/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz డా.బుర్రి వెంకన్న ను సన్మానించిన టిజి ఎంఆర్పిఎస్ నాయకులు Mane Praveen
డా.బుర్రి వెంకన్న ను సన్మానించిన టిజి ఎంఆర్పిఎస్ నాయకులు
నల్లగొండ జిల్లా:
కొండ మల్లెపల్లి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ ఆఫీసులో ఇవాళ టిజి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు అన్నేపాక సంజీవ, ప్రదాన కార్యదర్శి ఎర్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన దళిత రత్న బుర్రి వెంకన్న ను మర్యాదపూర్వకంగా కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రం పటాన్ని బహుకరణ చేసి శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దళిత రత్న మద్దిమడుగు బిక్షపతి గారు పాల్గొని మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి యువతను చైతన్య పరుస్తూ భారత రాజ్యాంగ హక్కులు పూర్తిస్థాయిలో తెలియపరుస్తూ అవగాహన సదస్సు నిర్వహిస్తూ, జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొంది ఇప్పుడు గౌరవ డాక్టరేట్ తీసుకోవడం చాలా సంతోషకరమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా సమతా సైనిక దళ్ అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని భారత రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరుడికి అందే విధంగా నిరంతరం పనిచేస్తుందని వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో  అన్నేపాక సంజీవ. జెడ చంటి, దర్శనం దేవా, ఎలిమినేటి చిన్న యాదయ్య, వస్కుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఈ నెల 30
నల్గొండ: అక్టోబర్ లో జరిగే ఓపెన్ స్కూల్ 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు అయ్యేందుకు పరీక్ష ఫీజును ఈనెల 30 వ తేదీలో చెల్లించాలని డిఈఓ బిక్షపతి మరియు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జగదీష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు మీసేవ కేంద్రం ద్వారా పరీక్ష ఫీజును చెల్లించి రసీదు ను సంబంధిత స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ కు అందజేయాలన్నారు. పరీక్ష ఫీజును నిర్ణీత రుసుము తో ఈనెల 22 నుండి 30 వ తేదీ లోపు చెల్లించాలని పేర్కొన్నారు.
NLG: యూత్ ఫర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బొట్టుగూడ హైస్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన, ఈరోజు యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో సైన్స్ విభాగంలో ప్రాథమిక స్థాయి పరీక్ష నిర్వహించారు.అనంతరం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించి, రక్షాబంధన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అదేవిదంగా పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సైదులు, తిరుపతి ,పాఠశాల టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
గౌరవ డాక్టరేట్ అందుకున్న బుర్రి వెంకన్నను సన్మానించిన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా:
దేవరకొండ: ఆల్ ఇండియా సంస్థ సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మరియు చందంపేట  పీ ఏ సి ఎస్ చైర్మన్ జాలె నరసింహారెడ్డి లు శుక్రవారం డా. బుర్రి వెంకన్నను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబాసాహెబ్ స్థాపించిన సంస్థ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంఘం ద్వారా తెలంగాణ రాష్ట్ర, నల్గొండ జిల్లా లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను దళిత రత్న బుర్రి వెంకన్న రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొని నేడు ప్రతిష్టాత్మకంగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం.. ఆయన మన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ వాసి కావడం సంతోషకరమని అన్నారు.     

డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారికి భారత రాజ్యాంగ ఫలాలు, హక్కులను ప్రతి పౌరుడికి అందే విధంగా సామాజిక పోరాటాలు నిర్వహించినందుకు, నాకు గౌరవ డాక్టరేట్ రావడం చాలా సంతోషకరమని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.తన గౌరవ డాక్టరేట్ ను తన వెన్నంటూ ఉండి సంపూర్ణ సహకారం అందించిన తన కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, డివిజన్ ఉపాధ్యక్షులు అందుగుల గిరి, పీఏ పల్లి మండల అధ్యక్షులు జిల్లా రాములు, కొండమల్లేపల్లి మండల ఉపాధ్యక్షులు చేపూరి రాజేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, మామిడి చెట్టు యాదగిరి. టీజీ ఎంఆర్పిఎస్ మల్లేపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఎర్ర ప్రసాద్, కడారి రాజు, ఖండేలా వెంకన్న లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
NLG: కప్ప కాముడు నిర్వహించిన లెంకలపల్లి గ్రామస్తులు

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ఇవాళ వరుణ దేవుని ప్రార్థిస్తూ కప్ప కాముడు ఆటలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలోని బొడ్రాయికి నీళ్ళు పోసి సమృద్ధిగా వర్షాలు కురవాలని పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా సరిగ్గా వర్షాలు లేవని దీంతో పత్తి చేలు ఎండిపోతున్నాయని, వర్షాలు పడకపోతే ఆర్థికంగా నష్టపోతామని, వర్షాలు సమృద్ధిగా పడాలని బొడ్రాయికి పూజలు నిర్వహించామని తెలిపారు.

