మేళ తాళాల నడుమ నాంపల్లి మండలంలో గణేష్ శోభాయాత్ర
నల్లగొండ జిల్లా:
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో నిర్వాహకులు కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నాంపల్లి మండల కేంద్రంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన వినాయక మండపాల లోని గణేషుడి శోభాయాత్ర.. సోమవారం ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానాలు, శోభాయాత్ర సందర్భంగా స్వామి వారి శేష వస్త్రాలు, కలశం, లడ్డు ప్రసాదం తదితరాలను వేలం వేయగా భక్తులు పోటీపడి దక్కించుకున్నారు.
అనంతరం గణపతిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై ఉంచి ఆలయ కమిటీ, పుర ప్రముఖులు మహిళల కోలాట ప్రదర్శన, మేళ తాళాల నడుమ నాంపల్లి పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. తదనంతరం జై జై గణేశా బై బై గణేశా అంటూ గుర్రంపొడు సాగర్ కాల్వలో నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో పానుగంటి వెంకటయ్య, జాల ముత్తయ్య, తిరుమణి మోహన్, ఎస్కే జాంగిర్, కాంశెట్టి ముత్యాలు, జాల సునీత, నాంపల్లి వెంకటమ్మ జాల సుష్మ దోనాల రేణుక నాంపల్లి కవిత కోనేటి లలిత, జువేద, పసుపులేటి అలివేలు, నాంపల్లి భిక్షం, అమ్మోదు కోటమ్మ, బా లకృష్ణయ్య, పసుపులేటి గిరి, నాంపల్లి యాదయ్య, కమిశెట్టి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
Sep 17 2024, 17:26