NLG: రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి, పార్లమెంటులో సమగ్ర చట్టం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
రైతుల పండించిన పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించడంతో పాటు, పార్లమెంటులో సమగ్ర చట్టం చేయాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.
మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో కామ్రేడ్ పగిళ్ల చిన్న నరసింహ నగర్ లో జరిగిన సిపిఎం 17వ గ్రామ శాఖ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక రైతుల పట్ల వివక్ష చూపుతుందని, రెండు సంవత్సరాల నుంచి దేశం నడిబొడ్డున రైతులు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, రైతుల మీద అక్రమ కేసులు పెట్టడం తప్ప రైతుల సమస్యలు పరిశీలించడం లో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు.
కేంద్ర బడ్జెట్లో రైతాంగానికి తగిన బడ్జెట్ కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో కంటే ఈసారి బడ్జెట్లో 19వేల కోట్లు తగ్గించారని కూలీల పట్ల కూడా మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు.
రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, ప్రజలకు ఇచ్చిన ఆరు గారంటీలను అమలు చేయాలని, పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీని చేయాలని, రైతుల ఖాతాల్లో వెంటనే రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం హాజరై మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను ఆమోదించాలని, లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అలాగే కల్వకుంట్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, కల్వకుంట్ల నుంచి వెల్మకన్నె వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం నూతన గ్రామ కమిటీని ఎన్నుకొన్నారు. నూతన కార్యదర్శిగా పగిళ్ల మధు, సహాయ కార్యదర్శిగా బొందు చిన్న నరసింహ, వీరితోపాటు మరో 9 మంది తోటి కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్, సహాయక కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు, గ్రామ శాఖ నాయకులు నారబోయిన నరసింహ, బొందు అంజయ్య, అయితగోని యాదయ్య, పగిళ్ల యాదయ్య, కట్ట మారయ్య, పుల్కారం అంజయ్య, జిల్లపల్లి యాదయ్య, పగిళ్ల వెంకన్న, కట్ట ఆంజనేయులు, బొందు సుందరయ్య, చేకూరి బిక్షం, కుక్కల బాలస్వామి, సింగపంగా లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Sep 10 2024, 14:18