అర్హులందరికీ పెన్షన్ రూ. 3వేలు చేశాకే ఎన్నికలకు సీఎం జగన్

అర్హులందరికీ పెన్షన్ రూ. 3వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

గతంలో 39 లక్షల మందికి రూ. 1000 మాత్రమే పెన్షన్ అందేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.2750 పెన్షన్ ను 64 లక్షల మందికి అందిస్తున్నామని తెలిపారు. వచ్చే జనవరి నుంచి రూ. 3 వేలకు పెంచుతామని జగన్ చెప్పారు. ఏపీ మాదిరిగా పెన్షన్ అందిస్తున్న విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.

 నాలుగేళ్ల పాలనలో కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా మంచి చేశామని సీఎం అన్నారు. ఎన్నికలైపోయాక అందరూ నావాళ్లే అని నాలుగేళ్ల పాలనలో నిరూపించామని జగన్ పేర్కొన్నారు. లక్షా 90 వేల కోట్లు పిల్లలు, యువత, వృద్ధులకు నేరుగా అందించామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

బాలయ్యకు సవాల్.. మా ఊరి గొడవలతో మీకేం పని? - వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 

బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. సినీనటుడు బాలకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయ్. ఏదో ఒకటి మాట్లాడటం తప్పైపోయిందని వెనక్కి తీసుకోవడం బాలకృష్ణకు అలవాటు. కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభ ఏర్పాటు విషయంలో తలెత్తిన ఘటనపై ఆయన మాట్లాడారు.

 తిరునాళ్లలో ప్రభ ఏర్పాటు కోసం భాస్కర్ రెడ్డి చందాలు వసూలు చేశాడన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. నరసరావు పేటలో కూడా చందాలు వసూలు చేసి ప్రభ కట్టాడు. తిరునాళ్లకు కూడా తీసుకెళ్లకుండా మధ్యలోనే ప్రభ నిలిపివేశాడు.. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ప్రతీ విషయంలోనూ న్యూసెన్సు చేస్తుంటాడు. చందాలిచ్చిన వారు కూడా నాకు అతని పై ఫిర్యాదులు చేశారు.

మాకు వార్నింగ్ ఇవ్వడానికి మీరెవరు బాలకృష్ణ. మా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడటానికి మీకేం పని? ఏదైనా మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలి. నువ్వు హీరోవైతే మీ టీడీపీకి గొప్ప నాకు కాదు. 

మా నియోజకవర్గంలో జరిగిన విషయం పై స్పందించడానికి మీరెవరు ? ఏదైనా మాట్లాడే ముందు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. బాలకృష్ణకు ఇదే నా సవాల్.. జరిగిన సంఘటనపై చర్చించేందుకు నేను సిద్ధం.. ఓ పనికిమాలిని వెధవకు వత్తాసు పలికి బాలకృష్ణ దిగజారొద్దు.

 మనుషులకు మూడోకన్ను ఉండదు. బాలకృష్ణ కూడా మనిషే. సినిమాల్లో మాదిరి నటన రాజకీయాల్లో కుదరదని బాలకృష్ణ తెలుసుకోవాలని హితవు పలికారు శ్రీనివాసరెడ్డి.

AP : ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బరిలో నిలిచెదెవరు.. గెలిచెదెవరు..? ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఫలితాల వెల్లడి మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రావడానికి మూడు రోజుల సమయం పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమగోదావరి స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో దాదాపు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గెలుపు తమదంటే తమదని రాజకీయ పార్టీలన్నీ బలంగా చెప్తున్నాయి. అన్ని స్థానాలు తమవేనని అధికార YCP ప్రకటించింది. మరో వైపు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఆ అభ్యర్థులకు ఓటు వేయమని జనసేన చెప్పకపోవడం ఈ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

విశాఖ గ్రాడుయేట్‌ స్థానం నుంచి 37 మంది, కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 49 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 22 మంది పోటీలో ఉన్నారు. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది పోటీలో నిలిచారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు, కర్నూలు స్థానానికి ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు పోటీపడ్డారు.

బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన ఉంటుంది. ముందుగా చెల్లని ఓట్లను పక్కన పెట్టేస్తారు. బ్యాలెట్‌ పేపర్‌లో 1,2 3 అంకెలకు బదులు ABC లేదా ఇతర అక్షరాలు ఉన్న బ్యాలెట్‌ పేపర్లను చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. మిగిలిన ఓట్లను లెక్కలోకి తీసుకొని ఒక కోడ్‌ ప్రకారం లెక్కింపు చేపడతారు.

