/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండ మండల పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రాచకొండ సిపి తరుణ్ జోషి Vijay.S
వలిగొండ మండల పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రాచకొండ సిపి తరుణ్ జోషి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి సందర్శించారు .వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 250, 252 ,255,256 పోలింగ్ బూత్ లను మరియు టేకుల సోమవారం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 213 ,214 పోలింగ్ బూత్ లను సందర్శించారు . పోలింగ్ సరళిని పరిశీలించి, పోలీసులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, వలిగొండ ఎస్సై డి మహేందర్, పోలీసులు ,తదితరులు పాల్గొన్నారు.


వేములకొండ లో ఓటు హక్కు వినియోగించుకున్న జై స్వరాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నరేంద్ర వేముల

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న జై స్వరాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నరేంద్ర వేముల. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అప్రాజ్యసమితంగా జరుగుతున్నాయని అన్నారు. పది రోజుల నుండి ఓటర్లకు మద్యం ,డబ్బులు పంపిణీ చేసినారని అన్నారు. సి విజిల్ యాప్ సరిగా పనిచేయలేదని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతామని తెలియజేశారు.
వలిగొండ లో ఓటు హక్కు వినియోగించుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో కుటుంబ సమేతంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు ద్వారానే మనం మార్పును కోరుకోవాలని అన్నారు. ఓటు ద్వారా ప్రజలు అభిప్రాయాలను తెలిపారని అన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. వాతావరణం మంచిగా ఉందని అన్నారు సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంటుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం 6టీలను అమలు చేస్తుందని తెలిపారు ఓటింగ్ శాతం పెరగాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈవీఎం మిషిన్లు సిరియల్ ప్రకారం పెట్టలేదని యాదాద్రి జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుంగతుర్తి, నకరేకల్ నియోజకవర్గం పలు పోలింగ్ బూత్ లను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈవీఎం మిషన్ లను సీరియల్ ప్రకారం పెట్టలేదని, కావాలని ఇలా చేశారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈవీఎం మిషన్లు వరుస క్రమంలో పెట్టకపోవడం మూలంగా ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆయన తెలిపారు వెంటనే ఎలక్షన్ కమిషన్ అధికారులు స్పందించారని వారు కోరారు.

నా ఓటే నా భవిష్యత్తు: రమేష్ ముత్యాల సామాజిక కార్యకర్త ,జర్నలిస్ట్


నా ఓటే నా భవిష్యత్తు* నేడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఓటరు తన ఓటు యొక్క ప్రాముఖ్యతను,ఓటు విలువను,ఒక ఓటుకున్న శక్తిని తెలుసుకోని ఓటు వేయండి. నోటు తీసుకోకుండా ఓటు వేయాలి. నోటుతీసుకోకుండా ఓటు వేసినప్పుడే నీతి,నిజాయితీ,విలువలు ఉన్న నాయకులు వస్తారు. ఓటును అమ్ముకుని మంచి నాయకులు రావాలనుకోవకోవడం,అవసరాలు తీర్చేవారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికకావాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఓటరు నిక్కచ్చిగా ప్రలోభాలకు లొంగకుండా,కానుకలు తీసుకోకుండా ఓటు వేస్తాడో అప్పుడే అభివృద్ధిని కాంక్షించే ప్రజాప్రతినిధులు వస్తారు. దేశ,రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించాడానికి ఓటు ఉపయోగపడుతుంది డబ్బుకు,మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఆలోచించి ఓటువేద్దాం -- రమేష్ ముత్యాల సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్
చందుపట్లలో సుబ్బూరు సత్తయ్య అంత్యక్రియలు, హాజరైన ప్రముఖులు

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య  సతీమణి బీర్ల అనిత  తండ్రి సుబ్బూరు సత్తయ్య  అనారోగ్యంతో మృతిచెందారు. ఆదివారం రోజు ఉదయం 11:00గంటలకు భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో స్వర్గీయ సుబ్బూరు సత్తయ్య గారి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మందుల సామేల్,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,ఎంపి అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,క్యామ మల్లేష్,బండ్రు శోభారాణి సత్తయ్య  ఆత్మ శాంతి చేకూరాలని నివాళులర్పించారు.ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పూస బాల కిషన్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఈరోజు ఉదయం 11:00 గంటలకు గ్రామంలో మహిళలు గ్రామీణ ఉపాధి పని చేస్తుండగా స్వయంగా వారి దగ్గరికి వెళ్లి మహిళలతో మమేకమై వారి కష్టం సుఖాలు తెలుసుకొని మహిళలకు మజ్జిక పంపణి చేసి బాలకిషన్ గారు మాట్లాడుతూ. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలు అయింది ఉపాధి హామీ కూలీలకు ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ మహిళలను అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఉపాధి కూలీలకు 400 రూపాయలు వేతనం ఇస్తారు ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం, మరియు 500 రూపాయలకె గ్యాస్ సిలిండర్ 200 యూనిట్స్ ఉచిత కరెంట్, మీకు అందుతున్నాయి పార్టీలకు అతీతంగా ఇల్లు లేని వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీకుఏ కష్టం నష్టం వచ్చిన నేను ముందు ఉండి మిములని ఆదుకుంటాం దేశం లో ప్రజా సామ్యం కూని ఐతున్నది భారత రాజ్యాంగాని మారుస్తాం అనే దృష్టిలో బీజేపీ పార్టీ ఉన్నది కాబట్టి మన హక్కులు మనకు రావాలి మనం స్వాతంత్ర0గ బ్రతకాలంటే దేశం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి త్యాగల పునాధుల మీద ఉన్న కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడం మన లక్ష్యం.... కాబట్టి దయచేసి మే 13న జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ 03 హస్తం గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపియాలని కిరణ్ అన్నని గెలిపిస్తే ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి చోరువతో అనేక నిధులు తెచ్చి మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం అని తెలియజేసి కూలీలను అభ్యర్ధించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూస బాలకిషన్ గారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీపి పూస బాలమణి గారు, మాజీ సర్పంచ్ కాటపెల్లి యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ గార్ధస్ సురేష్,శివగళ్ల మల్లయ్య, మందడి గోపాల్ రెడ్డి, పెద్దగోని వెంకటేష్ జోగు నర్సింహా, పర్శరాములు , బందెల క్రిస్టఫర్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.



ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : AITUC


కార్మిక హక్కులు మరియు చట్టాల పరిరక్షణకై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని భువనగిరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మరియు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. శనివారం రోజున ఇండియ కూటమి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికుల అడ్డాల వద్ద తిరిగి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించిన ఏఐటీయూసీ కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ, కేసీఆర్ ఒక్కేటనని అన్నారు, పొరపాటున BRSకి ఓటు వేసిన అది,BJP కే వెళ్తుందని అన్నారు, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సాగిస్తున్న ఎన్నికల ప్రచారం బాహాటంగానే మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతోందని, ఈ నేపథ్యంలోనే బీజేపీ నిసిగ్గుగా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం సిగ్గు చేటు అన్నారు. ఓట్లను సంపాదించడం కోసం కుల, మత భావాలను రెచ్చగొట్టరాదన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని అన్నారు. 13 సోమవారం రోజున జరిగే ఎన్నికలలో కార్మికులందరూ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ లో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కసబ శ్రీనివాస్ రావు, పిట్టల బాలరాజ్, ఏఐటీయూసీ నాయకులు గనబోయిన వెంకటేష్, సామల భాస్కర్, ముదిగొండ బసవయ్య, వల్దాస్ నరసింహ, ఐలయ్య, మల్లేష్, గణేష్, పరశురాములు, కృష్ణా, జగన్, తదితరులు పాల్గొన్నారు.


ప్రజల కోసం పోరాడుతున్న ఒక అవకాశం కల్పించండి: భువనగిరి సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్

నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న తనను రాజకీయంగా చూడకుండా ప్రజల కోసం పోరాడే అభ్యర్థిగా ఓటేసి గెలిపించాలని సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు మండల పరిధిలోని వర్కట్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజా ఉద్యమాల పట్ల అనేక పోరాటాలు నడిపిన నాకు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తూ ఒక అవకాశం కల్పించి ఎంపీగా గెలిపించాలని రాజకీయంగా చూడకుండా ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని కార్పొరేట్లకు పెట్టుబడుదారులకు డబ్బున్న బడా నాయకులకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని ప్రజల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థిగా ముందుకు వచ్చిన తన పట్ల మంచి నిర్ణయం తీసుకొని ఓటు వేసి గెలిపించాలని కోరారు భువనగిరి పార్లమెంటుకు మూడుసార్లు ఇప్పటికే ఎన్నికలు జరిగాయని మూడుసార్లు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఏనాడు గ్రామాలను ప్రజలను పట్టించుకోలేదని అటువంటి వారందరికీ తగిన బుద్ధి ఈ ఎన్నికల్లో చెప్పాలని కోరారు తనను ఎంపీ గా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు భువనగిరి కేంద్రంగా అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్,కలుకూరి రామచందర్,సిపిఎం శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, భీమనబోయిన జంగయ్య ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు బుచ్చిరెడ్డి, చేగురి నరసింహ,ఆకుల మారయ్య,మాడుగుల వెంకటేశం,రొండి మల్లేశం,నాగేల్లి లక్ష్మయ్య,రొండి రాములు,చేగురి రాములు,మెట్టు లక్షమమ్మ,మాడుగుల కృష్ణవేణి,సిర్పంగి స్వప్న,వేముల జ్యోతి బస్,తదితరులు పాల్గొన్నారు.


బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం గెలుపు కోసం ఎనిమిదవ వార్డులో ఇంటింట ప్రచారం

భువనగిరి పట్టణములో పైళ్ళ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 8వ వార్డ్ రామ్ నగర్ జంఖన్నగూడెం నందగుట్ట సీతానగర్ భువనగిరి పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కామ మల్లేష్ గారి గెలుపు కోసం ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంగ రెక్క స్వామి, కో అప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబిత గోపాల్ ,ఇట్టబోయిన పావని ,సుదర్శన్, సత్యనారాయణ ,వార్డ్ ప్రజలు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.