/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ముమ్మరంగా కొనసాగుతున్న RUB WORK అభినందించిన సీనియర్ డివిజనల్ ఇంజనీర్ పశ్చిమ మండలం ఉన్నత ఉన్నతాధికారి శ్రీనివాస్ Vijay.S
ముమ్మరంగా కొనసాగుతున్న RUB WORK అభినందించిన సీనియర్ డివిజనల్ ఇంజనీర్ పశ్చిమ మండలం ఉన్నత ఉన్నతాధికారి శ్రీనివాస్

RUB work నాగలపల్లి km 152 SSE/Pway లింగం పల్లి సెక్షన్ ఇంజనీర్ ఎల్లేష్ ఆధ్వర్యంలో west DEN srinivas ADEN రామాంజనేయులు Unit No-4 gang Mate సీతారాం అనిల్ కి పదివేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ ఇంజనీర్ పశ్చిమ మండలం ఉన్నత అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్యాంగ్ మెన్స్  రాత్రింబగళ్లు కష్టపడి పని చేస్తున్నందుకు, పని రాత్రింబగళ్లు కొనసాగిస్తున్నందుకు  వారిని అభినందించి పదివేల రూపాయలు అందజేశామని తెలిపారు .ఈ కార్యక్రమంలో కీ మెన్ జితేష్ ,బాబురావు ,సీనియర్ గ్యాంగ్ మెన్ గజ్జి గంగారం యాదవ్ ,తదితరులు పాల్గొన్నారు.
AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన దుబ్బ యాదగిరి చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా శనివారం వారి యొక్క కుటుంబ సభ్యులకి, AJR ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో రూ.5000 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు , ఈజీ ఆర్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గోపరాజు పల్లి లో జై భీమ్ సేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో శుక్రవారం జై భీమ్ సేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సేన అధ్యక్షులు వల్లమల్ల రత్నయ్య, ఉపాధ్యక్షులు కట్ట సురేష్ , ఆర్గనైజింగ్ సెక్రెటరీ నీలం నరేందర్, జాయింట్ సెక్రెటరీ సంగిశెట్టి రమేష్, కల్చరల్ సెక్రటరీ నీలం నరేష్, కమిటీ సభ్యులు సంగిశెట్టి ప్రభాకర్ , గౌరవ అధ్యక్షులు సంగిశెట్టి సుందర్ రావు, సంగిశెట్టి కిష్టయ్య,వల్లమాల శంకరయ్య, సంగిశెట్టి మాణిక్యరావు ,సంగిశెట్టి సుధీర్ ,రావుల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
నీర్నెములలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి .ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి నాగటి ఉపేందర్, గ్రామ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి నోముల యాదగిరి, మాజీ సర్పంచ్ బో ఆనంద్, మాజీ వార్డు సభ్యులు నోముల ప్రవీణ్, పెరుమండ్ల నవీన్, బోయిని మల్లేష్, నోముల నర్సింహ, చిప్పలపల్లి ముత్తయ్య, కోయగుర సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రపాలనగరంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి  పూలమాలవేసి క్యాండిల్ వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బందెల క్రిస్టఫర్, కోలుకులపల్లి యాదయ్య, మహేష్ రవీందర్, పోతరాజు నరసింహ కొలుకులపల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా AJR ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి జన్మదిన వేడుకలు

ఏజెఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉప్పల్ లోని వారి నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఫౌండేషన్ సభ్యులు, ఆత్మీయులు, కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్లమీద చలితో బాధపడుతున్న వృద్ధులకు ఏజేఆర్ ఫౌండేషన్ సభ్యులు వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. పైల్వాన్ పూర్ లో విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏజేఆర్ ఫౌండేషన్ టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టుటకు ప్రజలు ప్రజా ఉద్యమాలలో భాగస్వాములు కావాలి : సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ

పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించకుండా,అమర వీరుల ఆశయాలను సాధించకుండా ప్రజలకు విముక్తి లేదని సీపీఐ(ఎం.ఎల్)న్యూడెమోక్రసీ ల జిల్లా కార్యదర్శులు, భువనగిరి డివిజన్ కార్యదర్శి ఆర్.జనార్ధన్, మామిడాల బిక్ష పతి,బేజాడి కుమార్ లు స్పష్టం చేశారు రఘునాథ పురం లో డిశంబర్ 5 2024 న,రైతాంగ ప్రతిఘటన పోరాట అమర యోధుడు కామ్రేడ్ కటకం అంజన్న 44 వ వర్ధంతి సభ సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ గ్రామ కార్యదర్శులు కొంగరి సాయిరాం, యెర్ర మల్లేష్ అధ్యక్షతన జరిగింది. ముందుగా కామ్రేడ్ కటకం అంజన్న స్మారక స్థూపం వద్ద మామిడాల బిక్ష పతి జెండాను ఆవిష్కరించారు.ఈ సభకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు అంజన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అమర వీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి విప్లవ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా జనార్ధన్,భిక్షపతి లు మాట్లాడుతూ,కామ్రేడ్ కటకం అంజన్న కమ్యూనిస్టు విప్లవకారునిగా ప్రజలకు,రైతు.కూలీలకు అనేక ఆపద సమయాలలో అండగా నిలబడ్డాడని ముఖ్యంగా దున్నే వారికే భూమి నినాదాన్ని సమున్నతంగా ముందుకు నడుపుడాని,భూమి లేని పేదలకు భూములు పంచాలని,పేదలు, సామాన్యులు,మద్యతరగతి,కార్మిక వర్గం తలెత్తుకొని జీవించే సౌకర్యవంతమైన, సమానత్వంతో కూడిన నూతన ప్రజాస్వామిక విప్లవం విజయాన్ని కాంక్షిస్తూ బలమైన ప్రజా,రైతాంగ పోరాటాలను,పాలేర్లకు జీతాలు, కూలోల్లకు కూలీ రేట్లు కోసం కొట్లాడిన గొప్ప నక్సలైట్ నాయకుడని కొనియాడారు. నేడు కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీ జే పీ,కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఉద్యమాలను అణిచివేసే విధానాలను అమలు చేస్తున్నాయని,అందులో భాగంగానే కమ్యూనిస్టు విప్లవ కారులను,మావోయిస్టులను బూటకపు ఎన్ కౌంటర్ లలో నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపుతున్నాయని అన్నారు. ఛత్తీస్గడ్,ములుగు జిల్లా లో ఇందులో కొనసాగింపుగా నే జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకొని బీ ఆర్ ఎస్ పార్టీని మట్టికరిపించారని,కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలు,రైతులు మరీ ముఖ్యంగా పేదలైన గిరిజనుల పట్టా భూములను దౌర్జన్యంగా గుంజుకోని పార్మసీ కంపెనీలు నిర్మిస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను పాడు చేయడానికి,వ్యవసాయ పంటలను దెబ్బతీయడానికి పూనుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్( న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శులు ఇక్కిరి సహదేవ్,ప్రజా సంఘాల నాయకులు మామిడాల సోమయ్య,ఆర్.సీత, కల్లెపు అడవయ్య, చిర బోయిన రాజయ్య, సాదుల శ్రీకాంత్,గడ్డం నాగరాజు,వగ్గు మల్లయ్య, బర్మ బాబు,గడ్డం యాదగిరి, ఇక్కిరి శ్రీనివాస్,బరిగే రాములు, వంగాల నర్సింహారెడ్డి, మామిడాల బాల మల్లెష్, మారజోడు సిద్దేశ్వర్, యెలగందుల సిద్దులు, రాచకొండ ఉదయ్, కొమ్మిడి గోపాల్ రెడ్డి,గోవింద్ పరమేశ్, మామిడాల ప్రవీణ్, మామిడాల మహేష్, కోలా సోములు, పాకాల నరేష్,శికిలం వెంకటేష్, సుంచు రాములు, సుంచు ఆంజనేయులు, పుండరీకం, ఇక్కిరి సిద్దులు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు.
భువనగిరి : సినిమా థియేటర్స్ ఓనర్ లింగం యాదవ్ కు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సినిమా ధియేటర్స్ ఓనర్ లింగం యాదవ్ ను గురువారం  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు భువనగిరి థియేటర్స్ (రాష్ట్రంలోని పలు థియేటర్లకు) ఓనర్ లింగం యాదవ్ ను శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగుర్ల మోడీరాందేవ్, టాప్ top 9 న్యూస్ చిరంజీవి,భరత్ బాలాజీ నాయక్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
నోబెల్ ఎన్జీవో అవార్డును అందుకున్న దంతూరి నరేష్ కుమార్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన దంతూరి యాదయ్య గౌడ్, భాగ్యమ్మల మొదటి సంతానమైన దంతూరి సురేష్ కుమార్ గౌడ్ చిన్నతనంలోనే పోలియోతో అంగవైకల్యం చెందినాడు. అప్పట్లో వసతులు లేని సమయంలో హైదరాబాదులోని ప్రభుత్వ వికలాంగుల వసతి గృహంలో తన చదువును కొనసాగించి ఉన్నత చదువులు చదివి తనకున్న ఆశయంతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురి చేతుల మీదుగా అవార్డులు అందుకునేవాడు. ఎన్జీవో నోబుల్ పురస్కారాన్ని రాజ్ భవన్ లో ఈ నెల మూడో తేదీన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ చేతిలో మీదుగా ప్రపంచ అంగవైకల్ల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ సురేష్ కుమార్ కు అందజేశారు. నోబుల్ ఎన్జీవో పురస్కారం అందుకున్న సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తూ పలువురికి తన వంతు సహకారం అందిస్తూ కంప్యూటర్ శిక్షణలో వివిధ కోర్సులలో సర్టిఫికెట్లు అందజేస్తూన్నారు. గత 20 సంవత్సరాలుగా దాదాపుగా 20,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పనకు తోడుపడి నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణతో విద్యార్థులు వివిధ రకాల ఉద్యోగాలను చేస్తూ ఉన్నారు. తన వంతు బాధ్యతగా ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన అన్నారు.
ఆర్థిక సహాయం అందజేసిన AJR ఫౌండేషన్ అధినేత

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన సుక్క నర్సమ్మ తన రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని మేడిపల్లి జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఏజెఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి ఆసుపత్రికి వెళ్లి నర్సమ్మ కుటుంబాన్ని పరామర్శించి,ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.10000/- ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ప్రతి ఒక్కరికి తోడుగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏజేఆర్ టీం సభ్యులు రెడ్ల రేపాక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.