/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మునుగోడు: యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ Mane Praveen
మునుగోడు: యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ
యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అభ్యర్థి మేకల ప్రమోద్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అభ్యర్థి అబ్బనబోయిన రామ్ యాదవ్ ఆధ్వర్యంలో, శుక్రవారం మునుగోడులో యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో  మర్రిగూడ మండలం యువజన కాంగ్రెస్ అభ్యర్థి ఉడతల లవకుమార్ గౌడ్, మర్రిగూడ యూత్ కాంగ్రెస్ నాయకులు గణేష్ మరియు మునుగోడు యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేయాలి: బూడిద సురేష్
ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మర్రిగూడ మండల కార్యాలయంలో సిపిఐ మండల పార్టీ సహాయ కార్యదర్శి బూడిద సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందక మండల కేంద్రంలో పేద విద్యార్థులు పై చదువులు చదవలేక పోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, మర్రిగూడ మండల పరిసర ప్రాంతాల విద్యార్థుల జీవితాల్లో మార్పులు జరగడం లేదని చదువు కుంటే చదువు రావడం లేదు 
చదువు కొనుక్కుంటే దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో అఖిలభారత విద్యార్థి సమాఖ్య AISF - AIYF ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, ఐటిఐ కాలేజీలు నిర్మించాలని అనేకమార్లు నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా.. ప్రభుత్వం మరియు అధికారులు పట్టించుకోలేదు, వివిధ గ్రామాల నుండి మండల కేంద్రానికి చేరుకోవడానికి  విద్యార్థులు బస్సు సౌకర్యాలు లేక ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే ప్రైవేటు కళాశాలలో చదువుకుంటూ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతూ వారు  చదువులను కొనసాగిస్తున్నారు. కావున ఈ ప్రాంతం సమస్యల పైన స్థానిక ఎమ్మెల్యే కు పూర్తి అవగాహన  ఉన్నందున ఇప్పటికైనా ప్రభుత్వం నుండి కళాశాలలు మంజూరు చేయించి నిర్మించే విధంగా చూడాలని కోరారు.

ఈ సమావేశంలో  సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కొనిరెడ్డి గిరి, AISF మండల కార్యదర్శి ఇస్కీళ్ల మహేందర్, AIYF మండల సహాయ కార్యదర్శి సిరిపంగి శ్రీనివాస్, AIYF మండల నాయకులు పున్నం సుభాష్ పాల్గొన్నారు.
మర్రిగూడ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుకలు

నల్లగొండ జిల్లా: ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి మేడమ్ పుట్టిన రోజు సందర్భంగా.. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ, కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య, సంపత్ కుమార్, మాజీ సర్పంచ్ లు నున్సావత్ బిచ్చునాయక్, పాక నగేష్, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, ఉప్పునుతుల ఈశ్వర్, ఇబ్రహీం, ముద్దం శ్రీనివాస్, చామకూరి అబ్బయ్య, వడ్త్యా యాదగిరి, ఆకారపు శ్రీను, గొడ్డేటి వెంకటేష్, రమావత్ శ్రీను, కుక్కడపు ముత్యాలు, ఉడుతల లవకుమార్, గ్యార వెంకటేష్, నందికొండ లింగారెడ్డి, జింకల కొండల్, పొనుగోటి శేఖర్, మండల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

NLG: డిండి ఎత్తిపోతల పథకం పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి: నెల్లికంటి సత్యం
నల్లగొండ జిల్లా:
మునుగోడు: కరువు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు నిర్ణీత కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మునుగోడు మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సత్యం పాల్గొని మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం అప్పటి  ప్రభుత్వం మహాబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని సుమారు 3.61 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు 2015లో జి.వో. 107  విడుదల చేసినప్పటికి  గత ప్రభుత్వం డిటైల్స్ ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్‌) ను ఆమోదించకుండా, పర్యావరణ అనుమతులు తీసుకరాలేకపోవడంతో జాప్యం జరిగి  ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నదన్నారు.

ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే విషయంపై గత ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయిందని, ఈ ప్రభుత్వమైనా నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్ లోనే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ 300 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ డిపిఆర్‌ అమోదం, పర్యావరణ అనుమతులు తీసుకొని నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిదంగా నల్లగొండ జిల్లాలో సుమారు 3.20 వేల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు సాగునీరు ఇచ్చే శ్రీశైలం సొరంగం పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. 19 ఏండ్ల క్రితం రూ.1925 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులు నేటికి రూ.4658 కోట్ల అంచనా వ్యయానికి చేరింది. 9.5 కి.మీ. సొరంగం త్రవ్వాల్సి ఉన్నప్పటికీ  గత ప్రభుత్వం 10 ఎండ్లలో అరకొర నిధులు కేటాయించడం వలన సొరంగం పనుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఎంతమాత్రం ముందుకు సాగ లేదన్నారు. దాంతో లిప్టు వల్ల మాత్రమే ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు, హైద్రాబాద్‌ త్రాగునీటికి సగం నీరు, సగం నీరు మాత్రమే సేద్యానికి ఉపయోగించడం వలన ఆయకట్టుకు నీరు అందటం లేదు. సొరంగం పూర్తయితే మాత్రమే సాగు, తాగు నీరు అందుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా మంత్రులు చెప్పిన విధంగా 30 నెలలో శ్రీశైలం సొరంగ మార్గం పనులు  పూర్తి చేయాలన్నారు.  సమావేశానికి సురిగి చలపతి అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు బలుగూరి నరసింహ గురిజా రామచంద్రం, టి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శీను సహాయ కార్యదర్శులు బండమీది యాదయ్య,మందుల పాండు, మాజి జడ్పీటిసి గోసుకొండ లింగయ్య,  కార్యవర్గ సభ్యులు వనం వెంకన్న ఊపునుతుల రమేష్, ఈదులకంటి కైలాష్,మాదగోని సత్తమ్మ, కాగితం వెంకన్న మునుగోడు దయాకర్  బి లాలు దుబ్బ వెంకన్న, ఎం డి జానీ,యువజన సంఘం కార్యదర్శి బండారు శంకర్, తదితరులు  పాల్గొన్నారు.
గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సిబ్బందిని అందరిని పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ వేతనాలు అమలు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ,కార్మికులకు వేతనాల్లో ప్రత్యేక గ్రాండ్ కేటాయించాలని పిఆర్సి లో అర్హులుగా గుర్తించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా గ్రామాల్లో వర్షాకాలంలో మురికి కాల్వలను రోడ్లను శుభ్రం చేసే కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం సరైనది కాదని ఆయన అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో గల్లి గల్లి వాడ వాడ లలో శుభ్రం పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సహజ మరణానికి ఐదు లక్షల ఇవ్వాలి విధి నిర్వహణలో మరణించిన కార్మికులకు 10 లక్షల ఎక్స్ గ్రెసియా ఇవ్వాలని, జీవో నెంబర్ 51 సవరించాలని, కార్మికులకు దుస్తులు చెప్పులు సబ్బులు బ్లౌజులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఒట్టిపల్లి హనుమంతు, ఊరు పక్క లింగయ్య, పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, ఒంపు ముత్తమ్మ, సిలువేరు మహేష్, మైలారం నరసింహ, ఐతపాక పద్మ, ఎడ్ల నరసింహ, ఆవుల ముత్తయ్య, పోతురాజు కృష్ణయ్య, ఎడ్ల రమణ గ్యార దుర్గమ్మ, ఊరు పక్క వెంకటయ్య, గ్యార యాదగిరి, లాలూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
డల్లాస్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి మహాత్ముడి కి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. మంత్రివర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి మహాత్ముడి కి నివాళులర్పించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్
మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామం లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో  మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఇవాళ మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్  పంపిణి చేశారు.

యరగండ్లపల్లి గ్రామానికి చెందిన పోలగోని యాదయ్య తండ్రి మారయ్య  కు రూ. 48,000/-, పోలగోని ప్రసాద్ తండ్రి సత్యనారాయణ రూ.18000/-,గొడ్డేటి వెంకటయ్య తండ్రి మారయ్య రూ.36000/-, దంటు లక్ష్మమ్మ భర్త దంటు శేఖర్ రూ. 31000/-, ముద్దం వెంకటయ్య తండ్రి రామస్వామి రూ.42000/, ఇరగోని శ్రీను తండ్రి ముత్యాలు రూ. 21000/-  విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ పంపిణీ చేశారు.                                            
ఈ సందర్భంగా రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాకులవరం అశోక్ రెడ్డి, మాడెం జంగయ్య, జమ్ముల వెంకటేష్, సిలువేరు యాదయ్య, ఆకారపు శ్రీను, గ్యార వెంకటేష్, పోలె చిన్నపెద్దయ్య, దండేటికారి నాగార్జున్, మడెం శంకర్, వనపర్తి సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: లెంకలపల్లి లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సెంటర్ 1 లో బుధవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ అయితగోని అండాలు మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు (ముర్రుపాలు) గంట లోపు పట్టించడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉండి, బిడ్డ ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తుందని, ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి గోపీనాథ్, టీబి నోడల్ అధికారి ప్రేమ్ కుమార్, ఎస్ టి ఎస్ సైదులు, ఏఎన్ఎంలు స్వర్ణలత, జ్యోతి, ఆశాలు సైదాబీ, పద్మ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నాంపల్లి: AEE ఉద్యోగాలకు ఎంపికైన యువకులకు సన్మానం
నల్గొండ జిల్లా:
నాంపల్లి: స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి నరేష్ ఆధ్వర్యంలో AEE ఉద్యోగాలకు ఎంపికైన యువకులను సన్మానించారు. ఈరోజు నాంపల్లి మండల కేంద్రం జడ్.పి.హెచ్.యస్ హైస్కూల్లో AEE ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఆకులపల్లి సుధాకర్, బొంత శ్రీను, కన్యబోయిన గోపాలకృష్ణ, జక్కుల రమేష్ ను సన్మానించిన ఎంపీడీవో స్వర్ణ కుమారి మరియు హెచ్ఎం అజయ్ కుమార్.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. కష్టపడి చదివి వీరిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త శ్రీహరి,స్వేరో నాయకులు మధు, రాంబాబు,టీచర్లు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
NLG: బాధిత కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఏ ఆర్ కే మిత్రమండలి
నల్లగొండ మండలం పెద్ద సూరారం గ్రామంలో గుండె నాగయ్య నిన్న అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఏ ఆర్ కే మిత్ర మండలి, ఇవాళ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పిల్లల భవిష్యత్తు కొరకు 50 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అరుణ రామకృష్ణ, గ్రామ మాజీ సర్పంచ్ యర్రమాద యాదమ్మ రత్నారెడ్డి, వల్లపు ఇంద్రసేనారెడ్డి, వల్లపు కర్ణాకర్ రెడ్డి, తంతనపల్లి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.