/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: వర్మి కంపోస్టు తయారీకి కృషి చేయాలి: కలెక్టర్ Mane Praveen
NLG: వర్మి కంపోస్టు తయారీకి కృషి చేయాలి: కలెక్టర్
నల్లగొండ: డంపింగ్ యార్డుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ  వర్మి కంపోస్టు తయారీకి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకుగాను నూటికి నూరు శాతం తడి చెత్త, పొడి చెత్తను సేకరించాలన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని చందనపల్లి లో ఉన్న డంపింగ్ యార్డ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
డంపింగ్ యార్డ్ వల్ల తాగునీరు  కలుషితం కాకుండా  చూసుకోవాలని, డంపింగ్ యార్డ్ లో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు వర్మి కంపోస్టు తయారు పై దృష్టి సారించాలని చెప్పారు. డంపింగ్ యార్డ్ ద్వారా చెత్త రీసైక్లింగ్,  డిస్పోస్ చేయడంపై సూచనలు చేశారు.

డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న స్థలంలో స్లాటర్ హౌస్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. స్లాటర్ హౌస్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని మున్సిపల్ అధికారులకు ఆమె తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ శేషమ్మగూడ లో ఉన్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను తనిఖీ చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,ఆర్డీవో అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తహసిల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ ఇంజనీర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, తదితరులు  పాల్గొన్నారు.
NLG: సయ్యద్ షావలి ఉర్సు ఉత్సవాల సందర్భంగా గంధం ఊరేగింపు
నల్లగొండ: హజ్రత్ సయ్యద్ షావలి (సయ్యద్ సాహెబ్) ఉర్సు ఉత్సవాలు సందర్భంగా, గురువారం సాయంత్రం పట్టణంలోని ఆర్పి రోడ్డు చౌరస్తా పాత కలెక్టరేట్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ మజీద్ నుండి గంధం ఊరేగింపు జరిగింది. పెద్ద ఎత్తున భక్తులందరూ కలిసి మునుగోడు రోడ్డు ఈద్గా సమీపం వరకు గంధాన్ని ఊరేగింపు గా తీసుకొని వెళ్లారు.

ఉర్సు కమిటీ అధ్యక్షులు అడ్వకేట్ కట్టెల శివకుమార్ (ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. హిందూ ముస్లిం అందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండాలని కోరుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మతవల్లి షేక్ హాబీ బ్రదర్స్ మరియు లీగల్ అడ్వైజర్ సీనియర్ బిఎస్పి నాయకులు అడ్వకేట్ మస్యుద్దిన్, మాజీ కౌన్సిలర్  మొయినా ఇంతియాజ్ అలీ, సలీం భాయ్, రఫీ, సిరాజ్, సలీం, కాజా ఆమీర్, ఇర్ఫాన్, సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, గంట సుమంత్, నాగరాజు, అల్లంపల్లి కొండన్న, శ్రీను తదితరులు, పాల్గొన్నారు. 

ఈరోజు సాయంత్రం దీపారాధన పాతేహా జరుగునని ఉర్సు ఉత్సవ కమిటీ వారు తెలిపారు.
సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు..
చౌటుప్పల్ పట్టణంలోని ప్రయాణికుల ప్రాంగణం వద్ద రోడ్డు పనుల రిపేర్ దృష్ట్యా.. మునుగోడు, గట్టుప్పల్, చండూరు ప్రాంతాలకు వెళ్తున్న బస్సులు బస్టాండు లోకి వెళ్లకుండా ప్రధాన రహదారిపైనే ఆపి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. కాగా ప్రధాన రహదారిపై బస్సులు ఆగటం వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలగడంతో పాటు, బస్సుల కోసం గంటల తరబడి వెయిటింగ్ చేస్తున్న ప్రయాణికులకు కూర్చోవడానికి కనీస సదుపాయాలు వసతులు లేవని, అధికారులు దృష్టిసారించి ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలికంగా బెంచీ లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుచున్నారు.
NLG: క్రీడలలో సత్తా చాటిన ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్లగొండ: ఇంటర్ యూనివర్సిటీ క్రీడలలో వివిధ విభాగంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు సత్తా చాటారు. గురువారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన కో-కో మహిళ విభాగంలో జి. మౌనిక, జీ. స్వాతి, కోకో పురుషుల విభాగంలో బి. అనిల్, బి. వినయ్, వి.ఈశ్వర్, కే.శివకుమార్ లు, హాకీ విభాగంలో కే .మహేష్, ఆర్.లింగ స్వామి.. వాలీబాల్ విభాగంలో ఎస్. రాధాకృష్ణ ఎంపిక కావడం జరిగింది.

వీరంతా త్వరలో చెన్నైలో  జరగబోయే సౌత్ జోన్ క్రీడా పోటీలలో కో-కో హాకీ మరియు వాలీబాల్ క్రీడలలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్, ఇంచార్జి పిడి మల్లేశం తెలిపారు.

ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం తో పాటు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ లభిస్తుందని తెలిపారు. ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్, అధ్యాపకులు మునిస్వామి, భట్టు కిరీటం, అంకుష్, వెల్దండి శ్రీధర్, ఈ మేరకు విద్యార్థులను అభినందించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహణకు ప్రతిపాదన
హైదరాబాద్: బంజారాహిల్స్ స్టోన్ వ్యాలీ లో రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జిపి ఫల్గుణ అధ్యక్షతన, ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం గురువారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఎఫ్ఏ చైర్మన్, శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపకులు
Dడా. కే.టి.మహి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

అనంతరం అన్ని జిల్లాల్లో ఫుట్బాల్ క్రీడా వ్యవస్థ ను బలోపేతం చేసే క్రమంలో గ్రాస్ రూట్ మరియు పాఠశాల దశ నుండే క్రీడాకారులను తయారు చేయాలని తీర్మానిస్తూ, అన్ని జిల్లాల్లో రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు, ఫుట్బాల్ లీగ్స్ ను నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ప్రతినిధిగా పాల్గొన్న  ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి బొమ్మపాల గిరిబాబు.. 2025 సంవత్సరంలో, రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలు నిర్వహణకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనుమతి ఇవ్వవలసిందిగా ప్రతిపాదనలు అందించారు.
ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల సర్వే
మహబూబ్ నగర్: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభమైంది. బుధవారం భూత్పూర్ మండలం, కొత్త మల్గర గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సర్వేను పరిశీలించారు.

ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ..ఈ నెలాఖరు లోగా సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్ప వద్దు: కోటం రాజు
నల్లగొండ: భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని,బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు కార్మికులకుఅమలు చేయాలని, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద బీమా, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం తదితర సంక్షేమ పథకాలను భీమా కంపెనీలకు టెండర్ల ద్వారా అప్పజెప్పాలని ఆలోచన చేస్తుందని, అన్ని యూనియన్లు కొద్దిగా వెనకకు తగ్గిన పూర్తిగా విరమించుకోకపోతే కార్మిక వర్గ ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

వెల్ఫేర్ బోర్డు సైట్ అందుబాటులోకి వచ్చినా, ఇంకా క్లెయిమ్స్ పరిష్కారం కాకుండా ఉండిపోయాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రెట్టింపు చేయాలని, భవన నిర్మాణ కార్మిక సంఘాలు పోరాడుతుంటే ఉన్న వెల్ఫేర్ బోర్డు నే నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వెల్ఫేర్ బోర్డులో 5500 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని, వాటిని కార్మికుల సంక్షేమాన్ని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ అనుమతి లేకుండా బోర్డు నిధులు ఖర్చు చేయరాదని నిబంధన ఉన్నా పాటించడం లేదని ఆరోపించారు. బోర్డు ద్వారా అమలవుతున్న ఈ పథకాలను బీమా కంపెనీలకు అప్పచెప్పితే బోర్డు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ,బి దయానంద్, వరికుప్పల ముత్యాలు, అవుట రవీందర్, బి సైదులు,బివెంకటయ్య  యాదయ్య, మన్నెం శంకర్, ఎం.రామకృష్ణ, శంకర్, ఎండి సర్దార్, ఎస్.కె హుస్సేన్, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
ఏకసభ్య కమిషన్ కు వినతి పత్రం అందజేసిన న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్
నల్లగొండ: సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఏకసభ్య కమిషన్ కు న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ఉప కులాల వర్గీకరణ పై ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కు వారు వినతి పత్రం అందజేశారు.

కార్యక్రమంలో న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్ ఫౌండర్ మామిడి ప్రమీల, మేడి సావిత్రి, మాజీ కౌన్సిలర్ రూప, సుధ, తదితరులు పాల్గొన్నారు.
ఏకసభ్య కమిషన్ కు వినతి పత్రం అందజేసిన న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్
నల్లగొండ: సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఏకసభ్య కమిషన్ కు న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్ సభ్యులు  వినతి పత్రం అందజేశారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉప కులాల వర్గీకరణ పై ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో  ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కు వారు వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ మామిడి ప్రమీల, మేడి సావిత్రి, మాజీ కౌన్సిలర్ రూప, తదితరులు పాల్గొన్నారు.
ఏక సభ్య కమిషన్ కు వినతి పత్రం అందజేసిన న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్
నల్లగొండ: సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని, ఏకసభ్య కమిషన్ కు 'న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్' సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉప కులాల వర్గీకరణ పై ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కు వారు వినతి పత్రం అందజేశారు.

కార్యక్రమంలో న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్ ఫౌండర్ మామిడి ప్రమీల, మేడి సావిత్రి, మాజీ కౌన్సిలర్ రూప, సుధ, తదితరులు పాల్గొన్నారు.