సాధారణంగా ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఒక ఓటర్ వేసే ఓటు విలువ ఒకటిగా ఉంటుంది. అదే ఒకే చోట రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరిగితే ఒక్కో ఓటు విలువ 100గా పరిగణిస్తారు.పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండటంతో అక్కడ ఒక్కో ఓటు విలువ 100గా లెక్కకడతారు. కౌంటింగ్ చేసేటప్పుడు ఒక స్థానమైతే మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువను సగం చేసి దానికి ఒకటి కలిపి వచ్చిన విలువను బట్టి గెలుపు నిర్ణయిస్తారు.. రెండు స్థానాలు ఉన్నచోట అంటే పశ్చిమగోదావరిలో మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువను మూడు భాగాలుగా చేసి దానికి ఒకటి కలపగా వచ్చిన విలువను ప్రాధాన్యతగా తీసుకుంటారు. ఇలా మొదటి ప్రాధాన్యత ఓటును నిర్దేశిత కోటా చేరుకోకుంటే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారు. ఒకవేళ నిర్దేశిత కోటా గనుక చేరుకుంటే ఆ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. బ్యాలెట్ ఓటింగ్ కావడంకొన్ని చోట్ల అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

ఏపీ సోషియో ఎకనామిక్‌ సర్వే విడుదల చేసిన సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. 

ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ అన్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోందన్నారు. ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ అని ఆయన చెప్పారు. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైనట్లు ప్రకటించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించామన్నారు. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి అని తెలిపారు.

 ఈ సారి రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందని విజయ్‌కుమార్‌ వెల్లడించారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని వివరించారు. ఇక, వ్యవసాయంలో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 36 శాతం కంట్రీబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోందన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ అన్నారు.

అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోందన్నారు. ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ అని ఆయన చెప్పారు. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైనట్లు ప్రకటించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించామన్నారు. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి అని తెలిపారు.

ఈ సారి రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందని విజయ్‌కుమార్‌ వెల్లడించారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని వివరించారు. ఇక, వ్యవసాయంలో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 36 శాతం కంట్రీబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోందన్నారు.

జనసేన రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ – గుడివాడ అమర్నాథ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ..

 పదేళ్లపాటు ఒక అజెండా లేకుండా నడిచిన పార్టీ జనసేన అని వ్యాఖ్యానించారు. మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం సారాంశం కాపు ఓట్లను చంద్రబాబుకు ఎలా దారదత్తం చేయాలనేదే అని చెప్పారు.

తమ పార్టీ ఏం చేస్తుందో చెప్పకుండా గంటన్నర పవన్ మాట్లాడారని అన్నారు. పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన కార్యకర్తలు చాలా అమాయకులని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

 జనసేన రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ అన్నారు. పవన్ కళ్యాణ్ కు 175 కి 175 స్థానాలలో పోటీ చేసే ధైర్యం లేదన్నారు మంత్రి అమర్నాథ్. ఆయనది కాపు సేన కాదు.. కమ్మ జనసేన అంటూ ఫైర్ అయ్యారు.

ఏపీ అసెంబ్లీ నుంచి 12 మంది టిడిపి సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు వాడి వేడిగా సాగుతున్నాయి. శాసనసభ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

 గవర్నర్ ను స్పీకర్ చాంబర్ లో వెయిట్ చేయించారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆహ్వానం పలకాల్సిన సీఎం జగన్ ఆలస్యంగా వచ్చిన కారణంగానే గవర్నర్ ను వెయిట్ చేయించారని ఆయన ఆరోపించారు.

దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆరోపణలు చేసిన కారణంగా 12 మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వీరి సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పీకర్ పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే స్పీకర్ తీరుకు వ్యతిరేకంగా టిడిపి సభ్యులు నినాదాలు చేశారు.

పవన్‌ ఆ విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు..? ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ జగనే సీఎం.. - మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం వేదికగా పార్టీ చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆవిర్భావసభలో కులాల ప్రస్తావన గురించే పవన్ మాట్లాడారు.. కానీ, ఆ పార్టీకి దిశ.. దశ ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు.. సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడటమే పవన్ పని.. పార్టీ పొత్తులేదంటారు..

