/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఉపాధి హామీ చట్ట రక్షణకై ఈనెల 10న జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి: వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి Vijay.S
ఉపాధి హామీ చట్ట రక్షణకై ఈనెల 10న జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి: వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి

ఉపాధి హామీ చట్ట రక్షణ కోరుతూ ఈనెల 10వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేక పోరాటాల ద్వారా ఏర్పడిందని అలాంటి చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలను చేస్తుందన్నారు చట్ట రక్షణ కోసం మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సదస్సుకు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సహాయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శివ దాసన్ అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ముఖ్య వక్తలుగా హాజరవుతారని తెలిపారు ఉపాధి హామీ చట్టంలో గతంలో ఉన్న పద్ధతులను తీసివేస్తూ నూతన పద్ధతులను అవలంబిస్తూ కూలీలు పనులకు రాకుండా కొర్రీలు పెడుతున్నది రెండు పూటలా ఫోటోలు అప్లోడ్ చేస్తేనే వేతనాలు ఇస్తామని వేధింపులకు గురిచేస్తుంది పనిచేసిన కూలీలకు వారం వారం డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్లో ఉంచడంతో కూలీలు తగ్గడం వల్ల చట్టాన్ని రద్దు చేయాలని దురుద్దేశంతో ప్రభుత్వం ఉన్నది రోజు కూలి 600 రూపాయలు ఇచ్చి 200 పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఈ సదస్సులో వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయం సంఘం మండల కార్యదర్శి కలుకూరి రామచందర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కందగట్ల సాయి రెడ్డి, కొండూరి సత్తయ్య, గండికోట నరసింహ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ చైతన్య పాఠశాలలో అడ్మిషన్లు తీసుకుని మోసపోకూడదు: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి

వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ ఎలాంటి పర్మిషన్లు లేకుండా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల అనే పేరుతో అడ్మిషన్లకు తిరుగుతా ఉన్నారు ఈ చైతన్య పాఠశాలకు ఎలాంటి అడ్మిషన్లు తీసుకొని మోసపోవద్దని అన్నారు 20 రోజుల క్రితం వలిగొండ మండల కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాల అనే బోర్డు పెట్టి అడ్మిషన్లు తీసుకున్న పరిస్థితి. దీన్ని వెంటనే జిల్లా విద్యాధికారి గారి దృష్టికి తీసుకుపోగా వారు స్పందించి ఈ పాఠశాలకు ఇలాంటి గుర్తింపు పర్మిషన్లు లేవు అడ్మిషన్లు వేసి తల్లిదండ్రులు మోసపోవద్దు అని చెప్పి జిల్లా విద్యాధికారి గారు సూచించారు ఆ తర్వాత మండల విద్యాధికారి శ్రీ చైతన్య పాఠశాలపై కేసు నమోదు చేశారు ఇలాంటి పాఠశాలల్లో మీ మీ పిల్లలను చేర్చి అడ్మిషన్ల పేర్ల ఫీజులు కట్టి మోసపోవద్దని ఇలాంటి స్కూల్లో పూర్తిగా నడుస్తాయో మధ్యలో ఆగిపోతే తెలియని పరిస్థితి ఇలాంటి పాఠశాలలో మీ పిల్లల అడ్మిషన్లు వేసి వాళ్ళ భవిష్యత్తులో ఖరాబు చేయొద్దని ఎస్ఎఫ్ఐ గా తెలియజేస్తూ అదేవిధంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అన్ని పాఠశాలలో ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువుకునేలా ఈచట్టం అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాసు మండల అధ్యక్షులు SK ఫర్దిన్, మైసోల్ల నరేందర్, వేములకొండ వంశీ తదితరులు పాల్గొన్నారు.

మొగిలిపాక లో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మామిడి సత్తిరెడ్డి- మంజుల వివాహ వార్షికోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని మొగిలిపాక గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు మామిడి సత్తిరెడ్డి - మంజుల వివాహ వార్షికోత్సవాన్ని బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ యూత్ అధ్యక్షులు మధు యాదవ్ ,ఉపాధ్యక్షులు శివకుమార్ గౌడ్ ,గౌరవ అధ్యక్షులు సాయికుమార్ యాదవ్ మరియు యాస ఉదయ్ కుమార్ రెడ్డి ,గుండాల సాయి, టి బాలచందర్, కార్తీక్ గౌడ్, శ్రీకర్ గౌడ్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.


