/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz రైతుల కళ్ల ముందే తూకంలో భారీ మోసం Raghu ram reddy
రైతుల కళ్ల ముందే తూకంలో భారీ మోసం

అన్నం పెట్టే రైతులను వ్యాపారులు, దళారులు అన్ని విధాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నో ఘటనలు బయట పడుతూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్లూ చాటుమాటుగా రైతులను దోచుకున్న వారు, ఇప్పుడు నేరుగా కళ్ల ముందే మోసానికి తెగించారు. చూస్తుండగానే అందినంత లాగేస్తున్నారు. ఓ రైతుకు అనుమానం రావడంతో హనుమకొండ జిల్లాలో ఈ వ్యవహారం బయటపడింది.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పత్తి రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి గింజలు నాటడం మొదలు, పత్తి తీత వరకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పై మందు, అడుగు మందు అంటూ ఎన్నో ఎరువులు, పురుగు మందులు పంటకు అందించాల్సి వస్తోంది. ఆ తర్వాత పంటను మార్కెట్కు తరలించడం మరో ఖర్చుగా మారింది. ఈ ఖర్చులు భరించలేక చాలా మంది పత్తిని దళారులకు గ్రామాల్లోనే విక్రయిస్తున్నారు.

క్వింటా పత్తికి మార్కెట్ ధర కంటే రూ.100 నుంచి రూ.200 ఎక్కువగానే చెల్లిస్తామని దళారులు చెబుతుండటం, చెల్లింపులు కూడా సరిగానే చేస్తుండటంతో రైతులు చాలా మంది వీరికే పంటను అమ్ముతున్నారు. అంతేకాదు పంటను తమ వద్దకు తీసుకురావాల్సిన అవసరం లేదని, తామే రైతుల పొలాలు, ఇళ్ల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో అన్నదాతలు మరింత ఉపశమనంగా భావిస్తున్నారు. కానీ ఇందులో మతలబు ఉందన్న విషయాన్ని మాత్రం చాలామంది గుర్తించలేకపోతున్నారు.

పత్తి బస్తాలను తూకం వేసేందుకు గతంలో కాటాను మాత్రమే వినియోగించే వారు. కానీ ఇప్పుడు చాలా చోట్ల డిజిటల్ యంత్రాలను వినియోగిస్తున్నారు. రైతుల పంట కొనుగోలు చేసేందుకు వస్తున్నప్పుడు దళారులు తమ వెంట ఈ యంత్రాలను తీసుకొస్తున్నారు. రైతుల కళ్ల ముందే పత్తి బస్తాలను యంత్రంపై ఉంచి, బరువు చూస్తున్నారు. బయటికి అంతా సవ్యంగానే సాగుతున్నట్టు అనిపించడంతో సహజంగానే సందేహం వచ్చే అవకాశం తక్కువ. అయితే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన రైతు కుమార స్వామికి ఎందుకో డౌట్ వచ్చింది.

చాలా కాలంగా పత్తి పండిస్తున్న రైతులకు, పత్తిని బస్తాల్లో నింపిన తర్వాత ఎంత బరువు ఉంటుందనే విషయంలో ఒక అవగాహన ఉంటుంది. వారి అంచనాకు మూడ్నాలుగు కిలోలు మాత్రమే అటూ ఇటుగా బస్తా బరువు తూగుతుంది. ఈ లెక్క ప్రకారం తన పత్తి బస్తాలు 40 నుంచి 45 కిలోల బరువు తూగుతాయని కుమార స్వామి అంచనా వేశాడు. కానీ కాంటాపై పెడితే బరువు 35 కిలోలే చూపించింది. పలు బస్తాల బరువు ఊహించిన దానికన్నా తక్కువ తూగడంతో ఆ రైతుకు అనుమానం వచ్చింది. దీంతో అదే యంత్రంపై ఒక మనిషిని నిలబెట్టాడు. ఆయన బరువు 90 కిలోలు. కానీ ఆ యంత్రం మాత్రం 68 కిలోలు మాత్రమే చూపింది. దీంతో వారి అనుమానం నిజమైంది.

