/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TG: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం Mane Praveen
TG: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం
HYD: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ మేరకు కమిషన్ ఛైర్మన్ గా నియమించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా విధులు నిర్వర్తించాలని సీఎం కోరారు.

కాగా, ప్రస్తుత టిజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి, రేపటితో పదవీ విరమణ కానున్నారు. ఈనెల 3న బుర్ర వెంకటేశం బాధ్యతలు చేపట్టనున్నారు.
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన వెంకటసాయి
నల్గొండ జిల్లా:
నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 5 వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరుగు 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 బాలుర ఫుట్బాల్ జాతీయస్థాయి పోటీలకు, నల్గొండ చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన రాచూరి వెంకటసాయి సెలెక్ట్ కావడం జరిగిందని క్లబ్ వ్యవస్థాపకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు  తెలిపారు. నల్లగొండలో ఆదివారం బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. రాచూరి వెంకటసాయి గత సంవత్సరం 2సార్లు జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గా సారధ్య బాధ్యతలు వహించడం జరిగిందని తెలిపారు.

చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో ఫుట్బాల్ క్రీడలో తర్ఫీదు పొంది శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్ కు సెలెక్ట్ కావడమే కాకుండా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కలిగిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.

ఈ సందర్భంగా  స్పోర్ట్స్ ఫౌండేషన్ పక్షాన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కుంభం రామ్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
NLG: రైతు వేదికలో రైతు పండుగ.. వీడియో కాన్ఫరెన్స్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల రైతు వేదిక లో శనివారం రైతు పండుగ లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు రాష్ట్ర రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మర్రిగూడ ఏవో మల్లేష్ ఏఈఓ విజయ్ మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మర్రిగూడ మండల మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మాల్ మార్కెట్ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్ పగడాల లింగయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెండు నరసింహారెడ్డి, బండ యాదయ్య, వివిధ గ్రామాల రైతులు కోలుకులపల్లి యాదయ్య, సిలివేరు యాదయ్య, ఆకారపు శ్రీను, గ్యార వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
TG: ప్రజా ప్రభుత్వానికి ఇక నుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు: సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్: అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో మూడు రోజులపాటు జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.


ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.

దాదాపు 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికే రుణమాఫీ చేయగా, తాజాగా ఈ వేదిక నుంచి మరో 3,13,897 మంది రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేస్తూ అందుకు అవసరమైన 2747.67 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి  విడుదల చేశారు.

తాజాగా విడుదల చేసిన నిధులతో రాష్ట్రంలో మొత్తంగా 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది. ఈ నిధులను విడుదల చేయడంతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళా సమాఖ్య కోసం 255 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వానికి ఇకనుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు, కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారనప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించినామని తెలిపారు.

రైతే రాజు అని ప్రభుత్వం రైతన్నలకు రుణమాఫీ చేయడంతో పాటు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అన్న పరిస్థితుల నుంచి.. నేడు రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కాకుండా ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇచ్చిన సందర్భంలో రైతు పండుగ చేసుకుంటున్నామన్నారు.

గ్రీన్ చానెల్లో నిధులు విడుదల చేయించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.

కొడంగల్ రుణం తీర్చుకోవాలని 1300 ఎకరాల భూ సేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి 25 వేల మంది మహిళలకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రయత్నం చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారు.. అమాయకులను రెచ్చగొడుతున్నారు అని తెలిపారు.

ఇక్కడ పుట్టిన వాడిని... గిట్టేది కూడా ఈ గడ్డమీదే. ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే, అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. జిల్లా వాసిగా నా బాధ్యత నాకు తెలుసు అని రేవంత్ రెడ్డి అన్నారు.

భారీ స్థాయిలో జరిగిన ఈ రైతు పండుగలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ,  శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పలువురు సలహాదార్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వర్షపు నీటితో ప్రతి చెరువు నిండేలా చూడాలి: మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలో చిన్న నీటి వనరులను పటిష్ట పరచడానికి సమగ్రమైన కార్యాచరణ రూపొందించి  పనులను మొదలుపెట్టాలని.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, హైదరాబాదులోని వారి నివాసంలో శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ..
అత్యధిక ఫ్లోరైడ్ ప్రాంతం మునుగోడు నియోజకవర్గమని, ఇక్కడ కురిసే ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి చెరువులకు మళ్ళించినట్లయితే భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం కొంత మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు.

నియోజకవర్గంలో ఉన్న  669 చెరువుల్లో గొలుసు కట్టు చెరువులకు నీరు వచ్చే ఫీడర్ ఛానల్ లను పటిష్టం చేయడంతో పాటు ఆయా చెరువులలో  పేరుకుపోయిన పూడికను తీయడం, కట్టలను పటిష్టం చేయడం  లాంటి పనులను  విడతల వారీగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు.

