/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz వెంకటసాయి సాధించిన 3 గోల్స్ తో నల్గొండ జిల్లా ఫుట్బాల్ జట్టు ముందంజ Mane Praveen
వెంకటసాయి సాధించిన 3 గోల్స్ తో నల్గొండ జిల్లా ఫుట్బాల్ జట్టు ముందంజ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 బాలుర ఫుట్బాల్ పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు ఈరోజు జరిగిన పోటీల్లో ఖమ్మం జిల్లా ఫుట్బాల్ జట్టుతో డ్రా చేసుకోగా రెండో మ్యాచ్ లో నిజామాబాద్ జిల్లాపై 3-0 స్కోర్ తో విజయం సాధించిందని ఈ 3 గోల్స్ కూడా చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన రాచూరి వెంకటసాయి సాధించడం ఎంతో అభినందనీయమని క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు వెంకటసాయి కి అభినందనలు తెలిపారు.
NLG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం సభ్యులకు సన్మానం

నల్లగొండ: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో, నేడు నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జిజియల్ లెక్చరర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు హేమ్ల నాయక్ మాట్లాడుతూ. విద్యార్థుల భవిష్యత్తు కొరకు తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డల సంక్షేమంబికొరకు నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థాపించిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాల బహుజన జాతి బిడ్డలందరికీ గొప్ప అవకాశం అని ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లు గా, ఇంజనీర్లు గా ఉన్నత ఉద్యోగాలలో పోలీస్ విభాగాలలో పనిచేస్తున్నారంటే, అది మంత్రి కోమటిరెడ్డి సహకారం అని తెలిపారు.ఆయన సహాయం వల్లనే లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య చదువుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ కాలేజీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని వారు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన క్వాలిఫైడ్ లెక్చరర్స్ బోధనలు విని మంచి స్థాయికి రావడం జరుగుతుందని అన్నారు.ఈ కళాశాల చైర్మన్ పెద్దలు గోన రెడ్డి పేద విద్యార్థుల అభ్యున్నతి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారు, వారికి కూడా మా బహుజన విద్యార్థుల పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.

నూతనంగా సంఘం బాధ్యతలు చేపట్టిన ప్రెసిడెంట్ హేమ్లా నాయక్, సెక్రెటరీ శిల్ప, వైస్ ప్రెసిడెంట్ జ్యోత్స్న, ట్రెజరర్ ధనమ్మ, చీఫ్ అడ్వైజర్ శిబ, జాయింట్ సెక్రెటరీ రామకృష్ణ, లేడీస్ సెక్రటరీ గా నస్రత్ బేగం, ఈసీ మెంబర్స్ కోటేశ్వరరావు, లింగారెడ్డి, వేణుగోపాల్ లను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ తాడిశెట్టి నరసింహ, లెక్చరర్స్ శివకోటి విక్రమ్ బాబు, మల్లెపాక వెంకన్న, జిల్లా నరసింహ, జయమ్మ, లింగం అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరున్, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, నియోజకవర్గ అధ్యక్షులు శివతేజ, ప్రవీణ్, సురేందర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్

చెన్నై అపోలో ఆస్ప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. తాను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని విష్ చేసిన‌ ప్ర‌ముఖుల‌కు, అభిమానులకు సామాజిక మాధ్యమం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్ లో చేరిన రజినీకాంత్ కు డాక్టర్లు స్టెంట్స్ వేసారు. మూడు రోజులు విశ్రాంతి తర్వాత ఈ రోజు ఆయన్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రజినీకాంత్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.

NLG: డీజే ల వినియోగం పై నిషేధం: ఎస్పీ
నల్లగొండ: ఈ నెల 14 వరకు  జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే డీ.జే లు, అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వినియోగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్య కఠిన చర్యలు చేపడుతామని అన్నారు.
NLG: మర్రిగూడ మండలం నుండి ఎన్నిక అయిన మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లకు సన్మానం
నల్లగొండ జిల్లా:
మాల్ మార్కెట్ యార్డ్ నందు నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి గురువారం మర్రిగూడ మండలం నుండి ఎన్నిక అయినటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లను వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్, జమ్ముల వెంకటేష్ గౌడ్, గంట మల్లేష్,  మేకల జగన్ రెడ్డి లను శాలువాతో సన్మానించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఇటీవల నియమించిన విషయం విధితమే.

