Andrapradesh

Feb 03 2022, 10:04

చలో విజయవాడ..ఉద్యోగుల అరెస్టుల పర్వం.. Chalo Vijayawada : ఏపీ రాష్ట్రంలో పీఆర్సీ
చలో విజయవాడ..ఉద్యోగుల అరెస్టుల పర్వం.. Chalo Vijayawada : ఏపీ రాష్ట్రంలో పీఆర్సీ వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా ఓ కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు కార్యాచరణ రూపొందించాయి. అందులో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. వీరిని అడ్డుకొనేందుకు పోలీసులు మోహరించారు. ఏపీలో ఉద్యోగుల అరెస్ట్‌ల పర్వం మొదలైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడుగు బయటకు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేస్తున్నట్లుగా సమాచారం. బయలుదేరిన ఉద్యోగులను… పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు.. ఎక్కడ చూసిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉద్యోగుల వాహనాలను వెనక్కి పంపించి వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడకు బయలుదేరిన ఉద్యోగులు, ఉద్యోగ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతేకాదు.. నరసన్నపేట హైవేపై వాహన తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులు అన్న అనుమానంతో బస్సుల నుంచి కిందకు దింపివేస్తున్నారు.

Andrapradesh

Feb 03 2022, 10:03

పట్టణ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించినసి.ఐ కనకారావు మూడో తారీఖున ఉద్యోగ సంఘాలు ఏర్పాటు
పట్టణ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించినసి.ఐ కనకారావు మూడో తారీఖున ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేసిన ఛలో విజయవాడ కార్యక్రమానికి ముందస్తుగా భారీగా వాహనాలలో అనుమతి లేకుండా సభ కి వెళ్తున్నరనే సమాచారంతో వాహనాలను తనిఖీలు నిర్వహించారు సభకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా చలో విజయవాడ కార్యక్రమానికి హాజరు అవుతాం అని అంటున్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు నందిగామ లో ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేని కారణంగా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు ఛలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరుతున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న నందిగామ పోలీసులు

Andrapradesh

Feb 03 2022, 10:03

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని చెలో
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని చెలో విజయవాడ సభకు వెళ్లనీయకుండా పోలీసులు నానా ప్రయత్నాలు చేసినా కర్నూల్ జిల్లా ఉపాధ్యాయుల సంఘం నాయకులు పెళ్లికి వెళుతున్నట్లు బస్ కు పెళ్లి బ్యానర్ కట్టి బస్ లో విజయవాడ సభకు చేరుకొని పోలీసులు అవ్వాక్ ఐయ్యేల చేశారు.

Andrapradesh

Feb 02 2022, 19:49

కేశినేని నాని క్వశ్చన్..రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆన్సర్.. న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం రెండు
కేశినేని నాని క్వశ్చన్..రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆన్సర్.. న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం రెండు జతల వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు మాత్రమే నడుస్తున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేసినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఆయన సమాధానం ఇచ్చారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను రాష్ట్రాల వారీగా నడిపే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి రైల్వే శాఖ వద్ద లేదని అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. విజయవాడ-హైదరాబాద్‌, విజయవాడ-తిరుపతి, విజయవాడ-విశాఖపట్నం సెక్టార్లలో ఇప్పటికిప్పుడు వందే భారత్‌ నడిపే నిర్ణయం ఏదీ రైల్వే శాఖ వద్ద లేదన్నారు. ఫీజిబిలిటీ, కోచ్‌ల వెసులుబాటు, లాభం... వంటి అంశాల ఆధారంగా వందే భారత్‌ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.