దీనికోసం డిసెంబర్ నెలలో చెరువులను పటిష్టం చేయడానికి సైట్ సర్వే పూర్తి చేసి అంచనాలు రూపొందించే పని పూర్తి చేయాలన్నారు.  జనవరి నుండి జులై వరకు ఎంపిక చేసిన చెరువులను పటిష్టం చేయాలన్నారు. వర్షాకాలం రావడానికి ముందే చెరువులను పటిష్టపరిచేలా ప్రణాళికలు ఉండాలని  సూచించారు.

భూగర్భ జలాలను పెంచడానికి చెరువులతోపాటు వాగులపై ఎన్ని చోట్ల  మత్తడి( మట్టితో నిర్మించే మినీ చెక్ డ్యాం) నిర్మాణాలు చేపట్టాలి. వాగులపై ఎన్ని చోట్ల చెక్ డ్యాములు నిర్మించాలి, వెల్మకన్నే , శేషులేటి వాగు ఫీడర్ ఛానల్ పనుల పునరుద్ధరణ, గొలుసు కట్టు చెరువులతో పాటు  మిగతా చెరువులలో నీటిని నింపడానికి కావలసిన వనరులను, చేపట్టాల్సిన పనులపై  ఈ సమీక్ష సమావేశంలో వారు చర్చించారు.

మండలాల వారిగా  కమిటీలు ఏర్పాటు చేస్తానని  ఆ కమిటీల ద్వారా నీటిపారుదల అధికారులు సమన్వయం చేసుకుంటూ, వర్షాకాలం వచ్చే సమయానికి ఎంపిక చేసిన చెరువులను నిర్దేశిత సమయంలో పూర్తిచేసేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. విడతల వారీగా  మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న  669 చెరువులను పటిష్ట పరచాలన్నారు.

గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల అకౌంట్ ఫ్రిజ్ ను ఎత్తివేయాలి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా:
మునుగోడు ఉప ఎన్నికలలో యాదవులకు గొర్రెల పంపిణీ పథకం సందర్భంగా, లబ్ధిదారుల ఎకౌంట్లు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని.. శుక్రవారం నాంపల్లి మండలం, దేవత్ పల్లి గ్రామ యాదవులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

నేటికీ ఎకౌంటు ఫ్రీజ్ ఎత్తివేయకపోవడం తో ఇబ్బందులు పడుతున్నామని గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులు తమ ఆవేదనను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి చెప్పుకున్నారు.

దీంతో స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి వెంటనే అకౌంట్ ఫ్రిజ్ ను ఎత్తివేయాలని.. గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

ఈ విషయమై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
NLG: ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా
నల్లగొండ జిల్లా:
చిట్యాల: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ విజ్ఞప్తి చేశారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

కార్మికులకు రూ.10,000/- వేతనాన్ని ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NLG: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపిన శాసనమండలి చైర్మన్
నల్గొండ: జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

శనివారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన నివాసంలో, ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ మేరకు సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ కు శాశ్వత భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఆయన అభినందనలు తెలిపారు.

*జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సన్మానించారు*.

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు పై ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తుందని, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తగిన విధంగా న్యాయ సలహాలు తీసుకొని ముందుకు పోతుందని మండలి చైర్మన్ తెలిపారు. జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సూచించారు.

ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు దోసపాటి సత్యనారాయణ, ఎం.యాదగిరి, మదనాచారి, సయ్యద్, రామకృష్ణ, ఉపేందర్, మల్లేష్, కంది శ్రీనివాస్, భాస్కర్, రవీందర్ రెడ్డి, అశోక్, చాంద్, రాంప్రసాద్, భజరంగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఆసరాగా నిలుస్తున్న సీఎం సహాయనిధి పథకం: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ: వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 24 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరు అయిన రూ. 8,15,000/- విలువ గల చెక్కులను, శుక్రవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పట్టణంలోని వారి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి ( CMRF) పథకం నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.  ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు .

ఈ పథకాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రజిత రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగులవంచ వెంకటేశ్వర్ రావు, దుబ్బ అశోక్ సుందర్, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, శ్రీరామదాసు హరికృష్ణ, చిలకరాజు శ్రీనివాస్, రిటైర్డ్ వార్డెన్ పాదురి ఇంద్ర సేన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నారాయణపురం ప్రెస్ క్లబ్ ను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం:
సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో, జర్నలిస్టులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న  ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సందర్శించారు.

ఈ మేరకు మొదటిసారి ప్రెస్ క్లబ్ కు వచ్చిన  ఎమ్మెల్యేకు ప్రెస్ క్లబ్ సభ్యులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.

ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఎమ్మెల్యే ను ప్రెస్ క్లబ్ సభ్యులు ఆహ్వానించారు.