అన్ని సీట్లకు పోటీచేయనంటారు.. పార్టీ పొత్తులు లేకుండా.. అన్ని చోట్లా పోటీచేయకుండానే.. సీఎం అయిపోతానంటారు? అంటూ సెటైర్లు వేశారు. అసలు, పవన్‌ 175 సీట్లలో పోటీచేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు..? అని ప్రశ్నించిన ఆయన.. 175 సీట్లలో పోటీచేస్తా.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇన్ని సీట్లు ఇస్తాను అని ఎందుకు చెప్పరు అని ఫైర్‌ అయ్యారు.

ఇక, చంద్రబాబు చేసిన వాగ్ధానాల గురించి పవన్‌ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు మంత్రి కారుమూరి.. ముద్రగడను చంద్రబాబు నానా ఇబ్బందులకు గురుచేసినా పల్లెత్తు మాట అనని వ్యక్తి పవన్‌ అని మండిపడ్డ ఆయన.. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు.. ఆ విషయం మీకు తెలియదా ? అని నిలదీశారు. కాపు జాతి రంగాను ఎందుకు కాపాడుకోలేకపోయారని ప్రశ్నిస్తున్నారు..? మరోవైపు రంగాను చంపిన వ్యక్తిని సమర్ధిస్తున్నారు .. పవన్ కళ్యాణ్ కు ఓ ప్లానింగ్ లేదు.. అతని మాటలకు అర్ధం లేదని ఎద్దేవా చేశారు.. మరోవైపు.. చంద్రబాబు తన హయాంలో ఒక్క ఆర్ అండ్‌ బీ రోడ్డైనా వేశారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం చంద్రబాబు 2లక్షల71422 కోట్లు అప్పుచేశాడు.. దాచుకో దోచుకో అన్న చందంగా పాలన సాగిందని ఆరోపించారు.

సీఎంగా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి లక్షా 25 వేల కోట్లను ప్రజల ఖాతాల్లో వేశారని తెలిపారు మంత్రి కారుమూరి.. పార్టీలకు అతీతంగా సంక్షేమం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అని పేర్కొన్న ఆయన.. అన్ని వర్గాల వారికి మంచి చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.. కాయలు లేని చెట్టు చంద్రబాబు అయితే.. కాయలున్న చెట్టు జగన్ మోహన్ రెడ్డి.. అందుకే జగన్ మోహన్ రెడ్డి మీద రాళ్లేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, హత్యచేసిన వ్యక్తిని కౌగలించుకోమని కార్యకర్తలకు పవన్ చెబుతున్నాడు.. జగన్ మోహన్‌రెడ్డి మీద ధ్వేషంతో పవన్‌ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్ సమ్మిట్ విజయవంతమైతే ఒక్కరైనా అభినందించారా..? అని ప్రశ్నించారు.. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగనే అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

దెబ్బపడే కొద్దీ జనసేన బలపడుతోంది.. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్

ఎవరైనా గెలిచే కొద్ది బలపడుతుంటారు.. కానీ జనసేన మాత్రం దెబ్బపడే కొద్ది మరింత బలపడుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అసమానతలు, దోపిడీ విధానాలపై ఎదురు తిరగడానికే పార్టీని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ పాల్గొన్నారు​. 2014వ సంవత్సరంలో మార్చి14న జనసేన పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు.

పార్టీ ఏర్పాటుకు స్ఫూర్తి స్వాతంత్య్ర ఉద్యమ నాయకులని పవన్‌ తెలిపారు. అణగారిన వర్గాలకు చేయూత ఇవ్వడానికి పార్టీ ఏర్పాటు స్థాపించానని అన్నారు. అగ్రకులాల్లో ఉన్న పేదలకు అండగా ఉండేందుకు పార్టీ ఏర్పాటు చేశానని వెల్లడించారు.

రెండు చోట్లా ఓడినా తనను ముందుకు నడిపింది పార్టీనేనని.. మహానుభావుల స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ నడిపిస్తున్నానని స్పష్టం చేశారు. ధైర్యమే తన కవచమని, ధైర్యం ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతానని అన్నారు. జనసేనకు పిడుగుల్లాంటి జనసైనికులు అండగా నిలబడ్డారని పవన్ కల్యాణ్ ధైర్యం వ్యక్తం చేశారు.

తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే.. పేర్ని నాని

జనసేనాని పవన్ కల్యాన్ మచిలీపట్నం సభపై మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే అంటూ వ్యాఖ్యానించారు. తొడలుకొట్టాల్సిన అవసరం తమకేం లేదన్నారు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుళ్లు పవన్ పక్కనే ఉన్నారన్నారు. ఓ నాయకుడు పార్టీ పెట్టి మూసేశాడంటూ సొంత అన్ననే పవన్ హేళన చేశాడని విమర్శించారు. రాజకీయాల్లో వచ్చి పదేళ్ళు అవుతుందని అంటున్నారు.

2009లో యువరాజ్యం అధ్యక్షుడు కాదా? అది రాజకీయం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పెట్టిన తన అన్న చిరంజీవినీ పరోక్షంగా ఎత్తిపొడుస్తున్నాడని మండిపడ్డారు. డబ్బులు లేవు అంటూనే రోజుకు రెండు కోట్లు నా సంపాదన అని తనే అన్నారని ఎద్దేవా చేశారు. జనసేన స్థాపించిన సమయంలో చిరంజీవి ఏ హోదాలో ఉన్నారని పేర్ని నాని ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జనసేన ఆవిర్భావ వేడుక జరిపారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పదవి రాజకీయం కాదా? అని నిలదీశారు.

బందర్ లో బీసీ డిక్లరేషన్ అని బీసీలకు మాటిచ్చాడు 48 గంటలు కూడా అవ్వక ముందే బీసీ డిక్లరేషన్ మాట మర్చిపోయాడని సెటైర్లు వేశారు. నోరు తెరుస్తే కులం పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు సంకల్పం, చిత్తశుద్ధి, నాయకత్వం ఉంటే తన లాంటి వాళ్లు ఆయన వెనుకే ఉండేవారమని, జగన్ వెంట ఎందుకు వెళ్తామంటూ ప్రశ్నించారు.

జగన్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం ఎంత త్యాగం చేయటానికి అయినా సిద్ధం పడతారని పేర్ని నాని చెప్పారు. జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వ పడుతున్నామన్నారు. 2014 నుంచి పవన్ పచ్చిగా కాపు కులస్తులను పోగేసి కమ్మాయనికి ఊడిగం చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడని, అందుకే పవన్ తో కులాల గురించి మాట్లాడిస్తున్నారని చెప్పారు. 2019లో ఇదో దొంగ ప్రభుత్వం అని టీడీపీని విమర్శించారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ సభ అర్థరాత్రి మద్దెల దరువు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆపాలన్నారు. ముసుగులు వేసుకుని కాకుండా చెట్టాపట్టాలేసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రండి అంటూ సవాల్ చేవారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో, బంద్ లో ప్రభుత్వమే పాల్గొంటే మీకు కనిపించటం లేదా అంటూ పవన్ పై పేర్ని నాని నిప్పులు చెరిగారు.

కులరహిత రాజకీయాలంటూనే మళ్లీ కాపుల కోసం పనిచేస్తున్నానని మహానుభావుడు అంటున్నారని పేర్ని నాని విమర్శించారు. కాపులకు ఎవరేం చేశారనేది అందరికీ తెలుసని చెప్పారు. కాపులందరమూ కలిసి చంద్రబాబును ఆశ్రయిద్దామని అంటున్నారని.. కాపులు మాత్రం జగన్ వెంటే ఉన్నారని నాని అన్నారు. కాపుల్లో 60 శాతం మంది జగన్ వెంటే ఉన్నారని, ఉంటారని, ఇకపైనా ఉండబోతున్నారని స్పష్టం చేశారు.

కాగా, మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని జనసేనానికి కౌంటర్ ఇచ్చారు.

రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త

ఏపీ రేషన్ కార్డుదారులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి బల వర్ధక ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరరావు ప్రకటన చేశారు.

పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొదట శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖ జిల్లాలలోని మున్సిపాలిటీలలో రెండు కిలోల గోధుమపిండిని అందిస్తామని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. ఆ తర్వాత త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ కొనసాగుతుందని ఆయన వివరించారు. వచ్చే రెండు నెలల్లో జొన్నలు మరియు రాగులు రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి నాగేశ్వరరావు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందని ఆయన గుర్తు చేశారు.