/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కొరకు దరఖాస్తు చేయండి Mane Praveen
NLG: అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కొరకు దరఖాస్తు చేయండి
నల్గొండ: బీకాం, బీఎస్సీ (కంప్యూటర్స్), బీటెక్ మెకానికల్ మరియు డిప్లమా మెకానికల్ పూర్తి చేసిన పూర్తి చేసిన
ఉమ్మడి జిల్లా (నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి) అభ్యర్థులు, టీ జి ఎస్ ఆర్ టి సి, నల్గొండ రీజియన్ పరిధిలో నాన్ ఇంజనీరింగ్ మరియు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్షిప్ చేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు వెబ్ సైట్ https://nats.education.gov.in లో దరఖాస్తు చేసుకొని రీజినల్ మేనేజర్ ఆఫీస్, టీజిఎస్ఆర్టిసి, నల్లగొండ కేంద్రంలో తమ అర్హత వివరాలను ఈ నెల 20 తేదీ  లోగా పొందుపరచాలని రీజినల్ మేనేజర్ తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అర్హత ప్రాతిపదికన నల్గొండ రీజియన్ లోని 7 డిపోలలో అవసరం మేరకు 3 సంవత్సరాల అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కొరకు కొరకు ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.


'CMCUP-2024 క్రీడల్లో పాల్గొనే అభ్యర్థులు వ్యక్తిగత నమోదు చేసుకోవాలి': ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  CMCUP 2024 క్రీడల్లో పాల్గొనే జిల్లా ఫుట్బాల్ ప్లేయర్స్ వ్యక్తిగత నమోదు ను CMCUP2024 telanga అధికారిక వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాలని, ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్అథారిటీ, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో మెరుగైన ఫుట్బాల్ జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు.

గతంలో జరిగిన సీఎం కప్ ఫుట్బాల్ క్రీడల్లో నల్లగొండ జిల్లా మహిళా ఫుట్బాల్ జట్టు, రాష్ట్రస్థాయిలో 2వ స్థానం పొంది సిల్వర్ సాధించిందని గుర్తు చేశారు.
పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలలో జరిగే అవకతవకలను అరికట్టాలి: సిపిఎం
నల్గొండ జిల్లా:
మర్రిగూడ: పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలలో జరిగే అవకతవకలను అరికట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.

సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం లోని వివిధ పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలలో దళారులకు స్థానం కల్పిస్తూ, నిజమైన రైతులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.

కొనుగోలు కేంద్రాల యజమాన్యాలు, దళారులతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని, నిజమైన రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, అధికారుల పర్యవేక్షణ ఆధారంగా పత్తిని కొనుగోలు చేయాలని ఆయన అన్నారు.

పత్తి కొనుగోలు కేంద్రాలలో రైతులు తెచ్చిన పత్తిని తేమ పేరుతో కొనుగోలు చేయకపోగా, దళారులు తెచ్చిన పత్తిని నేరుగా అధికారుల అండదండలతో సీసీఐ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.  ప్రభుత్వం రైతులు పండించిన పత్తి పంటకు మద్దతు ధర క్వింటాల్ కు 12,500 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం గ్రామాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా దళారులు తమ వ్యాపారాలను అధికారులు, నాయకుల అండదండలతో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలలో జరిగే అవకతవకలను అరికట్టకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ఎం.డి ఆసిన్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య,  పుచ్చకాయల నర్సిరెడ్డి, నల్పరాజు సైదులు, నీలకంఠం రాములు మాడుగుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: జాతీయస్థాయి ఫుట్బాల్ క్రీడాకారుడిని అభినందించిన జిల్లా కలెక్టర్ త్రిపాఠి

