/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఆర్జీవీ లొంగిపోతే ఉత్తమం లేకపోతే Raghu ram reddy
ఆర్జీవీ లొంగిపోతే ఉత్తమం లేకపోతే

పోలీసుల ట్రాప్‌ను ఆర్జీవీ గుర్తించలేకపోతున్నారు. తనను పట్టుకోవడం లేదని అనుకుంటున్నారు. తాను పరారీలో లేనని అంటున్నారు. సాంకేతికంగా ఆయన పరారీలో ఉన్నట్లుగా పోలీసులు ఫ్రేమ్ సృష్టించారు.

ఆయన ఎదురుగా ఉన్నా ఇప్పుడు పోలీసులు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు న్యాయపరమైన అన్ని అవకాశాలను ముగించాలని పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ ట్రాప్‌లో ఆర్జీవీ ఇరుక్కున్నారు.

తనను అరెస్టు చేసి కొడతారని ఆర్జీవీ భయడపడుతున్నారు. ఆయనను కొట్టాల్సినంత కోపం ఏపీ పోలీసులకు.. లేకపోతే ప్రభుత్వ పెద్దలకు ఎందుకు ఉంటుంది?. తనను ఓ జోకర్‌గా చూడాలని.. జోకులేనని..సెటైర్లేశానని ఆయన చెప్పుకుంటున్నారు.

కానీ ఎలా చూడాలో చట్టం కోణం నుంచి చూస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేయవద్దంటూ విజయ్ బాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందన చూస్తే ఆర్జీవీకి న్యాయపరంగా కూడా ఎలాంటి రిలీఫ్ రాదని అర్థమైపోయింది.

ఆర్జీవీకి తాను చేసిన తప్పేమిటో తెలుసు. రెండు, మూడు టీవీ చానళ్లకు పిలిపించుకుని తనదైన సుత్తి చెప్పి కన్ ఫ్యూజ్ చేయవచ్చని అనుకుంటున్నారో.. లేక తనను అరెస్టు చేసి కొడతారని జాతీయ మీడియా చానళ్లన్నింటికీ ట్యాగ్ చేసి చెబితే.. పోలీసులు వెనక్కి తగ్గుతారని అనుకుంటున్నారో కానీ.. రోజు రోజుకు ఆర్జీవీ.. మరింత కూరుకుపోతున్నారు. ఆయనకు న్యాయసలహాలు ఇస్తున్న హైకోర్టు లాయర్‌గా మారిన సాక్షి టీవీ అనలిస్ట్ క్లీన్ షేవ్ బాలయ్య .. రాజమండ్రి జైలు బయట కూడా అలాంటి ప్రెస్‌మీట్లు పెడతారు. దాని వల్ల ఆయన మీడియాలో కనిపిస్తారు కానీ.. ఆర్జీవీ మాత్రం జైల్లో ఉంటారు.

30 లక్షల సైబర్ మోసాన్ని చాకచక్యంగా అడ్డుకున్న ఎస్బీఐ అధికారులు

సైబర్ నేరగాళ్ల బారి నుంచి ఓ వ్యక్తిని ఎస్బీఐ అధికారులు కాపాడారు. ఆ క్రమంలో రూ. 30 లక్షలు పోగొట్టుకోకుండా కట్టడి చేశారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

సైబర్ నేరగాళ్లు (cyber fraud) ఎప్పటికప్పుడూ సామాన్యులను టార్గెట్ చేసుకుని లూటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం పలురకాల ఆఫర్లు లేదా అరెస్టుల పేరుతో జనాలను మభ్యపెట్టి దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సైబర్ కేటుగాళ్లు ఓ వ్యక్తిని బురిడి కొట్టించే ప్రయత్నాన్ని SBI అధికారులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లోతుకుంట బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఓ 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ఎస్బీఐ బ్రాంచ్‌ని సందర్శించారు.

ఆ క్రమంలో తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) మూసివేయాలని బ్రాంచ్ మేనేజర్‌ను కలిసి అభ్యర్థించారు. దానిలోని రూ. 30 లక్షలను ఓ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని కోరారు. అదే సమయంలో కస్టమర్ మొబైల్‌కు మోసగాళ్ల నుంచి త్వరగా నగదు బదిలీ చేయాలని తరచుగా కాల్స్ రావడాన్ని మేనేజర్ గమనించారు. అయితే మొత్తం డబ్బులు ఎందుకని మేనేజర్ ప్రశ్నించగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన తన భార్య చికిత్స కోసం నిధులు అవసరమని కస్టమర్ చెప్పాడు.

