భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై క్రిమినల్ కేస్ నమోదు చేయాలి...
•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ సుహాస్‌కు ఫోన్ చేసి మీ ఇద్దరిని తన అభిమానులు చంపుతామని వంద వెహికిల్స్‌లో తిరుగుతున్నారని, వారం రోజుల్లో చంపేస్తారని తీవ్ర పదజాలంతో బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై క్రిమినల్ కేస్ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకుల అహంకారంతో బడుగు బలహీన వర్గాల ఎదుగుదలను చూసి ఓర్వలేక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గారిని చంపడానికి 100 వాహనాలు ఏర్పాటు చేసినట్లు,మరియు సుధాకర్ గారి అబ్బాయిని సుహస్ ను చంపి, హాస్పిటల్ కూలగొడుతం అని స్వయంగా ఆయన కుమారునికి ఫోన్ చేసి రాయలేని రీతిలో బెదిరించడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుoదన్నారు.
రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పోటీచేసిన బీసీలందరూ ఏకమై మీకు రాజకీయ సమాధి కడుతారని హెచ్చరించారు. తక్షణమే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mar 05 2023, 18:48