/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz *డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి... - DMJU, కరీంనగర్. TS breaking
*డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి... - DMJU, కరీంనగర్.

ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజంను ఫోర్త్ ఎస్టేటగా పిలుస్తారని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ధీటుగా డిజిటల్ మీడియా వచ్చేసిందని గతంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులము అయినా మేము డిజిటల్ మీడియాలోకి వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సామాజిక భద్రత కొరవడిందని, అంతే కాకుండా ప్రభుత్వం నుండి ఆదరణ కూడా కరువైందని, ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా డిజిటల్ మీడియా జర్నలిస్టులు వార్తలను సేకరించి ఎప్పటికప్పుడు క్షణాలలో డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారాన్ని చెరవేస్తున్నారని డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు చాలా మంది తెలంగాణ ఉద్యమ వార్తలను కవరేజ్ చేసిన వాళ్ళే, హక్కుల సాధనకోసం డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ (DMJU) పనిచేస్తుందని ఐక్యత, ఆచరణ నినాదంతో పనిచేస్తున్నామని, కావున డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారిని జర్నలిస్టులుగా గుర్తించాలని, డిజిటల్ మీడియా జర్నలిస్టు పిల్లలకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రైవేటు విద్యా సంస్థలలో 50% ఫీజు రాయితీ కల్పించాలని, అలాగే అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలని, సామాజిక భద్రత కోసం మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ ల సాధనకోసం DMJU కృషి చేస్తుందని, డిజిటల్ మీడియా జర్నలిస్టు ల సమస్యలని వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా (DMJU) అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్ము గణేష్ జిల్లా కలెక్టర్ కు మరియు DPRO లకు వినతి పత్రం సమర్పించారు. 

ఈ కార్యక్రమంలో కొమ్ము గణేష్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు సంతోష్, దాసరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Hyd : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం... వివరాల్లోకి వెళ్ళితే...

హైదరాబాద్ మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఓ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

కాగా ఈ దాడిలో కొరియోగ్రాఫర్‌ కన్హ మహంతి పట్టుబడ్డారు. మహంతితో పాటు ఆర్కిటెక్ట్‌ ప్రియాంకరెడ్డి కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ప్రియాంకరెడ్డి ఇచ్చిన పార్టీలో మహంతి పాల్గొన్నారని తెలుస్తోంది.

 బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4.18 లక్షల విలువైన ఎండీఎంఏ, ఎల్ఎస్, చరాస్ను సీజ్ చేశారు.

ఈ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఈ రోజు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది. మధ్యాహ్నం 1.30కు ముఖ్యమంత్రి బేగంపేట నుంచి హెలికాప్టర్​లో సిద్ధిపేటకు బయల్దేరుతారు సీఎం రేవంత్. 

సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ వద్ద HCCB – కోకా కోలా ఫ్యాక్టరీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 3 గంటలకు తిరిగి హైదరాబాద్​కు బయల్దేరుతారు. 3.30 కు ఎన్టీఆర్​ మార్గ్​లోని హెచ్​ఎండీఏ గ్రౌండ్స్​లో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహించే ఆరోగ్య ఉత్సవాలలో పాల్గొంటారు.

ఇక అటు ఇవాళ 206 అంబులెన్స్‌లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అంబేడ్కర్ విగ్రహం దగ్గర ప్రజా పాలనా సభలో సీఎం రేవంత్‌ పాల్గొంటారు. 

ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 206 అంబులెన్స్‌లు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ చేతుల మీదుగా అంబులెన్స్‌లు ప్రారంభం అవుతాయి. 442 సివిల్ అసిస్టెన్స్ సర్జెన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు పోస్టింగ్స్ ఇస్తారు. 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు మంజూరు చేయనున్నారు.

ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం మళ్ళీ పెద్దపులి దాడి

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి చోటు చేసుకుంది. సిర్పూర్ మండలం దుబ్బగూడలో పొలంలో పనిచేస్తున్న రైతుపై దాడి చేసింది పెద్దపులి. 

ఈ సంఘటనలో రైతు సురేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు. అసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పులుల దాడులు నిన్న మహిళ లక్ష్మీ పై దాడి చేసి హతమార్చింది పులి.

ఇక నేడు సిర్పూర్ టౌన్ దుబ్బగూడ గ్రామం దగర లో చేనులో పని చేస్తున్న రౌత్ సురేష్ అనే రైతు పై పులి దాడి చేసింది. ఈ సంఘటనలో సురేష్ మెడ పై తీవ్ర గా యాలు అయ్యాయి. దీంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఆసిఫాబాద్ జిల్లాకు కొత్తగా వచ్చిన పులిగా భావిస్తున్నారు అధికారులు. మహరాష్ట్ర నుంచి వచ్చిన పులే దాడి చేసి ఉంటుదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు ఉన్నతాధికారులు.