ఆ క్రమంలో బ్యాంకు అధికారికి అనుమానం వచ్చి ఆస్పత్రి పేరు, పేషెంట్ వివరాలను అడిగారు. కానీ ఆ వివరాలతో పేషంట్ ఎవరు లేరని తేలింది. దీంతో మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ క్రమంలో కస్టమర్ అసలు విషయం వెల్లడించారు. సీనియర్ సిటిజన్ తనకు మలేషియా నుంచి 16 పాస్‌పోర్ట్‌లు, ATM కార్డులతో కూడిన పార్శిల్ వచ్చాయని తనను తాను ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి గురించి తెలిపారు. ఆ వ్యక్తి సీనియర్ సిటిజన్ పేరుతో ఆధార్ కార్డుల ఆధారంగా 30 బ్యాంకు ఖాతాలు తెరిచి రూ. 88 కోట్ల మనీలాండరింగ్ మోసానికి పాల్పడ్డారని బెదిరించినట్లు చెప్పారు.

ఆ కేసు తొలగిపోవాలంటే తమ ఖాతాకు డబ్బులను బదిలీ చేయాలని సైబర్ నేరగాళ్లు కోరారని పూర్తి వివరాలను వెల్లడించారు. దీంతో అది నిజం కాదని కస్టమర్‌కు అధికారులు సర్ది చెప్పి పంపించారు. అంతేకాదు బ్రాంచ్ సిబ్బంది జోక్యం సీనియర్ సిటిజన్ డబ్బును పోగొట్టుకోకుండా కాపాడారని SBI ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతోపాటు డిజిటల్ మోసాలు/అరెస్టుల గురించి ఏదైనా తెలియని కాల్స్ వస్తే 1930 లేదా ప్రభుత్వ పోర్టల్ www.cybercrime.gov.inకి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించింది.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇదే నెలలో ఓ ఉద్యోగికి పలువురు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ చేసి దాదాపు రూ.13 లక్షలు లూటీ చేశారు. దీనికంటే ముందు ఓ మహిళకు కాల్ చేసి ఏకంగా 37 లక్షలకు బురిడీ కొట్టించారు. ఈ విధంగా సైబర్ నేరగాళ్లు ప్రతి రోజు అనేక మందిని టార్గెట్ చేసుకుని దోచేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపిక

గత కొన్ని రోజులుగా ఆసక్తిరేపిన మహారాష్ట్ర కొత్త సీఎం పేరు దాదాపు ఖరారైంది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఇంకా ప్రకటన వెలువడనప్పటికీ, ఆయా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, దేవేంద్ర ఫడ్నవీస్ పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది.

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి (Maharashtra CM) పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఎన్నికైనట్లు సమాచారం. ఆయా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తెలిసింది. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లను ఉప ముఖ్యమంత్రులు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై చర్చించేందుకు గురువారం రాత్రి మహాయుతి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సమావేశంలోనే ఈ సమీకరణ ఖరారైనట్లు సమాచారం.

బీజేపీ నేత ముఖ్యమంత్రి అయితే ఇరు పార్టీలకు ఎలాంటి అభ్యంతరం ఉండదని సమావేశంలో ఇరు పక్షాలు అంగీకరించాయి. ఢిల్లీలోని తన నివాసంలో మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన రెండు గంటల సుదీర్ఘ సమావేశం అర్ధరాత్రి ముగిసింది.

బ్యాడ్ న్యూస్ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

తాను పరారీలో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, తన కార్యాలయం ఆర్జీవీ డెన్లోనే ఉంటోన్నానని వెల్లడించారు. తనను అరెస్ట్ చేయడానికి ఏ పోలీసూ రాలేదని తేల్చి చెప్పారు. దీనిపై నా కేసు- ఆర్జీవీ అంటూ ఓ సుదీర్ఘ ట్వీట్ పోస్ట్ చేశారు.

అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి పరారీలో ఉన్నానని, మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు తన కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్లందరికీ ఓ బ్యాడ్ న్యూస్ అంటూ ట్వీట్‌ను మొదలు పెట్టారు ఆర్జీవీ. భారత న్యాయసంహిత కింద ఎలాంటి కేసులు నమోదయ్యాయో.. అందులో ఏవి తనకు వర్తిస్తాయో, వర్తించవో కూడా వివరించారు.

ఇంత వరకు పోలీసులు తన ఆఫీసు లోకి కాలే పెట్టలేదని, పైగా అరెస్టు చేయడానికి వచ్చినట్లు తన మనుషులతో గానీ మీడియాతో గానీ చెప్పలేదని, తనను అరెస్టు చేయడానికే వస్తే ఆఫీసులోకి ఎందుకు రారు అని ప్రశ్నించారు. ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్ వల్ల కేసు పెట్టారని, ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం వల్ల కంప్లైంట్ ఇచ్చారట అని గుర్తుచేశారు.

నలుగురు వేర్వేరు వ్యక్తులు, ఏపీలోని నాలుగు వేర్వేరు జిల్లాల్లో తన మీద ఈ కేసు పెట్టారని, మీడియా చెబుతున్న దాని ప్రకారం మరో అయిదు కేసులు కూడా నమోదు అయ్యాయని, మొత్తంగా తొమ్మిది కేసులు ఈ నాలుగైదు రోజుల్లోనే నమోదయ్యాయిని ఆర్జీవీ వివరించారు.

పోలీసుల నుంచి నోటీసు అందిన వెంటనే, సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరానని ఆర్జీవీ చెప్పారు. ఆయన కూడా దీనికి అనుమతి ఇచ్చారని వివరించారు. సినిమా పనులు పూర్తి కాకపోవడం వల్ల ఇంకొంత గడువు అడిగానని చెప్పారు. దీనికి అంగీకరించకపోతే వీడియో ద్వారా విచారణకు హాజరవుతాననీ తెలియజేశానని అన్నారు.

అదే సమయంలో తనపై వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉందని తనకు, తన తోటి వారికి అనుమానం కలిగిందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటానని, రోజుకు 10 నుంచి 15 పోస్టులు పెడుతుంటానని చెప్పుకొచ్చారు.

ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం, ఆ చిత్రం విడుదల కావడం కూడా జరిగిపోయి చాలా నెలలు అయిందని ఆర్జీవీ గుర్తుచేశారు. నేను పెట్టాను అంటున్న ఆ పోస్టుల వల్ల తమ మనోభావాలు ఎలా దెబ్బ తిన్నాయని వేర్వేరు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఎలా అంటున్నారో వాటిని వివరించారు.

ఈ మీమ్స్ వల్ల తనపై బీఎన్ఎస్ కింద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు నమోదయ్యాయని ఆర్జీవీ తెలిపారు. ఏవైనా డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ రికార్డులు, ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించితే సెక్షన్ 336 (4) వర్తిస్తుందని, తాను చేసిన పోస్టులను చూస్తే, అందులో ఫోర్జరీ ఎక్కడుందని ప్రశ్నించారు.

అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటని అన్నారు. తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను ప్రోత్సహించడం, మతం, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు/కులాలు/వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని పెంచడంపై బీఎన్ఎస్ 353 (2) సెక్షన్ కింద- కేసు నమోదు చేస్తారని, ఇది ఎలా వర్తిస్తుందో అర్థం కావట్లేదని అన్నారు.

పడవెనుక పడవ పెట్టి

నిండు గోదావరిలో పడవెనుక పడవను పెట్టి... నీటిలో మునిగి బకెట్‌తో లోపలున్న ఇసుకను తోడి.. పైకి తెచ్చి పడవలో నింపి ఒడ్డుకు చేర్చడం

నిండు గోదావరిలో పడవెనుక పడవను పెట్టి... నీటిలో మునిగి బకెట్‌తో లోపలున్న ఇసుకను తోడి.. పైకి తెచ్చి పడవలో నింపి ఒడ్డుకు చేర్చడం... నిత్యం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండున్నర గంటల నుంచి నడి నెత్తికి సూర్యుడు వచ్చే మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగే తంతు ఇది. చిన్న పడవలో ఐదుగురు కార్మికులు కలిసి తొమ్మిది టన్నుల ఇసుకను ఒడ్డుకు చేరుస్తారు.