మరి దీన్ని ఎలా నియంత్రిస్తున్నారని పరిశీలించగా, ఒక వ్యక్తి దూరంగా నిలబడి, తన జేబులో ఉన్న రిమోట్తో యంత్రాన్ని ఆపరేట్ చేస్తున్నాడని గుర్తించారు. బరువు తూచే యంత్రంలో ఒక చిప్ పెడుతున్నారు. ఈ చిప్ను 100 మీటర్ల దూరం నుంచి రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. ఆ రిమోట్లోని బటన్ ఒకసారి నొక్కితే 5 కేజీలు, రెండుసార్లు ప్రెస్ చేస్తే 10 కిలోలు తగ్గేలా సెట్ చేస్కున్నారట. మరికొందరు వ్యాపారులైతే ముందుగానే తమ యంత్రాల్లో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గించి రైతుల వద్దకు తీసుకొస్తున్నట్టు సమాచారం. తాము పట్టుకున్న మోసగాళ్లను పోలీసులకు అప్పగించినట్టు రైతు కుమార స్వామి తెలిపారు. కాబట్టి రైతన్నలూ అలర్ట్గా ఉండండి. మీ కష్టాన్ని తన్నుకుపోయే గద్దలను ఓ కంట కనిపెట్టండి.

మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య కారుతో ఢీకొట్టి తమ్ముడే చంపేశాడు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్‌ నాగమణి హత్యకు గురయ్యారు. రాయపోలు నుంచి ఎండ్లగూడ వెళ్లే రహదారిపై ఈ ఘటన జరిగింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నాగమణి విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం జరగ్గా 10 నెలల క్రితం భర్తతో విడాకులయ్యాయి.

అనంతరం నెల రోజుల క్రితం మరో వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని ఆమె సోదరుడు పకడ్బందీగా ప్లాన్ చేసి డ్యూటీకి వెళ్తుండగా కార్‌తో ఢీ కొట్టి, వేట కొడవలితో నరికి హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

8 సంవత్సరాలుగా నేను నాగమణి ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు నాగమణిని పట్టించుకోవడం మానేశారు. 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంతకుముందు 4 సంవత్సరాలు తను హాస్టల్లోనే ఉంది. ఆ సమయంలో నేనే ఆమెకు కావాల్సిన అవసరాలు తీర్చి చదివించాను. కానిస్టేబుల్ జాబ్ వచ్చాక తల్లిదండ్రులు ఆమెకు దగ్గరయ్యారు. నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్టలో మేం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న వెంటనే మాకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం.

మేం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మమ్మల్ని చంపుతామని నాగమణి కుటుంబసభ్యులు బెదిరిస్తూ వచ్చారు. ఈరోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ల తమ్ముడు చంపేశాడు.

రాయపోల్ నుంచి హయత్నగర్ బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసింది. మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు అంటూ ఫోన్ కట్ చేసింది. వెంటనే మా అన్నయ్యకు విషయం చెప్పాను. ఆయన వెళ్లేలోపే రక్తపు మడుగులో నాగమణి కొట్టుకుంటుంది. అని నాగమణి భర్త శ్రీకాంత్ వివరించారు

కుమారుడికి బైడెన్‌ క్షమాభిక్ష

మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్‌ బైడెన్‌కు భారీ ఊరట కల్పించారు.

మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్‌ బైడెన్‌కు భారీ ఊరట కల్పించారు. రెండు క్రిమినల్‌ కేసుల్లో (Criminal Cases) హంటర్‌కు బైడెన్‌ (Hunter Biden) క్షమాభిక్ష ప్రసాదించారు. తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా బైడెన్‌ పేర్కొన్నారు.

అక్రమంగా తుపాకీ కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్‌, కాలిఫోర్నియాలో హంటర్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయుధం కొనుగోలు వ్యవహారంలో నమోదైన కేసులో హంటర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది.

అయితే, ఇప్పటి వరకూ శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. దీనిపై అప్పట్లో బైడెన్‌ స్పందిస్తూ.. హంటర్‌ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు యత్నించబోనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని వినియోగించుకున్నారు. బైడెన్‌ నిర్ణయం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరోసారి రెచ్చిపోయిన డ్రగ్ పెడ్లర్లు

హైదరాబాద్‌లో యువతీయువకులు రెచ్చిపోయారు. ఏకంగా ఓయో రూమ్‌లో డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. గచ్చిబౌలిలోని ఓయో హోటల్‌పై దాడి చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.