Andrapradesh

Feb 02 2022, 17:01

AP PRC:ఏపీ ప్రభుత్వం చేసిన గాయం కంటే కరోనా తీవ్రమైనదేదీ కాదు:బండి శ్రీనివాసరరావు విజయవాడ: పీఆర్సీ
AP PRC:ఏపీ ప్రభుత్వం చేసిన గాయం కంటే కరోనా తీవ్రమైనదేదీ కాదు:బండి శ్రీనివాసరరావు విజయవాడ: పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం చేసిన గాయం కంటే కరోనా తీవ్రమైందేమీ కాదని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రభుత్వానికి మాట, మనసు మార్చుకునే జబ్బు వచ్చిందని.. కరోనా కంటే దాని తీవ్రత ఎక్కువని ఎద్దేవా చేశారు. విజయవాడ రెవెన్యూ భవన్‌ వద్ద తాజా పీఆర్సీ ప్రకారం ఇచ్చిన పే స్లిప్‌లను ఉద్యోగ సంఘాల నేతలు తగులబెట్టారు. వేతన స్లిప్‌లతో పాటు పీఆర్సీ జీవోలను సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి తదితరులు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. రివైజ్డ్‌ పే స్కేల్‌ వేసే తొందరలో మనుషులు చేసే పనిని ప్రభుత్వం మిషన్లతో చేసి తప్పుల మీద తప్పులు చేస్తోందని బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ''మాట మీద లేని ప్రభుత్వం అంతా రివర్స్‌ చేస్తోంది. తాజాగా ఇచ్చిన వేతనాలు, పెన్షన్లను ఎవరూ హర్షించడం లేదని గుర్తించాలి. 'చలో విజయవాడ' కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. ముందు అనుమతి ఉందని చెప్పి ఇప్పుడు లేదంటున్నారు. అందర్నీ అరెస్ట్‌ చేసినా కనీసం పది మందితో అయినా ఉద్యమాన్ని నిర్వహించి తీరుతాం'' అని అన్నారు. పీఆర్సీ అశాస్త్రీయం.. చెప్పినా విపించుకోవడం లేదు: బొప్పరాజు కొత్త వేతనాలు అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పినా.. ప్రభుత్వం హడావిడిగా జీతాలను బ్యాంకు ఖాతాల్లో వేసిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ హడావిడిలో చనిపోయిన ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించేశారని చెప్పారు. పీఆర్సీ అశాస్త్రీయంగా ఉందని చెప్పినా ప్రభుత్వం వినిపించుకునే పరిస్థితిలో లేదన్నారు. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు: వెంకటేశ్వర్లు 'చలో విజయవాడ'కు వస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయులను ఎక్కడికక్కడ నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. వెంకటేశ్వర్లు అన్నారు. నిన్నటి వరకు అనుమతి ఇచ్చి ఇవాళ నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు. నిర్బంధాల పేరుతో తమ ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని వెంకటేశ్వర్లు నిలదీశారు. 'చలో విజయవాడ'కు లక్షలాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలిరావాలని కోరారు.

Andrapradesh

Feb 02 2022, 16:01

ఏపీ రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి న్యూఢిల్లీ , అభి మీడి
ఏపీ రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి న్యూఢిల్లీ , అభి మీడియా సొల్యూషన్స్ ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై నిర్ణయ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ విభజన చట్టం అమలుపై రాజ్యసభలో కీలక ప్రశ్నలను సభ్యులు లేవనెత్తారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని మరోసారి పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టం చేసింది. ►మూడో రోజు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ జీరో అవర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంశాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రస్థలమని, టీటీడీ అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యాకలాపాల నిర్వహణకు భారీస్థాయిలో నిధులు అవసరం అవుతాయని తెలిపారు. విదేశాల నుంచి ప్రవాస భారతీయులు విరాళాలుగా పంపిస్తుంటారని గుర్తుచేశారు.* కేంద్ర హోంశాఖ సాంకేతిక కారణాలతో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును తాత్కాలికంగా నిలిపివేసిందని, తగిన పత్రాలన్నీ సమర్పించినప్పటికీ లైసెన్స్ పునరుద్ధరించలేదని కేంద్రం దృష్టికి ఎంపీ విజయసాయిరెడ్డి తీసుకువెళ్లారు. డిసెంబర్ 31 నాటికి రూ.13.04 కోట్ల నిధులు ఎఫ్‌సీఆర్‌ఏ అనుసంధాన బ్యాంకు ఖాతాలో ఉన్నాయని తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ తరహాలో లుక్ సౌత్ పాలసీని అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. బీజేపీని హిందూ జాతీయవాదానికి టార్చ్ బేరర్‌గా చెప్పుకుంటారని, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

Andrapradesh

Feb 02 2022, 15:59

సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు? : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు : సమస్య
సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు? : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు : సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని, మీరు చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ‘‘సమ్మె అవసరం లేకుండా సమస్య పరిష్కారం చేద్దామని చెప్పాం. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలను జఠిలం చేసుకోవద్దని చెప్పాం. కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని’’ సజ్జల విజ్ఞప్తి చేశారు. బల ప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఎవ్వరి జీతాలు తగ్గలేదని, ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని సజ్జల కోరారు. సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?. ఉద్యోగుల కార్యాచరణను పక్కన పెట్టాలని చెప్పాం. సమ్మెకు వెళ్లకముందే రోడ్డు ఎక్కడం సరికాదని’’ సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు

Andrapradesh

Feb 02 2022, 15:58

రాష్ట్ర ప్రభుత్వం 'చింతామణి' సాంఘిక పద్య నాటకాన్ని నిషేధించడం అప్రజాస్వామికం ఊరూ వాడా తిరుగుతూ
రాష్ట్ర ప్రభుత్వం 'చింతామణి' సాంఘిక పద్య నాటకాన్ని నిషేధించడం అప్రజాస్వామికం ఊరూ వాడా తిరుగుతూ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న రంగస్థల కళాకారులు నిన్న పి నైనవరం నేడు కొత్తూరు తాడేపల్లి లో కళాకారుల నిరసన ప్రదర్శనలు నాటక అకాడమీని సంప్రదించకుండా ఏకపక్షంగా చింతామణి నాటకాన్ని నిషేధించడం దుందుడుకు చర్యే ప్రజానాట్యమండలి కృష్ణా జిల్లా (తూర్పు)కమిటీ అధ్యక్షుడు జి వి రంగారెడ్డి ఆవేదన విజయవాడ ఫిబ్రవరి 2:- రాష్ట్ర ప్రభుత్వం చింతామణి సాంఘిక పద్య నాటకాన్ని నిషేధించడం అప్రజాస్వామికమని పలువురు రంగస్థల కళాకారులు, కళారంగ ప్రముఖులు పేర్కొన్నారు. 'చింతామణి' నాటకంపై నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ కొత్తూరు తాడేపల్లి పంచాయతీ ఆఫీస్ సెంటర్ లో స్థానిక, షాబాద్ కళాకారులు బుధవారం ఉదయం ఆందోళన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రజానాట్యమండలి కృష్ణా జిల్లా (తూర్పు) కమిటీ అధ్యక్షుడు జి వి రంగారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నిషేధం వంటి ఓ అతి ముఖ్యమైన నిర్ణయంలో నాటక అకాడమీనీ సంప్రదించకపోవడం ప్రభుత్వ ఏకపక్ష దుందుడుకు ధోరణికి నిదర్శనమని గర్హించారు.అంతేగాకుండా ఎంతో సామాజిక పరమైన హితోపసందేశం ఉన్న ఇలాంటి నాటకాన్ని నిషేధం పట్ల ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కళాకారులు మాత్రమే కాకుండా ప్రజాతంత్రవాదులు కూడా ఐక్యంగా ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసించాలని సూచించారు. గుమ్మడి జైరాజ్ కళాపీఠం, విజయవాడ రంగస్థల కళాకారుల సమాఖ్య బాధ్యులు అగురు త్రినాథనాయుడు ప్రసంగిస్తూ నాటకంపై నిషేధాన్ని ఎత్తేసేవరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. 'చింతామణి' నాటకం నిషేధంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీనియర్ కళాకారులు బండి సదాశివరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఎం ఆంజనేయులు, మెండెం సుబ్బారావు, దుగ్గిరాల బాలస్వామి, కూరపాటి మన్మథరావు, కొల్లి శ్రీనివాసరావు, మార్కాపురం వెంకటేశ్వరరావు, మార్కాపురం రాము, ఉయ్యూరు గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. నాటకాన్ని నిషేధించడం సిగ్గు సిగ్గు అని ఆందోళనకారులు నినదించారు. ఐదో తేదీ ఉదయం విజయవాడ ధర్నా చౌక్ లో జరగనున్న కళాకారుల నిరసన దీక్షను విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తిచేశారు.

Andrapradesh

Feb 02 2022, 15:56

ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే నాటకాన్ని ఎలా నిషేధిస్తారు : హైకోర్టు చింతామణి నాటకం
ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే నాటకాన్ని ఎలా నిషేధిస్తారు : హైకోర్టు చింతామణి నాటకం నిషేధంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. చింతామణి నాటక నిషేధంపై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. నాటకంలో ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించనప్పుడు.. నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారని ఆక్షేపించింది. ప్రభుత్వానికి వచ్చిన వినతుల ఆధారంగా నాటకాన్ని నిషేధించామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వచ్చే మంగళవారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించిన కోర్టు విచారణను ఆ రోజుకే వాయిదా వేసింది. చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ఈనెల 17న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని ప్రతివాదులుగా చేర్చారు. దేవదాసి వ్యవస్థపై అవగాహన, వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారని పిటిషన్‌లో వివరించారు. 1920 నుంచి ఎలాంటి అవరోధం లేకుండా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనన్నారు . రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేలమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని పూర్తిగా నిషేధిస్తే వారు రోడ్డునపడతారని పేర్కొన్నారు. ఈ నాటకం ప్రదర్శించిన కళాకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గతంలో పలు అవార్డులు, బహుమానాలు ఇచ్చాయని గుర్తుచేశారు. కళాకారుడు స్థానం నరసింహారావును 1956లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయవిచారణ ముందు నిలువదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో 7ను రద్దు చేయాలని అభ్యర్థించారు.

Andrapradesh

Feb 02 2022, 15:30

ఏపీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. అమరావతి : ఏపీ ప్రభుత్వం తన పంతం నెగ్గించు
ఏపీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. అమరావతి : ఏపీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. ఒక వైపు ఉద్యోగుల డిమాండ్లు, నిరసనల వంటివేమీ పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ వేతనాలను వారి అకౌంట్‌లో జమ చేసేసింది. పదకొండవ పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల అకౌంట్లలో ఉదయం నుంచి వేతనాలు పడిపోయాయి. ప్రతి నెలా ఉద్యోగులకు ఆలస్యంగా వేతనాలు అందుతుండగా, ఈ నెలలో మాత్రం బుధవారం ఉదయంలోపు అందరికీ వేతనాలు పడ్డాయి. కాగా ట్రెజరీ ఉద్యోగులకు మాత్రం ఇంకా వేతనాలు పడలేదు. వేతన బిల్లులు ప్రాసెస్ చేయకపోవడంతో ట్రెజరీ ఉద్యోగులపై ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఐదు డీఏలను కలిపి మరీ వేతనాలను అందించింది. అయితే హెచ్ఆర్ఏలో కోత విధించింది. విజయవాడ, విశాఖపట్నంలో పని చేసే ఉద్యోగులకు ప్రభుత్వం సీసీఏను రద్దు చేసింది.