ఇలా 12 గంటల నిర్విరామ శ్రమతో నాలుగైదు ట్రిప్పులు వేస్తారు. టన్ను ఇసుక ఒడ్డుకు చేర్చినందుకు రూ.195లు ఇస్తారు. ఇక పెద్ద పడవలో అయితే పదిమంది కార్మికులు కలిసి 44 టన్నుల వరకూ ఇసుకను తీస్తారు. ఇవైతే రోజుకు రెండు ట్రిప్పులు వేస్తారు. ఈ ఇసుకపై సుమారు 3 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే బోట్స్‌మన్‌ సొసైటీలు 160 వరకూ ఉన్నాయి.

వాటి ద్వారా 1600 మంది ఉపాధి పొందుతున్నారు. ఇవికాక తూర్పుగోదావరి జిల్లా అఖండ గోదావరి ప్రాంతంలోని రాజమహేంద్రవరం వైపు గాయత్రి, కోటిలింగాల కొవ్వూరు ర్యాంపుల్లోనూ బోట్స్‌మన్‌ సొసైటీల ద్వారా డీసిల్టేషన్‌ పేరుతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

ఈ ఇసుక తీసే పనిలో పడవలపై పనిచేసేవారంతా దాదాపు యూపీ, బిహార్‌ తదితర రాష్ర్టాల నుంచి వచ్చినవారే.

30న తెలంగాణలో పాఠశాలలు బంద్‌

తెలంగాణలో పుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు.

ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, విద్యార్థులు చనిపోతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు సమస్యలతో సతమతం అవుతున్నాయని, రక్షణ కరువై పర్యవేక్షణ లేకుండా పోతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే 1 సంవత్సరం గడిచిందన్నారు. ఈ సమస్యలపై కనీసం సమీక్ష చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు. అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్ ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

తక్షణమే సీఎం విద్యాశాఖ వసతిగృహాలు గురుకులాలు, కేజీబీవీలపై రివ్యూ చేసి సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరింది.

విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేసింది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యపై ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని, 30న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది.

ట్రంప్ ఎఫెక్ట్ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై కొనసాగుతున్న అనిశ్చితి మార్కెట్ల పతనానికి కారణమయింది. 

మధ్యాహ్నం 1.45 గంటల సమయానికి సెన్సెక్స్ 983 పాయింట్లు పతనమై 79,250కి పడిపోయింది. నిఫ్టీ 297 పాయింట్లు కోల్పోయి 23,977 వద్ద కొనసాగుతోంది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది.

ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, టెక్ మహీంద్రా, టీసీఎస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ తదితర బ్లూచిప్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్ లాభాల్లో ఉన్నాయి.

విద్యుత్ కొనుగోలు ఒప్పందం కధ ఇదీ

రాష్ట్ర ప్రభుత్వంపై, రెడ్ బుక్ పాలనపై, చంద్రబాబు అండ్ కో అవినీతి వ్యవహారంపై తూర్పారబట్టిన వైఎస్ జగన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం కోసం ప్రయత్నించిన తాను మంచోడినా లేక చంద్రబాబు సోలార్ ఒప్పందాలతో ఏడాదికి 2 వేల కోట్ల భారానికి కారణమయ్యే చంద్రబాబు మంచోడా అని ప్రశ్నించారు. 

గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో తప్పు జరిగిందనే విధంగా చిత్రీకరించే కుట్రపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. తమ హయాంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఈ ఒప్పందం అత్యంత చౌక ఒప్పందమని గుర్తు చేశారు. తమ ఒప్పందం కారణంగా యూనిట్ విద్యుత్ ధర 5.10 రూపాయల నుంచి 2.49 రూపాయలకు తగ్గిన సంగతిని గుర్తు చేశారు. విద్యుత్ ఒప్పందం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెకీకు మధ్య మాత్రమేనని స్పష్టం చేశారు. 2021 డిసెంబర్ 1న జరిగిన ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో మూడో పార్టీ ప్రమేయమే లేదని స్పష్టం చేశారు. 