విత్తనాలు ఎరువులు సకాలంలో అందేలా క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం నాడు ఆమె రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రూప్ -1 పరీక్షల నిర్వహణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు స్కూల్ డ్రెస్సుల అందజేత కార్యక్రమాలను సమీక్షించారు. రైతులందరికీ విత్తనాలు, ఎరువులు సకాలంలో ప్రతి ఒక్కరికి అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలని, పోలీసు, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలని, కంట్రోల్ రూముల ఏర్పాటుతో నిఘా పఠిష్టంగా నిర్వహించాలని సూచించారు. విత్తన డీలర్ల రిజిష్టర్లను తనిఖీ చేయాలని, ప్రతి రోజూ డీలర్ల నుండి రిపోర్టులు పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా సందర్భంగా జూన్ 11 లోగా విద్యార్ధులకు అందించే డ్రైస్సులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. *జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే విత్తనాలు, ఎరువుల గురించి వివరిస్తూ జిల్లాలో ఇప్పటి వరకు 78,345 పత్తి విత్తనాల ప్యాకెట్స్ అమ్మడం జరిగిందని, ఇంకా 66,858 పత్తి విత్తనాల ప్యాకెట్స్ అందుబాటులో వున్నాయని, అలాగే ఎరువులకు సంబంధించి 14,117 మెటిక్ టన్నుల యూరియా, 829 మెటిక్ టన్నుల డిఎపి, 4160 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 375 మెటిక్ టన్నుల పొటాష్, 186 మెట్రిక్ టన్నుల సూపర్ఫాస్టేట్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీకి సంబంధించి క్షేత్రస్థాయిలో అని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, జిల్లా పంచాయితీ అధికారి సునంద, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణను పక్కగా నిర్వహించాలి, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే

గ్రూప్-1 పరీక్ష నిర్వహణను పక్కాగా నిర్వహించాలని, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే అధికారులను ఆదేశించారు. గురువారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో ఛీప్ సూపరిటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఐడెండిఫికేషన్ ఆఫీసర్స్, బయోమెటిక్ ఆఫీసర్లకు గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించబడుతున్న గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, పరీక్ష వ్రాసే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు ఉండాలని ఆదేశించారు. ఛీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష నిర్వహణను చేపట్టాలని, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కేంద్రాలలో సీటింగ్ అరేంజ్మెంట్, వసతులు పరిశీలించాలని, ఆడ మగ అభ్యర్ధులకు విడివిడిగా తనిఖీ ఏర్పాట్లు చేయాలని, ఇతరులను అనుమతించవద్దని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణతో పరీక్షాల కేంద్రాలను పరిశీలించాలని, పరీక్ష రోజున ప్రతి సెంటర్ మూడు సార్లు పరిశీలించాలని, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు అభ్యర్ధుల ఐడి కార్డులతో హాల్ టిక్కెట్లను పరిశీలించాలని, పరీక్షా కేంద్రాలలో ఎవరికీ మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, ఒక చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రము ఎమర్జెన్సీ కోసం అనుమతి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు పరీక్ష వ్రాసే అభ్యర్ధులు కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలని తెలియచేస్తూ కోరుతూ......ఈ నెల 9 వ తేదిన జరిగే గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయము 10.30 గంటల నుండి మద్యాహ్నం 01.00 గంటల వరకు పరీక్ష జరుగుతుందని,* సుమారు 3349 అభ్యర్డులు హాజరగుతున్నారని తెలిపారు. *పరీక్ష కేంద్రాల గురించి, హాల్ టికెట్ డౌన్ లోడ్ గురించి జిల్లా స్థాయి హెల్ప్ లైన్ నెం. 8331997006, 8331997037 సంప్రదించవచ్చునని సూచించారు. హాల్ టికెట్ ను http://www.tspsc.gov.in వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని, హాల్ టికెట్ ను A4 పేపర్ నందు ప్రింట్ తీసుకోవాలని తెలిపారు.* హాల్‌ టికెట్‌లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి లేటెస్ట్ ఒరిజినల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను గమ్‌తో అతికించాలని, అభ్యర్దులు పరీక్షహాలుకు హాల్ టికెట్ తో పాటుగా ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటరు ఐడి కార్డు, ఇతర ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి మరియు బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలని, ఒకవేళ హాల్ టికెట్ లో ఫోటో సరిగా ముద్రణ కాకపోయినా, లేదా కనిపించనట్లయితే అభ్యర్థి గెజిటెడ్ అధికారి/ అభ్యర్ది చివరగా చదివిన సంస్థ ప్రిన్సిపాల్ చేత ధృవీకరించబడిన మూడు (3) పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను, అండర్‌టేకింగ్ ఫామ్ (TSPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌తో) తో పాటుగా తీసుకురావాలి. అట్టి ఫోటోలు, అండర్‌టేకింగ్ ఫామ్ ను పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్‌కు సమర్పించినట్లయితే అభ్యర్థి పరీక్షకు అనుమతించబడతారని, లేనట్లయితే అభ్యర్దిని పరీక్ష హాల్ లోకి అనుమతించబడరని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలు నుండి బయటకు వెళ్ళేందుకు అనుమతించబడరని, పరీక్ష హాలును వదలి వెళ్ళే ముందు, అభ్యర్థి OMR ఆన్సర్ షీట్ ను ఇన్విజిలేటర్‌కు అందజేయాలని, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ద్వారా అభ్యర్థి తన బయోమెట్రిక్‌ ను క్యాప్చర్ చేసే వరకు పరీక్ష హాలు నుండి బయటకు అనుమతించబడరని, అభ్యర్థి ఎవరైనా తన బయోమెట్రిక్‌ ను ఇవ్వకపోతే వారి OMR ఆన్సర్ షీట్ మూల్యాంకనం చేయబడదని తెలిపారు. చేతులకు మెహంది, టాటూలతో పరీక్షకు వెళ్లకూడదని, ఒకవేళ ఉంటే బయోమెట్రిక్ చేయుటకు తంబ్ ఇంప్రెషన్ పడకపోవచ్చునని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు షూస్, సాక్స్ ధరించరాదని, కేవలము చెప్పులు మాత్రమే ధరించాలని, *పరీక్ష కేంద్రము లోనికి ప్రవేశించడానికి ఉదయము 09.00 గంటల నుండి 10.00 గంటల వరకు అనుమతి ఉంటుందని, ఉదయం 10.00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైననూ పరీక్ష హాలు లోనికి అనుమతించబడరని, పరీక్ష కేంద్రము మెయిన్ గేట్ ఉ.10.00 గం.లకు మూసివేయబడుతుందని తెలిపారు.* పరీక్షకు హాజరయ్యే అభ్యర్దికి ఒకవేళ చేతులు లేకపోతే సహాయకులు కావాలి అని ముందుగానే దరఖాస్తు చేసినవారికి మాత్రమే పరీక్ష కేంద్రము వారు స్క్రైబ్ ను ఇస్తారని, అనుమతి లేకుండా ఎవరూ సహాయకులను తీసుకురాకూడదని తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు కనీసం ఒకరోజు ముందుగా తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా కేంద్రం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోవాలని కోరారు. *పరీక్ష కేంద్రము లోకి వాటర్ బాటిల్ అనుమతించరని, పరీక్ష కేంద్రం వారే త్రాగు నీటి సౌకర్యము కల్పిస్తారని, పరీక్ష కేంద్రము లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైలు ఫోన్ లు, కాలిక్యులేటర్లు, చేతి గడియారాలు , హాండ్ బ్యాగ్ లు, బ్లూటూత్ డివైస్ లు, పెన్ డ్రైవ్ లు, రైటింగ్ ప్యాడ్ లు, తెల్ల కాగితాలు అనుమతించబడవని,* పరీక్ష కేంద్రము వద్ధ వస్తువులు భద్రపరచడానికి కమిషన్ ఎలాంటి క్లోక్ రూమ్/ స్టోరేజీ సౌకర్యం కల్పించలేదని, కాబట్టి అభ్యర్డులు ఇట్టి విషయాన్ని గమనించాలని సూచించారు. పరీక్ష వ్రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం, సమయాన్ని అంచనా వేయడానికి ప్రతి అరగంట పూర్తయిన తర్వాత హెచ్చరిక బెల్ మోగించబడుతుందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు ఈ సూచనలు పాటించాలని కోరారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాధ రెడ్డి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణ రెడ్డి, TGPSC రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ బాలాజీ, వ్యవసాయ శాఖ ఏడి నీలిమ, అధికారులు పాల్గొన్నారు.