యరగండ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నల్లగొండ జిల్లా, మారిగూడ మండలం (ఆగష్టు 15, స్ట్రీట్ బజ్ న్యూస్): 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా యరగండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

స్కూల్  హెడ్మాస్టర్ మాలతి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ పోరాట నాయకుల త్యాగాలను స్మరించుకుంటూ మర్రిగూడ మండల ప్రజలకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్కూల్ కు యువ చైతన్య యూత్ కమిటీ సభ్యులు సౌండ్ బాక్స్ లు ఇవ్వడం జరిగింది. యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. స్కూల్లో ఉన్న స్టూడెంట్ కు ఏమైనా అవసరం ఉంటే మేము ముందుకు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.తదనంతరం యూత్ కమిటీ సభ్యులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీచర్లు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.
డిస్టిక్ ఇన్నోవేటర్ అవార్డు ను అందుకున్న నవీన్ కుమార్
నల్గొండలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  ఇంటింటా ఇన్నోవేటర్- ఇంటికి ఒక శాస్త్రవేత్త  ప్రాజెక్టు, "తక్కువ ధరలో ఎక్కువ సామర్థ్యం గల వ్యవసాయ డ్రోన్ పిచికారి విధానం" లో బొమ్మలరామారం మోడల్ స్కూల్ కెమిస్ట్రీ లెక్చరర్ కోట నవీన్ కుమార్ ఇవాళ నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా "డిస్టిక్ ఇన్నోవేటర్ అవార్డు" ను అందుకున్నారు. ఈ సందర్భంగా రావులపెంట గ్రామానికి నవీన్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా వ్యవసాయం చేయడంలో ముఖ్యంగా రసాయనిక ఎరువులు డ్రోన్ ద్వారా  పిచికారి చేయడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని, పండిన పంట మానవులపై ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం వినియోగిస్తున్న డ్రోన్ ల ధర ఎక్కువగా ఉంటుందని, అతి తక్కువ ధరలోనే ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నానని  తెలిపారు. రావులపెంట గ్రామస్తులు, మరియు మోడల్ స్కూల్ అధ్యాపకులు, మిత్రులు పలువురు ఈ అవార్డు రావడం పట్ల ఆయనను అభినందించారు
బహుజన సంఘాల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం
నల్లగొండ జిల్లా:
దేవరకొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బహుజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా. బుర్రి వెంకన్న పూలమాల వేశారు. తదంతరం వికలాంగుల హక్కుల సమితి రాష్ట్ర నాయకులు గుద్దేటి సైదులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ కార్యక్రమానికి  ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి కంబాలపల్లి వెంకటయ్య, నియోజకవర్గ కన్వీనర్ సహదేవుడు పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుందని ఎందరో స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్రం సాధించుకున్నటువంటి మన భారతదేశంలో ఇంకా అట్టడుగు వర్గాలకు పూర్తి స్థాయిలో  రాజ్యాంగ  ఫలాలు దక్కుతలేవని వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, చింతపల్లి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సంధ్య, ఏసు వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు చారి, వస్కుల నాగరాజు, చాట్ల చందర్, యాదగిరి, మాతంగి జాన్, పెరిక వెంకన్న, బీసీ సంఘం నాయకులు భాస్కరాచారి, ఎర్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన నిర్వహించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జెండా వందనం అనంతరం పాఠశాల ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణను, జాతీయతాభావాన్ని పెంపొందించుకుంటూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అనంతరం ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ బొట్టుగూడ హైస్కూలుకు గతంలో క్రీడల్లో ఘనమైన రికార్డు ఉందని దాన్ని కొనసాగించాలంటే విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి పటిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో విద్యాభ్యాసం కొనసాగాలని సూచిస్తూ స్వాతంత్ర త్యాగాలను గుర్తుచేసే స్లొగన్స్ ను విద్యార్థుల చేత ఇప్పించారు.
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఇవాళ పార్టీ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్న ప్రజా ప్రభుత్వం దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ మర్రిగూడ మండల ప్రజలకి 78 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం లో స్వీట్లు పంచుకొని పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ నాంపల్లి అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య,PACs డైరెక్టర్ బాయికడి కొండల్, అజ్జిలాపురం ఉప్పునుతులమల్లయ్య,ఎలిమినేటి సత్తి రెడ్డి,పగడాల లింగయ్య,మాజీ ఎంపీటీసీ వెంకటపేట బాలయ్య,ఏర్పుల శ్రీశైలం, కొడాల ఆల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్,అశోక్ రెడ్డి,ఐతపాక జంగయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు మహ్మద్ ఖధీర్, సలవోజు బిక్షమాచారి,నందికొండ లింగారెడ్డి, చాపల రవి, పెంబళ్ల గిరి,పగడాల యాదయ్య,బేత వెంకటేష్,బడేటి వెంకటేష్, జమ్ముల వెంకటేష్, వల్లపు భాస్కర్, రావుల రాములు, గ్యార వెంకటేష్,సిరపంగి శ్రీను,ఉడుతల లవకుమార్,గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు