డాక్టర్ చెరుకు సుధాకర్ హత్యకు ప్లాన్ వేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి... చెరుకు సుధాకర్ కు రక్షణ కల్పించాలి..
•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు : ఐతగోని జనార్దన్ గౌడ్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన బహుజన ఉద్యమ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ని భౌతికంగా హత్య చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐత గోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఆదివారం రోజున కోమటిరెడ్డి వెంకటరెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ గారి కుమారుడు డాక్టర్ చెరుకు సువాస్ కు ఫోన్ చేసి నిన్ను మీ నాన్నను చంపడానికి వంధలమంది 100 వెహికల్ల లో తిరుగుతున్నారని ఫోన్ చేసి బెదిరించడాన్ని నిరసిస్తూ నల్లగొండ పెద్దగడియారం చౌరస్తాలో బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అయితే కొన్ని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుల అహంకారంతో మాట్లాడుతున్నాడని ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ డిల్లీ అధిష్టానం వెంకట్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడినా, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తీసుకోవడం లేదని వారు అన్నారు.నల్లగొండ జిల్లాలో ఏ బహుజన నాయకుడు ఏదిగినా జీర్ణించుకోలేని దుర్మార్గుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
డాక్టర్ చెరుకు సుధాకర్ ని రాజకీయంగా ఎదుర్కొనలేక భౌతికంగా అంతం చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లాన్ వేశాడని ఈ కుట్రలను భగ్నం చేయాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందన్నారు. నల్లగొండ జిల్లాలో నల్లగొండ నియోజక వర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాజకీయంగా బీటలు బారి పిచ్చెక్కి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారని తక్షణమే ఎర్రగడ్డ హాస్పిటల్లో వెంకట్ రెడ్డికి వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు. ఒక ఎంపీ హోదాలో ఉండి ఇలా బూతులు మాట్లాడమని, హత్యలకు ప్లానింగ్ లు వేయమని కాంగ్రెస్ పార్టీ నేర్పిందా అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ పోటీ చేసినా చిత్తుచిత్తుగా ఓడించాల్సిన బాధ్యత బహుజనులపై ఉందన్నారు.తక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ కు వారి కుమారుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని తెలంగాణ ఉద్యమకారుడు అయిన డాక్టర్ చెరుకు సుధాకర్ కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కారింగు నరేష్ గౌడ్, కొంపెల్లి రామన్నగౌడ్ ,గోవర్థన్,నవీన్, శివ,లక్ష్మీ నారాయణ, ప్రణిత్,లక్ష్మణ్,ముఖేష్, అశోక్ ,వినోద్ తదితరులు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Mar 06 2023, 08:51