AP : దేవాలయాలలో తలనీలాల టికెట్ రేట్లు పెంచిన ఏపీ దేవాదాయ శాఖ

హిందూ సనాతన సంప్రదాయంలో పుణ్యక్షేత్రాల్లో, పవిత్ర ఆలయాల్లో భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గత కొంతకాలంగా ఏపీలోని ఆలయాల్లోని క్షురకులు తమకు కూడా మిగతా ఉద్యోగుల మాదిరిగానే జీతం ఇవ్వమంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

తన పరిధిలోకి వచ్చే హిందూ ఆలయాల్లోని తలనీలాల టికెట్ ధరను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాల్లోని తలనీలాల సమర్పణకు ఇప్పటి వరకూ టికెట్ ధర రూ.25లు ఉండగా ఆ టికెట్ ధర రూ. 40కి పెంచింది. ఇక నుంచి ఆలయాల్లో తలనీలాలను తీసే విధులను నిర్వహించే క్షురకులు కమిషన్ గా రూ. 20 లు ఇవ్వాలని దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌ ముఖ్య కార్యదర్శి ఎం.హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు.

అంకెల గారడీతో మాయ చేశారు.. అప్పులను ఆదాయంగా చూపారు..!

అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ 2023-24పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.. అప్పులను ఆదాయంగా చూపించ కూడదని ఆర్బీఐ చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా అసెంభ్లీసాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారు. ఆయన అందుకు విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తనవాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను శాసన సభలో వెల్లడించారని తప్పుపట్టారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనంగా శాసన సభలో ఎలా చెబుతారని ప్రశ్నించారు. 

ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే రుణాలు ఎంత అనేది వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం కాగ్ కు కూడా నివేదిస్తున్నారో లేదో తెలియని గందరగోళం ప్రభుత్వంలో కొట్టచ్చినట్లు కనపడుతోంది. విభజన ఆంధ్రప్రదేశ్‌కు అంటే 2014 నుండి రాష్ట్రానికి 9 లక్షల3 వేల 336 కొట్లు అప్పులు ఉన్న పరిస్ధితి.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులను ఈ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకున్న విధంగా ఇది ఒక స్టిక్కర్ బడ్జెట్ గా అభివర్ణించారు సోమువీర్రాజు.

రాష్ట్ర బడ్జెట్ 80 శాతం రెవిన్యూ వ్యయం కాగా మూలధనం వ్యయం పెరగక పోవడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు సోము వీర్రాజు.. మూలధనం వ్యయం లేక పోతే ఆర్ధిక కార్యకలాపాలు జరగక దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు కుంటుపడతాయి. ద్రవ్యలోటు పెరిగిపోవడంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. 

ప్రతినెల సుమారుగా 21 వేల కోట్లు రాష్ట్రానికి అవసరం ఉండగా సుమారు 10 వేల కోట్లు ఆదాయంగా వస్తున్నా ప్రతి నెల నాలుగువేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు.. మిగిలిన ఏడు వేల కోట్లు ఏవిధంగా సమకూరుతున్నాయన్న విషయం ప్రభుత్వం వెల్లడించడం లేదు. కాబట్టి ప్రభుత్వ ఆర్ధిక తీరుతెన్నుల పై మిలియన్ డాలర్ల అనుమానం కలుగుతోంది. కార్పోరేషన్ల పై తీసుకున్నరుణాలకు సంబంధించిన విషయాలను ఆర్ధిక మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లు రిజిస్ట్రేషన్ కంపెనీ రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి కార్పోరేషన్ లావాదేవీలు కంపెనీ రిజిస్ట్రార్ కు నివేదిస్తున్నారా? లేదా? అని ఘాటుగా ప్రశ్నించారు సోము వీర్రాజు.

మూలధన వ్యయం విషయం బుగ్గన క్లారిటీ ఇవ్వక పోగా.. ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో కూడా వెల్లడించక పోతే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టి ప్రజలకు ఏం చెప్పదల్చారని ప్రశ్నించారు సోమువీర్రాజు.. వ్యవసాయానికి కేంద్రం ఇస్తున్న సహకారంతో పోలిస్తే రాష్ట్రం ఇస్తున్నది లేశ మాత్రమే. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేధ్యం, భూసార పరీక్షలు బడ్జె కేటాయింపులు అంకెల్లో ఘనంగా ఉన్నా క్షేత్రస్ధాయిలో రైతులకు నిరాశ ఎదురు అవుతోంది. మద్య, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఒక అంకెలగారడీగానే కనపడుతోంది.