ఈనెల 10న హైదరాబాదులో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూకుట్లచొక్కా కుమారి

ఈనెల 10 న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు - సవాళ్లు  అనే అంశంపై నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సులో ఉపాధి హామీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూకుట్ల చొక్కాకుమారి పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఉపాధి హామీ కార్మికుల పని ప్రదేశాన్ని సందర్శించి కార్మికుల సమస్యలను తెలుసుకున్న అనంతరం కార్మికులతో కలిసి సదస్సు ను జయప్రదం చేయాలని *కరపత్రం* ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా చొక్కాకుమారి మాట్లాడుతూ కొలతలు లేని పనికి కొలతలు పెట్టి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం కోతలను రద్దు చేసి రోజుకు ఆరు గంటల పనికి 600 రూపాయల కూలీ ఇవ్వాలని డిమాండ్ చేసినారు. సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని గతంలో అమలు చేసిన విధంగా పని ప్రదేశంలో మౌలిక వసతలు కల్పించాలని కోరారు. బిజెపి ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో ఉపాధి హామీ పథకంలో అనేక జీవోలు తీసుకొచ్చి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు చేస్తున్నదని బిజెపి పాలనలో కార్మికుల సమస్యలు రెట్టింపు అయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు. ఉపాధి హామీ చట్ట చట్ట పరిరక్షణ కోసం, మున్సిపల్ పట్టణాల్లో కూడా ఉపాధిహామీని అమలు చేయాలని, కనీస కూలీ 600 లు, సంవత్సరానికి 200 పని దినాలు, చట్టంలో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలని కోరుతూ ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సు ముఖ్య అతిధులుగా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీమతి సీతక్క, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాజ్యసభ సభ్యులు శివ దాసన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి. నాగయ్య, ఆర్. వెంకట్రాములు పాల్గొంటున్నారని వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో డి. కళమ్మ, ఎం. సుజాత, ఎం. పోచమ్మ , ఎం. రాములమ్మ , డి. ధనలక్ష్మి , ఎ. సత్తమ్మ , ఎం. స్వరూప, కే. మంగమ్మ, ఎన్. పద్మ, ఎన్. సుజాత, బి. రేణుక, ఆర్. చంద్రకళ, ఆర్ .కలమ్మ, ఏ. పద్మ పాల్గొన్నారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్యేలు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి, గెలుపొందిన సందర్భంగా మరియు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి . ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి శుభకాంక్షలు మరియు ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



దళిత హక్కుల పోరాట సమితి కరపత్రం ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్
వలిగొండ మండల కేంద్రంలో దళిత కుల పోరాట సమితి కరపత్రం ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా *సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్  మాట్లాడుతూ* డిహెచ్పిఎస్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈనెల 18,19,20 తేదీలలో యాదగిరిగుట్ట, మండలంలో  లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో జరగనున్నట్లు తెలిపారు... గ్రామాలలో ఇంకా అంటరానితనం అవమాననీయ దురాచారాలు అత్యంత దారుణంగా జరుగుతున్నాయి రోజురోజుకు దళితులపైన కుల వివక్ష చూపిస్తున్నారు.ఇలాంటి అణచివేతలను ఎదిరించే విధంగా దళితులను సామాజిక సంఘటితంగా రాజకీయ చైతన్యపరచటకు ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ మండల కో కన్వీనర్ మేడి దేవేందర్, సిపిఐ మండల కార్యదర్శి పోలపాక యాదయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, చొప్పరి వెంకటేష్,సుద్దాల సాయికుమార్, భూశి శివ, నరేష్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

రెడ్ల రేపాక గ్రామంలో తాటి చెట్టు నుండి కింద పడి గీతా కార్మికునికి తీవ్ర గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్ల రేపాక గ్రామంలో జువ్వ గాని కిష్టయ్య తండ్రి రాములు వయస్సు 50, బుధవారం  ఉదయం తాటి చెట్టు పై నుండి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భువనగిరి కి తరలించడం జరిగింది వారికి ప్రభుత్వపరంగా రావలసిన ఎక్స్గ్రేషియా మంజూరు చేయవలసిందిగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోలగాని జయరాములు, రాష్ట్ర నాయకులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి పలుసం స్వామి, రెడ్ల రేపాక గ్రామ అధ్యక్షుడు జువ్వగాని స్వామి ,ఎక్సైజ్ అధికారులను కోరారు.

రిటర్నింగ్ అధికారి ,జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే నుండి ధ్రువీకరణ పత్రాన్ని పొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎంపీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయినది. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,22,249 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు. భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డి కి  రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్ల  ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.