ఈనెల 7 న పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యే అవకాశం ఉంది.
లెంకలపల్లి లో ఘనంగా దుర్గామాత పూజలు
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, గాంధీ సెంటర్లో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వద్ద విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో మొదటి రోజు పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భవానీలు, భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
NLG: మూసి సుందరీకరణ పేరుతో పేదల బ్రతుకులను ఆగం చేయొద్దు: సిపిఎం
నల్లగొండ జిల్లా:
మూసి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల బతుకులు ఆగం చేయొద్దని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య కోరారు. గురువారం మునుగోడు లో మండల కమిటీ సమావేశం స్థానిక సిపిఎం కార్యాలయంలో వేముల లింగ స్వామి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నారి ఐలయ్య మాట్లాడుతూ.. మూసి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేద, మధ్య తరగతి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని.. మూసి రివర్ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న ప్రజలపై పోలీసులు అధికారులు దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని  విమర్శించారు. బుల్డోజర్లు వచ్చి ఇల్లు కూలగొడతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా నిర్ణయాలు తీసుకునే ముందు అఖిలపక్ష పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల మేధావులతో చర్చించాలని.. చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ ప్రజల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని, పర్యాటక కేంద్రంగా మార్చినంత మాత్రాన ప్రభుత్వ ప్రయోజనాలు నెరవేరవని అన్నారు. పైగా  సాధారణ ప్రజల ఆవాసాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మూసి ప్రధాన సమస్య కాలుష్యమని, మందులు రసాయన పరిశ్రమలకు సంబంధించిన వ్యర్ధాలు, మురికి నీరు మూసి లో కలవడం వల్ల కాలుష్యం పెరుగుతుందని, ఫలితంగా
మూసి పరిసరాల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, ఉప్పల్ నుండి సూర్యాపేట వరకు కలుషిత మూసి జలాల వలన వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, చేపలు ఉపయోగించిన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయాల వల్ల వీధిన పడుతున్న మూసి నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని, మూసి సుందరీకరణ పేరుతో పేదలను నగరం బయటికి పంపి బడా కార్పొరేట్ సంస్థలకు షాపింగ్ మాల్స్, గార్డెన్స్, స్టార్ హోటల్  యజమానులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టే ప్రయత్నం  మానుకోవాలని పేదలకు వెంటనే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం మూసి ప్రాంత పేదల ఇళ్లను తొలగిస్తారని తెలియడంతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని, మరి కొంతమంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని బాధిత కుటుంబాలను నష్ట పరిహారం ఇవ్వాలని ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని, వారిపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, మండల కార్యదర్శి మిర్యాల భగత్, మండల కమిటీ సభ్యులు వరికుప్పుల ముత్యాలు, యాతరాణి శ్రీను, సాగర్ల మల్లేశం, శివర్ల వీరమల్లు, వడ్లమూడి హన్మయ్య, యాట యాదయ్య, కొంక రాజయ్య, బోల్ల ఎట్టయ్య, ఒంటెపాక అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలి: ఎక్సైజ్ ఎస్ఐ స్వాతి
నల్లగొండ జిల్లా:
సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలని చండూరు ఎక్సైజ్ ఎస్సైస్వాతి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో సేఫ్టీ మోకులపై గురువారం గీత కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేఫ్టీ మోకులు వినియోగించడం వలన తాటి చెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదం నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు.

గీత కార్మిక వృత్తి చాలా ప్రమాదకరమైనది. గీత కార్మికుడికి కాటమయ్య రక్షణకవచం చాలా అవసరమని ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలనివారు తెలిపారు. సేఫ్టీ మోకులు లేకపోవడం వలన చాలామంది గీత కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల కోసం సేఫ్టీ మోకులపై తీసుకున్న నిర్ణయాన్ని గీత కార్మికులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికారులు సైదులు, శ్రీను కుమార్, నల్లగొండ టీం ట్రైనర్స్ కాసాని సత్తయ్య, సైదులు, శంకరయ్య, గీత పనివారల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శంకరయ్య,  ఎక్సైజ్ అధికారి ప్రభాకర్, గీత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: గట్టుప్పల్ లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి: బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం గట్టుప్పల మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీసు, ఆరోగ్యశాఖ, వ్యవసాయ కార్యాలయం, విద్యుత్ కార్యాలయం, మండల పశు వైద్యశాల కార్యాలయం, తదితర సమస్యలతో మండల కేంద్రం పూర్తిస్థాయిలో నడవడం లేదని, ప్రభుత్వం వెంటనే చొరవ చూపి మౌలిక వసతులు కల్పించాలని  ఆయన అన్నారు.

గట్టుప్పల్ పోలీస్ స్టేషన్ కు పూర్తిస్థాయి అధికారులు ఇవ్వాలని, అదేవిధంగా  సిబ్బందిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మండల వ్యాప్తంగా లింకు రోడ్ల సమస్యలు కూడా త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని కోరారు.

ఈనెల 15న గట్టుప్పల సిపిఎం మండల మహాసభ జరుగుతుందని, ఈ మహాసభకు అందరూ హాజరుకావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు,గట్టుప్పల మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం మండల కమిటీ సభ్యులు బొట్టు శివకుమార్,కర్నాటి సుధాకర్, అచ్చిన శ్రీనివాస్, వల్గూరి శ్రీశైలం,ఖమ్మం రాములు,కక్కునూరి నాగేష్,టేకుమెట్ల కృష్ణ,బండ లింగస్వామి,తదితరులు పాల్గొన్నారు.
NLG: దుర్గామాతకు అభిషేకం నిర్వహించిన కంజర శ్రీను జ్యోతి దంపతులు

నల్గొండ: పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీ గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, రేపు జరగబోయే దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా.. ఈ రోజు దుర్గ మాత కు పంచామృతాలతో ప్రముఖ అయ్యప్ప పూజల గాయకుడు గురు స్వామి కంజర శ్రీను-జ్యోతి దంపతులు భక్తి శ్రద్ద లతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న భవానీ లకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే దేవి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ పూజ కార్యక్రమంలో గురుభవాని వెంకన్న భవాని, మహేష్, మనోజ్, శివ, నవీన్, ప్రవీణ్, వెంకట్, చందు, జగదీష్, అర్జున్, ధత్తు లతో పాటు భవానీలు పాల్గొన్నారు.