కనేకల్ పట్టణం లో ప్రభుత్వం డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేయండి

అనంతపురం జిల్లా

కనేకల్  

M.R.O గారికీ వినతిపత్రం.

రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

 

 కనేకల్ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విద్యార్థులు చదువుని మధ్యలో ఆపేస్తున్నారు. 

కారణం డిగ్రీ కళాశాలకు వెళ్లాలంటే అటు రాయదుర్గం ఇటు కళ్యాణదుర్గం ఇటు ఉరవకొండ కు వెళ్లాలంటే దూరం అవ్వడం వల్ల చాల ఇబ్బందులు ఎదురుకోవాలి అనీ పేద మధ్య తరగతి విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు.

 బస్సులో వెళ్లాలంటే బస్ పాస్ చార్జీలు కట్టాలంటే కట్టలేని పరిస్థితి లో విద్యార్థులు తల్లీ, తండ్రులు లు ఉన్నారు ఇక్కడే డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేయాలనీ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

ఈ కార్యక్రమం లో రాయదుర్గం డివిజన్ PDSU కార్యదర్శి మల్లెల ప్రసాద్, గంగరాజు, ఆనంద్ రాజు, కిషోర్, యోగి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

              ఇట్లు

PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

 ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

8977939733

AP : ప్రత్యేక హోదాపై మోదీని నిలదీసిన భరత్

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ భరత్ రామ్ లోక్‌సభ ప్రత్యేక హోదాపై మోదీని నిలదీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఈ బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేవని భరత్ రామ్ చెప్పారు. చంద్రబాబు యూటర్న్ తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు తీసుకురావాలని చూస్తుంటే.. కేంద్రం మూడింటికి నిధులు ఇస్తామని చెప్పిందని భరత్ రామ్ తెలిపారు.

రైల్వే పరంగా విశాఖపట్నం విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి వుందని.. విశాఖపట్నం చెన్నై, చెన్నై బెంగళూరు , హైదరాబాద్ కారిడార్లకు నిధులు ఇస్తే 80 జిల్లాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ను హైదరాబాద్ కు ఇచ్చారని రాష్ట్రానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని భరత్ రామ్ వెల్లడించారు.

AP : కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర.. 17వ రోజు తిరుపతి జిల్లాలో...

 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నేడు 17వ రోజుకి చేరుకుంది. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలం కొత్తూరు నుంచి ఉదయం 11.30 గంటలకు పాదయాత్ర ప్రారంభంకానుంది. నేడు కూడా చిత్తూరుజిలాల్లో కొనసాగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈడిగపల్లెలో గౌడ సామాజిక వర్గం తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొత్తిరివేడు వద్ద స్థానికులతో సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు లంచ్ బ్రేక్ అనంతరం తీసుని.. మధ్యాహ్నం 3.05 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.

సాయంత్రం 4.40 గంటలకు గొల్లకండ్రిక వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. అనంతరం డీఎం. పురం గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు ద్వారకా నగర్ చేరుకుని లోకేష్ అక్కడే బస చేయనున్నారు.

నేటితో నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర పూర్తి చేసి.. తిరుపతి జలాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఇప్పటి వరకూ లోకేష్ పాద యాత్ర 201.2 కిలో మీటర్ల జరిగింది.

AP : ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే రాజధాని ఏర్పాటు చేయాలన్న వెంకయ్య నాయుడు

పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలోని SRKR ఇంజినీరింగ్‌ కాలేజ్‌ 43వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో రెండున్నర కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన యాక్టివ్‌ ఐడియా ల్యాబ్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. కాలేజీలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్‌ అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్ధులు వెంకయ్య నాయుడితో కాసేపు చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానిపై వెంకయ్య నాయుడుని విద్యార్థులు ప్రశ్నించారు. ఏపీ రాజధానిగా అమరావతిని చూడాలా.. వైజాగ్ ని చూడాలా.. మీరు క్లారిటీ ఇవ్వండి సార్ అంటూ వెంకయ్య నాయుడుని విద్యార్థినిలు అడిగారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరణమ చేసిన తానూ రాజకీయాల్లోని వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకూడదని చెప్పారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తన అభిప్రాయం చెప్పానని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు.

తాను రాజకీయాల్లో లేను కాబట్టి, రాజకీయాలపై వ్యాఖ్యానిస్తే పెద్ద సమస్యగా మారుతుందన్నారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి తో కలిసి అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నానని, పట్టణాభివృద్ధి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానని వెంకయ్య తెలిపారు.