నగరంలో డ్రగ్స్ సరఫరా మరోసారి కలకలం రేపింది. గచ్చిబౌలి డీఎల్ఎఫ్ సమీపంలోని ఓయో బోటిక్ హోటల్లో డ్రగ్స్ సేవిస్తున్న నలుగురిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఇద్దరు యువతులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

నిందితుల్లో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు కాగా మరో ఇద్దరు మత్తుపదార్థాలు సేవించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్ పెడ్లర్లు వైజాక్‌కి చెందిన గులిపల్లి గంగాధర్, హైదరాబాద్‌కి చెందిన మొహంతిగా గుర్తించారు.

మత్తుపదార్థాలు సేవించిన ప్రియాంకరెడ్డితోపాటు షకి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఓటీ పోలీసులు వెల్లడించారు. వారి నుంచి ఎండీఎమ్ఏ 18 గ్రాములు, ఇండియన్ చెర్రస్ 7 గ్రాములు, ఎల్ఎస్డీ డ్రగ్స్, ఓజీ కుష్ ఒక గ్రాము చొప్పున స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఓటీ పోలీసులు చెప్పారు.

అసలైన వారిని వదిలి బినామీలకు నోటీసులు

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌పై విచారణ తప్పుదోవ పడుతోందా ఆయనకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) అధికారులు కొందరు సహకరిస్తున్నారా

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌పై విచారణ తప్పుదోవ పడుతోందా? ఆయనకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) అధికారులు కొందరు సహకరిస్తున్నారా అంటే తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి.

భూముల బదిలీ కేసులో అసలైన వారికి కాకుండా బినామీలకు నోటీసులు జారీ చేశారన్న ఆరోపణలున్నాయి. ఆదిభట్లలోని సర్వే నంబరు 44లో 10ఎకరాల పట్టా భూములను అక్రమంగా గోపాల్‌ గౌడ్‌, మంజుల గౌడ్‌కు బదిలీ చేసిన విషయంలో అమోయ్‌ కుమార్‌ ప్రమేయంపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ విషయంలో సీసీఎల్‌ఏ కూడా సమాంతర విచారణ జరుపుతోంది.

ఈ పదెకరాలకు హక్కుదారులమైన తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణకు పిలవకుండా.. అధికారులు ఇతరులకు నోటీసులిచ్చారని దీనిపై విచారణ జరపాలంటూ నీరుడి యాదయ్య తదితరులు సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో సీసీఎల్‌ఏ నోటీసులు అందుకున్న వారు బినామీలని ఆదిభట్ల వాసులు ఆరోపిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో రూ.100 కోట్ల విలువైన భూముల అక్రమ బదిలీకి సంబంధించిన కేసులో నెలన్నర క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అమోయ్‌ కుమార్‌ను విచారించారు. ఈ కేసులో సీసీఎల్‌ఏ అధికారులూ విచారణ చేపట్టారు. విచారణను తప్పుదోవ పట్టించేలా సీసీఎల్‌ఏలోని కొందరు అధికారులు అమోయ్‌ కుమార్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై సీసీఎల్‌ఏకు ఫిర్యాదు అందింది.

అమెరికాలో కూడా ఇదే జరుగుతోంది రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడుగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)పై కేసుల నమోదు అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఏపీలోని పలు పోలీస్ స్టేషన్‌లలో గతంలో ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై కేసులు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లాలో నమోదైన కేసులో పోలీసులు ఆయనకు 41ఏ నోటీసులు సైతం ఇచ్చారు. 