నల్గొండ: చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి, ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 68వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, అండర్ 17 బాలుర ఫుట్బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి..తిరిగి నల్లగొండకు విచ్చేసిన సందర్భంగా, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల ఆధ్వర్యంలో, సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశాడు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రీడాకారుడిని అభినందిస్తూ.. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని, క్రమశిక్షణతో నిరంతరం సాధన చేస్తూ, మన జిల్లా నుండి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఎదగాలని వెంకటసాయి కి సూచించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్ కుమార్, జిల్లా ఉన్నతాధికారులు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు, రాచూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
NLG: ఘనంగా ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు
నల్గొండ జిల్లా:
మర్రిగూడ: మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం మర్రిగూడ మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలతో కలసి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ప్రభుత్వ దవఖాన లో రోగులను  పరిశీలించి వారి యోగక్షేమాలను తెలుసుకొని, పండ్లు మరియు బ్రెడ్డు ప్యాకెట్లు అందజేశారు. ఈ మేరకు మండల పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణ రాష్ట్రమిచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఆమె స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మర్రిగూడ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, మాజీ ఎంపీపీ లు లపంగి వజ్రమ్మ, గంటికోట హరికృష్ణ, వెంకటేష్, శివన్నగూడెం రామలింగేశ్వర స్వామి గుడి చైర్మన్ రాపోలు గిరి, మాజీ సర్పంచ్ లు మాస శేఖర్, మాడెం వెంకటయ్య, వనపర్తి యాదయ్య, బీమనపల్లి కుంభం శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,కళ్లెం జైపాల్ రెడ్డి, దండేటికార్ అంజయ్య, నున్సవత్, బిచ్య నాయక్, ఐతపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, తుమ్మల వరప్రసాద్, ఎర్పుల శ్రీశైలం, పగడాల లింగయ్య, మైనారిటీ సెల్ నాయకులు. ఇబ్రహీం, ఎస్సీ సెల్ నాయకులు సిర్పంగి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్  అధ్యక్షులు కోడల అల్వల రెడ్డి, మాధగోని మహేష్, వడ్డే వెంకటేష్, గ్యార వెంకటేష్, ఉడుతల లవకుమార్, మండల నాయకులు కుమ్మరి మల్లయ్య, రావుల రాములు, ఎలిమినేటి సత్తి రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తుంది: పిఆర్టియూటిఎస్
నల్లగొండ: సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) లో గత కొన్ని సం.లుగా పని చేస్తున్న ఎంఐఎస్, ఎండిఎం ఇతర ఉద్యోగులు, మండల కేంద్రంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షను శనివారం పిఆర్టియూటిఎస్ సందర్శించి సంఘీభావం తెలిపింది. ఈ మేరకు అర్బన్ శాఖ పక్షాన అధ్యక్షుడు తీగల శంకర్, మాజీ అద్యక్షులు గాదె వెంకటరెడ్డిలు మట్లాడుతూ.. జిల్లాశాఖ ద్వారా, రాష్ట్ర శాఖకు నివేదిక పంపించి వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు.
NLG: జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
నల్లగొండ: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంత ఖర్చయినా కానివ్వండి.. ఎన్ని కష్టాలైనా రానివ్వండి.. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల వద్ద ఏర్పాటుచేసిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని భారీ బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, మూసీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లా సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు.

మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ ప్రజలు జీవించలేని పరిస్థితులు తలెత్తబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఫ్లోరైడ్ బారిన పడి నల్గొండ ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు. మూసీలో కొట్టుకొచ్చే శవాలు, కళేబరాల నుంచి విముక్తి కలిగించి ఈ జిల్లాలో వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడే విధంగా గోదావరి నుంచి నీటిని తరలించి కృష్ణా నదిలో కలిసే వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలను ప్రవహింపజేసి దేశానికే తలమానికంలా నిలబెట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. 44 కిలోమీటర్ల ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీటిని ఇవ్వాలని ప్రణాళికలు సిద్దం చేశామని, బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించామన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా పోరాటాల గడ్డ నల్గొండ జిల్లాలో ఉత్సవాలు చేసుకోవడం సంతోషకరం.
21 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేశాం. ఒక్క నల్గొండ జిల్లాలోనే 2400 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగిందని చెప్పారు. 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పరంగా 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఏ రాష్ట్రానికి లేదని అన్నారు.

నల్గొండ రింగ్ రోడ్డు ను పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్డు తో పాటు 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, ఎంపీ లు చామాల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాకు ప్రజా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ: నాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను 65 శాతం, బ్రాహ్మణ వెల్లంల ను 75 శాతం పూర్తి చేసుకున్నాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా నల్లగొండ జిల్లాపై కక్ష్య కట్టి, ఫ్లోరైడ్ జిల్లాగా ఉన్న కూడా పట్టించుకోకుండా, కాలుష్యం కోరల్లో ఉన్న మూసి నది ప్రక్షాళన ను పట్టించుకోకుండా మన జీవితాలతో చెలగాటం ఆడారని  గత ప్రభుత్వాన్ని విమర్శించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నల్లగొండ జిల్లాలో ఉన్న  ప్రాజెక్ట్ లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నారని తెలిపారు.
NLG: వైద్య కళాశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నల్లగొండ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రమైన నల్గొండలో ప్రభుత్వ వైద్య కళాశాలను అధికారికంగా ప్రారంభించింది. సుమారు రూ. 275 కోట్లతో నిర్మించిన వైద్య కళాశాలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ లు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
NLG: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రజలకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

నల్గొండ జిల్లా, దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. 4వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో, 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్‌ కు అనుసంధానించే కార్యక్రమాన్ని శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు.

కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు,, ఎంపీలు రఘువీర్ రెడ్డి , చామల కిరణ్ కుమార్ రెడ్డి లతో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.