/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి : సినిమా థియేటర్స్ ఓనర్ లింగం యాదవ్ కు ఘన సన్మానం Vijay.S
భువనగిరి : సినిమా థియేటర్స్ ఓనర్ లింగం యాదవ్ కు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సినిమా ధియేటర్స్ ఓనర్ లింగం యాదవ్ ను గురువారం  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు భువనగిరి థియేటర్స్ (రాష్ట్రంలోని పలు థియేటర్లకు) ఓనర్ లింగం యాదవ్ ను శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగుర్ల మోడీరాందేవ్, టాప్ top 9 న్యూస్ చిరంజీవి,భరత్ బాలాజీ నాయక్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
నోబెల్ ఎన్జీవో అవార్డును అందుకున్న దంతూరి నరేష్ కుమార్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన దంతూరి యాదయ్య గౌడ్, భాగ్యమ్మల మొదటి సంతానమైన దంతూరి సురేష్ కుమార్ గౌడ్ చిన్నతనంలోనే పోలియోతో అంగవైకల్యం చెందినాడు. అప్పట్లో వసతులు లేని సమయంలో హైదరాబాదులోని ప్రభుత్వ వికలాంగుల వసతి గృహంలో తన చదువును కొనసాగించి ఉన్నత చదువులు చదివి తనకున్న ఆశయంతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురి చేతుల మీదుగా అవార్డులు అందుకునేవాడు. ఎన్జీవో నోబుల్ పురస్కారాన్ని రాజ్ భవన్ లో ఈ నెల మూడో తేదీన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ చేతిలో మీదుగా ప్రపంచ అంగవైకల్ల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ సురేష్ కుమార్ కు అందజేశారు. నోబుల్ ఎన్జీవో పురస్కారం అందుకున్న సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తూ పలువురికి తన వంతు సహకారం అందిస్తూ కంప్యూటర్ శిక్షణలో వివిధ కోర్సులలో సర్టిఫికెట్లు అందజేస్తూన్నారు. గత 20 సంవత్సరాలుగా దాదాపుగా 20,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పనకు తోడుపడి నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణతో విద్యార్థులు వివిధ రకాల ఉద్యోగాలను చేస్తూ ఉన్నారు. తన వంతు బాధ్యతగా ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన అన్నారు.
ఆర్థిక సహాయం అందజేసిన AJR ఫౌండేషన్ అధినేత

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన సుక్క నర్సమ్మ తన రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని మేడిపల్లి జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఏజెఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి ఆసుపత్రికి వెళ్లి నర్సమ్మ కుటుంబాన్ని పరామర్శించి,ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.10000/- ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ప్రతి ఒక్కరికి తోడుగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏజేఆర్ టీం సభ్యులు రెడ్ల రేపాక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అడ్డ గూడూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం: AISF

విద్యాశాఖ మంత్రి లేకుండా సంవత్సరం పాలనా విద్యావ్యవస్థపై సమీక్షా ఏది? గురుకుల, సంక్షేమ హాస్టల్లు, జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత లేని కారణంగా రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థులు ఫుడ్ ఫయిజాన్ తో అస్వస్థకు గురవుతున్నారు. వరుస ఘటనలపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు (ఏఐఎస్ఎఫ్) నవంబర్ 30న ప్రభుత్వ పాఠశాలల బంద్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు అడ్డగూడూరు మండలం లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో, కేజీబీవీ మోడల్ స్కూల్ లలో వరసగా ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు చనిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యాశాఖ మంత్రి లేకపోవడంపై ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆవేదన వ్యక్తం చేస్తుందని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో మధ్యాహ్నం భోజనం అందజేస్తున్న సరిగా ఉడకక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని నిన్న మోత్కూర్ మండల కేంద్రంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినలేక బయట హోటల్లో టిఫిన్ చేస్తున్న పరిస్థితిని చూసామని ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంశి, సాయి తదితరులు పాల్గొన్నారు
జర్నలిస్ట్ నరేందర్ కి ఆర్థిక సహాయం అందజేసిన TJU జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కోశాధికారి నీలం నరేందర్ తల్లి గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకొని గురువారం రోజున *తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్.షానూర్ బాబా మరియు జిల్లా కమిటీ సభ్యులు కలిసి వారి ఇంటికి వెళ్లి పరమార్శించి, మనోధైర్యాన్ని కల్పిస్తూ రూ. 5000/- ఆర్థిక సహాయం వారికి అందజేశారు* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన టి జె యు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుర్రాల నాగరాజు, జిల్లా మహిళా విభాగం కార్యదర్శి కంది చంద్ర కళ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మల్లేష్, రవ్వ శివ,జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ అజీజ్ , విజయ్ పాల్గొన్నారు.
ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో కౌన్సిలర్ గా ఎన్నికైన గోకారం కు చెందిన బైరు మణికంఠ గౌడ్,
ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన సెంట్రల్ కౌన్సిలర్ ఎన్నికల్లో దక్షిణ భారతదేశ నుండి నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందిన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన బైరు మణికంఠ గౌడ్ తండ్రి వెంకటేశం మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. వీరితోపాటు ఏపీ పీసీసీ
మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గోకారం గ్రామ ప్రజలు, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేసి, శుభాకాంక్షలు తెలిపారు.
AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని మొగిలి పాక గ్రామానికి చెందిన మచ్చ పాపయ్య  అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ దీనస్థితిని తెలుసుకొని సమాచారం తెలిసిన వెంటనే  AJR ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి రూ .5000వేలు రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మొగిలి పాక గ్రామ ప్రజలు, యువత ఏజేఆర్  టీం సభ్యులు పాల్గొన్నారు.
AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన బూడిద నరసింహ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా సోమవారం మృతుని కుటుంబ సభ్యులకు ఏజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో ఐదు వేల రూపాయలను ఏజేఆర్ ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, ఏజేఆర్ ఫౌండేషన్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కొడారి వెంకటేష్ వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు


యాదాద్రి భువనగిరి  జిల్లాలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డివిజనల్ ఇంజనీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ కార్యాలయం లో "విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (ప్రత్యేక కోర్టు)" సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ మాట్లాడుతూ భువనగిరి డీఈ కార్యాలయం లో "ఫ్యూజ్ ఆఫ్ కాల్ రిజిష్టర్" ను విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని కోరారు. వినియోగదారుల సేవా కేంద్రం(సీ ఎస్ సీ)లో సేవల వివరాలను, గృహ అవసరాలకు (డొమెస్టిక్), వ్యాపారం (కమర్షియల్), వ్యవసాయ (అగ్రికల్చర్) అవసరాలకు కావలసిన మీటర్లకు డీడీ అమౌంట్, డీడీ ఎవరి పేరుమీద తీయాలి అనే వివరాలను పొందుపరచాలని ఆయన కోరారు. రూరల్ ఏఈ, పట్టణ ఏఈ , ఈ ఆర్ ఓ కార్యాలయాల పేర్లను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొందరు విద్యుత్ అధికారులు, విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని , సమయపాలన కూడా పాటించడం లేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(ఈ సీ జి ఆర్ ఎఫ్) చైర్మన్ పి. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫ్యూజ్ ఆఫ్ కాల్ కొరకు 1912 నంబర్ ను ఉపయోగించాలని కోరారు. వేదిక ద్వారా ప్రతి నెలా సమావేశాలు నిర్వహిస్తూ, విద్యుత్ సమస్యలైన లో- ఓల్టేజ్, కొత్త కనెక్షన్స్ , మీటర్ బిల్లింగ్, పేరు మార్పు మొదలగు సమస్యలు పరిష్కారం చేస్తున్నామన్నారు. సిటిజన్ చార్టర్ లో పేర్కొన్న ప్రకారం సకాలంలో సేవలందిస్తామన్నారు. భువనగిరి వినియోగదారుల సేవా కేంద్రం లో వారం లోపు సూచికలు ఏర్పాటు చేయాలని, వివిధ కార్యాలయాల బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని డీఈ ని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక మెంబర్ ఫైనాన్స్ ఎస్. రామాంజనేయ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ ఈ సుధీర్ కుమార్, డీ ఈ ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్ ఏ ఓ లు బాలచంద్రుడు, శ్రీనివాసాచారి, ఏడీ లు ఆనంద్ రెడ్డి (భువనగిరి) మచ్చేంధర్ ( బీబీనగర్) రాజశేఖర్ ( ఆలేరు) బాలు (మోత్కూరు), ఏఈ , సాయికృష్ణ , వినియోగదారుల సంఘాల ప్రతినిధులు మాటూరి బాలేశ్వర్, పొలిశెట్టి అనిల్ కుమార్, విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

అరూరులో శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలోని శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన అధ్యక్షులుగా కసర బోయిన లింగయ్య, ఉపాధ్యక్షులు జినుకల వెంకటేశం, కార్యదర్శి తుమ్మల సంతోష్ కుమార్, డైరెక్టర్లు మర్రి ముత్యాలు, బుర్ర అనిత , మోదాల సుధాకర్, చెముడాల మంజుల ఎన్నికైనారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకార సంఘం పెద్దలు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.