బిఆర్ఎస్ ను ఓడిస్తాం - రామరాజ్యాం స్థాపిస్తాం
తెలంగాణలో హిందువులంతా ఓటు బ్యాంకుగా మారుతున్నారు
కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతుంది
అన్ని పార్టీలు కలిసి బిజెపిని ఓడించే కుట్ర
ధరణి పేరుతో నలుగురు కలెక్టర్ల దోపిడీ
కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్న కలెక్టర్ల బండారం బయటపెడతాం
బూత్ కార్నర్ల మీటింగులతో చరిత్ర సృష్టిస్తాం
బిజెపిని సునాయాసంగా అధికారంలోకి తీసుకొస్తాం: చెవ్వ శేషగిరి యాదవ్
Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
  మొగుళ్జళపల్లి):- హిందుత్వ వాతావరణం వచ్చిందని..80 శాతం ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నారని.. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం కుట్రలు చేస్తున్నారని అయినప్పటికీ వెనుకంజ వేయకుండా బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసి గోల్కొండ కోటపై కాషాయ జెండా రెపరెపలతో రామరాజ్యాన్ని సాధించి తీరుతామని బిజెపి మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు చెవ్వ శేషగిరి యాదవ్ అన్నారు. మంగళవారం శేషగిరి యాదవ్ మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు ధరణి పేరుతో అడ్డగోలుగా సంపాదించి కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారని, అందుకు ప్రతిఫలంగా ప్రమోషన్లు పొందుతున్నారని శేషగిరి యాదవ్ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో నిర్వహిస్తున్న బూత్ కార్నర్ల మీటింగుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ బిజెపి చరిత్ర సృష్టించబోతుందని, రాష్ట్రంలో సునాయాసంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Feb 16 2023, 09:07