IND vs AUS: టీమిండియా టెస్టు జట్టులోకి తెలుగు తేజం.. మైదానంలో ఎమోషనలైన తల్లి.. సీఎం జగన్ స్పెషల్ విషెస్

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియా గెలిచినా, ఓడిపోయినా ఈ జెంటిల్మెన్‌ గేమ్‌కు ఉండే పాపులారిటీ ఏ మాత్రం తగ్గదు. అలాంటి గేమ్‌లో ఆడాలని, టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ అతి కొద్దిమందికే ఆ అవకాశం దక్కుతుంది. ట్యాలెంట్‌ ఉండి, పరిస్థితులు అన్ని అనుకూలించి.. టీమిండియా అవకాశం తలుపు తడితే మాత్రం అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ఆ క్రికెటర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు గాల్లో తేలిపోతారు.

తాజాగా అలాంటి అద్భుతమైన సంఘటనకు నాగ్‌పూర్‌ టెస్ట్ వేదికగా నిలిచింది. బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 09) ప్రారంభమైన తొలి టెస్టులో తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే భరత్ మ్యాచ్‌ ఆడుతున్నాడని తెలిసి అతని తల్లి ఎమోషనల్ అయింది. గ్రౌండ్ లో తన తనయుడిని ఆప్యాయతతో హత్తుకుని ముద్దు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పిక్ ఆఫ్ ది డే’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ట్యాలెంట్‌ ఉన్నా జట్టులో చోటు కోసం కొన్నేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు భరత్. టెస్టు జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. సాహా, పంత్ జట్టులో పాతుకుపోవడం వల్ల మైదానంలో దిగే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోయాడు. అయితే గత ఏడాది చివరలో పంత్ కు యాక్సిడెంట్ జరగడంతో అతని స్థానంలో కేఎస్ భరత్ టీమిండియాలోకి ఎంపికయ్యాడు.

మూడేళ్లుగా ఎదురుచూపులకు మోక్షం..

ఇక భరత్‌ విషయానికొస్తే.. అతని స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం. శ్రీనివాసరావు, దేవి దంపతులకు 1993 అక్టోబరు 3న జన్మించాడు. తండ్రి విశాఖపట్నంలో నావీలో ఉద్యోగం ఉండడంతో ఆయన విద్యాభ్యాసమంతా అక్కడే జరిగింది. ఇక భరత్ 2012లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. మొత్తం 78 మ్యాచ్‌లు ఆడి భరత్‌ 9 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు. ఆతర్వాత 2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో 308 పరుగులు చేశాడు. తద్వారా రంజీల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన తొలి వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. 

ఈ ప్రతిభతో భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారిపోయాడు భరత్‌. ఇక 2015లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే అతనికి మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌-2021 సీజన్‌ మినీ వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 లక్షలు వెచ్చించి భరత్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మొత్తం 191 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి తన జట్టును గెలిపించడం క్రికెట్‌ అభిమానులందరికీ గుర్తుండిపోతుంది. కాగా రెండేళ్ల క్రితమే న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ కోసం భరత్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. 

అయితే అప్పటికే పంత్‌ జట్టులో కుదురుకోవడంతో తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. కేఎస్‌ భరత్‌ 2021 నవంబర్ నాటికీ 78 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 4283 పరుగులు చేశాడు. అలాగే లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 51 మ్యాచ్‌లు ఆడి 1351 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో 48 మ్యాచ్‌లు ఆడి 730 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 9 సెంచరీలు 23 హాఫ్‌ సెంచరీలు, లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 3 సెంచరీలు 5 హాఫ్‌ సెంచరీలు, టీ20 క్రికెట్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు టీమిండియాలో స్థానం దక్కించుకుని తన కలను సాకారం చేసుకున్నాడు.

View this post on Instagram

A post shared by K S Bharat జగన్‌ ప్రత్యేక అభినందనలు..

కాగా టీమిండియాలో చోటు దక్కించుకున్న శ్రీకర్‌ భరత్‌కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ భరత్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మా తెలుగు తేజం భరత్‌కు అభినందనలు, శుభాకాంక్షలు. తెలుగు జాతి గర్వపడేలా భరత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు’ అని ట్వీట్‌ చేశారు సీఎం జగన్‌.

Our very own is debuting today with the Indian Cricket Team in the ongoing test against Australia. My congratulations and best wishes to him.