అయితే.. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన రామ్ గోపాల్ వర్మ .. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత తనపై వరుస కేసుల నమోదుపైనా హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారన్న వార్తల నేపథ్యంలో ఆయన అజ్ఞాతం నుంచి సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తూ తాను ఎక్కడికీ పరారు కాలేదని చెబుతూ కేసుల నమోదుపై రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 

తాజాగా ఒక ఎలక్ట్రానిక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై నమోదైన కేసులపై ఆర్జీవీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా న్యూస్ థంబ్‌నయిల్ బెటర్‌గా ఉండాలని, నా న్యూస్ బెటర్‌గా ఉండాలని కోరుకునే కాంపిటీషన్ వరల్డ్‌‌లో ఉన్నామన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదా ఇండియాలో జరుగుతున్న విషయం కాదు అమెరికాలో కూడా అదే జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ ప్రపంచంగా క్రియేట్ అయిపోయిందని వర్మ చెప్పుకొచ్చారు. తాను ఏడాది క్రితం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై అప్పుడు దాని గురించి ఎవరూ మాట్లాడలేదని ఇప్పుడు ఆ ట్వీట్ వల్ల ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసులు పెట్టారు పెడుతున్నారని ఆయన అన్నారు.

కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ ప్రయాణికుల అవస్థలు

ముంబయి నుంచి యూకేలోని మాంచెస్టర్‌కు వెళ్తోన్న విమానం.. కువైట్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. దీంతో అందులోని 60 మందికిపైగా భారతీయ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 13 గంటలకు పైగా వారంతా అక్కడే చిక్కుకుని.. అవస్థలు పడుతున్నారు. తమకు సరైన ఆహారం, సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అమెరికా, బ్రిటన్ పాస్‌పోర్టులు కలిగిన వారికి మాత్రమే హోటల్‌ సౌకర్యాలు కల్పించి.. తమను పట్టించుకోలేదని వాపోతున్నారు. ఈ క్రమంలో కువైట్‌ ఎయిర్‌పోర్టులో అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముంబయి నుంచి యూకేలోని మాంచెస్టర్‌కు వెళ్తోన్న విమానం.. కువైట్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. దీంతో అందులోని 60 మందికిపైగా భారతీయ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 13 గంటలకు పైగా వారంతా అక్కడే చిక్కుకుని.. అవస్థలు పడుతున్నారు. తమకు సరైన ఆహారం సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అమెరికా, బ్రిటన్ పాస్‌పోర్టులు కలిగిన వారికి మాత్రమే హోటల్‌ సౌకర్యాలు కల్పించి.. తమను పట్టించుకోలేదని వాపోతున్నారు. ఈ క్రమంలో కువైట్‌ ఎయిర్‌పోర్టులో అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తమను వేధించారని, అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే పౌరులకు మాత్రమే వసతి కల్పించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. భారత్, పాకిస్థాన్ సహా ఇతర దక్షిణాసియా దేశాల పాస్‌పోర్టు కలిగిన ప్రయాణికులు అర్హులకాదని ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని ఆవేదన చెందుతున్నారు. ముంబయి నుంచి బహ్రెయిన్‌ మీదుగా మాంచెస్టర్‌ వెళ్లాల్సి ఉండగా.. మార్గమధ్యలో ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సిద్ధం కావాలని క్యాబిన్ సిబ్బంది అనౌన్స్ చేశారని ఓ ప్రయాణికుడు తెలిపారు. సాంకేతికలోపంతో ఇంజిన్‌లో మంటలు, పొగ వచ్చినట్లు తాను చూశానని మరో ప్రయాణికుడు వెల్లడించాడు.

కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యాక కనీసం కూర్చోడానికైనా చోట్టు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని.. నేలపైనే కూర్చొవాల్సి వచ్చిందని అర్జూ సింగ్‌ అనే ప్రయాణికుడు ఆరోపించారు. మేము ఏంచేయాలని అడిగితే వెనక్కి వెళ్లిపోండి అని సమాధానం చెప్పారు.. తమకు రెండు గంటల తర్వాత లాంజ్ ఇచ్చారని ఆహారం దుప్పట్లు అడిగితే ఇవ్వలేదు... మంచి నీళ్లు కూడా ఓ నాలుగు గంటల పాటు మాకు దొరకలేదు’ అని అతడు వాపోయాడు. ఈ వ్యవహారంపై గల్ఫ్‌ ఎయిర్‌ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

మరోవైపు, ఈ వ్యవహారంపై స్పందించిన భారత రాయబార కార్యాలయం.. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గల్ఫ్‌ ఎయిర్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఎంబసీలోని సిబ్బంది ఎయిర్‌లైన్స్‌తో సమన్వయం చేస్తూ.. ప్రయాణికులకు సహాయం అందించేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునంది. బాధితులతో మాట్లాడి సమస్యను తెలుసుకుంది. ఎయిర్‌పోర్టులోని రెండు లాంజ్‌లను కేటాయించేలా చర్యలు తీసుకుంది.

గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ శిఖరాగ్ర సమావేశం(GCC Summit) జరుగుతున్న దృష్ట్యా ఎయిర్‌పోర్టు హోటల్‌లో వసతి లేదని.. వీలుని బట్టి అక్కడ వసతి కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. కువైట్‌లో దిగిన తర్వాత ట్రాన్సిట్ వీసా పొందే అవకాశం భారత పౌరులకు లేదని.. జీసీసీ సమ్మిట్ కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూసివేశారని పేర్కొంది.

తిరుమల ఘాట్ రోడ్డులో రన్నింగ్ కారులో అరుపులు కేకలు భయపడిపోయిన భక్తులు

తిరుమల ఘాట్ రోడ్డులో యువకులు హల్చల్ చేశారు. తిరుమలకు వెళ్ళే సమయంలో సన్ రూఫ్, విండోల నుంచి నిలబడి సెల్ఫీలు దిగిన ఈ యువకుల చేష్టలు చూసి, ఇతర భక్తులు భయపడ్డారు. పెద్దగా కేకలు, అరుపులతో రెచ్చిపోయారు. అసలే వర్షం పడుతోంది.. ఇదే సమయంలో కారులో చేసిన స్టంట్స్ భయపెట్టాయి. యువకుల చేష్టలకు అందరూ అవాక్కయ్యారు. కొంతమంది ఈ యువకుల చేష్టల్ని మొబైల్స్‌లో రికార్డు చేశారు.

తిరుమల ఘాట్ రోడ్డులో యువకులు రెచ్చిపోయారు. తిరుమల రెండో ఘాట్ రోడ్‌లో కార్ డోర్ తీసి సన్‎రూఫ్, సైడ్ విండోల నుంచి బయటకు నిలబడి పెద్దగా కేకలు వేస్తూ హంగామా చేశారు. వర్షంలో యువకులు కారులో బయటకు నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు.. దీంతో తిరుమలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. యువకుల చేష్టలు చూసి వాహనాల్లో వెళుతున్న భక్తులు అవాక్కయ్యారు.. ఈ యువకుల ఆగడాలను రికార్డ్ చేశారు. ఘాట్ రోడ్డులో హంగామా చేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు తిరుప‌తి స్థానికుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిలు పాల్గొన్నారు. తిరుపతి మహతి ఆడిటోరియం ప్రాంగణంలో ఏడు దర్శన టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీటీడీ 2,500 టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. మరో 500టోకెన్లు తిరుమల బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో జారీ చేస్తున్నారు. తిరుపతితో పాటు తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట ప్రాంత వాసులకు టోకెన్లను జారీ చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులకు మంగళవారం తిరుమల శ్రీవారి దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తున్న టీటీడీకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

గత నెల 18న జరిగిన పాలకమండలి సమావేశంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ముఖ్మయంత్రి చంద్రబాబును కలిసి స్థానికులకు దర్శన విషయంపై చర్చించామన్నారు. తిరుపతితో పాటు తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట ప్రాంత వాసులకు దర్శన భాగ్యం కల్పించాలని సీఎం సూచించారని.. ఈ మేరకు స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నామన్నారు.

ఈ దర్శన టోకెన్లు ముందుగా వ‌చ్చిన‌వారికి తొలి ప్రాధాన్య‌త‌తో కేటాయిస్తారు. ⁠దర్శన టోకెన్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాలని సూచించారు.⁠టోకెన్లు పొందిన భ‌క్తులు ద‌ర్శ‌న స‌మ‌యంలో ఒరిజిన‌ల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. ⁠వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఫుట్ పాత్ హాల్‌(దివ్య ద‌ర్శ‌నం) క్యూలైన్ లో భ‌క్తుల‌ను ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తిస్తారు. ⁠ఇతర దర్శనాల్లో ఇచ్చేవిధంగా ద‌ర్శ‌నానంత‌రం ఒక లడ్డూ ఉచితంగా అందించబడుతుంది. ⁠స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వ‌ర‌కు ద‌ర్శ‌నం చేసుకునేందుకు అవకాశం ఉండదు.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం జ‌రుగ‌నున్న గ‌జ‌వాహ‌న‌సేవ‌లో అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని సోమ‌వారం ఉద‌యం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకెళ్ల‌నున్నారు.

