/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండ మండల టాపర్స్ కి సన్మానం, పురస్కారాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి Vijay.S
వలిగొండ మండల టాపర్స్ కి సన్మానం, పురస్కారాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోని గాయత్రి హై స్కూల్ లో గాంధీ గ్లోబల్ జ్ఞాన ప్రతిష్ట వారి సౌజన్యంతో మండల కన్వీనర్ పాలకూర వెంకటేశం సమక్షంలో మండలంలోని అన్ని పాఠశాల టాపర్ లకు ఘన సన్మానం చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి ,కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, స్కూల్ చైర్మన్ నరహరి , వాకిటి రామిరెడ్డి ,కాసుల వెంకటేశం, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



మహిళల T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

మహిళల టి20 వరల్డ్ కప్- 2024 షెడ్యూల్‌ను విడు దల చేసింది ఐసిసి. అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్న ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 10 జట్లు పోటీపడ నుండగా వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, న్యూజిలాండ్, క్వా లిఫయిర్-1 జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ 2 జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడతాయి. గ్రూప్ ద శలో టాప్‌లో తొలి రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సిల్హె ట్ వేదికగా అక్టోబర్ 17న తొలి సెమీఫైనల్ జరుగనుండగా ఢాకా వే దికగా అక్టోబర్ 18న రెండో సెమీస్ జరగనుంది. ఇక ఢాకా వేదికగా అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ నిర్వ హించనున్నారు. ప్రారంభ మ్యాచ్ లో ఇంగ్లండ్ -సౌతా ఫ్రికా జట్లు తలపడతాయి. ఇక భారత్ అన్ని గ్రూప్ మ్యాచ్‌లు సిల్హెట్‌లోనే ఆడనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో, 9న క్వాలిఫయిర్-1 టీమ్‌తో, 13వ తేదీన ఆస్ట్రేలియాతో భారత్ తలపనుంది.

ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు చెల్లింపు వార్తల పట్ల నిశితంగా పరిశీలించాలి: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు కే జండగె


ఎన్నికల  నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు, (పెయిడ్ న్యూస్) చెల్లింపు వార్తల పట్ల నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. సోమవారం నాడు కాన్ఫరెన్స్ హలులో ఆయన సభ్యులతో సమావేశమైనారు. ఎన్నికల ప్రవర్తనా నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను పరిశీలించాలని, ఓటరుపై ప్రభావితం చేసే వార్తల పట్ల అప్రమతంగా ఉండాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్, లోకల్ కేబుల్ ఛానల్స్, సోషల్ మీడియా, వాట్సప్, ఈ పేపర్లలో రాజకీయ ప్రకటనలు మానిటరింగ్ చేయాలని, అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేస్తే రిటర్నింగ్ అధికారికి తెలిపి నోటీస్ జారీ చేయాలని అన్నారు. ప్రచారం కొరకు అవసరమయ్యే అనుమతులను పరిశీలించి జారీ చేయాలని, వివిధ వార్తాపత్రికలు, టెలివిజన్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే వాటికి అయ్యే ఖర్చులు ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ కు పంపాలని, సంబంధిత నివేదికలను ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. సమావేశంలో మెంబర్ సెక్రెటరీ, జిల్లా సంబంధాల అధికారి పి. వెంకటేశ్వర రావు, సోషల్ మీడియా నోడల్ అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి, కమిటీ సభ్యులు జి.దయాకర్, కె.శ్రీనివాస్, ఎ.శ్రవణ్, పాల్గొన్నారు.

గోకారంలో బిఆర్ఎస్ విస్తృత ప్రచారం
వలిగొండ మండలం గోకారం గ్రామంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్న గెలుపు కోసం ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్ , గ్రామ శాఖ అధ్యక్షులు కనికరపు రాము, పాల్గొన్నారు.

చౌటుప్పల్ లో బిజెపి భారీ బహిరంగ సభలో పాల్గొన్న బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా



యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జనసభ కు ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జాతీయ అద్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బిజెపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు* భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ పట్టణ పరిధిలోని ముసుగు మధుసూదన్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షులు *శ్రీ జేపీ నడ్డా గారతో* కలిసి హాజరైన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలుకానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కోడి గుడ్డుకు గాడిద గుడ్డుకు తేడా తెలియని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను రైతు రుణమాఫీ, రైతుబంధు, ఆసరా పింఛన్లు, మహిళలకు 2500 రూపాయలు, కళ్యాణ లక్మి లక్ష రూపాయల తులం బంగారం, ఇందిరమ్మ ఇండ్లు,విద్యార్దులకు స్కూటీలు, ఇవ్వకుండా ప్రజలను మోసగిస్తున్న మీకు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మాట్లాడుతూ ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందాలంటే 3వ సారి మోడీ గారిని ప్రధాని గారు చూడాలని అన్నారు. మోడీ గారి నాయకత్వంలో మన భువనగిరి బీజేపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు ఎయిమ్స్ తీసుకొచ్చి, మాతా శిశు హాస్పిటల్, జాతీయ రహదారులు, ఎంఎంటీఎస్ రైళ్ళు, ప్రతిపక్షంలో బిఆర్ఎస్ లో ఉన్నా సరే భువనగిరి పార్లమెంటుకు ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని అన్నారు. మంచి సౌమ్యుడు ఒక డాక్టర్ మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర నాయకులు మండలం మరియు జిల్లా, మండల గ్రామ బూత్ నాయకులు పాల్గొన్నారు.


