తెలంగాణను మరో రాయలసీమ చేయాలనీ చూస్తున్న రేవంత్ రెడ్డి! వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమనేది మర్చిపోవద్దు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
తెలంగాణను మరో రాయలసీమ చేయాలనీ చూస్తున్న రేవంత్ రెడ్డి!
వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమనేది మర్చిపోవద్దు!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
చిన్నకోడూర్ న్యూస్
తెలంగాణ రాష్ట్రాన్ని మరో రాయలసీమ చేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నాడని మాజీ వైస్ యంపిపి కీసరి పాపయ్య, బిఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, గుండెల్లి వేణులు అన్నారు.
మంగళవారం నాడు వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఐనాక తెలంగాణ రాష్ట్రం ఆగమ్యగోచరంగా మారిందని ఇచ్చిన హామీలకు దిక్కు మొక్కు లేదని ప్రభుత్వం విద్యాలయాలకు కనీసం చాక్ పీస్ లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ప్రభుత్వం ఏర్పడిన ఎన్మిది నెలల్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడితే మిగతా నాలుగేండ్లు రేవంత్ రెడ్డి ఎంచేయగలడని వారు అన్నారు.
ఇచ్చిన హామీలను మరిపించడానికి తెలంగాణ ప్రజలను మాట్లాడకుండా చేయడానికే కాంగ్రెస్ కార్యకర్తలను గుండాలుగా తాయారు చేసి బిఆర్ఎస్ పైన బిఆర్ఎస్ నాయకుల పైన ఇండ్ల పైన దాడులు చేయిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వారు అన్నారు.
రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారనికి గురికాకతప్పదని అన్నారు.
ప్రజలు మల్ల బిఆర్ఎస్ కావాలని కేసీఆర్, హరీష్ రావు రావాలని కోరుకుంట్టున్నారని బిఆర్ఎస్ తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు
Sep 29 2024, 19:16