Telangana : గుడ్ న్యూస్... ఇక వేలిముద్ర పడకపోయినా పెన్షన్...

తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ దారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వేలిముద్ర పడకపోయినా పెన్షన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.

 పెన్షన్ చాలా మంది వృద్ధులకు వస్తుంది. అయితే వృద్ధుల చేతి ముద్రలు సరిగా ఉండవు. పెన్షన్‌ వేలిముద్రల మిషన్‌ లో వారి వేలి ముద్రలు సరిగా తీసుకోదు. దానివల్ల పెన్షన్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధ పింఛన్ల పంపిణీ సమయంలో వేలిముద్రలు పడకపోవడం సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు.

మిషన్లు వేలిముద్రలను గుర్తించలేక పింఛన్ ఇవ్వలేకపోతున్నట్లు తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… చాలా మంది పెన్షన్ దారులకు ఖాతాల్లోనే డబ్బులు పడుతున్నాయి. 

కొంత మంది వేలిముద్రలు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అయితే వేలిముద్రల సమయంలో.. ఇబ్బందులు వస్తున్నాయట. అయితే అందుకే వేలిముద్రపడకపోయినా పెన్షన్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు పంచాయతీలకు ఆదేశాలు వెళ్లినట్లు చెబుతున్నారు.

TG : ఈ రోజు CM పాలమూరు టూర్‌... - షెడ్యూల్ ఇదే

ఈ రోజు మహబూబ్ నగర్ కు ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా... రైతు పండగ బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రానున్నారు. 

మూడు రోజుల పాటు కొనసాగనుంది రైతుల పండగ. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

పెద్ద ఎత్తున రైతుల సమీకరణ పై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాయి. ఇక అటు సొంత స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చేయడం జరిగింది.

నేటి రాశి ఫలాలు నవంబర్ 12, 2024

ఓం గం గణపతయే నమః 

ఓం గురుభ్యోనమః 

ఓం నమో నారాయణాయ 

నేటి రాశి ఫలాలు

నవంబర్ 12, 2024

మేషం

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనఃశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్యహృదయం చదవడం మంచిది.

వృషభం

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపించాలి.

మిధునం

కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

కర్కాటకం

మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

సింహం

సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

కన్య

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

తుల

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ దర్శనం శుభప్రదం.

వృశ్చికం

చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శ్రీ రామ నామాన్ని జపించడం శుభప్రదం.

ధనుస్సు

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. చతుర్ధంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. తప్పుదారి పట్టించేవారు ఉన్నారు జాగ్రత్త. ఇష్టదైవ నామాన్ని జపించాలి.

మకరం

దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శనిధ్యానం శుభదాయకం.

కుంభం

బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాల విషయంలో అప్రస్తుతంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం శుభకరం.

మీనం

జన్మరాశిలో చంద్రసంచారం అనుకూలిస్తోంది. ఒక విషయంలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రారంభించిన పనిలో మంచి ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన శుభదాయకం.

నేటి పంచాంగం నవంబర్ 12, 2024

ఓం గం గణపతయే నమః 

ఓం గురుభ్యోనమః 

ఓం నమో నారాయణాయ 

నేటి పంచాంగం

నవంబర్ 12, 2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః 

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక 

పక్షం: శుక్ల - శుద్ధ 

తిథి: ఏకాదశి ప‌.12:46 వరకు

తదుపరి ద్వాదశి

 

వారం: మంగళవారం - భౌమవాసరే 

 

నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.03:48 వరకు

తదుపరి రేవతి 

యోగం: హర్షణ రా.06:50 వరకు

తదుపరి వజ్ర

 

కరణం: భధ్ర ప‌.12:46 వరకు

తదుపరి బవ రా.11:35 వరకు 

తదుపరి బాలవ

వర్జ్యం: ప‌.02:25 - 03:54 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.08:36 - 09:21

మరియు రా.10:41 - 11:32

రాహు కాలం: ప‌.02:50 - 04:15

గుళిక కాలం: ప‌.12:00 - 01:25

యమ గండం: ఉ‌.09:09 - 10:35

 

