వినియోగదారుల హక్కులకు తూట్లు పొడుస్తున్న పెట్రోల్ బంకులపై కలెక్టర్ కు పిర్యాదు..
వినియోగదారుల హక్కులకు తూట్లు పొడుస్తున్న పెట్రోల్ బంకులపై కలెక్టర్ కు పిర్యాదు..
వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన ఉచిత సేవలను విస్మరించడంపై నల్గొండ పట్టణానికి చెందిన ఎండి సాధిక్ పాషా మరియు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం ఉచిత త్రాగునీరు, మరుగుదొడ్లు, ఉచిత ఫోన్ సౌకర్యం అలాగే వాహనాలకు గాలి నింపడం లాంటి కనీస సౌకర్యాలను వినియోగదారుల చట్టం ప్రకారం వాహన వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత పెట్రోల్ బంకుల నిర్వాహకులపై ఉన్నది.
కానీ అట్టి నిబంధనలను ఆయా పెట్రోల్ బంకుల యజమానులు వినియోగదారులకు ఉచితంగా సేవలను అందించకపోగా వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు.ఇటీవల సామాజిక కార్యకర్త అయినటువంటి సాదిక్ పాషా వారి వాహనానికి దేవరకొండ రోడ్డు విశాల్ మార్ట్ పక్కన గల హెచ్. పి. పెట్రోల్ బంకులో తన వాహనానికి పెట్రోల్ పోయించుకున్న తరువాత టైర్లలో గాలి నింపమని కోరగా అక్కడి మేనేజరు దురుసుగా మాట్లాడడమే కాకుండా ఎక్కడ ఫిర్యాదు చేస్తారో చేసుకోండి మాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది.అంతేకాకుండా జిల్లా కేంద్రంలో ఉన్న జైలు పెట్రోల్ బంకులో సైతం పరిమితికి మించి గాలిని టైర్లలో నింపడం వలన వాహన టైర్లు పేలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కావున ఇట్టి విషయమై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించగా అక్కడి సిబ్బంది పెడచెవిన పెట్టడం జరిగింది.ఇది కేవలం ఏ ఒక్క పెట్రోల్ బంకుకే పరిమితం కాదు నల్గొండ పట్టణంలో ఉన్న దాదాపు 80% బంకుల్లో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
అలాగే చాలా పెట్రోల్ బంకుల్లో వాహనాలకు గాలి నింపే సాధనాలు పూర్తిగా చెడిపోయి శిధిలావస్థలో దర్శనమిస్తున్నాయి.అంతేకాక పలు పెట్రోల్ బంకుల్లో పది రూపాయల నాణేలు మరియు ఫోన్ పే, గూగుల్ పే, లాంటి ఆన్ లైన్ పేమెంట్ లను నిరాకరిస్తూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూన్నారు. ఒకవేళ పెట్రోల్ నాణ్యతలో వినియోగదారునికి అనుమానం కలిగినచో అట్టి నాణ్యతను చెక్ చేయడానికి ఫిల్టర్ పేపర్ అందుబాటులో ఉంచడం లేదు మరియు చాలా పెట్రోల్ బంకుల్లో డెన్సిటీ డిస్ప్లే కూడా చేయడం లేదు ఇలాంటి విషయాలు సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో వీరి ఆటలు సాగుతున్నాయి మరియు పెట్రోల్ బంకుల్లో పనిచేసే ఉద్యోగులు వినియోగదారులతో ఎలా మసలుకోవాలో అవగాహన లేక పలుమార్లు వినియోగదారులతో ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కావున ఇట్టి విషయాలపై సంబంధిత అధికారులు లు దృష్టి సారించి వినియోగదారులకు ఉచితంగా అందించాల్సిన సేవలను పటిష్టంగా అమలుపరచాలని అట్టి సేవలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎం.డి. సాధిక్ పాష, ఎస్బి న్యూస్ రిపోర్టర్ కిరణ్ కుమార్,గుండె జనార్ధన్,జిల్లా కర్ణకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.



షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి
కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
నేడు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్రం స్టేట్ అధ్యక్షులు కట్టెల శివకుమార్ గారు ఎన్డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ మరియు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బీసీ కులానికి చెందిన నాగిళ్ల మురళి అధ్యక్షుడు అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కట్టెల శివకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నుండి 1982 లాస్ లో ఉన్న నష్టాలలో నడుస్తున్న ఎన్ డి సి ఎం ఎస్ ను గత మూడు సంవత్సరాలుగా అనేక బ్రాంచీలు జిల్లా లేవల్ను ఏర్పాటు చేసి మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 90 లక్షల నష్టాలలో ఉన్న ఎన్డీసీఎంఎస్ ను ప్రస్తుతము మూడు కోట్ల లాభాలోకి నడిపించిన ఘనత వీరికి దక్కుతుందని తెలియజేసినాడు మరియు టీఎన్జీవోస్ ఉద్యోగస్తుల అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగి వారి మంచి చెడులను జిల్లాలో మొత్తంగా పరిశీలించి వారి సమస్యలపై ఎనలేని పోరాటం చేయాలని తెలుపుతూ వారికి మరొకసారి మా అసోసియేషన్ తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లం పల్లి కొండన రాష్ట్ర కార్యదర్శి కమ్మలా నరేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు నల్గొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి డిఐఈఓ దస్రు నాయక్ గారిని కలిసి వినతిపత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్
Jul 16 2024, 08:01
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.7k