ఉమ్మడి వరంగల్ లో ఉద్యమకారుల సదస్సు లో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమకారుల ఫోరం నాయకులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమ కళాకారుల సదస్సును ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా" చీమ శ్రీనివాస్ పిలుపుమేరకు వరంగల్ సదస్సుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమకారుల ఫోరం నాయకులు పాల్గొన్నారు. ఉద్యమ కళాకారుల డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని సదస్సు నిర్వహించినట్లు వారు తెలిపారు వారి యొక్క డిమాండ్లు 250 గజాల ఇంటి స్థలం 25 వేల పింఛన్ గుర్తింపు కార్డులతో పాటు సంస్కృతిక సారధిలో కళాకారులకు 1000ఉద్యోగాలు కళాకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యమ కళాకారుల ఆకాంక్షను మరియు గత ప్రభుత్వంలో కన్న కలలను సాకారం కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఉద్యమ కళాకారులు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఈ సదస్సులో గుర్తు చేశారు ముఖ్యమంత్రి వెంటనే ఇచ్చిన హామీలను మంజూరు చేయించి ఉద్యమ కళాకారులను ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గంధమల్ల బాలయ్య ఉమ్మడి జిల్లా మహిళా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గంధమల్ల మల్లమ్మ యాదాద్రి భువనగిరి ,మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు మారగొని శ్రీనివాస్ గౌడ్ ,జిల్లా ఉద్యమ కళాకారుల సాంస్కృతిక కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్ ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యదర్శి కదిరిని స్వామి జిల్లా ఉద్యమ కళాకారుల కన్వీనర్ సురుపంగా గణేష్ పాల్గొన్నారు*
Nov 06 2024, 11:00