యూనిట్‌కు 5.90 మంచిదా లేక 2.49 రూపాయలు మంచిదా

చంద్రబాబు హయాంలో విండ్ , సోలార్ పవర్ ఒప్పందాలతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందని గుర్తు చేశారు. ఆ సమయంలో యూనిట్ 5.90 రూపాయలు కొనుగోలు చేశారని, ఫలితంగా ఏటా 2 వేల కోట్లు భారం పడిందన్నారు. అంటే యూనిట్‌కు అదనంగా 3.49 రూపాయలు కట్టాల్సి వచ్చిందన్నారు. అంత అత్యధిక ధరకు ఒప్పందం చేసుకున్న చంద్రబాబు మంచోడా లేక ఏడాదికి 2 వేల కోట్ల భారాన్ని తగ్గించిన తాను మంచోడినా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన ఒప్పందం అమలై ఉంటే 25 ఏళ్లకు 87 వేల కోట్ల ప్రజల సంపద ఆవిరయ్యేదని గుర్తు చేశారు. 

తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీ నుంచి వచ్చిన లేఖను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల్ని ప్రశంసించిందన్నారు. యూనిట్ విద్యుత్‌కు 2.49 రూపాయలు చొప్పున 9 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామంటూ తెలిపింది. 2024 సెప్టెంబర్ నాటికి 3 వేల మెగావాట్ల విద్యుత్ ఇస్తామని చెప్పినట్టు గుర్తు చేశారు వైఎస్ జగన్. ఏపీ చరిత్రలోనే అత్యంత చౌక విద్యుత్ కొనుగోలు ఒప్పందమని తెలిపారు. ఈ ఒప్పందం వల్ల లక్షల కోట్ల ప్రజా సంపద ఆదా అయ్యేదన్నారు. 

చంద్రబాబు తన హయాంలో 25 ఏళ్లకు 50 వేల కోట్ల అదనపు భారానికి ప్రయత్నిస్తే తాము మాత్రం లక్ష కోట్లు ఆదా చేసే ప్రయత్నం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెకీకు, ఏపీ ప్రభుత్వానికి ఇంత చౌక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగితే మూడో పార్టీ ప్రమేయం లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.

దూసుకుపోతున్న మెట్రో

హైదరాబాద్ మెట్రోరైలు అనతికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్‌, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా ప్రస్తుతం5.6 లక్షల వరకు ప్రయాణిస్తుండడం ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్ మెట్రో రైలులో (Metro Rail) ఇప్పటివరకు 63 కోట్ల మందికి పైగా ప్రయాణం చేశారని ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వేడుకలు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఇవాళ(గురువారం) జరిగాయి. మెట్రో ప్రయాణంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఇప్పుడు ఈ స్థితికి మెట్రో వచ్చిందని చెప్పారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ప్రధానమంత్రి నేంద్రమోదీ మెట్రో రైల్ ప్రారంభించారని గుర్తుచేశారు. మెట్రోతో పాటు తన ప్రయాణం కూడా 7ఏళ్లు పూర్తి అయ్యిందని చెప్పారు. ఎల్ అండ్ టీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు వెళుతుందని అన్నారు.

ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు మంచి సహకారం వచ్చిందన్నారు. రాబోయే మూడు నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు లాభాల్లోకి వస్తుందని వివరించారు. ప్రజా రవాణాపై చాలా ఒత్తిడి ఉందని అన్నారు. ఢిల్లీ మెట్రో 22 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. మెట్రో ప్రాజెక్టుల్లో ఢిల్లీ మెట్రో ప్రథమ స్థానంలో ఉంటే.. హైదరాబాద్ మెట్రో మూడోస్థానంలో ఉందని తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంలో మెట్రో రైల్‌లో బ్యాక్ బోన్‌గా ఉండనున్నాయని చెప్పారు. హైదరాబాద్ మెట్రో చాలా ఏకో ఫ్రెండ్లీ సిస్టమని తెలిపారు.