ముందుగా తిరుమ‌లలో శ్రీవారి ఆల‌యం నుండి ఈ హారాన్ని ఆల‌య నాలుగు మాడ‌వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొస్తారు. తిరుచానూరులోని పసుపు మండపం వ‌ద్ద‌ హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఊరేగింపుగా ఆల‌యం వద్దకు తీసుకెళ్తారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి ల‌క్ష్మీ కాసుల హారాన్ని అలంకరిస్తారు.

రైల్వేకు శ్రీవారి భక్తుల స్పెషల్ రిక్వెస్ట్

కలియుగ ప్రత్యక్ష దైవం శేషాచల కొండలలో కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాది మంది ప్రజలు తిరుమల శ్రీవారి ఆలయానికి వెళుతుంటారు. ఇక అటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు కావలసిన వసతులను కల్పించడంలో టిటిడితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, అలాగే రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు విస్తృతమైన ఏర్పాట్లను చేస్తూనే ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం వారి అవసరాలను తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

అయితే తాజాగా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు రైల్వే శాఖకు ఒక కీలక విజ్ఞప్తిని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులను కలిగి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయానికి దర్శనం కోసం వెళ్లే భక్తులు రేణిగుంట రైల్వే స్టేషన్ విషయంలో దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తి చేస్తున్నారు. రేణిగుంట రైల్వేస్టేషన్ లో చిన్నపాటి వర్షం పడినప్పటికీ వర్షపునీరు నిలిచిపోతుందని, చిన్నపాటి నీటి గుంటలాగా ఆ ప్రాంతం మారుతుందని చెబుతున్నారు.

భక్తులు వర్షపు నీళ్లలో నుండే నడవాల్సిన పరిస్థితి వస్తుందని తిరుమలకు వెళుతున్న శ్రీవారి భక్తులు వాపోతున్నారు.భారతదేశంలో భౌగోళికంగా నలు దిక్కులకు ప్రయాణించడానికి సామర్థ్యం కలిగి ఉన్న మేజర్ జంక్షన్ అయిన రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రాంగణం బయట వర్షం పడితే వచ్చే వర్షపు నీరు అలాగే అక్కడ వినియోగించే వ్యర్ధ జలాలు పోవడానికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

మురికి కాలువలలోని మురుగునీరు వర్షపు నీటితో కలిసి రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రాంగణం మురుగునీటి గుంటను తలపిస్తుందని వారు చెప్తున్నారు. ఈ మురుగునీటి గుంటలో నుండి నడుచుకుంటూ వెళ్లాలంటే భక్తులకు అసౌకర్యంగా ఉందని వారు వాపోతున్నారు. దీనిపైన రైల్వే అధికారులు చొరవ చూపించాలని వారు కోరుతున్నారు.

నిఖేష్‌ కుమార్‌ బాగోతం

సింగిల్‌ విండో అవినీతి గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇరిగేషన్‌ శాఖలో ఏఈఈగా పని చేస్తూ సస్పెండైన ఓ వ్యక్తి.. దీనికి తెర తీశాడు. తన పై అధికారుల తరఫున కూడా ఆయనే రేటు మాట్లాడి అనుమతులు మంజూరు చేయించేవాడు. ఏసీబీ సోదాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అవినీతి కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇరిగేషన్‌ విభాగం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) నిఖేశ్‌కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది.

