఫ్టీని మెయింటెనెన్స్ సరిగా ఉంచుకోవాలని నాగిరెడ్డి సూచించారు. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్స్ లు లాక్ చేయకూడదు. అయితే, చనిపోయిన వాళ్ల ప్రాంతంలో తాళాలు వేసి ఉండటంతో వాళ్లు బయటపడలేక పోయారు. వ్యాపారా లావాదేవీలు నిర్వహించే వాళ్లు మెయింటేన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, ఈ విషయంపై గతంలో స్వప్నలోక్ కాంప్లెక్ వారికీ నోటీసులు ఇచ్చినా వాటిని పాటించాలేదని నాగిరెడ్డి అన్నారు. 

కాంప్లెక్సులు ఉన్న వాళ్లు లిఫ్ట్ తోపాటు, మెట్ల దారిని కూడా తెరచి ఉంచాలని చెన్నారు. ఏ కాంప్లెక్ లో అయినా మెట్ల దారిని లాక్ చేస్తే 101 కు ఫోన్ చేయాలి, వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే నగరంలో 1150 ఎస్టాబ్లిష్ మెంట్ల అగ్నిమాపక శాఖ పరిశీలన చేశామని అన్నారు.

TS Sircilla Jilla : గిరిజన గురుకుల గర్ల్స్ స్కూల్​ హాస్టల్ లో ఫుడ్​ పాయిజన్... అస్వస్థతకు గురైన 50 మంది విద్యార్థినులు...

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన గురుకుల గర్ల్స్ స్కూల్​ హాస్టల్ లో గురువారం ఉదయం ఫుడ్​ పాయిజన్ ​అయ్యింది.

 బుధవారం సాయంత్రం స్కూల్​లో చేసిన పకోడి తినడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు గాఢనిద్రలో ఉన్న పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో 50 మంది అస్వస్థతకు గురయ్యారు.

 స్థానిక ఏఎన్ఎంను పిలిపించడంతో అందరికీ ట్యాబ్లెట్లు ఇవ్వగా 25 మందికి తగ్గలేదు. దీంతో 25 మందిని సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి మెరుగుపడని ఆరుగురిని అడ్మిట్​ చేసుకుని మిగతా వారికి ట్రీట్​మెంట్​ ఇచ్చి హాస్టల్​కు పంపించారు. ఏమైందో ఏమోగాని గంటలోనే వారిని కూడా డిశ్చార్జి చేసి పంపించారు. హాస్టల్ లోనే విద్యార్థులకు ట్రీట్​మెంట్​ ఇస్తుండగా, ఇద్దరికి సీరియస్​గా ఉండడంతో ఓ కారులో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించినట్టు తెలుస్తోంది. 

అయతే, ఈ విషయాన్ని మాత్రం ధ్రువీకరించడం లేదు. ఫుడ్​ పాయిజన్​ ఘటన నేపథ్యంలో గురువారం హాస్టల్​లో మెడికల్​క్యాంప్​ ఏర్పాటు చేశారు. ఎవరికైనా బాగా లేకపోతే దవాఖానకు తీసుకెళ్లడానికి వీలుగా ఓ అంబులెన్స్​ను సిద్ధంగా ఉంచారు. కాగా, ప్రిన్సిపాల్ శకుంతల ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెబుతుండగా, డీఎంహెచ్ఓ సుమన్​మోహన్​రావు మాత్రం వైరల్ ఫీవర్​ కారణమని చెబుతున్నారు.

TS : ఇంకా 3 దినాలు వర్షాలే వర్షాలు - వాతావరణ శాఖ

తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నటి నుంచి తెలంగాణలో వ్యర్ధాలు పడుతునాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

టోలి చౌక్ లో 9.1సెం.మీ, రాజేంద్ర నగర్ శివరాంపల్లిలో 6.3సెం.మీ, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో 6.1సెం.మీ, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల గాయిత్రినగర్‌లో 5.3సెం.మీ. కాజాగూడలో 5.3సెం.మీ, శంకర్‌పల్లి పొద్దుటూరులో 5.2సెం.మీ. జూ పార్క్ 5.1సెం.మీ పడింది.

ఇవాళ కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో వర్షం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉరుములతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. దీంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ పేర్కొంది.

TS : ఉపాధ్యాయ MLC ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపు.

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. సమీప పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు.

చెన్నకేశరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి గెలిచారు. గురువారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు లెక్కింపు పూర్తయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా.. ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ దక్కలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థుల్లో ఎవరికీ గెలుపునకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్‌ పద్దతిలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్‌ రెడ్డి విజయం ఖరారైంది.

మొత్తం 29,720 ఓట్లకు గాను 25,868 ఓట్లు పోలవగా, అందులో 452 ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన 25,416 ఓట్లలో గెలుపునకు కావాల్సిన 12,709 ఓట్లు ఏ ఒక్క అభ్యర్థికి రాకపోవడంతో ఎలిమినేషన్‌ పద్దతిలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్‌రెడ్డి, పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి, యూటీఎప్‌టీఎస్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డికి, కాంగ్రెస్‌ బలపరచిన గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి పోటీ చేశారు.