/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz RR: నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ నాయకులను అభినందించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే Mane Praveen
RR: నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ నాయకులను అభినందించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం:
నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ , మండల స్థాయి యువజన కాంగ్రెస్ నాయకులు ఇవాళ, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు శాలువతో సత్కరించారు.

అనంతరం  ఎన్నికైన నాయకులకు ఎమ్మెల్యే స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికైన నాయకులు.. కార్యకర్తలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషిచేయాలని.. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలని వారికి సూచించారు.
యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో సత్తా చాటిన  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అనుచరులు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్  5857 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులలో ఇది భారీ మెజారిటీ.. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన రామకృష్ణ యాదవ్ ను, మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో అభినందించారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులుగా గెలుపొందిన  అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్ నియోజకవర్గ  కాంగ్రెస్ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజవర్గ నాయకులు అబ్బనబోయిన రామకృష్ణను అభినందించారు.
NLG: అంగన్వాడి సొంతం భవనం కోసం ఎమ్మెల్యే కు వినతి పత్రం
మునుగోడు మండల కేంద్రం కు బుధవారం వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, కొండాపురం గ్రామంలో అంగన్వాడి స్వంత భవనం కోసం సామాజిక ఉద్యమకారుడు కొమ్ము గణేష్ వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా కొమ్ము గణేష్ మాట్లాడుతూ.. 2006 నుండి ఉన్న అంగన్వాడి కి సొంత భవనం లేక 18 సంవత్సరాల నుండి  కిరాయి భవనంలో అంగన్వాడీ సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి హమీ ఇచ్చారని తెలిపారు.
డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు మండలం, కొరటికల్ గ్రామంలో రూ. 2 కోట్ల 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కె వి విద్యుత్ సబ్ స్టేషన్ కు మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు.

అదేవిధంగా పులిపల్పుల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో తన సొంత ఖర్చులతో విద్యార్థులకు డిజిటల్ క్లాస్ ల కోసం మెటీరియల్ ఇప్పించి డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించారు.

బీరెల్లిగూడెం గ్రామంలో 20 లక్షల వ్యయంతో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి.. అస్వస్థత ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్

నల్గొండ జిల్లా, పీఏ పల్లి మండలంలోని దుగ్యాల ఆదర్శ పాఠశాలను, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ కన్వీనర్ జిల్లా రాములు ఆధ్వర్యంలో బుధవారం సందర్శించారు.

ఆదర్శ పాఠశాల హాస్టల్ లో విద్యార్థులు నాసిరకం బియ్యం కారణంగా అన్నం తిన లేకపోవడంతో అనారోగ్యానికి గురైన విద్యార్థులను, తిన్న విద్యార్థులకు కొంతమంది కడుపునొప్పితో అనారోగ్యానికి గురైన కారణంగా, దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించిన నిన్నటి ఘటన సందర్భంగా, ఇవాళ మోడల్ స్కూల్ దగ్గర అక్కడ విద్యార్థులను రైస్ గురించి, యాజమాన్యం విద్యార్థులకు ఏ రకమైన పోషకాహారం పెడుతుందని విద్యార్థులను వారు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆలిండియా సమతా సైనిక రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా.బుర్రివెంకన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఆదర్శ, కస్తూర్బా పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు అవస్థ కు గురవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించి, విద్య వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. దుగ్యాల ఆదర్శ పాఠశాల వద్ద రాళ్లు, చెట్లు ఉన్నాయని విష సర్పాల భయాందోళన విద్యార్థులకు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా దుగ్యాల మోడల్ స్కూల్ లో మెరుగైన వసతులు కల్పించాలని ఆల్ ఇండియా సంస్థ సైనిక్ దళ్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ జిల్లా రాములు, తదితరులు పాల్గొన్నారు
NLG: ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సౌజన్యంతో దుప్పట్లు పంపిణీ
నాగార్జునసాగర్ నియోజకవర్గం,
తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో  ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సౌజన్యంతో బుధవారం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో  విద్యార్థిని, విద్యార్థులకు  మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జయ వీర్ సొంత ఖర్చులతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని, చలికాలంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యే మండలాల్లోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి,వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గడ్డం సాగర్ రెడ్డి,మాజీ ఎంపీపీలు భగవాన్ నాయక్, బ్రహ్మానందరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ నాయక్, ఉపాధ్యక్షులు లాలు నాయక్, బ్రహ్మానందరెడ్డి,  యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు మేరావత్ ముని నాయక్, మండల కాంగ్రెస్ నాయకులు బాలు నాయక్,ఎంకన్న, శ్రవణ్ కుమార్ రెడ్డి, బద్రి నాయక్, పాపిరెడ్డి, పాండు నాయక్, అనుముల  అంజి,నగేష్ నాయక్,  పగడాల సైదులు, హరి నాయక్, పాండురంగ, శ్రీను నాయక్,వెంకటేశ్వర్లు, బీలు నాయక్,సర్దార్ నాయక్, కృష్ణ,మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.
మహిళలను లక్షాధికారి చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
చౌటుప్పల్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ మేరకు మెప్మా ఆధ్వర్యంలో 15 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద 1 కోటి 50 లక్షల రుణాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను లక్షాధికారి చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు.


అదేవిధంగా చౌటుప్పల్ పట్టణంలో ఉన్న 50 మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున 25,00,000/- రూపాయల రుణ సదుపాయ చెక్కులను వారు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
NLG: చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు
నల్లగొండ జిల్లా:
పీఏ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థినిలు ఫుడ్ పాయిజన్ కి గురయ్యారని తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ రమేష్ నాయక్, ఇవాళ దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.

ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు తీవ్ర  అనారోగ్యానికి గురవుతూ వారి తల్లిదండ్రులు కంటిమీద కునుకు లేకుండా, భయం భయంగా జీవించే పరిస్థితులు వచ్చాయని తెలిపారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోట్ట మురళి, తరి గోవర్ధన్, జగ్రు నాయక్, అందుగుల సైదులు, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
NLG: నల్లగొండకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్
నల్లగొండ: వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ఈనెల 7 వ తేదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి  తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్ల విషయమై జిల్లా అధికారులతో కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.. తాత్కాలిక సమాచారం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి 7 వ తేదీన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, నల్గొండ మెడికల్ కళాశాల ప్రారంభం, స్కిల్ సెంటర్ తదితర వాటిని ప్రారంభించి.. అనంతరం నల్గొండ లోని నాగార్జున కళాశాల మైదానంలో నిర్వహించనున్న  బహిరంగ సభలో పాల్గొంటున్నట్లు తెలిపారు.

ఇందుకుగాను ఆయా కార్యక్రమాల వద్ద ఇన్చార్జి అధికారులు ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా బహిరంగ సభ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆమె ఆదేశించారు.

ఈ విషయమై ఆమె నీటిపారుదల శాఖ, వైటీపీఎస్, మున్సిపల్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల అధికారులతో ఏర్పాట్ల పై సమీక్షించారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తదుపరి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, ఏర్పాట్లపై సూచనలను తీసుకొని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.

అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్ఓ అమరేందర్,  దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
NLG: 2 కె రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ త్రిపాఠి
నల్లగొండ: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా, మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్‌జి కళాశాల మైదానం నుండి క్లాక్ టవర్ వరకు 2 కె రన్‌ ను, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మున్సిపల్ కమీషనర్ ముసబ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.