పేదల కోసం పోరాడే జహంగీర్ ను ఎంపీగా గెలిపించండి: నారీ ఐలయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు


నిరంతరం పేదలు,వ్యవసాయ కార్మికులు,రైతుల సమస్యలపై పోరాడే సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు సోమవారం రోజున మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ గెలుపును కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం రైతులు,వ్యవసాయ కూలీలు, కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో జహంగీర్ గెలిస్తే ఈ ప్రాంతంలో ఉన్న త్రిబుల్ ఆర్ బాధితుల సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని పార్లమెంట్ వేదికగా అలైన్మెంట్ మార్పు కోసం పోరాడుతారని తెలిపారు ఇప్పటిదాకా జరిగిన అనేక ఆందోళనలో సిపిఎం పార్టీ అగ్ర భాగాన నిలిచిందని భవిష్యత్తులో జహంగీర్ గెలిస్తే ప్రజలకు భువనగిరి కేంద్రంగా అందుబాటులో ఉంటారని తెలిపారు డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ అధిపతులు గెలవడం ద్వారా ప్రజలకు మరిన్ని కష్టాలు తప్ప ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం జరగదన్నారు ధరల పెరుగుదలను నియంత్రించాలంటే పార్లమెంట్ వేదికగా పోరాడే వారు కావాలని,ఉపాది హామీ పథకం చట్ట రక్షణ కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు మండల కార్యదర్శి సిర్పంగి స్వామి శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి నాయకులు గూడూరు బుచ్చిరెడ్డి చేగూరి రాములు ఎస్ఎఫ్ఐ మండల నాయకులు వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

వేములకొండలో జోరుగా కాంగ్రెస్ ప్రచారం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతి గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములకొండ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఏర్పుల వెంకటేశం, కేశిరెడ్డి నీరజారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఎస్.కె రసూల్, పులిపలుపుల రాములు, ఇంజమూరి శ్రీను, ఏనుగుల నరసింహ, కాడిగళ్ల రవి, ఇంజమూరి నాగేష్, కొవ్వాకుల యాదగిరి ,పట్టేటి జగన్, దాసరి యాదగిరి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ ఈర్లపల్లి బొందయ్య కు నివాళులర్పించిన సిపిఎం నాయకులు


సుంకిషాల గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ ఈర్లపల్లి బొందయ్య గారి పార్థివ దేహం పై ఎర్రజెండాను కప్పి పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య గారు,కొండమడుగు నర్సింహ గారు,జగదీష్ గారు,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు గారు బొందయ్య గారి అంత్యక్రియల కోసం వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించిన సిపిఎం నాయకులు సుంకిషాల మాజీ సర్పంచ్ ఫైళ్ల సంధ్యారాణి ఉపేందర్ రెడ్డి గారు వారితో పాటు పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి గారు,జిల్లా కమిటీ సభ్యులు పగిళ్ళ లింగారెడ్డి గారు,సిపిఎం మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య గారు,బుగ్గ చంద్రమౌళి గారు,పోచం పల్లి మండల నాయకులు ప్రసాదం విష్ణు గారు, గారు,శాఖ కార్యదర్శి గూడూరు వెంకట్ రెడ్డి గారు,సహాయ కార్యదర్శి మంగ బాలయ్య గారు,నాయకులు వేముల నాగరాజు,కాటపల్లి వెంకటేశం,గోపగాని కుమార్,వేముల జ్యోతిబస్,లక్ష్మమ్మ,తదితరులు పాల్గొన్నారు

బొందయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి....

   సిపిఎం...

ఎండ తీవ్రత వల్ల బొందయ్య తట్టుకోలేక మృతి చెందారని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఒక ప్రకటన లో కోరారు.

ప్రజా ఉద్యమ నాయకుడు భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని పార్లమెంటుకు పంపండి : కొండమడుగు నరసింహ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు


  

భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో ఆదివారం సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొని నరసింహ మాట్లాడుతూ సిపిఎం నిరంతరం పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పోరాడుతుందని, నియోజకవర్గం లో నెలకొన్న అనేక సమస్యలపై CPM పోరాటాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహిస్తున్నారు పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గారు ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న సమయంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారంన్యాయమైన పరివారం ఇవ్వాలని ఆందోళనలో ప్రత్యక్షంగా భాగస్వామిగా ఉన్నారు. రిజర్వాయర్లో ముప్పుకు గ్రామాలకు తిమ్మాపురం, లప్పనాయక్ తండ, సోకుల తండా, జంగంపల్లి ,బస్వాపురం రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరివారం చెల్లించాలని, భూమికి భూమి ఇల్లుకు ఇల్లు ఇవ్వాలని అనేక ఆందోళనలో చేసి అధికారుల దృష్టికి ,ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు.

 *ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లె అంజయ్య, అన్నప్పట్ల కృష్ణ, కొండ అశోకు, శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, వడ్డెబోయిన వెంకటేష్, మధ్యపురం బాల నరసింహ ,ఉడత విష్ణు, మచ్చ భాస్కర్, ఉడుత వెంకటేష్ ,దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మోడీ ఫోటో తీయడం ఖాయం: అతహర్

రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మోడీ ఫోటో తొలగించడం పక్కా అని కాంగ్రెస్ నాయకులు అతహర్ అన్నారు. ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టి గుండె పోటు వస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై మోడీ ఫోటో తీసివేయడం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు. స్వయంగా వ్యాక్సిన్ తయారుచేసిన కంపెనీ ఆస్ట్రాజెనిక కంపెనీ యాజమాన్యం అందులో లోపాలు ఉన్నాయని ఒప్పుకున్నారని అలాంటి వార్తలకు భయపడి వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై మోడీ ఫోటో ను తొలగించారని అన్నారు. అతి త్వరలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మోడీ ఫోటో ను తొలగించి దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ ఫోటో పెట్టడం ఖాయం అని అన్నారు.