NLG: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రజలకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
నల్గొండ జిల్లా, దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. 4వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో, 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్ కు అనుసంధానించే కార్యక్రమాన్ని శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు.
అంతకుముందు థర్మల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పైలాన్ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు.
కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు,, ఎంపీలు రఘువీర్ రెడ్డి , చామల కిరణ్ కుమార్ రెడ్డి లతో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Dec 07 2024, 20:00