కార్బన్ కమిషన్‌ను తగ్గించడంలో హైదరాబాద్ మెట్రో చాలా కీలకంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో 7 నుంచి 8 శాతం ప్రయాణికులను మెట్రో తమ గమ్యస్థానాలకు చేర్చుతుందని అన్నారు. కరోనా టైంలో కొంత ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. తర్వాత అన్ని మెట్రోల కంటే వేగంగా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికులు ప్రయాణించారని అన్నారు. ఇప్పుడు సాధారణంగా 4.67 లక్షల ప్యాసింజర్స్ ఉండగా అత్యధికంగా 5.6 లక్షల ప్యాసింజర్స్ వచ్చారన్నారు. అమీర్‌పేట్ మెట్రో ఉదయం సాయంత్రం సమయాల్లో చాలా ఎక్కువ రద్దీగా ఉందని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణాను అందించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైలు కట్టుబడి ఉందని తెలిపారు

గత పదేళ్లలో ఏ మాత్రం విస్తరణ జరగకపోవడంతో హైదరాబాద్‌ మెట్రో దేశంలో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిందని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మొదటి స్థానంలో ఢిల్లీ (415 కిలోమీటర్లు), రెండో స్థానంలో బెంగళూరు (74 కిలోమీటర్లు) ఉన్నాయని చెప్పారు. అక్కడి ప్రభుత్వాలు చొరవ తీసుకోవడంతో మెట్రో విస్తరణ పెద్దఎత్తున జరిగిందన్నారు. మనవద్ద 69 కిలోమీటర్ల వరకే చేపట్టామని, విస్తరణ గురించి వెంటనే పట్టించుకోకుంటే 9వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో ప్రారంభించి ఏడేళ్లయిన సందర్భంగా ఎన్వీఎస్‌ రెడ్డి రసూల్‌పురాలోని మెట్రో భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలును నడిపించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. మొదటి దశ సమయంలో మెట్రో వద్దని చాలామంది వ్యతిరేకించారని, ఇప్పుడు తమకంటే తమకు కావాలని పట్టుపడుతున్నారని తెలిపారు. మొదటి దశ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్‌ రెడ్డి రెండో దశ ప్రతిపాదనలను స్వయంగా సమీక్షించారని చెప్పారు. జనవరి నుంచి సెప్టెంబరు వరకు పదిసార్లు తమతో సమీక్షలు నిర్వహించారన్నారు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రపంచంలోనే విజయవంతంగా మెట్రోను నడిపిస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్‌ నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

రెండో దశలో 116.4 కిలోమీటర్ల మేర ఆరు కారిడార్లను ప్రతిపాదించామని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 6వ కారిడార్‌ (ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కి.మీ.) ప్రతిపాదనలు విడిగా రూపొందించామని, మిగిలిన 5 కారిడార్ల (76.4కి.మీ.) పనుల డీపీఆర్‌ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో నవంబరు 4న కేంద్రానికి సమర్పించామని చెప్పారు. రెండు నెలల్లోపు కేంద్రం నుంచి అనుమతి రావచ్చని తెలిపారు. రెండో దశలో రైళ్ల సగటు వేగం గంటకు 35 కిలోమీటర్లు ఉంటుందని, దీన్ని నాగోల్‌-ఎయిర్‌పోర్ట్‌ లైన్‌లో పెంచే అవకాశం ఉందన్నారు. ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లను ప్రతిపాదించామని, వాటిలో 4 స్టేషన్లు తగ్గించి వేగం పెంచుతామన్నారు. ప్రారంభంలో 3 కోచ్‌లతో రైళ్లను నడిపిస్తామని, తర్వాత 6 కోచ్‌లకు పెంచుతామన్నారు. ఫేజ్‌-1 అనుభవంతో పార్కింగ్‌, బస్‌బేలు, ఆటోల కోసం స్టేషన్ల గ్రౌండ్‌ లెవెల్‌లో స్థలాలు సేకరిస్తామన్నారు. రెండో దశ విస్తరణలో కిలోమీటర్‌కు నిర్మాణ వ్యయం రూ.318 కోట్లుగా అంచనా చేశామని చెప్పారు. రెండో దశలో ప్రతిపాదించిన 5 కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.7,313 కోట్లు (30శాతం), కేంద్రం వాటా రూ.4,230 కోట్లు (18శాతం) కాగా, మిగ తా 48శాతం అంటే రూ.11,693 కోట్లను కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతో జైకా, ఏడీబీ, ఎన్‌డీబీ వంటి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు సేకరిస్తున్నామని ఎంవీఎస్‌ రెడ్డి వివరించారు. ఈ రుణాలపై 2 శాతం వడ్డీ ఉంటుందన్నారు. మిగతా 4శాతం అంటే రూ.1,033 కోట్ల పెట్టుబడిని పీపీపీ విధానంలో సమకూర్చుకుంటామని తెలిపారు.మొదటి దశలో భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ 9 శాతం నుంచి 10 శాతం ఉండటంతో నిర్మాణ సంస్థపై భారం పెరిగిందని చెప్పారు. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల పనులను జనవరిలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇక్కడ మార్కెట్‌ ధర గజానికి రూ.23 వేలు ఉందని, తాము రూ.65 వేలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

