చౌటుప్పల్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు కోసం సీఎంను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
HYD: జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఇవాళ చౌటుప్పల్ బార్ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని, అన్ని శాఖల డివిజన్ కార్యాలయాల తో పాటు, రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉన్న చౌటుప్పల్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రికి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే ఏకైక రెవిన్యూ డివిజన్ గా చౌటుప్పల్ ప్రాంతం ఉన్నదని.. అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసి జ్యుడీషరీ పొజిషన్లో ఉన్నదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. వీటితోపాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకి కావలసిన పెండింగ్ కేసులకు సంబంధించి చౌటుప్పల్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని వారు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే లా సెక్రెటరీ కి ఫోన్ చేసి పరిశీలించమని ఆదేశించారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు తాడూరు పరమేష్, జనరల్ సెక్రెటరీ రాపోలు శ్రీను, కోశాధికారి పడమటి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు తో పాటు చౌటుప్పల్ బార్ అసోసియేషన్ చెందిన 40 మంది అడ్వకేట్లు ఉన్నారు.
Jul 27 2024, 15:54