అభిజిత్: 11:38 - 12:22

సూర్యోదయం: 06:19

సూర్యాస్తమయం: 05:40

చంద్రోదయం: ప‌.02:55

చంద్రాస్తమయం: రా.02:25

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: మీనం

దిశ శూల: ఉత్తరం

భోధనైకాదశి 

సంత్ నామ్‌దేవ్ జయంతి 

దేవ ఉత్థాన ఏకాదశి 

జాగరణము 

కైశిక‌ - చిలుకు ఏకాదశి 

పుష్కర్‌రాజ్ స్నాన‌ పర్వారంభం 

గురువాయుర్‌ ఏకాదశి 

శ్రీ వేదనిధితీర్థ‌ పుణ్యతిథి‌ 

భీష్మపంచక వ్రతము‌ 

పంచగవ్య స్నానము - సేవన 

కుంభదానము 

తులసి పద్మ వ్రతము 

ద్విదళవ్రత‌ సమాప్తి 

పండరీపూర్‌ యాత్ర 

తులసి - ధాత్రి కాష్ఠ‌ మాలాధారణ‌ 

చాతుర్మాస్యనియమ 

సమాప్తి 

శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్య

 జయన్తీ 

గోపద్మవ్రత‌ సమాప్తి 

పంచపర్వారంభం‌ 

విష్ణు ప్రభోదనోత్సవం‌ 

మేల్కోటే‌ శ్రీ చలువనారాయణ‌

స్వామి రథోత్సవం 

ఉజ్జయిని శ్రీ కాళిదాస్ 

స్మృతి సమరోహ్‌ ఉత్సవం

వాట్సప్‌ లో మరో కొత్త ఫీచర్‌ Search on web ఆప్షన్‌... వివరాల్లోకి వెళ్ళితే...

యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్లు అందించడంలో భాగంగా ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నది. స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టడానికి కొన్ని ఫీచర్స్‌ను తీసుకొచ్చిన ఈ ప్లాట్‌ ఫామ్‌ తాజాగా ఇమేజ్‌ల మూలాలను గుర్తించే పనిలో పడింది. దీనికోసం రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.

 వాట్సప్‌లోని ఫొటోల కోసం మేసేజింగ్‌ యాప్‌ ‘‘Search on web’’ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్‌ గురించి సెర్చ్‌ చేయవచ్చు. ప్లాట్‌ఫామ్‌లో నేరుగా ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్‌ గురించి సెర్చ్‌ చేయవచ్చు. ప్లాట్‌ఫామ్‌లో నేరుగా ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది కాబట్టి.. ఇతర యాప్‌ లేదా బ్రౌజర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సప్‌ ద్వారా షేర్‌ చేసే కంటెంట్‌కు పారదర్శకతను మెరుగుపరచడమే ఈ ఫీచర్‌ లక్ష్యం.

ఎలా ఉపయోగించాలి...?

వాట్సప్‌ చాట్‌లో ఇమేజ్‌ను ఓపెన్‌ చేయగానే పైన కుడివైపున త్రీ డాట్స్‌ మెనూ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయగానే పలు ఆప్షన్లు దర్శనమిస్తాయి. అందులో ‘‘Search on web’’ అని ఆప్షన్‌ కనిపిస్తుంది. 

దాన్ని క్లిక్‌ చేయగానే ఒక పాపప్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో ‘Search’’ పై క్లిక్‌ చేసి రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ను మొదలుపెట్టవచ్చు. అయితే ఇలా వెబ్‌ సెర్చ్‌ కోసం గూగుల్‌కు పంపే ఫొటోల గోప్యంగా ఉంటాయని, మెటాతో షేర్‌ అవ్వవని వాబీటా ఇన్ఫో స్పష్టం చేసింది. ఇక ఇమేజ్‌ గురించి సెర్చ్‌ చేయగానే దానికి సంబంధించిన మూలం, ఆ ఫొటో ఎక్కడి నుంచి వచ్చింది, ఆన్‌లైన్‌లో ఈ ఫొటో వినియోగించిన ఇతర సందర్బాలు.. ఇలా అన్నీ కనిపిస్తాయి. 

అంతేకాదు ఆ ఫొటోను ఎడిట్‌ చేశారా? తప్పుదారి పట్టించేలా మార్చాలా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. కచ్చితత్వాన్ని అంచనా వేయడం ఈజీ కానున్నది. మొదటి బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నదని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పంచుకున్నది. సంబంధిత ఫొటోను పోస్ట్‌ చేసింది. రానున్న వారాల్లో ఇది అందరికీ అందుబాటులోకి రానున్నదని వెల్లడించింది.

TG : హైదరాబాద్ లో పెరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇండ్ల రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో 7 శాతం మేర రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ స్క్వేర్యార్డ్స్ వెల్లడించింది.

ఈ సంస్థ తాజా నివేదిక ప్రకారం.. నగరంలో గతేడాది ఇదే త్రైమాసికంలో 18,314 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, తాజాగా ఈ ఏడాది అవి 19,527కు చేరుకోవడం విశేషం.