మాటలకే పరిమితమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
మాటలకే పరిమితమైన ముఖ్యమంత్రి, మంత్రులు!
వడ్లు తూకం వేసిన వారంలోపే రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామంట్టిరి ఏవి డబ్బులు?
కొన్ని గ్రామాలలో ప్రారంభలకే పరిమితమైన కొనుగోలు కేంద్రాలు నేటికి తూకలు లేవు!
రైతు భరోసా పూర్తి ఋణమాఫీ ఇవ్వకుండ ఎగనామం పెట్టాలని చూస్తుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,
కీసరి పాపయ్య మాజీ వైస్ ఎంపిపి
తేది: 18-11-2024 సోమవారం
చిన్నకోడూర్ న్యూస్
వడ్లు తూకం వేసిన వారంలోపే రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్న ప్రభుత్వం నేటి కూడా రైతు ఖాతాలో డబ్బులు జమ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య అల్లిపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కుంభాల చంద్రశేఖర్లు అన్నారు.
చిన్నకోడూరులో ప్రెస్ నోట్ విడుదల చేసి మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా పూర్తి రుణమాఫీ ఇవ్వకుండా ఎగనామం పెట్టాలని ఇవాళ రేవంత్ ప్రభుత్వం చూస్తుందని రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ సీజన్లో కొన్ని గ్రామాలలో కేవలం ముహూర్తాలు మాత్రమే చేసి వడ్లు తూకం వేయకుండా కాలయాపన చేయడం వల్ల రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తుందని మండిపడ్డారు రేవంత్ ప్రభుత్వం ఏర్పడ్డాక బిఆర్ఎస్ నాయకులైన కెసిఆర్ హరీష్ రావు కేటీఆర్ లను విమర్శిస్తూ కాలయాపన చేయడం తప్ప ప్రజలకు మీరు ఈ పది నెలల్లో చేసింది ఏమిటంటే వారు మండిపడ్డారు.
ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచిపోయిన రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదు రైతు భరోసా ఇవ్వలేదు పెన్షన్ 4000 కాలేదు కళ్యాణ లక్ష్మి ఊసే లేదు మహాలక్ష్మి కింద 2500 ఇవ్వలేదు ఇలా చెబుతూ పోతే మీ గ్యారెంటీలు గాలికి పోయిన తప్ప చేసింది ఏమీ లేదని అధికారిని అడ్డుపెట్టుకొని బెదిరింపులకు దిగుతున్నారు తప్పితే ప్రజా శ్రేయస్సు మీకు ఏమాత్రం పట్టడం లేదని వారు అన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది బిఆర్ఎస్ అని వారు అన్నారు.
Dec 15 2024, 20:23