ఉత్తరాంద్ర, రాయలసీమల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నేటికీ సమస్యల సుడిగుండంలోనే ఉండడమే ఇందుతార్కాణం. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించిన విషయంలో కేంద్రం ఇస్తున్న సహకారం మాత్రమే కనపడుతోంది.. అయితే, బడ్జెట్ లో రాష్ట్రం చేస్తున్నట్లుగా ఎలా చూపించుకుంటారని ప్రశ్నించారు. ఇళ్లు నిర్మాణానికి సంబంధించి ఆర్ధిక మంత్రి అంతా రాష్ట్రం చేస్తున్నట్లు చెప్పుకోవడం చూస్తే జాలి వేస్తోంది. కేంద్రం ఇచ్చిన ఇళ్లు సకాలంలో నిర్మాణం చేయకుండా అబద్దాలతో ఇళ్లు కడుతోందని రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి.. బడ్జెట్ ముఖ్యాంశాలు

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది.

 మొత్తం రూ.2,79,279 కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి..

 అందులో రెవున్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు కాగా మూలధన వ్యయం రూ. 31,061 కోట్లుగా ఉన్నాయి.

సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ కేటాయింపుల ముఖ్యాంశాలు

రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్

ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపు

వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు

వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు

పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు

బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు

పర్యావరణానికి రూ.685 కోట్లు

జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు

హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు

గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు

గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు

నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు

మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు

కార్మిక శాఖకు రూ.796 కోట్లు,

ఐటీ శాఖకు రూ.215 కోట్లు

న్యాయశాఖకు రూ.1058 కోట్లు కేటాయింపు

స్త్రీ, శిశు సంక్షేమం రూ.3951 కోట్లు

బీసీ కార్పొరేషన్‌కు రూ.22,715 కోట్లు

ఎస్పీ కార్పొరేషన్‌కు రూ.8384.93 కోట్లు

ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2428 కోట్లు

ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6165 కోట్లు

కాపు కార్పొరేషన్‌కు రూ.4887 కోట్లు

క్రిస్టియన్ కార్పొరేషన్‌కు రూ.115.03 కోట్లు

బ్రాహ్మణ కార్పొరేషన్ రూ.346.78 కోట్లు

మైనారిటీ కార్పొరేషన్‌కు రూ.1868.25 కోట్లు కేటాయింపు

యూత్, టూరిజం రూ.291 కోట్లు

డీబీటీ స్కీమ్‌లకు రూ.54,228.36 కోట్లు కేటాయింపు

పెన్షన్లు రూ.21,434 కోట్లు

రైతు భరోసాకు రూ.4020 కోట్లు

జగనన్న విద్యా దీవెనకు రూ.2842 కోట్లు

వసతి దీవెనకు రూ.2200 కోట్లు

వైఎస్సార్ పీఎమ్ బీమా యోజనకు రూ. 700 కోట్లు

అసెంబ్లీ, సెక్రటేరియట్‌ రూ.111 కోట్లు

పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు కేటాయింపు

మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు కేటాయింపు

నగదు బదిలీ పథకాలకు రూ.54 వేల కోట్లు

ఇంధన శాఖకు రూ. 6546 కోట్లు కేటాయింపు

అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ. 11,085 కోట్లు

సివిల్ సప్లై – రూ. 3725 కోట్లు,

 జీఏడీకి రూ.1,148 కోట్లు

పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ రూ.1.67 కోట్లు, 

ప్రణాళిక 809 కోట్లు

రెవెన్యూ రూ.5380 కోట్లు,

 రియల్ టైం గవర్నెస్ రూ.73 కోట్లు

స్కిల్‌డెవలప్‌మెంట్‌కు రూ. 1167 కోట్లు

సాంఘిక సంక్షేమం రూ.14511 కోట్లు, 

R&Bకి రూ.9119 కోట్లు

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లు

రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.500 కోట్లు

కాపు నేస్తం రూ.550 కోట్లు

జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు

వాహనమిత్ర రూ.275 కోట్లు

నేతన్న నేస్తం రూ.200 కోట్లు

మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి రూ.50 కోట్లు

ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

వైఎస్సార్ కళ్యాణమస్తు రూ.200 కోట్లు

వైఎస్సార్ ఆసరా రూ.6700కోట్లు

వైఎస్సార్ చేయూత రూ.5000 కోట్లు

అమ్మఒడి రూ.6500 కోట్లు కేటాయించారు.

ఈ రోజే హస్తినకు పయనం... మోదీ, షాలతో భేటీ కానున్న జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి 7:30 గంటలకు ఆయన హస్తినకు పయనం కానున్నారు.

 ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఓవైపు నేడు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం జరుగుతుండగా.. సాయంత్రం ఆయన ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడం పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి ఢిల్లీ పెద్దలకు సీఎం జగన్ సమాచారం ఇవ్వనున్నారని అంటున్నారు. 

అలాగే రాష్ట్రంలోని సమస్యలు, పెండింగ్ బకాయిలు వంటి అంశాలకు సంబంధించి ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. రాజధాని అంశంపై కూడా కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

AP : విద్యార్థులకు గుడ్ న్యూస్... ఈనెల 19న రిలీజ్ చేయనున్న విద్యా దీవెన నిధులు...

ఏపీ సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.

 విద్యా దీవెన పథకం నిధులు మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం డబ్బుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు సీఎం జగన్.

 వాస్తవానికి ఈ నెల 18న జరగాల్సి ఉండగా.. అదేరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉండగా విద్యార్థులు ఇబ్బంది పడతారని, 19కి వాయిదా వేశారు.

 జగనన్న విద్యా దీవెన స్కీమ్ కింద అర్హులైన పేద విద్యార్థులందరికీ సర్కార్ పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేస్తున్న సంగతి తెలిసిందే.

జగన్ సర్కార్. జగనన్న వసతి దీవెన స్కీమ్ కింద ఏటా 2 వాయిదాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్‌, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు అందజేస్తోంది. అలాగే ఐటీఐ స్టూడెంట్స్‌కు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ స్టూడెంట్స్‌కు రూ.15 వేలు ఇస్తుంది.

అర్హులందరికీ పెన్షన్ రూ. 3వేలు చేశాకే ఎన్నికలకు సీఎం జగన్

అర్హులందరికీ పెన్షన్ రూ. 3వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

గతంలో 39 లక్షల మందికి రూ. 1000 మాత్రమే పెన్షన్ అందేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.2750 పెన్షన్ ను 64 లక్షల మందికి అందిస్తున్నామని తెలిపారు. వచ్చే జనవరి నుంచి రూ. 3 వేలకు పెంచుతామని జగన్ చెప్పారు. ఏపీ మాదిరిగా పెన్షన్ అందిస్తున్న విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.

 నాలుగేళ్ల పాలనలో కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా మంచి చేశామని సీఎం అన్నారు. ఎన్నికలైపోయాక అందరూ నావాళ్లే అని నాలుగేళ్ల పాలనలో నిరూపించామని జగన్ పేర్కొన్నారు. లక్షా 90 వేల కోట్లు పిల్లలు, యువత, వృద్ధులకు నేరుగా అందించామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

బాలయ్యకు సవాల్.. మా ఊరి గొడవలతో మీకేం పని? - వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 

బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. సినీనటుడు బాలకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయ్. ఏదో ఒకటి మాట్లాడటం తప్పైపోయిందని వెనక్కి తీసుకోవడం బాలకృష్ణకు అలవాటు. కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభ ఏర్పాటు విషయంలో తలెత్తిన ఘటనపై ఆయన మాట్లాడారు.

 తిరునాళ్లలో ప్రభ ఏర్పాటు కోసం భాస్కర్ రెడ్డి చందాలు వసూలు చేశాడన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. నరసరావు పేటలో కూడా చందాలు వసూలు చేసి ప్రభ కట్టాడు. తిరునాళ్లకు కూడా తీసుకెళ్లకుండా మధ్యలోనే ప్రభ నిలిపివేశాడు.. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ప్రతీ విషయంలోనూ న్యూసెన్సు చేస్తుంటాడు. చందాలిచ్చిన వారు కూడా నాకు అతని పై ఫిర్యాదులు చేశారు.

మాకు వార్నింగ్ ఇవ్వడానికి మీరెవరు బాలకృష్ణ. మా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడటానికి మీకేం పని? ఏదైనా మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలి. నువ్వు హీరోవైతే మీ టీడీపీకి గొప్ప నాకు కాదు. 

మా నియోజకవర్గంలో జరిగిన విషయం పై స్పందించడానికి మీరెవరు ? ఏదైనా మాట్లాడే ముందు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. బాలకృష్ణకు ఇదే నా సవాల్.. జరిగిన సంఘటనపై చర్చించేందుకు నేను సిద్ధం.. ఓ పనికిమాలిని వెధవకు వత్తాసు పలికి బాలకృష్ణ దిగజారొద్దు.

 మనుషులకు మూడోకన్ను ఉండదు. బాలకృష్ణ కూడా మనిషే. సినిమాల్లో మాదిరి నటన రాజకీయాల్లో కుదరదని బాలకృష్ణ తెలుసుకోవాలని హితవు పలికారు శ్రీనివాసరెడ్డి.