సస్పెండ్ (Suspended) అయిన ఇరిగేషన్ ఏఈఈ (Irrigation AEE) నిఖేష్‌ కుమార్‌ (Nikesh Kumar) బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ (ACB) అధికారులు గుర్తించారు. శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆయన నివాసంతోపాటు అతడి బంధువులు, స్నేహితుల నివాసాలు, కార్యాలయాల్లో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించిన పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిఖేష్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆదివారం ఉదయం 6 గంటలకు ఏసీబీ జడ్జి నివాసంలో నిఖేష్‌ను హాజరపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈనెల 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో నిఖేష్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

సింగిల్‌ విండో అనుమతుల మంజూరు గురించి విని ఉంటాం.. కానీ, సింగిల్‌ విండో అవినీతి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇరిగేషన్‌ శాఖలో ఏఈఈగా పని చేస్తూ సస్పెండైన ఓ వ్యక్తి.. దీనికి తెర తీశాడు. తన పై అధికారుల తరఫున కూడా ఆయనే రేటు మాట్లాడి అనుమతులు మంజూరు చేయించేవాడు. ఏసీబీ సోదాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అవినీతి కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇరిగేషన్‌ విభాగం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) నిఖేశ్‌కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. గండిపేట జోన్‌లో ఏఈఈగా విధులు నిర్వహిస్తున్న హేరూర్‌ నిఖేష్‌ కుమార్‌.. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వటానికి ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఈ ఏడాది మే 30న పట్టుకున్నారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న నిఖేష్‌ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిఖేష్‌ నివాసంతోపాటు అతడి బంధువులు, స్నేహితుల నివాసాలు, కార్యాలయాల్లో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించిన పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు ప్రాంతాల్లో ఇంటి స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఖరీదైన అపార్ట్‌మెంట్లలో ఆరు ఫ్లాట్లు, రెండు వ్యాపార సముదాయాలు నిఖేష్‌ కుమార్‌కు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం స్థిర, చర ఆస్తులు కలిపి మొత్తం రూ.17.74 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మార్కెట్‌ ధర ప్రకారం వీటి విలువ రూ.150 కోట్లకుపైగా ఉంటుందని భావిస్తున్నారు. సోదాల్లో గుర్తించిన ఆస్తులు కాకుండా బంగారం, బ్యాంకు లాకర్లు, బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలపైనా ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

పదేళ్ల క్రితం ఇరిగేషన్‌ శాఖలో చేరిన నిఖేష్‌ కుమార్‌ 2021 నుంచి గండిపేట జోన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గండిపేట జోన్‌ హైదరాబాద్‌ శివారుప్రాంతం కావడంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. చెరువులు, కుంటల సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిర్మాణాలు చేపట్టేందుకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిబంధనలు ఆటంకంగా ఉండటంతో.. వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి ఎన్‌ఓసీ ఇచ్చేలా నిఖేష్‌ డీల్‌ కుదుర్చుకునేవాడని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. పేరుకే ఏఈఈగా విధులు నిర్వహిస్తున్నా.. తన పై అధికారుల్ని సైతం ఒప్పించి ఫైల్‌ ఓకే చేయించేలా ఏకమొత్తంలో బేరం కుదుర్చుకునేవాడని తేలింది. కొన్ని సందర్భాల్లో ఒక్కో ఎన్‌ఓసీకి రూ.50 లక్షల వరకు కూడా వసూలు చేసినట్లు సమాచారం. వసూలు చేసిన మొత్తంలో సగానికిపైగా తాను తీసుకుని మిగిలిన దాంట్లో పైఅధికారులకు వాటాలు ఇచ్చేవాడని తెలుస్తోంది. కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో రూ.2.50 కోట్ల విల్లాను నిఖేష్‌ కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్‌ విభాగంలో ఆయనతోపాటు పనిచేసే మరో ఐదుగురికి కూడా ఇక్కడే విల్లాలు ఉన్నాయి. దీనిపైనా ఏసీబీ విచారణ జరుపుతోంది.

అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని కాపాడుకోవడానికి నిఖేష్‌ బినామీలను పెట్టుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంట్లో భాగంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తన చిన్ననాటి స్నేహితులను, బంధువులను ఎంచుకునేవాడు. వారికి రూ.5-10 లక్షల వరకు సహాయం చేసి వారి పేరుతో విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల ఆధారంగా బినామీలకు నోటీసులు జారీ చేసి విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు గండిపేట జోన్‌లో ఇరిగేషన్‌ విభాగం జారీ చేసిన అన్ని ఎన్‌ఓసీలపైనా ఏసీబీ దృష్టి సారించింది. నిఖేశ్‌తోపాటు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా లోతుగా విచారణ జరుపుతోంది.