హైదరాబాద్ మెట్రోరైలు(Metro Rail) అనతికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్‌, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం 5.6 లక్షల వరకు ప్రయాణిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) మోడల్‌లో సుమారు రూ.14,132 వేల కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. 2017 నవంబర్‌ నుంచి ఎల్‌బీనగర్‌-మియాపూర్‌(LBnagar-Miyapur), జేబీఎస్-ఎంజీబీఎస్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్ల పరిధిలోని 69.2 కిలోమీటర్ల మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి. ఆరంభంలో హైదరాబాద్‌ మెట్రోరైలు అధికారులు చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్‌అండ్‌టీ అధికారులు తీవ్రంగా కృషి చేసి ఆయా కారిడార్లలో పిల్లర్ల నిర్మాణానికి కావాల్సిన ఆస్తుల సేకరణకు పకడ్బందీగా చేశారు. సమర్థవంతంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.

మెట్రోరైళ్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా నడుస్తూ అన్ని వర్గాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రతి 3 నుంచి 6 నిమిషాలకోసారి రైలు వస్తుండటంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొవిడ్‌ కాలంలో ప్రయాణికుల సంఖ్య కొంతమేరకు తగ్గినా మళ్లీ పుంజుకుంది.

కారిడార్‌-1లోని ఎల్‌బీనగర్‌లో రోజుకు 40 నుంచి 50 వేల మంది, కారిడార్‌ 3లోని రాయదుర్గంలో 35 నుంచి 40 వేల మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కారిడార్‌-2 జేబీఎస్-ఎంజీబీఎస్‌లో తక్కువ మొత్తంలో ఉంటున్నారని, ఈ మార్గంలో రోజులో గరిష్ఠంగా 25 వేలు దాటడం లేదని పేర్కొంటున్నారు. వచ్చే మూడేళ్లలో 80 కోట్ల మందికి చేరేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు.

మూసీలో రసాయన వ్యర్థాలుముగ్గురిపై కేసు నమోదు

హైదర్‌గూడ(Bapughat - Hyderguda) సంగమం వద్ద మూసీలోకి రసాయన వ్యర్థాలను వదిలిన ముగ్గురిపై రాజేంద్రనగర్‌ పోలీసులు(Rajendranagar Police) కేసు నమోదు చేశారు. ఆ స్థలం లీజుకు తీసుకుని నడుపుతున్న చంద్రశేఖర్‌, కెమికల్‌ ట్యాంకర్‌ యజమాని వెంకటేశ్‌, డ్రైవర్‌ దేవదాసుపై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ భానుమతి(Rajendranagar SI Bhanumathi) తెలిపారు.

బాపూఘాట్‌ - హైదర్‌గూడ(Bapughat - Hyderguda) సంగమం వద్ద మూసీలోకి రసాయన వ్యర్థాలను వదిలిన ముగ్గురిపై రాజేంద్రనగర్‌ పోలీసులు(Rajendranagar Police) కేసు నమోదు చేశారు. ఆ స్థలం లీజుకు తీసుకుని నడుపుతున్న చంద్రశేఖర్‌, కెమికల్‌ ట్యాంకర్‌ యజమాని వెంకటేశ్‌, డ్రైవర్‌ దేవదాసుపై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ భానుమతి(Rajendranagar SI Bhanumathi) తెలిపారు.

మూసీలోకి రసాయన వ్యర్థాలను వదులుతుండటాన్ని గమనించిన లంగర్‌హౌజ్‌(Langerhouse)కు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు ఇంద్రసేనారెడ్డి తదితరులు మంగళవారం రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రసాయన వ్యర్థాల ట్యాంకర్‌ను పీసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.