AP : ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బరిలో నిలిచెదెవరు.. గెలిచెదెవరు..? ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఫలితాల వెల్లడి మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రావడానికి మూడు రోజుల సమయం పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమగోదావరి స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో దాదాపు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గెలుపు తమదంటే తమదని రాజకీయ పార్టీలన్నీ బలంగా చెప్తున్నాయి. అన్ని స్థానాలు తమవేనని అధికార YCP ప్రకటించింది. మరో వైపు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఆ అభ్యర్థులకు ఓటు వేయమని జనసేన చెప్పకపోవడం ఈ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

విశాఖ గ్రాడుయేట్‌ స్థానం నుంచి 37 మంది, కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 49 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 22 మంది పోటీలో ఉన్నారు. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది పోటీలో నిలిచారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు, కర్నూలు స్థానానికి ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు పోటీపడ్డారు.

బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన ఉంటుంది. ముందుగా చెల్లని ఓట్లను పక్కన పెట్టేస్తారు. బ్యాలెట్‌ పేపర్‌లో 1,2 3 అంకెలకు బదులు ABC లేదా ఇతర అక్షరాలు ఉన్న బ్యాలెట్‌ పేపర్లను చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. మిగిలిన ఓట్లను లెక్కలోకి తీసుకొని ఒక కోడ్‌ ప్రకారం లెక్కింపు చేపడతారు.

సాధారణంగా ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఒక ఓటర్ వేసే ఓటు విలువ ఒకటిగా ఉంటుంది. అదే ఒకే చోట రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరిగితే ఒక్కో ఓటు విలువ 100గా పరిగణిస్తారు.పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండటంతో అక్కడ ఒక్కో ఓటు విలువ 100గా లెక్కకడతారు. కౌంటింగ్ చేసేటప్పుడు ఒక స్థానమైతే మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువను సగం చేసి దానికి ఒకటి కలిపి వచ్చిన విలువను బట్టి గెలుపు నిర్ణయిస్తారు.. రెండు స్థానాలు ఉన్నచోట అంటే పశ్చిమగోదావరిలో మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువను మూడు భాగాలుగా చేసి దానికి ఒకటి కలపగా వచ్చిన విలువను ప్రాధాన్యతగా తీసుకుంటారు. ఇలా మొదటి ప్రాధాన్యత ఓటును నిర్దేశిత కోటా చేరుకోకుంటే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారు. ఒకవేళ నిర్దేశిత కోటా గనుక చేరుకుంటే ఆ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. బ్యాలెట్ ఓటింగ్ కావడంకొన్ని చోట్ల అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

ఏపీ సోషియో ఎకనామిక్‌ సర్వే విడుదల చేసిన సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. 

ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ అన్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోందన్నారు. ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ అని ఆయన చెప్పారు. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైనట్లు ప్రకటించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించామన్నారు. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి అని తెలిపారు.

 ఈ సారి రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందని విజయ్‌కుమార్‌ వెల్లడించారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని వివరించారు. ఇక, వ్యవసాయంలో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 36 శాతం కంట్రీబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోందన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ అన్నారు.

అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోందన్నారు. ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ అని ఆయన చెప్పారు. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైనట్లు ప్రకటించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించామన్నారు. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి అని తెలిపారు.

ఈ సారి రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందని విజయ్‌కుమార్‌ వెల్లడించారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని వివరించారు. ఇక, వ్యవసాయంలో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 36 శాతం కంట్రీబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోందన్నారు.

జనసేన రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ – గుడివాడ అమర్నాథ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ..

 పదేళ్లపాటు ఒక అజెండా లేకుండా నడిచిన పార్టీ జనసేన అని వ్యాఖ్యానించారు. మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం సారాంశం కాపు ఓట్లను చంద్రబాబుకు ఎలా దారదత్తం చేయాలనేదే అని చెప్పారు.

తమ పార్టీ ఏం చేస్తుందో చెప్పకుండా గంటన్నర పవన్ మాట్లాడారని అన్నారు. పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన కార్యకర్తలు చాలా అమాయకులని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

 జనసేన రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ అన్నారు. పవన్ కళ్యాణ్ కు 175 కి 175 స్థానాలలో పోటీ చేసే ధైర్యం లేదన్నారు మంత్రి అమర్నాథ్. ఆయనది కాపు సేన కాదు.. కమ్మ జనసేన అంటూ ఫైర్ అయ్యారు.