The Telugu flag continues to fly high!#TeluguPride pic.twitter.com/KlDACbHBhF

— YS Jagan Mohan Reddy February 9, 2023

AP : రాజధాని పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం ....

ఏపీ రాజధాని వివాదం పార్లమెంట్ లో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

బుధవారం రోజున రాజ్య సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్రం చెప్పిందా’ అని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. సెక్షన్‌ 5, 6 ప్రకారమే రాజధాని ఏర్పాటైందని తెలిపింది.ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని పేర్కొంది. దీనిపై మాట్లాడటం సబ్‌జ్యుడిస్‌ అవుతుందని లిఖిత పూర్వక జవాబు ఇచ్చింది.

2020లో ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును తెచ్చిందని, అయితే ఆ బిల్లు తెచ్చే ముందు ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని కేంద్రం తెలిపింది. రాజధానిపై హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంలో పిటిషన్‌ వేయగా, ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని కేంద్రం స్పష్టం చేసింది.

పెను విషాదం..ఏడుగురు కార్మికులు దుర్మరణం..

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రం చేస్తుండగా అందులోకి జారి పడి ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.

మొదట ఒక వ్యక్తి ట్యాంక్ లోకి దిగి శుభ్రం చేయడానికి దిగగా..కాలు జారి లోపల పడ్డాడు. దానిని గమించిన మిగతా కార్మికులు ఒక్కొక్కరు ట్యాంక్ లోకి దిగారు. దీనితో ట్యాంకర్ లో ఊపిరాడకపోవడంతో వీరంతా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక మృతి చెందిన వారిలో ఐదుగురు పాడేరు వాసులు కాగా ఇద్దరు పెద్దాపురం మండలం పులివేరు వాసులుగా తెలుస్తుంది.

ఫోన్ ట్యాపింగ్‌పై మరో అడుగు ముందుకేసిన Kotamreddy..

నెల్లూరు : ఫోన్ ట్యాపింగ్‌ (Mobile Tapping)పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) మరో అడుగు ముందుకేశారు..

తన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖ (Centra Home Ministry)కు లేఖ రాశారు. ఈ సందర్భంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవకాశం వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖకు నేరుగా ఫిర్యాదు చేస్తానన్నారు. ట్యాపింగ్‌పై ఆరోపణలు చేస్తే తన పైనే విమర్శలకు దిగుతున్నారన్నారు. తాను ఆరోపణలు చేసినప్పుడు మీరు కూడా సరైన పద్ధతిలో మాట్లాడాలన్నారు. తనపై శాపనార్దాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని కోటంరెడ్డి పేర్కొన్నారు.

నన్ను తిట్టడం కాదు..

'' కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah)కి టెలిఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయమని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాను. నన్ను తిట్లు తిట్టడం కాదు. అధికారం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ జరిపించాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కరించాను. నెల్లూరు రూరల్‌లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లని పూర్తి చేయాలి. పొదలకురు రోడ్డులో 3 కిలోమీటర్లు ఒక పక్కే వేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పొట్టేపాలెం కలుజు వద్ద ప్రమాదాలు జరిగుతున్నాయి. స్వయంగా సీఎం చూసి రూ.28 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదు. ముస్లిం, దళితులు, గిరిజనుల గురుకుల పాఠశాల పూర్తి కాలేదు. వావిలేటుపాడులో 3 వేల మందికి ఇచ్చిన ఇళ్ల సమస్య నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. దర్గామిట్టలోని బీసీ భవన్ కి నిధులు మంజూరు కాలేదు. అంబేద్కర్ భవన్, లైబ్రరీ పునాది దశలోనే నిలిచిపోయాయి. గణేష్ ఘాట్ రూ.15 కోట్ల 20 లక్షలు కేంద్రం నిధులు విడుదల చేశారు. అధికారుల సహకారం లేక పనులు జరగడం లేదు. రూ.30 లక్షల మందితో కులాలకు అతీతంగా జరిగే రొట్టెల పండుగ ప్రాంతంలో రూ.15 కోట్లు అడిగితే సీఎం స్పందించి జీవో ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీతో శంకుస్థాపన చేసినా.. ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. సీఎం (CM Jagan)ని కలిసి అడిగితే వెంటనే పూర్తి చేయమని అధికారులకి చెప్పారు. నెలలు గడుస్తున్నా పరష్కారం కావడం లేదు'' అని కోటంరెడ్డి పేర్కొన్నారు.